తమిళనాడులోని ప్రముఖ పర్యాటక ేకంద్రాల్లో విల్లుపురం ఒకటి. ఇక్కడ దట్టమైన అడవిలో పచ్చదనంతో పరుచుకున్న కల్రాయన్ పర్వతశ్రేణుల్ని చూడడానికి రెండు కళ్ళూ చాలవు. పర్వత శ్రేణుల నడుమ వయ్యారంగా ప్రవహించే గోముఖీ నది, అడవి మధ్యలో సెలయేటి చప్పుళ్ళు, ఆహ్లాదాన్నిచ్చే పెరియార్, మేఘం జలపాతాలు, నిటారుగా దర్శనమిచ్చే కల్రాయన్ పర్వత శిఖరాలు, అడుగడుగునా ఆహ్లాదపరిచే ప్రాంతాలు, పురాతనమైన కట్టడాల శోభతో... పర్యాటకులకు విశేషంగా ఆర్షిస్తున్న విల్లుపురంలో ఊటీని మించిన అందాలున్నాయంటే అతిశయోక్తి కాదు.

చూడాల్సినవివే...
కల్రాయన్ కొండలు ఇక్కడ ప్రధానంగా చూడాల్సిన పర్యాటక ప్రదేశం, కళ్లకుర్చి నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉండే కల్రాయన్ కొండల అందాలను చూసి తరించేందుకు కళ్లకుర్చి నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయి. సముద్రమట్టం నుంచి 3,500 కిలోమీటర్ల ఎత్తులో ఉండే పశ్చిమ కనుమలలో కొలువుదీరిన కల్రాయన్ కొండలు ఊటీని తలపించే చల్లటి వాతావరణంతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.దట్టమైన అడవి, సెలయేళ్ల పరుగులు, వనమూలికావనం, గోముఖీ నది పర్యాటకులను పరవశింపజేస్తున్నాయి. రాష్ట్ర పర్యాటకశాఖ ఏర్పా టు చేసిన ఎకో టూరిజం స్పాట్లు కూడా పర్యాటకులకు ప్రకౄఎతిమధ్య ఆహ్లాదం తోపాటు, సేదదీర్చే కేంద్రాలుగా ఉన్నాయి. కల్రాయన్ కొండల్లో పలు ప్రాంతాల్లో జలపాతాలున్నప్పటికీ, వాటిలో కొన్నింటిలో మాత్రమే స్నానాలు చేసేందుకు వీల వుతుంది.
పెరియార్ జలపాతం:

జింజికోట: విజయనగర పాలకులు నెల్లూరును పరిపాలించిన కాలంలో మూడు కొండలపై నిర్మితమైన ఈ జింజికోటను... రాజధానిగా చేసుకుని పాలించారు. కృష్ణగి రి, చక్కిలిదుర్గ, రాజగిరి అనే కొండలు ముక్కోణం ఆకారంలో వెలిశాయి. వాటిపై జింజికోటను అద్భుత శిల్పకళా నైపుణ్యంతో నిర్మించారు. ఈ కోటలో ఇండో- ఇస్లామిక్ రీతిలో నిర్మించిన కళ్యాణ మండపం విశేషంగా ఆకట్టుకుంటుంది. కోట ముఖద్వారం వద్ద నిర్మించిన వేణుగోపాల స్వామి ఆలయం నేటికీ పూజలందుకుం టోంది. హనుమాన్ ఆలయం, రంగనాథ్ దేవాలయం, ఉల్లాఖాన్ మసీదు, కమలకన్ని ఆలయాలను మొగల్ చక్రవర్తులు, విజయనగరరాజులు ఇక్కడ నిర్మించారు.

రాయలవారు దానమిచ్చారట..!
విల్లుపురంలో సుమారు 600 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించిన కల్రాయన్ కొండ ప్రాంతాన్ని విజయనగర సామ్రాజ్యాధిపతి శ్రీకృష్ణ్ణదేవ రాయలు కాంచీపురం నుంచి వలస వచ్చిన కర్లర్ అనే గిరిజన తెగవారికి దానంగా ఇచ్చారని చరిత్ర చెబుతోంది. రాయలవారి హయాంలో నిర్మిం చిన కట్టడాలు అనేకం నేటికీ విల్లుపురంలో దర్శనమిస్తుండటం దీనికి నిదర్శనంగా చెప్పవచ్చు.
No comments:
Post a Comment