విహారాలు

India

Gamyam

Saturday, January 29, 2011

సాయంకాలం.. సాగరతీరం.. హైదరాబాద్‌లోని హుస్సేన్‌ సాగర్‌

ఊహాలోకంలో విహరించే ప్రేమికులైనా, సాయంత్రం వరకు పనిచేసివచ్చే ఉద్యోగులైనా, కాలేజీలకు వెళ్లే విద్యార్థులైనా హైదరాబాద్‌లోని హుస్సేన్‌ సాగర్‌ చెంత సేద తీరేందుకు ఇష్టపడతారు. అలా నెక్లెస్‌ రోడ్డుపైకి వెళ్ళాక వాతావరణానికి తగ్గట్టు అక్కడ దొరికే చిరుతిళ్ళను ఆరగిస్తూ ఆనందించడమూ ఆనవాయితే.నగరంలో వయోభేదం లేకుండా అందరికీ ఆత్మీయ నేస్తమైన నెక్లెస్‌రోడ్డు హైదరాబాద్‌లో సాగర తీరం లేదనే కొరతను కొంతలో కొంత తీరుస్తోంది. పరిసరాలలో చిన్న చిన్న ఇబ్బందులున్నా సర్దుకుపోతూ నగరవాసులు అక్కడ దొరికే చిరుతిళ్ళనే ఆస్వాదించడం విశేషం..

necklaceroad-
వేరే ప్రదేశాలలో ధనిక, పేద వంటి తారతమ్యాలు ఉంటాయేమోగానీ సరదాగా గడిపే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు సాధారణంగా ఇవేవీ కనిపించవు. ఇటువంటి సేదతీరే ప్రాంతమైన నెక్లెస్‌రోడ్డులో దొరికే ఏ తినుబండారాలనైనా అందరూ ఇష్టంగా తింటారు. ఇక్కడ సామాన్యులకు అందుబాటులో ఫుడ్‌ ఐటమ్స్‌ ధరలు ఉంటాయి కాబట్టి వాటికి పెద్ద ఖర్చు కూడా పెట్టనవసరం లేదు. ఇలా నెక్లెస్‌రోడ్డుపై దొరికే మొక్కజొన్న పొత్తుల నుంచి కూల్‌డ్రింక్‌ల వరకు అందరికీ ప్రీతిపాత్రమే.

రుచిలో అమోఘం...
పానీపూరీలో రసంతో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తింటుంటే...ఆ టేస్టే వేరు. ఈ ఖరీదైన రోజుల్లో ట్యాంక్‌ బండ్‌పై యువతీ యువకులు ఇష్టపడే పానీపూరీని పరిశుభ్రంగా అతి తక్కువ ధరల్లో లభిస్తుందంటే ఎవరుమాత్రం తినకుండా ఉంటారు చెప్పండి. ఈ పూరీలను చిన్న చిన్న ట్రావెలింగ్‌ బల్లపై పెట్టి అమ్మేవారు చాలా మంది ఉన్నా కూడా అందరి వ్యాపారం జోరుగానే ఉండడం విశేషం. సాయంత్రాలలో వీటి వ్యాపారం యమ స్పీడుగా ఉంటుందని హుస్సేన్‌ సాగర్‌ వద్ద పానీపూరీ వ్యాపారం నిర్వహించే వారు చెబుతున్నారు.‘రుచికరమైన నీటితో నింపి ఇచ్చే పానీపూరీ అంటే ఎంతో ఇష్టం. ప్రతి రోజు సాయంకాలం ఆఫీసు ముగిసిన వెంటనే స్నేహితులతో కలిసి కాసేపు నెక్లెస్‌ రోడ్డులో సరదాగా గడుపుతాను. ఈ సందర్భంగా అందరం కలిసి పానీపూరీలను తింటాము. నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోయే ఈ గప్‌చుప్‌ల రుచి అమోఘం’ అని సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ శ్రీకాంత్‌ అన్నారు.

ఆ అనుభూతే వేరు...
in-the-parkచలిగాలులు వీస్తూ ఒళ్లంతా గిలిగింతలు పెడుతుంటే వేడి వేడి మొక్కజొన్న తింటుంటే కలిగే అనుభూతే వేరు. హుస్సేన్‌ సాగర్‌ వచ్చే వారు ఇష్టపడే వాటిల్లో మొక్క జొన్న పొత్తులకు ప్రత్యేక స్థానం దక్కుతుంది.చలికాలం వచ్చిందంటే ఇక నెక్లెస్‌రోడ్డుకు మహారాజు మొక్కజొన్నే. చాలామంది కాల్చిన మొక్కజొన్నలనే తినేందుకు ఇష్ట పడతారు.వీటి ఖరీదు పది రూపాయలు మాత్రమే.హుస్సేన్‌ సాగర్‌ వద్ద కొందరు గత పదేళ్ల నుంచి మొక్క జొన్న పొత్తులను అమ్ముతూ జీవనం సాగిస్తున్నారంటే ఇక్కడ వీటికి ఎంత గిరాకీ ఉందో అర్థం చేసుకోవచ్చు.

