వివేకానందుని స్ఫూర్తి క్షేత్రం... మహాత్ముని స్మారక చిహ్నం... ఇవి సముద్ర సోయగాలకు నెలవైన కన్యాకుమారి ని విహారకేంద్రగానే కాక, విజ్ఞాన ఖనిగా మార్చిన అద్భుత నిర్మాణాలు. పర్యాటక భారతావనికి చివరి మజిలీగా... త్రివేణి సంగమ పవిత్ర స్థలంగా... ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన ప్రకృతి అందాల మణిమకుటం కన్యాకుమారి విశేషాలు...
మూడు సముద్రాల అరుదైన మేలుకయిక కన్యాకుమారి ప్రధాన ఆకర్షణ. భారత దేశానికి దక్షిణ సరిహద్దుల్లోని కన్యాకుమారి పవిత్ర యాత్రాస్థలంగానే కాకుండా ప్రముఖ పర్యాటక కేంద్రంగా విలసిల్లుతోంది. సముద్ర సోయగాలకు నెలవైన కన్యాకుమారిలో ఉదయాన్నే తన నునులేత కిరణాలతో వెలుగులను ప్రసరింపజేసే సూర్యభగవానుడు, అప్పుడే సముద్ర గర్భం నుంచి ఉద్భవించి పైకి ఎగుస్తున్నాడా అన్నట్లు కనువిందు చేస్తుంటా డు. ముఖ్యంగా పౌర్ణ మి రోజు రాత్రి పూ ట ఏకకాలంలో జ రిగే సూర్యా స్తమ యం, చంద్రో దయాలను చూ సి పులకించని యాత్రికుడుండడేమో.త్రివేణి సంగమ క్షేత్రం...
కన్యాకుమారిలో బంగాళాఖాతం, మరోవైపు అరేబియా మహాసము ద్రం, దిగువన హిందూ మహాసము ద్రం.. వీక్షకుల్ని పరవశింపజేస్తుం టాయి. సముద్రతీర ప్రకృతి రమణీ యతతో అలరారే కన్యాకుమారి సముద్ర తీరంలోని థోరియం ధాతువుతో కూడిన ఇసుక రేణు వులు పరమేశ్వరుడి అద్భుత శక్తికి ఆనవాళ్లుగా చెబుతుంటా రు. అలాగే వారణాసి పరమశివు డికి నివాస స్థలమైనట్లుగా, కన్యా కుమారి పార్వతిదేవికి నివాస స్థలమని స్థానికుల ప్రగాఢ విశ్వా సం. మూడు మహాసముద్రాల నీరు పార్వతీమాత పాదాలను కడుగుతున్నట్లుగా ఉంటుందని భక్తులు నమ్ముతుంటారు.
ప్రధాన ఆకర్షణలివే...
కన్యాకుమారిలో చూడదగ్గ పర్యాటక ప్రదేశాలు చాలానే ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి వివేకానంద రాక్, తిరువళ్లువర్ విగ్రహం, గాంధీజీ స్మారక మంటపం, కుమరి ఆలయం ముఖ్యమైనవి. అలాగే ఈ ప్రాంతంలో అనేక రకాల అరుదైన పుష్పాలు, వృక్షాలను కూడా చూడవచ్చు. ఇంకా పెలికాన్, ఫ్లెమింగ్, స్పూన్‌బిల్, అనేక రకాల బాతులు.. కన్యాకుమారికి వలస వస్తుంటాయి. ఈ విదేశీ పక్షులు కూడా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.వివేకానంద రాక్...
కన్యాకుమారి పర్యాటనలో ముందుగా చెప్పుకోవాల్సింది వివేకానంద రాక్. ఇక్కడ క్రీస్తు శకం 1892లో స్వామి వివేకానంద ధ్యానం చేశారు. ఆయన ధ్యానం చేసిన ఈ ప్రదేశంలో నల్ల చలువరాతితో స్మారక కేంద్రం నిర్మించారు. ఇక్కడ 12 అడుగుల ఎత్తుతో ఉండే వివేకానందుడి కాంస్య విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. 1970వ సంవ త్సరంలో అప్పటి రాష్టప్రతి వి.వి. గిరి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ వివేకా నందుడి రాక్‌కు కొంత దూరంలో పార్వ తిదేవి పరమశివుడిని పెళ్లాడేందుకు తపస్సుచేసిన ప్రాంతం, అక్కడ శిలారూ పంలోని ఆమె పాద ముద్రిలు కూడా మనకు దర్శనమిస్తాయి.
తరువళ్లువర్ విగ్రహం...
వివేకానంద రాక్‌కు సమీపంలోని ఈ విగ్రహం 133 అడుగుల ఎత్తుతో ఉంటుంది. దీనిని 2000 సంవత్సరం లో తమిళనాడు ముఖ్యమంత్రి డాక్టర్ కరుణానిధి ఆవిష్కరించారు. ఈ తిరు వళ్లువర్ విగ్రహం బరువు ఏడువేల టన్నులు కాగా.. చాలా పొడవైన ఈ విగ్రహాన్ని దర్శించేందుకు పర్యాటకులు పడవలలో వెళ్లాల్సిందే. ఇది ఆసియా లోని ఎతె్తైన విగ్రహాలలో ఒకటిగా పేరుగాంచింది.మహాత్ముని స్మారక చిహ్నం...
