విహారాలు

India

Gamyam

Monday, July 12, 2010

భూగర్భంలో.. అద్భుతం

భూగర్భ గుహలున్న జిల్లాల్లో కర్నూలు జిల్లాకు దేశంలోనే ప్రత్యేక స్థానం ఉంది. జిల్లా తూర్పు ప్రాంతంలో భూమిపైన, భూమి అంతర్భాగంలోనూ సహజసిద్ధమైన గుహలున్నాయి. అలాంటి వాటిలో దేశంలోనే అతి పొడవైనవైన బెలుం గుహలకు విశేష ప్రాధాన్యత ఉంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ గుహలు ఏర్పడి ఉంటాయని పరిశోధకుల అంచనా. వందలాది సంవత్సరాలు నీటి బిందువులు జాలువారితే ఏర్పడే స్టాలక్‌టైట్లు, స్టాలగె్మైట్లు బెలూం గుహలకు ప్రత్యేకం.
buddaభూగర్భంలో కనిపించే పెద్ద పెద్ద మందిరాలు... జల పాతాలు, ఆధ్యాత్మిక ప్రాంతాలు... ఆలయాలు, సరిగమలు పలికించే స్తంభాలు... ఒక్కో వైపు నుండి ఒక్కో ఆకృతిని ప్రదర్శించే శిలాకృతులు ఒకటేమిటి ఎన్నో వింతలు... విడ్డూ రాలు బెలూం గుహల్లో దర్శనమిస్తా యి. అబ్బురపరుస్తాయి. మూడు కిలోమీటర్ల పొడవు మేర ఉన్న ఈ గుహలు అడుగడుగు అద్భుతంగా దర్శనమిస్తుంది.

1884లోనే గుర్తింపు...
ప్రకృతిలో సహజసిద్దమైన భూగర్బ నిర్మాణంగా చెప్పుకునే బెలుం గుహలు జిల్లాలో నెలకొన్ని ఉన్న ట్టుగా 1884లోనే హెచ్‌బి పుటే అనే గుహ శాస్తవ్రేత్త కనుగొన్నాడు. అయితే అప్పటి నుంచి దీనిపై ఎలాంటి పరిశోధనలు జరగలేదు. 1982, 84 సంవత్సరాల్లో జర్మనీ బృందాలు గుహలను సందర్శిం చాయి. హెర్బర్ట్‌ డానియల్‌ గెబాక్‌ నాయకత్వంలోని బృందం 3కిలోమీటర్ల దూరం మేరకు స్థితిగతుల ను పరిశీలించారు. బెలుం గుహల భూగర్భం యొక్క నైసర్గిక స్వరూపాన్ని వివరంగా పటం గీచి ప్రపంచా నికి చాటి చెప్పారు.

caveగుహల సుందరాకృతికి వందల యేళ్లు...
బెలుం గుహల సుందర ఆకృతి వెనుక వందల యేళ్ల చరిత్ర ఉంది. భూగర్బంలో జారిపడే నీటితో మిళిత మై సూక్ష్మంగా ఉండే సున్నపు కణాలతో ఒక ఘనపు అంగుళం పరిణామం కల ఆకృతి తయారు కావడాని కి కొన్ని వందల సంవత్సరాలు పడుతుందని భూ గర్భ శాస్తవ్రేత్తలు పేర్కొంటున్నారు. ఇలాంటి ఆకృతులు బెలుం గుహల్లో కోట్ల సంఖ్యలో కనిపిస్తాయి. అంతెందుకు గుహల్లోని ఒక మండపంలో కోటి లింగాలు న్నాయంటారు. ఇక గుహల్లో ఎక్కడ చూసినా ఇలాంటివి కనిపించి మనలను ఆశ్చర్యపరుస్తాయి. బెలుం లో ఉండే నమ్మశక్యం గాని రీతిలో భూ అంతర్భాగంలో ఏర్పడిన స్థంబాలు, గుహపై నుంచి వేలాడే మంచుకడ్డీల చారలు, గుహ పైక ప్పు నుంచి నిరంతరం జారీపడే నీటితో తయారై ఘనీభవించిన శిల్పాలు, సుందరమైన గదులు ఏర్పడ్డానికి కొన్ని మిలియన్‌ల సంవత్సరాలు పడుతుందని శాస్తవ్రేత్తల పరిశోధనలు వెల్లడి స్తున్నాయి.

