అంతా ‘ధ్వని’ మాయ ..!

నాలుగు వేరు వేరు కోటలు, 87 అర్ధ చంద్రాకారపు బురుజులతో కలిపి 10 కిలోమీటర్ల పొడవుతో కూడిన గోడలు, 8 సింహ ద్వారములు, 4 వంతెనలు (డ్రా బ్రిడ్జి), లెక్కలేనన్ని రాచమందిరాలు, మసీదులు, గుళ్ళు, అశ్వశాలలతో అలారారుతున్న గోల్కొండ కోట ప్రత్యేకత ప్రవేశద్వారం (ఫతే దర్వాజ) నుండే మొదలవుతుంది.
ఫతే దర్వాజా (విజయ ద్వారం)...

ధ్వనిశాస్త్రంలో ఆరితేరిన నిపుణులచే నిర్మించిన ఈ ఫతే దర్వాజాను చూసిన ఎవరికయినా సంబ్రమాశ్చ ర్యాలు కలుగక మానవు. ఎందుకంటే... గుమ్మటం కింద ఒక నిర్ణీత ప్రదేశం లో నిలబడి చప్పట్లు కొడి తే కిలోమీటరు అవతల ఉండే గోల్కొండ కోటలో అతి ఎత్తయిన ప్రదేశంలో ఉన్న బాలా హిస్సారు దర్వాజా వద్ద చాలా స్పష్టంగా వినిపిస్తుంది. ఈ విశేషాన్ని ఒకప్పుడు ఇక్కడి నిర్వాసితులు ప్రమాద సంకేతాలు తెలిపేందుకు ఉపయోగించేవారట. కానీ, ఇప్పుడు మాత్రం సందర్శకులకు వినోదం పంచేదిగా అది చరిత్రలో మిగిలిపోయింది.
బాలా హిస్సారు దర్వాజా...

దర్బారు హాలుగా ఉపయో గించే ఈ కట్టడంలో 12 ఆర్చీలు, మూడు అంతస్తులు ఉన్నాయి. దానిని వంపు తిరిగిన గదులుగా దృఢమైన స్థంబాలతో విభజించారు. ఎత్తులో ఉన్న ఒక గదికి ఆనుకొని ఉన్న మూడు ఆర్చీల ద్వారా వెనుక ద్వారం తెరచుకుంటుంది. ఒక ఎత్తయిన మిద్దెపైన మనకు రాతి సింహాసనం కనిస్తుంది.
కొండలలో విసిరేసినట్లున్న ఈ మంటపంలో అబుల్ హసన్‌లు తమ ఉంపుడుగత్తెలను ఉంచేవారని చాలామంది నమ్ముతారు. బారాదరీలో మనకు మరో విశిష్టత కనిపిస్తుంది. అదేంటంటే... జంట గోడల మధ్య ఉన్న ఖాళీలు గాలిని పీల్చి, పీడనం పెరిగేటట్లుగా గదిలోనికి వదులుతూ, సహజసిద్ధమైన కూలరులాగా ఉంటుంది. ఇన్ని విశిష్టతలు కలిగిన ఈ కోట భాగ్యనగరానికి ప్రధాన విహారకేంద్రంగా వెలుగొందుతోంది.
కర్టసీ : సూర్య Daily
No comments:
Post a Comment