కన్యాకుమారిలో చూడదగిన మరో అద్భుత పర్యాటక క్షేత్రం మహాత్మా గాంధీ స్మారక మంటపం. గాంధీజీ అస్థికల పాత్రను ఉంచిన స్థలంలో 1954వ సంవత్సరంలో ఈ స్మారక మంటపాన్ని నిర్మించారు. మహాత్ముడి జయంతి అయిన అక్టోబర్ 2 మధ్యాహ్నం 12 గంటల సమయంలో సూర్య కిరణాలు ఆయన అస్థికలను స్పృశించేలా అద్భుతంగా నిర్మించడం విశేషం.
కుమరి ఆలయం...
బాణాసురుడిని సంహరించిన అమ్మవారి కుమరి ఆలయం చూడదగ్గ మరో పర్యాటక ప్రదేశం. మూడువైపులా ఎతె్తైన గోడలున్న ఈ ఆలయంలో మూడు ప్రాకారాలు న్నాయి. ఆలయంలోని ముగ్ధ మోహనదేవి విగ్రహం భక్తులను పరవశింపజేసేలా ఉంటుంది. ఒకప్పుడు దేవి ముక్కెరలోని రత్నపు కాంతి నావికులను ఆకర్షించి నావలు రేవులోని బండరాళ్లను ఢీకొనేవని చెబుతుంటారు. బంగాళాఖాతానికి అభి ముఖంగా ఉండే ఈ ఆలయ ద్వారా న్ని ఎల్లప్పుడూ మూసే ఉంచుతారు. సంవ త్సరంలో ఓ నాలుగైదుసార్లు మాత్రమే ఉత్సవాల సందర్భంగా తెరుస్తారు.ఆలయ చరిత్ర...
పురాణ కథనాల ప్రకారం కుమరి ఆలయంలో దేవతగా కొలువబడుతున్న కన్యాదేవి, పరమశివుడిని వివాహం చేసు కునేందుకు సిద్ధపడిం దట. అయితే ముహూర్తం సమయా నికి కూడా శివుడు రాకపోవ టంతో విందుకు సిద్ధంచేసి పెట్టుకున్న బియ్యం రాశులను, మిగిలిన వస్తువులను అలాగే ఉంచేశారట. కాలక్రమంలో అవే చిన్న చిన్న రాళ్లుగా, బండలుగా మారిపోయాయని స్థానికుల నమ్మకం. అందుకే ఇప్పటికీ కన్యాకుమారి సముద్రం ఒడ్డున బియ్యాన్ని పోలిన సన్నటి రాళ్లు కనిపిస్తుంటాయని చెబుతుంటారు.
ఇందిరాపాయింట్...
కన్యాకుమారి చివరి సరిహద్దును ఇందిరాపాయింట్ అని పిలుస్తారు. ఈ ప్రదేశాన్ని చూసేందుకు దేశం నలుమూలలనుంచే కాకుండా, విదేశాల నుంచి కూడా పర్యాటకులు తరలివస్తుంటారు. ముఖ్యంగా ఇక్కడి సూర్యోదయం, సూర్యాస్తమయాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. అలాగే కన్యాకుమారి శివార్లలోని ఉదయగిరి కోట, విట్టకొట్టాయ్ కోటలు ఇక్కడ మరో ఆకర్షణ. కన్యాకుమారికి పది కిలోమీటర్ల దూరంలో ఉండే తమి ళులకు ప్రీతిపాత్రమైన స్వామితోప్ పతి ఆలయం భక్తులను ఆకట్టుకుంటుంది.
రొయ్యలకూ ప్రసిద్ధి...
ప్రముఖ పర్యాటక ప్రదేశంగా వెలుగొందుతున్న కన్యాకుమారి ‘రాక్ లాబ్‌స్టర్స్’ అని పిలిచే భారీ సైజు రొయ్యలకు కూడా ప్రసిద్ధి చెందినది. సగటున రెండు కేజీల బరువుండే ఈ లాబ్‌స్టర్ల ధర 5 వేల రూపాయల పైమాటే. కేంద్ర సముద్ర మత్స్య పరి శోధనా సంస్థ వాణిజ్య ప్రాతిపదికన కేజ్ కల్చర్‌ద్వారా ప్రత్యేకంగా పెంచ బడే ఈ లాబ్‌స్టర్లను ఎక్కువగా జపాన్, హాంకాంగ్ లాంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు.
కన్యాకుమారి, మండపం, కేరళలోని విళింజం వంటి తీర ప్రాంతాల్లోనే ఈ లాబ్‌స్టర్లు ఎక్కువగా దొరుకు తుంటాయి. తీరం నుంచి 3 కిలోమీటర్ల దూరం వరకు సముద్రంలో ఉండే రాళ్ల చుట్టూనే ఉంటాయి కాబట్టి వీటికి రాక్ లాబ్‌స్టర్స్ అనే పేరు వచ్చింది. ఇవి రాళ్ల చుట్టూ ఉంటాయి కాబట్టి రొయ్యల్లా ట్రాలింగ్ చేసి మొత్తం ఊడ్చి పట్టేయడం సాధ్యపడదు. వేరే చేపల కోసం వేసిన వలల్లో ఇవి పడుతూ ఉంటాయి. సెప్టెంబరు-జనవరి మధ్య ఎక్కువగా లభించే వీటిని పట్టుకునేం దుకు మత్స్యకారులు కొన్ని ప్రత్యేక పద్ధతులు అవలంభిస్తుంటారు.ఇలా వెళ్లాలి...
