విహారాలు

India

Gamyam

Friday, December 24, 2010

టోక్యో చుట్టేద్దామా...!

tokyo2 
జపాన్‌ పేరు వింటే యంత్రాలు, అద్భుత సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక జీవనశైలి వంటివి గుర్తుకు వస్తాయి. అభివృద్ధి చెందిన దేశంగా గుర్తింపు పొందిన జపాన్‌ రాజధాని టోక్యో. మెయిన్‌ల్యాండ్‌ హోన్షుకు పశ్చిమ దిశలోని జపాన్‌లో ఈ నగరం ఉంది. టోక్యో అంటే పశ్చిమ రాజధాని, దేశ సంప్రదాయాలను ఇది ప్రతిబింబిస్తుంది. జపాన్‌లో 47 నగరాలలో ఒకటిగా పేరుగాంచిన మహానగరం టోక్యో. అంతేకాదు అంతర్జాతీయ నగరం, మెగాసిటీగా ప్రపంచ పటంలో ఎంతో పేరుగాంచింది. ఇక్కడి సంస్కృతి, వారసత్వ సంపద యాత్రికులను అబ్బురపరుస్తాయి. టోక్యోలో చూడదగిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో వాస్తు కళాశిల్పుల నైపుణ్యం గత చరిత్రను కళ్లకు కట్టినట్టుగా చూపుతాయి. టోక్యో ప్రజలు పూర్తిగా ఆధునిక జీవనశైలికి అలవాటుపడినా పాత సంప్రదాయాలు మాత్రం మరిచిపోలేదు. వారి అలవాట్లు, పనులు భిన్నంగా ఉంటాయి. ఇంకా టోక్యో గురించి తెలుసుకోవాలనుందా అయితే చదవండి...

టోక్యో నగరం ఆలయాలు, పుణ్యక్షేత్రాలు, సుందరమైన వాస్తు శిల్పాలతో నిండి ఉంది. ఇవన్నీ ప్రశాంతమైన ప్రదేశాలు ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఇక్కడికి వచ్చే యాత్రికుల నుంచి దానధర్మాలు ఎక్కువగానే వస్తాయి. నగరంలో గోకుకు-జి ఆలయం, సెన్సోజి ఆలయాలు ఎంతో పేరుగాంచినవి. మత వారసత్వ ప్రదేశాలుగా గుర్తింపు పొందిన అసకుసా, మీజి జింగు, యాసుకుని వంటి పుణ్యక్షేత్రాల్లో విడిధి పర్యాటకులకు మరిచిపోలేని అనుభవం. ప్రశాంత వాతావరణం, సామరస్యం నగరంలో కనిపిస్తాయి.
గత వైభవం సజీవంగా...
tokyo 
కళలు, కళాకృతులకు సంబంధించిన శిల్పాలు, కట్టడాలు టోక్యో నగరంలో చాలా కనిపిస్తాయి. యాత్రికులు చూసేందుకు నగరంలో అనేక మ్యూజియాలు, ఆర్ట్‌ గ్యాలరీలు ఉన్నాయి. ఇక్కడి మ్యూజియాలు గత చరిత్ర వైభవాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపిస్తాయి. జపాన్‌లో టోక్యో నేషనల్‌ మ్యూజియం అతిపెద్ద, పురాతన మ్యూజియంగా ప్రజాదరణ పొందింది. ఇందులో దేశానికి చెందిన వైభవోపేత కళాఖండాలు ఎన్నో ఉన్నాయి. తప్పకుండా చూడవలసిన ఇతర మ్యూజియాలు.. మోరి ఆర్ట్‌ మ్యూజియం, అసకురా ఛోసో మ్యూజియం, బ్రిడ్జిస్టోన్‌ మ్యూజియం ఆఫ్‌ ఆర్ట్‌, ఫుకగావా ఎడో పిరియడ్‌ మ్యూజియం. ఇంకా చారిత్రాత్మక ప్రదేశాలు.. ఎవోయామా సెమెటరీ, హయాషి మెమోరియల్‌ హాల్‌, ఎడో క్యాస్టిల్‌, హాచికో, స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ వంటివి చూడవచ్చు.

ఎంటర్‌టైన్‌మెంట్‌ పార్కులు...
tokyo1 
టోక్యోలో తొలి పబ్లిక్‌ పార్క్‌ ఉఎనో. దీనిని 1873లో నిర్మించారు. ఈ పార్క్‌లో అనేక ఆలయాలు, పుణ్యక్షేత్రాలు, బోట్‌ లేక్‌, చారిత్రాత్మక స్మారక చిహ్నాలు, చెర్రీ బ్లాసమ్‌ చెట్లు ఉంటాయి. ఒక రోజు మొత్తం ఈ పార్క్‌లోని ప్రదేశాలను చూసేందుకే సరిపోతుంది. ప్రదేశాలన్నింటిని సందర్శించాలనుకుంటే ఎక్కువ సమయం కేటాయించాల్సిందే. కుటుంబ సమేతంగా వెళ్లి ఈ పార్కులో ఎంజాయ్‌ చేయవచ్చు.

మనిషి సృష్టించిన విచిత్రాలు...
టోక్యోలో ఆధునిక కట్టడాల గురించి తెలుసుకోవాల నుకున్నట్లయితే రెయిన్‌బో బ్రిడ్జి సరైన ప్రదేశం. ఇది తాత్కాళికంగా నిలుపుదల చేసిన బ్రిడ్జి. 1993లో నిర్మించిన రెయిన్‌బో బ్రిడ్జి 918 మీటర్ల పొడవు, రెండు టవర్లకు మధ్య 570 మీటర్ల దూరం ఉంటుంది. ఎనిమిది ట్రాఫిక్‌ లేన్‌లు, రెండు రైల్వే లైన్లను ఈ బ్రిడ్జి ఇముడ్చుకుంది. టోక్యో టవర్‌ మానవుడు సృష్టించిన మరో అద్భుతంగా చెప్పవచ్చు. ఇది తప్పకుండా చూడవలసిన ప్రదేశం

No comments:

Post a Comment