
అందుకే ఢిల్లీ యాత్రని ఎంచుకున్నారు. తమ నినాదాన్ని దేశ రాజధాని దాకా తీసుకెళ్లాలనుకున్నారు. 2010 డిసెంబర్ 29న సైకిలెక్కి బయల్దేరి... పల్లెలు, పట్టణాలు, నగరాలు చూసుకుంటూ... రాష్ట్రాలు దాటుకుంటూ... ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలు, గురుద్వార్‌లు... ఎక్కడ వసతి దొరికితే అక్కడ రాత్రులు బస చేస్తూ ఢిల్లీ చేరుకున్నారు. కొత్త కొత్త ప్రదేశాల్ని చూస్తూ, ప్రజలతో సంభాషిస్తూ... ఓ విహార విజ్ఞాన యాత్రలా సాగింది వారి ఢిల్లీ ప్రయాణం. అంత చలికాలంలో సైకిలెక్కి ఢిల్లీ యాత్రకి వెళ్లడం ఓ అదనపు సాహసం. ఈ సాహస యాత్రను నిర్వహించింది యాక్టివ్ బైసైకిలర్స్ అసోసియేషన్ (విజయవాడ). దాని కార్యదర్శి వి.సత్యనారాయణ మనతో పంచుకున్న యాత్రా విశేషాలు...
తనని తాను సైకిల్ ఉద్యమకారుడిగా పిలుచుకుంటారాయన. సైక్లింగ్ గురించి ప్రజలకు చెప్పడమే కాదు, చేసి చూపించాలనుకుంది ఆయన నాయకత్వంలోని యాక్టివ్ బైసైకిలర్స్ అసోసియేషన్. స్థాపించినప్పటి నుండి (అన్నట్టు 09-09-09 దాని పుట్టిన రోజు) నెలనెలా సైకిల్ ర్యాలీ నిర్వహిస్తూనే ఉన్నారు. విద్యార్థుల్ని, ఆసక్తి ఉన్న మరికొందరిని కూడగట్టి విజయవాడలోనూ, అక్కణ్ణుంచి చుట్టుపక్కల ఉన్న నూజివీడు, గుంటూరు, బాపట్ల... మొదలైన పట్టణాలకు సైకిల్‌పై వెళ్లొచ్చేవారు. బడిపిల్లల దగ్గర్నుండి రిటైర్ అయిన సీనియర్ సిటిజన్ల దాకా చాలా మంది ఆ ర్యాలీల్లో పాల్గొంటున్నారు. ఒక్కో యాత్ర యాభై అరవై కిలోమీటర్ల కన్నా ఉండదు. అయితే ఈ సారి మాత్రం మహా యాత్ర నిర్వహించాలనుకున్నారు వాళ్లు. అది ఎంత పెద్ద యాత్ర అంటే.. రెండు వేల కిలోమీటర్లు.. ఢిల్లీ దాక. సైకిళ్లు తొక్కుకుంటూ రాజధాని చేరి రాష్ట్రపతిని కలిసి తమ యాత్ర ఉద్దేశాన్ని ఆమెకి తెలియజేయాలన్నది వారి ప్రణాళిక.
ఆచరణ సాధ్యమే

ఢిల్లీ యాత్ర ఆలోచనను రాష్ట్ర యువజన సంక్షేమ శాఖ జిల్లా అధికారి డా. వెలగా జోషికి తెలియజేశారు సత్యనారాయణ. ఆయన 'యూత్ హాస్టల్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా' కృష్ణా జిల్లా చైర్మన్ కూడా. ఇలాంటి యాత్రల పట్ల ఆయనకి కూడా ఆసక్తి ఉంది. కాబట్టే ఢిల్లీ యాత్రలో పాల్గొనే విద్యార్థులు తమ పేర్లు నమోదు చేయించుకోవచ్చంటూ యువజన సంక్షేమ శాఖ నుంచి జిల్లాలో కాలేజీలకి లేఖలు పంపించారు. చాలామంది విద్యార్థులు ఆసక్తి చూపారు. అందరూ ఇంటర్మీడియట్, డిగ్రీ చదివే పిల్లలే. వారిలో నుండి 26 మంది యాత్రకొచ్చారు. శ్రీమతి గెంటేల శకుంతలమ్మ కళాశాల నుంచి 15 మంది విద్యార్థులు వస్తే మిగతా వాళ్లు తిరువూరు, విజయవాడ, అవనిగడ్డలలోని వివిధ కాలేజీల్లో చదువుకుంటున్న వాళ్లు.
నిధుల కోసం...

అలా మొదలైంది...

రాష్ట్రం దాటాం...

