విహారాలు

India

Gamyam

Wednesday, June 15, 2011

అందాలొలికే అనంతగిరి

Anantagiri_Hills
రాష్ట్రంలో ఉక్కు నగరంగా పేరుగాంచిన సుందర నగరం విశాఖ. ఈ అందమైన తీర ప్రాంత పట్టాణానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది అనంతగిరి. ప్రశాంతమైన ప్రకృతి నడుమ... దట్టమైన అడవులు, పచ్చని చెట్లు, సుందర దృశ్యాలతో రంజింపజేసే ఈ ప్రాంతం ప్రకృతి ప్రేమికులకు ఓ సరికొత్తలోకంలోకి తీసుకెళ్తుంది. అనంతగిరిలో వాతావరణం ఎల్లప్పుడూ శీతలంగా ఉండటమే కాకుండా ఎంతో నయానందకరంగా ఉండటం వలన ఇక్కడికి సంవత్సరం పొడవునా పర్యాటకుల తాకిడి ఉంటుంది. రాష్ట్రంలో పేరొందిన హిల్‌ స్టేషన్లలో ఒకటి ఈ అరకు అనంతగిరి. అంబరాన్ని తాకే కొండలు, ఆ కొండలపై పచ్చని చెట్ల సోయగాలు, ఏటవాలుగా ఉండే కనుమలు, లోయలు, జలపాతాలు పర్యాటకులను రంజింపజేస్తాయి. http://vizag.metromela.com/image/vizag/AnanthagiriResort.jpg
ముఖ్యంగా కొత్తగా పెళైన జంటలకు ఈ ప్రదేశం ఓ స్వర్గధామమంటే అతిశయోక్తికాదు. అరకు లోయకు 17 కిలోమీటర్ల దూరంలో, అక్కడి తిరుమల హిల్స్‌ పై భాగం లోని తూర్పు కనుమల్లో భాగంగా ఈ ప్రదేశం పర్యాటకుల మనసును దోచుకుంటోంది. తిరుమల గిరికి వెళ్లేందుకు ఘాట్‌ రోడ్డులలో చేసే ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. ఎటుచూసి నా సుగంధ సుమధుర పరిమళాలను అందించే కాఫీ తోటల సౌందర్యం పర్యాటకులను ఆనంద సాగరంలో ఓలాడిస్తుంది. అంతేకాకుండా రకరకాల పండ్ల తోటలు మనసును పరవశింపజేస్తాయి. ఈ ప్రాంతంలో కాఫీ తోటలు, పండ్ల తోటలు మాత్రమే కాకుండా వనమూలికలు కూడా లభ్యమవటం విశేషం.http://incredibleap.com/images/vizag/Ananthagiri-Hills_1364.jpg
దక్షిణ బధ్రీనాథ్‌...
ముఖ్యంగా దక్షిణ బధ్రీనాథ్‌గా పేరుగాంచిన తిరుమలగిరి ప్రాంతంలో భవనాశి సరస్సును అత్యంత పవిత్రమైన తీర్థంగా సేవిస్తుంటారు ఇక్కడికి వచ్చే పర్యాటకులు. ఈ సరస్సు వల్లనే ఈ ప్రాంతానికి దక్షిణ బధ్రీనాథ్‌ అనే పేరు వచ్చిందని కూడా చెబుతారు. అలాగే అనంతగిరి నుంచి ముచికుందా నది పాయలుగా చీలి వేగంగా పరుగులు తీస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. అనంతగిరిలో కాఫీ తోటల పరిమళాలతోపాటు రకరకాల పూల తోటల సుగంధాలతో, పక్షుల కిలకిలారావాలతో, సూర్యోదయ-సూర్యాస్తమయ సమయాల్లో ప్రకృతి వింతశోభతో అలరారుతూ ఉంటుంది.

http://vizag.metromela.com/image/vizag/WaterfallsatAnanthagiri%20Hills.JPG
ఇక్కడ లోతుగా ఉండే లోయలలోకి వేగంగా దుమికే జలపాతాల సౌందర్యం, పలు రకాల పండ్లతో అలరించే మామిడి తోటలు కూడా పర్యాటకులకు ఓ వింత అనుభూతికి గురిచేస్తాయి.http://www.my-india-travelguide.com/pics/anantha-padmanabha-swamy-temple-ananthagiri-hills-andhra-pradesh.jpg
కోరిన కోరికలు తీర్చే... అనంత పద్మనాభుడు...
ప్రకృతి రమణీయతను విశేషంగా కలిగి ఉండడమే కాకుండా ఇక్కడికి వచ్చే యాత్రికులను భక్తి పారవశ్యంలో నింపుతుంది ఇక్కడి అనంత పద్మనాభస్వామి ఆలయం. ఆంధ్రా ఊటీగా స్థానికు లు ప్రేమగా పిలిచే ఈ ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా ఉండటంతోపాటు ఇక్కడి ఎత్తైన ప్రాంతాలు, సేలయేర్లు, కొండలు, పెద్ద పెద్ద చెట్లు పర్యాటకులను కట్టిప డేస్తున్నట్లుగా ఉంటాయి.
http://www.crazy-cabs.com/images/ananthagiri%20road.jpg
ఇలా వెళ్ళాలి...
అనంతగిరికి చేరుకోవటం ఎలాగంటే... ఈ ప్రాంతానికి రైలు, రోడ్డు మార్గాల ద్వారా వెళ్లవచ్చు. శ్రీకాకుళం రైల్వే స్టేషన్‌ నుంచి 3 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే అనంతగిరి చేరవచ్చు. అలాగే ఈ ప్రాంతానికి విశాఖపట్నం నుంచి బస్సు సౌకర్యం కూడా కలదు. హైదరాబాద్‌, విశాఖపట్నం, ఇతర నగరాల నుంచి కూడా బస్సు సౌకర్యం కలదు. ఇక్కడ బస చేసేందుకు ప్రైవేటు కాటేజీలు, హోటళ్లు, ఇన్‌స్పెక్షన్‌ బంగళాలు అందుబాటులో ఉన్నాయి.

No comments:

Post a Comment