

వసంతం మొదట్లోనే వచ్చే పూలు కొన్నయితే, ఏప్రిల్ నెల మధ్య నుంచి మే నెల మధ్య వరకు విరబూసి నయనానందం కలిగించే పూలల్లో తులిప్స్ పూలు ముందుంటాయి. వీటిని పెద్ద పెద్ద తోటల్లో నాటుతారు కాబట్టే మనం'సిల్ సిలా' సినిమాలో చూసినట్టుగా మొత్తం భూమిపై పరుచుకుని పలకరిస్తాయి.

తులిప్స్ మొదట ఒట్టోమాన్ సామ్రాజ్యంలో ప్రాచుర్యం పొందాయి. ఈ పూలని టర్కీ వారు భగవంతుని పూలుగా భావిస్తారు. టర్కిష్ భాషలో తులిప్స్ అని రాయడంలో అల్లా అని రాయడంలో ఉండే అక్షరాలే ఉంటాయి. అందుకని మానవుల ఆనందం కోసం దేవుడే వాటిని సృష్టించాడని అనుకుంటారు.
టర్కీ చరిత్రలో ఈ తులిప్స్ చాలా ముఖ్యమైన పాత్ర వహించాయి. మూడవ సుల్తాన్ అహ్మద్ రాజ్యంచేసే సమయంలో దాదాపు 1718 నుంచి 1730 వరకు ఉన్న కాలాన్ని 'తులిప్‌యుగం' అంటారు. ఈ కాలాన్ని అందరూ ఆనందంగా ఉన్న యుగంగా చెప్పుకుంటారు. ఎంబ్రాయిడరీ పనుల్లో, నేత పనిలో తివాచీలు, బొమ్మలపైన కూడా తులిప్స్ డిజైన్స్, ఆకారాలు చోటుచేసుకునేవి. ధనవంతుల సందర్శన కోసం తులిప్స్ తోటలు తయారు చేసేవారు.

తులిప్స్ పూలు టర్కీ నుంచి ఇతర దేశాలకు ముఖ్యంగా యూరప్‌లోని హాలెండ్‌కి చేరాయి. అయితే హాలెండ్ దేశం ఎన్నో అందమైన రకాల తులిప్ గడ్డలను ఇతర దేశాలకు పంపిణీ చేయడంతో ఎక్కువమంది తులిప్స్ హాలెండ్ నుంచే వచ్చాయనుకుంటారు. యూరప్‌కి చేరకముందే ఎన్నో రకాల హైబ్రిడ్, అందమైన తులిప్స్‌ను టర్కీలోనే సిద్ధం చేశారు. ఇప్పుడు హాలెండ్ దేశస్థులు వాటిపై చాలా ప్రయోగాలు చేస్తూ కొత్తవి సృష్టిస్తున్నా తులిప్స్ గొప్పతనం టర్కీకే చెందుతుంది.

తులిప్స్‌లో లెక్కలేనన్ని జాతులున్నాయి. హైబ్రిడ్ తులిప్స్‌ని పెంచేవారు పెద్ద తోటలనే ఎంచుకుంటారు. వీటిని ఇళ్లల్లో కుండీల్లో పెట్టి కూడా పెంచుకోవచ్చు. శిశిరంలో తులిప్ గడ్డలు పాతితే అవి వసంతకాలంలో మొలకేసి పూలు పూస్తాయి. పర్షియన్ కవులు ఈ పూలను 'టర్బన్' అనేవారట.

తులిప్స్ గురించి ఒక కథ కూడా ప్రచారంలో ఉంది. తులిప్స్ పూలు చాలాకాలం పాటు విరియకుండానే మొగ్గగా ఉండేవట. ఒకరోజు ఒక తల్లి తన పాపని ఆడుకోవడానికి తోటకు తీసుకుని వెళ్లింది. తులిప్ మొగ్గని చూడగానే పాప నవ్వింది. పాప నవ్వగానే తులిప్ మొగ్గ వికసించింది. అప్పటి వరకు ఎవరూ చేయలేని పని ఆ పాప చేసింది. అప్పటినుంచే ఇతరులను సంతోష పరచలాలనుకున్నపుడు తులిప్స్ పూలని తీసుకెళ్లే సంప్రదాయం వచ్చింది.