చెన్నై నగరానికి 743 కిలోమీటర్ల దూరంలో ఉండే కన్యాకుమారి ఎలా వెళ్లాలంటే.. విమాన మార్గంలో అయితే, మధురై నుంచి 250 కిలోమీటర్లు, తిరువనంతపురం నుంచి 90 కిలో మీటర్ల దూరం ప్రయాణించి వెళ్లవచ్చు. చెన్నై నుంచే కాకుండా దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబయి, కోల్‌కతాల నుంచి కన్యాకుమారికి నేరుగా రైలు సౌకర్యం ఉంది. తమిళనాడులోని అన్ని ప్రధాన పట్టణాలనుంచి రోడ్డు మార్గంలో ప్రయాణించి కన్యాకుమారి చేరుకోవచ్చు. ఇక వసతి విషయానికి వస్తే.. కన్యాకుమారిలో పలు చిన్న, పెద్ద హోటళ్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే తమిళనాడు రాష్ట్ర పర్యాటక శాఖవారి హోటల్, దేవస్థానంవారి కాటేజీలు, ట్రావెలర్స్ బంగళా, అతిథి గృహాలు.. పర్యాటకులకు అందుబాటు లో ఉన్నాయి.
కర్టసీ : సూర్య Daily
ప్రాచీన కాలంలోనే బౌద్ధమత జీవన విధానం ఆంధ్రదేశంలో నలుదిశలా ఫరిఢవిల్లింది. రాజులు, చక్రవర్తులు ఎందరో సిద్ధార్థుని అడుగుజాడల్లో నడిచి ప్రజలకు నిస్వార్ధ సేవచేశారు. ఆ క్రమంలో ఆంధ్ర దేశంలో బయల్పడిన అనేక బౌద్ధ నిర్మాణ శిథిలావశేషాలు బౌద్ధమత చరిత్రలో ఆంధ్రుల విశిష్టస్థానానికి నిద ర్శనంగా నిలుస్తున్నాయి. ఇటువంటి క్షేత్రాలలో బహు శా భట్టిప్రోలు అన్నింటికంటే ప్రాచీనమైనది. గుంటుపల్లి కూడా సుమారు అదే కాలాని కి చెందినది. క్రీపూ 3వ శ తాబ్దానికే ఇవి ముఖ్యమైన బౌ ద్ధక్షేత్రాలుగా విరాజిల్లాయి. గుంటుపల్లిని కొన్నేళ్ల క్రితం వరకు కేవలం బౌద్ధ క్షేత్రంగానే భావించారు. కానీ కొన్ని సంవత్సరాల క్రితం లభ్యమె ైన మహామేఘవాహ న సిరిసదా శాసనం ఖారవేలుని శాసనాల వల్ల ఇక్కడ జైనమతం కూడా విలసిల్లిందని నిరూపితమైంది.
అలంకరణలకు ప్రాముఖ్యం లేకుండా కట్టిన కట్టడాలు, బుద్ధుని ప్రతిమ వంటివి లేకపోవడం వంటి అంశాలవలన ఇవి బౌద్ధమతం ఆరంభకాలం (హీనయాన బౌద్ధం) నాటి ఆరామాలని విశ్లేషకుల అభిప్రాయం. బౌద్ధం ఆరంభకాలంలో శిల్పాలంకరణకు ఆదరణ ఉండేది కాదు. దృశ్య కళలు ఇంద్రియ వాంఛలను ప్రకోపింపచేస్తాయని బుద్ధుడు వాటిని నిషేధించాడు. సుందర కావ్య నిర్మాణాన్ని కూడా నిరసించా రు. వాటి ప్రయోజనం ధర్మానురక్తిని కల్గించడానికే పరిమి త మవ్వాలి కాని రసానుభూతి కాదు. మౌలిక బౌద్ధంలో క్రమశిక్షణ అంత కఠినంగా ఉండేది. జీలకర్రగూడెం, కంఠ మనేనివారి గూడెం గ్రామాలలో కూడా మరికొన్ని బౌద్ధా రామాలు కనుగొన్నారు.
ఇది ఇసుకరాతి కొండ అంచులో తొలచిన గుహల సముదాయం. బౌద్ధ భిక్షువులకు నివాస స్థానం. గుహలు ఒకదానికొకటి గుండ్రని కిటికీలతో కలుపబడి ఉన్నాయి. గుహల్లోకి ఊరే నీరు, వర్షపు నీరు కాలువల ద్వారా పగులులలోనికి ప్రవహిస్తుంది.
ఇది గజపృష్టాకారంలో 17.6 మీటర్లు పొడవు, 4.42 మీటర్లు వెడల్పు కలిగి ఉంది. దీని గోడ 1.32 మీటర్లు ఎత్తువరకు లభించింది. దీని ప్రవేశ ద్వారములకు ఇరువైపుల దేవ కోష్టములలో బుద్ధుని, బోధిసత్వుని ప్రతిమలు ఉండవచ్చును. దీని అలంృత అధిష్టానము నాసిక్, కార్లే గుహలను పోలి ఉంది. 