రోడ్డున పోయే వాళ్లు ఎంత మంది తింటారో కార్లలో వచ్చే ధనవంతులు కూడా అంతమందే తింటారు.చలికాలంలో మొక్క జొన్నలను అమ్మే వారికి క్షణం తీరిక ఉండదంటే నమ్మండి. ‘వేడి వేడి మొక్కజొన్న తింటూ నెక్లెస్‌రోడ్డులో సరదాగా నడుస్తుంటే ఆ అనుభూతే వేరు. స్నేహితులతో కలిసి కబుర్లు చెప్పుకుంటూ కనీసం వారానికి ఒకసారైనా హుస్సేన్‌సాగర్‌ చెంతకు వస్తాము. ముఖ్యంగా వీకెండ్స్‌లో నెక్లెస్‌ రోడ్డుకు స్నేహితులందరం కలిసి వచ్చి కొంత సేపు గడుపుతాము. సరదాగా ఆడుతూపాడుతూ మొక్కజొన్నలను ఆస్వాదిస్తాము’ అని డిగ్రీ విద్యార్థిని సుష్మ పేర్కొంది.

ఐస్‌క్రీమ్‌ తినాల్సిందే...

good-placeమధ్యాహ్నం వేళలోనైనా, రాత్రి సమయంలోనైనా వర్షం కురిసినా, చలి గాలులు వీస్తున్నా ఏ వాతావరణంలోనైనా అందరికీ ఇష్టమైనది ఐస్‌క్రీమ్‌. అందరూ తినే ఐస్‌క్రీం ధరలు సామాన్యులకు అందుబాటులోనే ఉన్నాయి. ‘హుస్సేన్‌ సాగర్‌ తీరానికి వచ్చాక ఐస్‌క్రీమ్‌ తినకుండా వెళ్ళే సమస్యేలేదు.రోజులో ఒక సారైనా ఇటువైపు రావాల్సిందే వచ్చిన తరువాత ఐస్‌క్రీం తినాల్సిందే’ అని కాలేజీ స్టూడెంట్‌ తరణ్‌ చెప్పాడు. ఇక నెక్లెస్‌ రోడ్డు ప్రాంతంలో వివిధ కంపెనీల ఐస్‌క్రీమ్‌ వాహ నాలు కనిపిస్తాయి. అన్ని కాలాల్లో ఈ ఐస్‌క్రీమ్‌లకు మంచి గిరాకి ఉంటోంది.

కోరుకుంటారు...

etingచేతిలో తినటానికి ఏది పట్టుకున్నా దాహమేస్తే మాత్రం శీతల పానీ యాన్ని కోరుకుంటారు. కూల్‌డ్రింక్‌ను అందరూ ఎంతో ఇష్టంగా తాగుతున్నారు. నెక్లెస్‌ రోడ్డుకు వెళ్లిన చిన్న పిల్లలనుంచి పెద్దవారి వరకు అందరికీ కామన్‌గా ఏదో ఒక కూల్‌డ్రింక్‌ తప్పకుండా కావాల్సిందే.అలాగని ఇక్కడి కూల్‌డ్రింక్‌ల ధర ఎక్కువగా ఉంటుందనుకుంటే పొరపాటే. మామూలుగా ఎంత ధర ఉంటుందో అంతే ఉంటుందిక్కడ.స్నాక్స్‌ను తింటూ కూల్‌డ్రింక్‌ను తాగితే ఆ మజాయే వేరని కొందరు యువతీయువకులు పేర్కొంటున్నారు.

పొగలు కక్కే...
మానసిక ప్రశాంతత కావాలంటే ఏ పార్క్‌కు వెళ్ళినా లభిస్తుంది. కానీ నెక్లెస్‌ రోడ్డు దగ్గర మాత్రమే మానసిక ఉల్లాసంతో పాటూ చక్కని ఇరానీ చాయ్‌ కూడా దొరుకుతుంది. అక్కడ ఫ్లాస్క్‌ల్లో టీ, కాఫీలను అమ్మేవారు ఉంటారు. చల్లని వాతావరణంలో వేడి వేడిగా చాయ్‌ తాగుతుంటే ఎంతో హాయిగా ఉంటుంది. ఆఫీసుల నుంచి వచ్చేవారు రిలాక్స్‌డ్‌గా కాఫీ తాగడానికే ఇక్కడకు వస్తారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. రోజంతా పనితో అలసిపోయిన కొందరు యువతీయువకులు సాయంత్రం పూట కొంతసేపు ఇక్కడికి వచ్చి ఛాయ్‌ తాగుతూ సేద తీరుతూ కనిపిస్తారు. కబుర్లు చెప్పుకుంటూ మానసికోల్లాసాన్ని పొందుతారు.