ఆరవ తేదీకల్లా మా వ్యాన్ వచ్చేసింది. మాకు కొత్త శక్తి వచ్చినట్టయింది. ఇక దిగుల్లేదు, పోలీసులు పట్టుకుంటారనే సమస్య కూడా లేదు. నూతనోత్తేజంతో ముందుకు సాగాం. సాయంత్రానికి చంద్రపూర్ పట్టణం చేరుకున్నాం. మేం సైకిళ్లపై వెళ్తుంటే చూసి చాలామంది ఎన్నో ప్రశ్నలడిగే వారు. ఎక్కణ్ణుంచి వస్తున్నారు. ఎక్కడి కెళ్తున్నారు. ఎందుకిదంతా... ఇలాంటివే మరెన్నో ప్రశ్నలు. వాళ్ల ప్రశ్నలకి సమాధానం చెప్పడం మా దినచర్య అయిపోయింది. చాలాచోట్ల విలేకరులు కూడా కలిసి మాట్లాడారు. మేం ఎక్కడికెళ్లినా మీ గురించి పేపర్లో చూశాం, వాళ్లు మీరేనా అనే వాళ్లు. అప్పుడు కాని అర్థం కాలేదు.. మా గురించి పేపర్లో రాస్తున్నారని. పనిలో పనిగా ప్రాంతాల్ని చూస్తూ వాటి విశేషాలు తెలుసుకుంటూ వెళ్లాం.
చంద్రపూర్ నుంచి బయల్దేరిన రోజు సాయంత్రం బుట్టిబోరి అనే టౌన్ చేరుకున్నాం. అక్కడ ఓ పెద్ద స్కూల్ కనిపించింది. శ్రీ దత్తా విద్యా మందిర్ అని రాసుంది. ఆ స్కూల్‌కి వెళ్లి మా ట్రిప్ గురించి వివరించాం. స్కూల్ చైర్‌పర్సన్ మా గురించి, మేం చేపట్టిన యాత్ర గురించి చాలా ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. తెలుగువాళ్లని తెలియగానే ఆ స్కూల్ ప్రిన్సిపాల్‌ని పిలిపించారు. ఆయన వచ్చి తెలుగులో మాట్లాడడంతో మా ఆనందానికి అవధుల్లేవు. మన తెలుగు వాడేనట. మరో ఇద్దరు టీచర్లు కూడా తెలుగు వాళ్లున్నారు. వాళ్లంతా స్కూల్లో ఉండడానికి మాకు వసతి కల్పించారు. మరునాడు ఉదయం ఆ స్కూల్ విద్యార్థులతో ముచ్చటించి, స్కూల్ వాళ్లందరికి ధన్యవాదాలు తెలిపి మళ్లీ పయనమయ్యాం.
వాటర్ ట్యాంక్ తెప్పించారు...

ఉదయాన్నే మళ్లీ ప్రయాణం.. పదో తేదీ సాయంత్రం మంగ్వాని అనే ఊళ్లో ఓ పాఠశాలలో రాత్రి బస చేశాం. ఢిల్లీ వైపు వెళుతున్నాం కాబట్టి చలి నానాటికీ పెరిగిపోతోంది. అందరం రగ్గులు, దుప్పట్లతో వెళ్లినా..వాటితో చలి ఆగలేదు. 11వ తేదీన లోలారి రాజ్ మార్గ్ అనే గ్రామానికి వెళ్లి కేరళకి చెందిన టీచర్లు నడుపుతున్న 'రుక్మిణి దేవి పబ్లిక్ స్కూల్'లో ఉన్నాం. దేశంలో ఎక్కడికెళ్లినా కేరళ టీచర్లు కనిపిస్తారనిపించింది వారిని చూస్తుంటే.
గురుద్వారాల్లోనే మా బస

అజయ్ వచ్చేశాడు...

ఒక్కసారిగా మా అలిసిపోయిన ముఖాల్లో చిరునవ్వులు. వెంటనే వ్యాన్ వేసుకెళ్లి అజయ్‌ని తీసుకొచ్చాం. మా సైకిళ్లన్నిటి మీదా మా నినాదాలతో పాటు మా ఆర్గనైజేషన్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది. ఆ నెంబర్‌కి ఫోన్ చెయ్యమని చాలామందిని అడిగాడట అజయ్. చివరికి ఒక పెద్దాయన కరుణించి ఫోన్ చేశాడని చెప్పాడు. ఇలాంటి సంఘటన జరిగితే మనం చేయాల్సింది ఒక్కటే అని ముందే చెప్పుకున్నాం. ఎపి రిజిస్ట్రేషన్ నంబర్ ఉన్న ఏ లారీ అయినా ఆపితే చాలు.. వాళ్లు మనల్ని ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్తారని. ఎవరైనా నీరసపడి సైకిల్ తొక్కలేకపోతే దాన్ని వ్యాన్‌పై వేసుకుని వ్యాన్‌లో వెళ్లిపోయే వాళ్లు. ఒకబ్బాయికి నీరసంగా ఉంటే ఎందుకైనా మంచిదని సెలైన్ కూడా పెట్టించాం.
ఫైర్ ఇంజన్‌తో స్నానం చేశాం...