మనకు తెలిసిన ప్రపంచం నుండి కేన్స్ ఉత్సవానికి వెళ్లడం గొప్ప అనుభవం. ‘నైస్ కోట్‌డి అజర్’ విమానాశ్రయంలో దిగడం తో ఈ అద్భుత అనుభవాల ప్రస్థానం మొదలవు తుంది. కేన్స్‌లో వైవిధ్యమైన ఆహారం దొరుకుతుంది. రకరకాల రుచులు, కోరిన తరహా ఆహార పదార్థాలు లభిస్తాయి. వాటిని చూస్తేనే కడుపు నిండిపోతుందా అనిపిస్తుంది. మే నెలలో కేన్స్ సినిమానే తింటుంది. సినిమానే తాగుంది. సినిమానే శ్వాసిస్తుంది. అక్కడ సర్వం సినీమయం. సినీ గ్లామర్ నుండి తప్పించుకోవడం అక్కడ అసాధ్యం. బోలేవార్డ్ డి లా క్రోసిటీలో ఉన్నా, ఇంకా అనేక బొటిక్‌లు, హోటళ్లకు వెళ్లినా సినిమా సందడే. పసందైన విందులూ, వినోదాలు, భారీ తెరలపై టీవీ ప్రదర్శనలు, ఇతర కార్యక్రమాలతో ఊరు ఊరంతా ఉర్రూతలూగిపోంతుంది. ప్రపంచం మొత్తం మీద అత్యంత సందడి గా సాగేది కేన్స్ సినిమా పండుగ. ఊర్రూతలూపే సినీ ఉత్సవం.
కేన్స్ ఒకప్పుడు చేపల పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన ఓడ రేవు. ఇప్పుడు వెండితెర వేల్పులకు, సరదా సంబరాలకు వేదికగా మారింది. రెండువారాల పాటు ఇక్కడి తళుకు బెళుకులు చూడాలే తప్ప మాటల్లో వర్ణించలేం. కేన్స్‌కు ఇంతటి ఉత్సవ శోభ రావడానికి ప్రత్యేక కారణం ఏమిటో చూడాలి. సనీ ఉత్సవం జరిగే వేదికల ముందు జనం బారులు తీరి కేరింతలు కొడుతుంటే, అది టీవీల్లో చూసే జనం కూడా తామూ అక్కడికి వెళ్తే బాగుంటుందని అనుకుంటే ఇక సందర్శకుల సంఖ్య పెరగడంలో వింతేముంది. కేన్స్ ఎర్రతివాచీ మీద నడవడం గౌరవమని ప్రపంచ సినీ ప్రముఖులు భావిస్తారు. ఈ పండుగ రోజుల్లో బీచ్‌లలో పార్టీలు సంబరాలు షరామామూలే. వైన్ పొంగి ప్రవహిస్తుంది. షాంపేన్ ఫౌంటెయిన్‌లా వర్షిస్తుంది. మందు చిందులతో సముద్రతీరం సరదాగా సాగరమే అవుతుంది. ఓ వైపు అందాల తారలు, మరోవైపు సినీ దిగ్గజాలు, మరోవైపు మజా మజా పార్టీలు, తైతక్కలు, సంగీత హోరులో డ్యాన్సులూ, బీచ్‌లలో ఒకటే పార్టీలు. ఇదీ సినిమా పండుగ సందర్భంలో కేన్స్ దృశ్యం.
కెనడాలోని ఒంటారియో రాష్ట్రంలోని పట్టణం టొరంటో. ఇది ఇంచుమించు కేన్స్ పరిమాణంలో ఉంటుంది. అయితే కేన్స్‌కు ఉన్న చరిత్ర దీనికి లేదు. ఆ స్థాయిలో ఇక్కడ చలనచిత్రోత్సవం కూడా జరుపరు. కానీ, ప్రతిఏటా ‘టొరంటో అంతర్జాతీయ చిత్రోత్సవం (టిఫ్)’ జరుగుతుంది. అయితే ఇది ఉత్తర అమెరికాలో అతిపెద్ద చలనచిత్రోత్సవం. అంతకన్నా ముఖ్యంగా ‘టిఫ్’ ప్రజల చలనచిత్రోత్సవం. ఈ చిత్రోత్సవానికి వచ్చిన ప్రతి సినిమాను సామాన్య ప్రేక్షకులు, మీడియా వ్యక్తులు, పరిశ్రమల ప్రతినిధుల కోసం అనేకసార్లు ప్రదర్శిస్తారు. అందువల్లే ఈ చిత్రోత్సవాన్ని ప్రజల చిత్రోత్సవంగా కీర్తిస్తుంటారు. టొరంటో నగరం కెనడా దేశ వినోదపు రాజధాని. ప్రపంచంలోని విభిన్న సంస్కృతుల కలయికల పసందైన నగరం. నగరంలోని స్విష్ బ్లూర్-యార్క్ విల్లే ప్రాంతంలో చలనచిత్రోత్సవం జరుగుతుంది.
నగర దేవతైన మంగళాదేవి పేరే నగరం పేరుగా స్థిరపడినట్లు పూర్వీకులు చెబుతుంటారు. అదే విధంగా అనేక శతాబ్దాలుగా ఈ నగరం వివిధ సంస్కృ తులకు నిలయం కావటంతో, అక్కడ నివసించే భిన్నజాతులవారు తమ తమ మాతృ భాషలలో మంగళూరుకు అనేకమైన పేర్లు పెట్టారు. అలా స్థానిక భాషలో మంగళూరును కుడ్ల అని పిలు స్తారు. కుడ్ల అంటే కూడలి అని అర్థం.