అబ్బురపరిచే సహజ శిల్పాలు...
మూడు కిలోమీటర్ల మేర బెలుం గుహ అంతర్భాగంలో నెలకొన్న సహజ శిల్పాలు చూప రులకు విస్మయం కల్గిస్తాయి. నేర్పురు లైన శిల్పులు ఈ శిలలను చెక్కారా అన్న అనుమా నం రాక మానదు. స్థానికంగా గుహల చుట్టు ఉండే గిరిజనులు, పల్లె ప్రజలు ఈ ఆకృతు లకు కోటి లింగాలు, సింహ ద్వారం, పాతాళ గంగ మండపం అని పేర్లు పెట్టారు. ఆగ్నేయ దిశ నుంచి వాయువ్య దిశగా ప్రవహించే ఒక ఉపరితల ప్రవాహం బెలుం గ్రామపు సమీపంలో ఉన్న బావిలో అంతమవుతుందని ఇక్కడి ప్రజల నమ్మ కం. దీంతో బెలుం గుహల్లో అధ్యాత్మికంగా కూడా చారిత్రక ప్రాధాన్యత ఉట్టిపడుతోంది. దీంతో పర్యాటకుల తాకిడి కూడా రోజురోజుకు పెరుగుతుంది.

belum1999లో టూరిజం ఆధీనంలోకి...
పర్యాటకంగా బెలుం గుహలకు ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని 1999 సంవత్సరం లో ఆంధ్ర ప్రదేశ్‌ టూరిజం శాఖ 1999లో గుహలను తన అధీనంలోకి తీసుకుంది. 60 అడుగుల మేర స్టాలక్టిస్‌ వుండే గదుల్లోకి నడకదారి ఏర్పాటు చేసింది. గుహ అంతర్భాగంలో 2కిమీలు పొడవున లైటింగ్‌ ఏర్పాటు చేసింది. అలాగే పర్యాటకులు వెళ్లేందుకు వీలుగా డ్రిల్లింగ్‌ చేసి వెలుతురు కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటితో పాటు పర్యాటకులకు వసతులతో కూడిన బస ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పున్నమి హోటల్‌ యాత్రికులకోసం భోజన, అల్పహార శాలలను ఏర్పాటు చేసింది.

కర్నూలు నుంచి 110 కి.మీ...
కర్నూలు నగరం నుంచి కొలిమిగుం డ్ల మండలం బెలుం గ్రామానికి చేరు కోవాలంటే 110 కిలీమీటర్ల ప్రయా ణం చేయవలసి ఉంటుంది. నంద్యాల నుంచి 60 కిమీ, తాడిపత్రి నుంచి 31 కిమీ, అహోబిలం నుంచి 91 కిమీ, మహానంది నుంచి 90కిమీ, అలంపూ ర్‌ నుంచి 125కిమీ, అనంతపూర్‌ నుంచి 84కిమీ, బెంగుళూరు నుంచి 269 కిమీ, హైదరాబాద్‌ నుంచి 320 కిమీ, చెనై్న నుంచి 380కిమీల దూరం వుంటుంది. ఎపిటిడిసి కర్నూలు నుం చి ఒకరోజు ప్రత్యేక పర్యటనకు ఏర్పా టు చేసింది. ఇక్కడికి రావాలనుకునే టూరిస్టు బృందాలకు టూరిజం సంస్థ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.
caves

తక్కువ ఖర్చుతో యాత్రికులకు బస...
బెలూం గుహలకు వెళ్లే యాత్రికుల కోసం ఏపీ టూరిజం సంస్థ తక్కువ ఖర్చుతో బస ఏర్పాట్లను చేస్తుంది. డీలక్స్‌ ఏసీ రూంకు రూ. 1350 లతో పా టు ట్యాక్స్‌ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఏసీ రూముకు రూ.1050లు, నాన్‌ ఏసీ రూము కు రూ. 700, విశా లమైన కాన్ఫరెన్స్‌ హాలు ఉంటుంది. డార్మిటరీలో రూ. 40 లు బెడ్‌ దొరకుతుంది. స్నాక్‌ బార్‌, విజిటర్స్‌ రెస్ట్‌ రూం, క్లాక్‌ రూంతో రెస్టా రెంట్‌ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. బెలుం గుహలను సందర్శించే యా త్రి కులు ఎంట్రీ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పెద్దలైతే రూ. 30లు, పిల్లలు అయితే రూ. 20 చెల్లించాలి. ఉదయం 10 గంటల నుంచి సాయింత్రం 5.30 గంటల వరకు సందర్శించవచ్చు. రాత్రిపూట ఈ గుహల్లోకి పర్యాటకులను అనుమంతించరు.

No comments:

Post a Comment