తులిప్స్ పూలని సుగంధ ద్రవ్యాల్లో విరివిగా వాడతారు. ఈ పూల సుగంధంతో తయారు చేసిన ఫర్‌ఫ్యూమ్స్ ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి.

టర్కీలో ప్రతి ఏడాది వేసవిలో తులిప్స్ ఫెస్టివల్ జరుగుతుంది. హాలెండ్‌లో జరిగే తులిప్ ఫెస్టివల్ కోసం ఇతర దేశాల నుంచి కూడా జనం తరలివస్తారు. తులిప్స్ పూలనే టర్కీ పర్యాటక లోగోగా వాడుకున్నారు.

టర్కిష్ ఎయిర్‌లైన్స్
వారు ప్రతి విమానంపై తులిప్ బొమ్మని పెయింట్ చేస్తారు.
లిల్లీపూల గ్రూప్‌కి చెందిన ఈ పూలు ఎన్నో రంగుల్లో పూస్తాయి. రెండు రంగులు కలిసిన రకాలూ ఉన్నాయి. ప్రస్తుతం వంద రకాల జాతుల నుంచి మూడువేలకుపైగా రకాల తులిప్స్‌ని ప్రపంచ వ్యాప్తంగా పెంచుతున్నారు. పెన్సిల్వేనియా లాంగ్ ఉడ్ గార్డెన్స్‌లో రకరకాల రంగుల తులిప్స్‌ను చూస్తే కొత్తలోకంలోకి ప్రవేశిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అక్కడి నుంచి కదలిరావడానికి మనస్కరించదు. తులిప్స్ పూలు కేవలం అందంగా ఉండడమే కాదు, శాంతికి చిహ్నాలు కూడా. మన దేశంలో వీటిని చూడాలనుకుంటే కాశ్మీర్‌లోని శ్రీనగర్ తులిప్స్‌తోటలకు వెళ్లొచ్చు.
ఒకరోజు ఒక తల్లి తన పాపని ఆడుకోవడానికి తోటకు తీసుకుని వెళ్లింది. తులిప్
మొగ్గని చూడగానే పాప నవ్వింది. పాప నవ్వగానే తులిప్ మొగ్గ వికసించింది.
అప్పటి వరకు ఎవరూ చేయలేని పని ఆ పాప చేసింది. అప్పటినుంచే ఇతరులను సంతోష
పరచలాలనుకున్నపుడు తులిప్స్ పూలని తీసుకెళ్లే సంప్రదాయం వచ్చింది.
- కనకదుర్గ, అమెరికా నుంచి

లిల్లీపూల గ్రూప్‌కి చెందిన ఈ పూలు ఎన్నో రంగుల్లో పూస్తాయి. రెండు రంగులు కలిసిన రకాలూ ఉన్నాయి. ప్రస్తుతం వంద రకాల జాతుల నుంచి మూడువేలకుపైగా రకాల తులిప్స్‌ని ప్రపంచ వ్యాప్తంగా పెంచుతున్నారు. పెన్సిల్వేనియా లాంగ్ ఉడ్ గార్డెన్స్‌లో రకరకాల రంగుల తులిప్స్‌ను చూస్తే కొత్తలోకంలోకి ప్రవేశిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అక్కడి నుంచి కదలిరావడానికి మనస్కరించదు. తులిప్స్ పూలు కేవలం అందంగా ఉండడమే కాదు, శాంతికి చిహ్నాలు కూడా. మన దేశంలో వీటిని చూడాలనుకుంటే కాశ్మీర్‌లోని శ్రీనగర్ తులిప్స్‌తోటలకు వెళ్లొచ్చు.

- కనకదుర్గ, అమెరికా నుంచి