మంగళూరు చుట్టుప్రక్కల అనేక దర్శనీయ స్థలాలు ఉన్నాయి. వాటిలో పణం బూర్ బీచ్, ఉల్లాల్ బీచ్, నేత్రావతి బ్రిడ్జి, కద్రి ఉద్యానవనం, లాల్‌బాగ్, సుల్తాన్ బత్తెరీ, మంగళాదేవి ఆలయం, కద్రి దేవాలయం, సెయింట్ అలోసియస్ చర్చి, కాలేజీ, కొత్త మంగళూరు రేవు, గోకర్ణనాథేశ్వర ఆలయం, శరవు మహా గణప తి ఆలయం.. తదితరాలు ముఖ్యందా చూడాల్సిన పర్యాటక ప్రాంతాలు.
సింహద్వారాలలో అన్నింటికంటే కిందిది. అన్నింటికంటే బయటగా ఉండే ఫతే దర్వాజా (విజయ ద్వారం) నుంచే మనం గోల్కొండ కోటలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. ఔరంగజేబు విజయం తరువాత ఈ ద్వారం గుండానే తన సైన్యాన్ని నడిపించాడట. ఏనుగుల రాకను అడ్డుకునేందుకు కోటకు ఆగ్నేయ దిక్కున పెద్ద పెద్ద ఇనుప చువ్వలు ఏర్పాటు చేశారు.
అన్ని ముఖ ద్వారాలలోకెల్లా బాలా హిస్సారు దర్వాజా ఎంతో మనోహరమైంది. ఆర్చీల మూల ఖాళీలలో ఉన్న సన్నటి రాతి పలకల మీద కాల్పనిక మృగాలు, సింహ పు బొమ్మలు ఈ రక్షణ ద్వారానికి ప్రత్యేక అలంకా రాలుగా చెప్పుకోవచ్చు. బాలా హిస్సారు దర్వాజా నుండి కొండపైకి వెళ్ళేందుకు 380 ఎగుడు, దిగుడు రాతిమెట్లు ఉంటాయి. ఆ మెట్లు అన్నీ ఎక్కిన తరువా తనే మనకు బాలా హిస్సారు బారాదరీ అని పిలవబడే ఒక మంటపం కనిపిస్తుంది.
స్థానికులు ‘పట్టిసం’ అని కూడా పిలుచుకునే విశిష్ట విహారకేంద్రం పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలంలోని పట్టిసీమ. కొవ్వూరుకు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశం గోదావరి ఒడ్డున, ఇసుకతిన్నెల నడుమ ప్రకృతి అందాలతో అలరారుతోంది.పాపికొండల మధ్య సాగే గోదావరి బోటు ప్రయాణంలో ఇది ప్రధాన విడిది కేంద్రం. ఇక్కడ గోదావరి ఒడ్డున దేవకూట పర్వతంపైన వీరభద్రస్వామి వారి ఆలయం, భావనారాయణ స్వామివార్ల ఆలయాలు ఉన్నాయి. తెలుగు సినిమాలలో అత్యధికంగా చిత్రీకరణ జరిగిన మంచి అందమైన దేవాలయం ఇది. ఎప్పుడూ సినిమా షూటింగులతో రద్దీగా ఉండే దీన్ని పట్టిసం, పట్టిసంనిధి, పట్టిసీమ అని కూడా పిలుస్తుంటారు. గోదావరి మధ్యనున్న చిన్న లంక మాదిరి ప్రదేశంలో శ్రీ వీరభధ్రస్వామి దేవస్థానం ప్రశాంత వాతవరణంలో అతి సుందరంగా ఉంటుంది. ఇక్కడ మహాశివరాత్రి పర్వదినాన ప్రతియేటా ఐదురోజులపాటు బ్రహ్మాండమైన ఉత్సవాలు జరుగుతాయి. ఈ తిరునాళ్ళకు లక్షలాదిగా భక్తులు తరలి వస్తుంటారు.
ఒకప్పుడు ఇక్కడ కనీసం మంచి నీళ్ళు కూడా దొరకని పరిస్థితి ఉండేది. కాని ఇప్పుడు దేవాలయములో అన్ని రకాల సౌకర్యాలున్నాయి. భక్తులు విడిది చేసేందుకు ఇక్కడ గదులు నిర్మించారు. త్రాగుగునీటి వసతులు, భోజనశాలలు, గోదావరి పడవల రేవు, స్నానాలరేవులను రెండేళ్ళ క్రితం కొత్తగా ఏర్పాటు చేశారు. చుట్టూ గోదావరి, మధ్యలో దేవాలయం ఉండడంతో ఇక్కటి వాతావరణం గంభీరంగానూ, అందంగానూ ఉంటుంది. అలాగే ప్రస్తుతం విస్తరణ పనుల్లో భాగంగా ఆలయం చుట్టూ పెంచిన చెట్ల పెంపకంతో ఈ ప్రాంతాన్ని సందర్శించిన వారిని ఈ దేవాలయం విశేషంగా ఆకర్షిస్తుంది.