ఆగ్రాలో ఫోటోలే ఫోటోలు

ఢిల్లీలో ఓ వారం

రాజధానిని చూడడానికి వారం కేటాయించుకున్నాం. పార్లమెంటు దగ్గర్లోని రకబ్‌గంజ్ గురుద్వారా ఉండడానికి అవకాశం లభించినా రిపబ్లిక్‌డే ఉత్సవాలు జరగబోతున్నాయి కాబట్టి భద్రతా కారణాల వల్ల అక్కడ ఉండడానికి వీలు కాలేదు. దాంతో ఆ మహానగరంలో ఎక్కడుండాలో తెలీలేదు. దగ్గర్లో ఉన్న హిందూ సమాజ్ భవనంలో ఓ మూడు వేలు చెల్లించి ఆ రాత్రికి తల దాచుకున్నాం. మా యాత్ర మొత్తంలో ఆ ఒక్కరోజు మాత్రమే మేము ఉండడానికి డబ్బులు ఖర్చు చేశాం. మరునాడు ఉదయం చాందినిచౌక్‌లోని శిశు గురుద్వారాకి వెళ్లి.. మిగిలిన ఆరు రోజులూ అక్కడే ఉన్నాం.
రోజంతా సిటీ మొత్తం తిరగడమే మా దిన చర్య. 26న రిపబ్లిక్‌డే వేడుకలు తిలకించాం. 27న పార్లమెంటు భవనాన్ని చూడ్డానికి వెళ్లాం. ఆ సమయంలో మాలాగే కొందరు పార్లమెంటు చూడ్డానికి వచ్చారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కుమారుడు, పార్లమెంట్ సభ్యుడు అయిన సందీప్ దీక్షిత్ వారికి ఆ విశేషాలన్నీ వివరిస్తున్నాడు. వాళ్లతో పాటు మాకు కూడా ఆయన చాలా విశేషాలు చెప్పారు. అపరిచితులమైన మాకు కూడా ఆయన అంత ఆసక్తిగా వివరించడం చూసి మేం ఆశ్చర్యపోయాం. ఆరోజు సాయంత్రం కేంద్ర పర్యావరణ శాఖ కార్యాలయానికి వెళ్లాం. ఆ శాఖ సభ్య కార్యదర్శి జె ఎస్ కామ్యోత్రని కలిశాం.
మా యాత్ర గురించి చెప్పి ఆయన అభినందనలు పొందాం. 28న ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ని కలిశాం. ఆమె అపాయింట్‌మెంట్ దొరుకుతుందో లేదో అని మాలో చాలామంది రాలేదు. ఏడుగురమే వెళ్లాం. ఆమె అపాయింట్‌మెంట్ దొరికింది. సాయంత్రం అయిపోవడంతో అప్పటికే చలి బాగా ఉంది. మా ఏడుగురిలో ఇద్దరు ఆడవాళ్లు, మా పాప కూడా ఉన్నారు. 'ఇంత చలిలో ఏమీ కప్పుకోకుండా వచ్చారే' అంటూ వెంటనే మూడు షాల్స్ తెప్పించి మా పాపకి, ఇద్దరు ఆడవాళ్లకి కప్పారు. ఆమెతో కాసేపు ముచ్చటించి అక్కణ్ణుంచి సెలవు తీసుకున్నాం. అన్నట్టు మేం ఎపి భవన్‌కి వెళ్లి అక్కడ మన తెలుగు భోజనాన్ని కూడా రుచి చూశాం. అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిని, విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ని కూడా కలిశాం.
సైకిలెక్కి వందల గ్రామాలు, పదుల పట్టణాలు తిరిగాం. వేలమందిని కలిశాం, వారందరికీ మా యాత్ర గురించి వివరించాం. ఉపఖండంలో ఎంతో కొంత భాగాన్ని కలియ తిరగడానికి, మన దేశంలోని భిన్నత్వాన్ని కనులారా చూడడానికి ఇది మాకు గొప్ప అవకాశాన్ని కల్పించింది. జనవరి 29న ఢిల్లీలో రైలెక్కి 30న విజయవాడ చేరుకున్నాం. సైకిళ్లు ట్రాన్స్‌పోర్ట్‌లో వచ్చేశాయి. వాటిని మళ్లీ బిఎస్ఏ కంపెనీకి అప్పజెప్పాం... సైకిల్ యాత్ర తాలూకు మధురానుభూతుల్ని మాత్రం మాతోనే ఉంచుకున్నాం.