అప్పుడు అగస్త్యమహాముని వచ్చి వీరభద్రుని వెనకనుంచి ఆలింగనముచేసుకొని విడిపోయిన అతని జటాజూటాన్ని ముడివేసి అతన్ని శాంతింపచేశాడని పురాణ గాధ.అక్కడే రుద్ర సంభూతుడైన వీరభద్రుడు భద్రకాళీ సమేతుడై వెలిశాడట. ఈ ఆలయంలో మూల విగ్రహముపై అగస్త్యుని చేతిగుర్తులు, శిరస్సుపై ముడిని మనం చూడవచ్చును. పట్టిసం జారిపడినది కనుక ఈక్షేత్రానికి పట్టిసాచల క్షేత్రమని పేరు వచ్చింది.కాలక్రమేణా అది పట్టిసం, పట్టిసీమగా మారింది.కొవ్వూరు నుండి గోదావరి గట్టున 26వ కిలోమీటరు వద్ద ఉన్న ఈ ేత్రానికి... గోదావరి నదిలోనికి ఏటవాలుగ చక్కని రోడ్డు వుంది.అక్కడనుంచి పడవలలో నది దాటి నదిమధ్యలో గల పట్టిసం కొండకు చేరవచ్చు. వర్షాకాలం మినహాయించి నదీ ప్రవాహాన్ని బట్టి ఇక్కడ ఇసుక తిప్పలు ఏర్పడతాయి. 
మహమ్మదీయులు మనదేశం దక్షిణ ప్రాంతంలోకి రావడం వలన అంతకు ముందు వందలాది సంవత్సరాల పాటు సాగిన అనేక నిర్మాణ కార్యక్రమాలకు అంతరాయం కలిగింది. ఈలోగా మహోత్తుంగ తరంగంలా విజయనగర సామ్రాజ్యం పైకి వచ్చింది. 14 వ శతాబ్ది మధ్య కాలం నాటికి ముస్లింల రాకకు ఆనకట్టవేసింది. దక్షిణ భారతదేశ మంతా విస్తరించింది. హంపి (విజయనగర) ని రాజధానిగా చేసుకొని ఏకఛత్రాధిపత్యంగా ఏలారు విజయనగర చక్రవర్తులు.
విజయనగర రాజులు కట్టించిన ఆలయాల నగరం విజయనగరానికే విద్యానగరమన్న పేరుంది. శృంగేరీ పీఠాధిపతి అయిన విద్యాశంర (విద్యా తీర్థ) స్వామివారి ప్రధాన శిష్యుడూ, విజయనగర సామ్రాజ్య స్థాపనకు కారకుడైన విద్యారణ్యస్వామిపట్ల గౌరవ సూచకంగా విద్యా నగరం అన్న పేరువచ్చింది. ఈ విద్యారణ్యుడు అప్పటి విజయనగర సామ్రాజ్యాధీశుడైన హరిహర, బుక్కరాయుల సోదరులకు గురువుగా నిలిచి విజయనగర హిందూ సామ్రాజ్యానికి నాంది పలికాడు. ఆయన ఆధ్వర్యంలో 1వ విరూపాక్షరాజు 1336 ఏప్రిల్ నెలలో విరూపాక్షస్వామి సమక్షంలో పట్టాభిషిక్తుడయ్యాడు. తుంగభద్ర నదికి ఆవల ‘ఆనెగొంది’ అనే గ్రామంలో చాలా ఎత్తుగా భద్రంగా పెద్ద కోటను నిర్మించారు. నదికి ఇటువైపున హంపీని రాజధానిగా ఏర్పాటు చేసుకొని బుక్కరాయ సోదరులు పరిపాలన సాగించారు.
హంపీలోని విరూపాక్ష ఆలయం చాలా పెద్దది. ఇక్కడ ప్రధాన దైవం విరూపాక్షుడు. శివుడినే ఇక్కడ విరూపాక్షస్వామి అంటారు. ఇప్పటికీ ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. హంపీ వీధికి పశ్ఛిమ దిశగా ఎతె్తైన గోపురం దేవాలయం లోపలికి స్వాగతం పలుకుతుంది. ఈ ఆలయం క్రీశ 10-12 శతాబ్దాలలో కట్టి ఉంటారనీ, చాళుక్యుల తర్వాత వచ్చిన హోయసలులు కూడా కొన్ని పునరుద్ధరణ చేశారనీ చరిత్ర కారుల అంచనా. అయితే ప్రధాన ఆల యాన్ని విజయనగర రాజులు పునరుద్ధ రించి అందంగా తీర్చిదిద్ది అభివృద్ధి చేశారు. ఈ ఆలయానికి చుట్టూ మూడు ప్రాకారాలున్నాయి.
అలాగే అక్కడి నుంచి విఠలేశ్వరా లయానికి నైరుతీగా నడిచి వెళ్తుంటే దారిలో ఒక తులాభారం తూచే రాతి కట్ట డం కన్పిస్తుంది. దీనిని రెండు గ్రానైట్ స్తంభాలను కలుపుతూ పైన భూమికి సమాంతరంగా ఒక రాతికమ్మీ ఉంది. ఈ నిర్మాణాన్ని ‘రాజ తులాభారం’ అం టారు. కొన్ని ముఖ్యమైన రోజుల్లో ఇక్కడ రాజు తన ఎత్తు బంగారు, వజ్రవైఢూ ర్యాలను తూచి బ్రాహ్మణులకు దానం చేశేవాడట. ఇది పూర్తిగా గ్రానైట్‌రాతితో కట్టడంతో ఇప్పటికీ చెక్కు చెదరకుం డా ఉంది. ఇంకొక దేవాలయం ‘హజారా రామాలయం’. దీర్ఘచతురస్రాకారం గా ఉన్న ఈ ఆలయాన్ని అంతకు ముందు రాజవంశీయులు ఎవరో ప్రారం భించగా దీనిని శ్రీకృష్ణ దేవరాయలు పూర్తి చేశారంటారు.
విఠలాలయం సముదాయం చుట్టూ ప్రాకారం ఉంది. ఈ ప్రాకారానికి తూర్పున, దక్షిణాన, ఉత్తరాన గోపుర ద్వారాలున్నాయి. మండపాలు, ఉప మండపాలు, చుట్టూ పరివార ఆయతనాలున్నాయి. అన్నీ విజయనగర ఆలయాలలో మాదిరిగా ఇక్కడి మండపాలు, గోపురాలు చాలా పెద్దవి. దాదాపుగా అన్నీ వెయ్యి స్తంభాల మండపాలే. కుడ్య స్తంభాల మధ్య భాగాలు నాజూకుగా ఉన్నాయి. కొన్ని చోట్ల ఒకే రాతి నుంచి చెక్కిన మధ్య స్తంభమూ, చుట్టూ ఉప స్తంభాలూ లేదా జంతువులు ఉన్నాయి. ఈ స్తంభాలమీద మీటితే ‘సరిగమపదనిస’ స్వరాలు పలుకుతాయట! ఇప్పటికికూడా! అయితే వచ్చిన యాత్రికులంతా ఆ స్తంభాల మీద రాళ్లతో కొట్టి పరీక్షిస్తున్నారని ఇపుడు కర్నాటక గవర్నమెంటు గట్టి సెక్యూరిటీని ఇక్కడ ఏర్పాటు చేసింది. ఇక్కడే ‘ఏకశిలారథం’ ఒక అత్యద్భుమైన కట్టడం. ఒకేరాతిలో చెక్కిన రథం, పైన రెండు గోపురాలతో అద్భుతంగా చెక్కారు. పైన రెండు గోపురాలు నేడు శిథిలమైనా ఈ ఏకశిలారథం చక్కగా ఉంది. ఈ ఏకశిలా రథాన్ని చూడగానే మనకు ఒక పాట గుర్తుకొస్తుంది...
ఇక్కడ ఏకశిలతో కట్టిన ‘ఉగ్రపరసింహ’ మూర్తి పెద్ద శిలలో తొలిచారు. పక్కనే ‘బీదలింగ’ మనే శివలింగం ఉంది. ఆ లింగం ప్రతిమ కింద నుండి విరివిగా జల వస్తూ ఆ జల అక్కడి పంటపొలాలకు వెళ్లడం చూస్తాం. తరువాత ‘శ్రీకృష్ణాలయం’ కూడా అక్కడే ఉంది. ఇది చిన్నికృష్ణుని ఆలయం. ఇపుడు పూర్తిగా శిథిలమైపోయి ఉంది. కళింగదేశంపై రాయలు విజయానికి చిహ్నంగా కట్టించాడని ఇక్కడ శాసనం ఉంది. ఈ ఆలయం పరివార ఆలయాలతో, మండపాలతో, స్తంభఋలతో, మాలికలతో, అందమైన గోపురం ఉన్న మనో జ్ఞమైన ఆలయం. అయితే ఇపుడు శిథిలమైనా తప్పక చూడాల్సిందే. గర్భగు డిలో విగ్రహంలేదు. ఈ ఆలయానికి ఎదురుగా పెద్ద వీధి ఉంది. ఈ వీధికి రువైపులా చిన్న చిన్న గదుల్లా కట్టిన రాతికట్టడాలున్నాయి. ఇవి దాదాపు వంద లాది ఉంటాయి. ఇక్కడే ఈ వీధుల్లోనే రత్నాలూ, వజ్రవైఢూర్యాలు రాశులు పోసి అమ్మేవారట!
ఇంకా ఇక్కడ చూడాల్సినవి క్వీన్‌బాత్ కట్టడం, లోటస్ మహల్, ఏనుగుల గజ శాల, సరస్వతీ దేవాలయం, పుష్కరిణి, పురావస్తు శాఖవారి మ్యూజియం తప్పక చూడాల్సినవి. మ్యూజియం హంపీ నగరానికి దగ్గరలోని కమలాపురం లో ఉంది. ఇవన్నీ చూసుకొని ఇకరాత్రికి తిరుగు ప్రయాణం అయ్యాం.ఎలా వెళ్లాలి? దేశం నుండి బళ్లారికి విమాన, రైలు బస్ సౌకర్యం అన్ని ప్రాంతాలనుండి ఉన్నాయి. బళ్లారి నుండి హోస్పేటకు 60 కిమీ హోస్పేట నుండి హంపి 13 ిమీ ఇక్కడ మొత్తం హంపి నగర సందర్శనకు టూరిస్ట్ గైడ్లు విరివిగా ఉన్నారు. ఆటోలు, కార్లు అందుబాటులో ఉన్నాయి. అయితే కొన్ని ప్రాంతాలలోకి కారు ఆటోలు వెళ్లవు. తప్పనిసరిగా ద్విచక్ర వాహనం, సైకిళ్ల మీదనే వెళ్లాలి. వీటిని కూడా అద్దెకు ఇస్తారు ఇక్కడ. ఎక్కువగా విదేశీయులు మనకు తారసప డతారు. వాళ్లంతా సైకిల్, ద్విచక్రవాహనంమీద తిరుగుతారు. అలా కూడా మొత్తం చూడొచ్చు. విజయనగర రాజుల మొదటి కోట ‘ఆనెగొంది’ కోటకు వెళ్లాలంటేమాత్రం తుంగభద్ర నదిమీద చిన్న పుట్టీల (గుండ్రంగా ఉండే పడవ లాంటివి) మీద వెళ్లాల్సిందే.
సుమారు 250 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ నల్లమల అరణ్యంలో ఎక్కడచూసినా దేవీదేవతల శిలారూపాలే కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఓ కొండలోనే ఎనిమిది ఆలయాలు చెక్కిన వైనం ఎంతో అపురూ పంగా అనిపిస్తుంటుంది. ఇక్కడున్న దుర్గాంబ ఆలయంలో అమ్మవారి విగ్రహం మీద కార్తీకపౌర్ణమి రోజున చంద్రకిరణాలు పడటం భైరవకోనకున్న మరో విశేషం. అందుకే ఆరోజున భక్తులు విశేషంగా ఇక్కడకు తరలివస్తుంటారు. శివరాత్రికి పక్కనే ఉన్న జలపాత సేలయేటిలో స్నానంచేసి శివరూపాల్ని దర్శించుకుంటారు.
వీటన్నింటిలోనూ గర్భాలయాలూ, వరండాలూ స్తంభాలూ అన్నీ ఆ కొండ రాయితోనే మలచగలగడం విశేషం.శివలింగాలను మాత్రమే గ్రానైట్ శిలలతో చెక్కి ప్రతిష్ఠించారు. ఈ గుహాలయాల్లో నెలకొన్న ప్రధానదైవం భర్గేశ్వరుడు. ఈ ప్రాంతానికి క్షేత్రపాలకుడు భైరవుడు.ఆయనపేరుమీదే దీన్ని భైరవక్షేత్రంగా పిలుస్తున్నారు.అయితే ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని కాలభైరవుడు అనే చక్రవర్తి పాలించాడనీ అందుకే ఇది భైరవకోన అయిందనీ అంటారు. అందుకు సాక్ష్యంగా ఈ ప్రాంతం చుట్టూ కోటల ఆనవాళ్లు అనేకం కనిపిస్తుంటాయి.
ఇక్కడ ఉత్తరముఖంగా ఉన్నదే మొదటిగుహ. దీనికి ఎదురుగా నంది ఉంటుంది. తలపాగాలు ధరించిన ద్వారపాలక శిల్పాలు ఈ గుహ ప్రధాన ఆకర్షణ.మిగిలినవన్నీ తూర్పు ముఖంగానే ఉంటాయి. అయితే అన్నింటికన్నా ఏడో గుహాల యం సుందరంగా కనిపిస్తుంటుంది. ఎనిమిదో గుహలో లింగంతోపాటు బ్రహ్మ, విష్ణువుల బొమ్మలు కూడా చెక్కివుండడం విశేషం. త్రిమూర్తులు ఒకేచోట ఉన్న అరుదైన ప్రదేశంగా ఇది అత్యంత ప్రాచుర్యం పొందింది.అంతేకాదు ఈ ప్రాంతం అనేక ఔషధ మొక్కలకు పుట్టినిల్లు కూడా.ఆయుర్వేద వైద్యానికి అవసరమైన ఎన్నో మూలికల్ని ఇక్కడనుంచే సేకరిస్తుంటారు.
ఇక్కడి ఆలయాలకు మహాబలిపురంలోని ఆలయ నిర్మాణ శిల్పశైలికి సారూప్యం ఉండటంతో ఈ గుహాలయాలను పల్లవుల కాలానికి చెందినవిగా భావిస్తున్నారు. క్రీశ 600-630 కాలానికి చెందిన మహేంద్రవర్మ పాలనలోనే ఈ గుహాలయాలు ప్రారంభించి ఉంటారన్నది చరిత్రకారుల అభిప్రాయం. అయితే ఐదోగుహలోని స్తంభాలమీద ఉన్న నరనరేంద్రుడు, శ్రీత్రిభువనాదిత్యం...వంటి పదాలను చూస్తుంటే ఈ ఆలయాల నిర్మాణం ఏడో శతాబ్దం నుంచి చాళు క్యులకాలం వరకూ అంటే 11వ శతాబ్దంవరకూ కొన సాగి ఉంటుందని అంచనా. ఇక్కడ ఈ గుహాలయాలతో పాటు చుట్టుపక్కల ఉన్న గుండాలనూ దోనల్నీ చూడొచ్చు. సోమనాథ, పాల, కళింగ దోనలు; పార్వతి, కాముని, సరస్వతి, త్రివేణి, పాచికల గుండాలు ఇక్కడ దర్శనీయస్థలాలు. అయితే అటవీప్రాంతం కావడంతో ఇవన్నీ తిరగాలంటే కాలినడక తప్పనిసరి.