బోలెడంత ఎంటరటైన్‌మెంట్‌...
popcianఇవే కాకుండా ట్యాంక్‌బండ్‌పై ఎంటర్‌టైన్‌మెంట్‌ అందర్నీ ఉల్లాసపరుస్తుంది. సాగర్‌నుంచి సంగీతంలా వినిపించే చిరుగాలి అందర్నీ ఉల్లాసపరుస్తుంది. లుంబినీ పార్క్‌ వెళ్లి బోట్‌లో కూర్చొని హాయిగా మాట్లాడుకుంటూ తిరగవచ్చు. ఇక కొత్తగా పెళె్ళైన జంటలకైతే ఇలా విహరిస్తుంటే లాహిరి లాహిరి లాహిరిలో... అనే పాట తప్పకుండా గుర్తుకొస్తుంది. ఇక అక్కడ ముఖ్యంగా కనిపించేది చిలక జోస్యం. నమ్మకాలు కాసేపు పక్కన పెడితే చిలక జోస్యం చెప్పించుకోవడంలో ఎంత మజా ఉంటుందో ఒక సారి చెప్పించుకుంటే గానీ అర్థంకాదు.ఇలా సాగర్‌ వద్ద సరదాలకు అనేక మార్గాలు ఉన్నాయి.

‘నెక్లెస్‌రోడ్డులోని జలవిహార్‌లో కాసేపు గడిపేతే ఆ మధురానుభూతే వేరు. ఇక్కడ జలకాలాటలు ఆడుతూ వీకెండ్‌లో కుటుంబంతో కలిసి ఎంజాయ్‌ చేస్తాను. మా పిల్లలైతే వారానికి ఒక్కసారైనా జలవిహార్‌కు వెళ్లకపోతే ఊరుకోరు. పిల్లల కోసమైన మేము అక్కడికి వెళ్తాము’ అని హైదరాబాద్‌ నివాసి ప్రకాష్‌ చెప్పారు. ఇవేగాకుండా తరచుగా నెక్లెస్‌రోడ్డులో ప్రత్యేకంగా ఎగ్జిబిషన్‌లు, ఎంటర్‌టైన్‌మెంట్‌ కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇవన్నీ సందర్శకులకు మరచిపోలేని అనుభూతులను మిగులుస్తున్నాయి.

-ఎస్‌.అనిల్‌ కుమార్‌

Tuesday, January 25, 2011

సిమ్లా ..... భూతల స్వర్గం

సిమ్లా షికారు
Shimla2
ఎటుచూసినా తెలుపు తివాచీ పరిచినట్లుండే దట్టమైన మంచు. ఆ మంచును కుప్పలుతెప్పలుగా పోసినట్లుండే పర్వతాలపై సూర్యకిరణాలు పడి బంగారు వర్ణంలో మెరిపోయే చూడచక్కని దృశ్యాలు, పచ్చని పచ్చికబయళ్ళు, ఆపిల్‌ తోటల అందాలు, లోయలు, పైన్‌... ఓక్‌ చెట్ల సోయగాలు ఇవన్నీ సిమ్లాను భూతల స్వర్గంగా తీర్చిదిద్దాయి. ప్రతిఏటా ఫిబ్రవరి నెలలో జరిగే వింటర్‌స్పోర్ట్‌‌స సిమ్లాకు ప్రత్యేక ఆకర్షణ. సిమ్లా మంచుకొండల్లో అడ్వెంచర్‌ టూర్‌ ఓ మరుపురాని అనుభూతి. మంచుపై స్కీయింగ్‌ చేస్తూ దూసుకుపోవడంలో ఉన్న ఆనందం మాటల్లో చెప్పరానిది. సిమ్లా నుంచి కుఫ్రి వెళ్లేదారి అంతా ఒకవైపు ఆకాశాన్నంటే పర్వతాలు, మరోవైపు లోతైన లోయలు. ఈ పర్వత శ్రేణులన్నీ మంచుదుప్పటి కప్పుకున్నట్లుగా ఉంటే, లోయలన్నీ రంగు రంగుల సీతాకోక చిలుకల్లా ఉంటాయి. వింటర్‌ స్పోర్ట్‌‌సకు కేంద్రమైన సిమ్లాలో ప్రతి ఏడాది ఫిబ్రవరి నెలలో వింటర్‌ స్పోర్ట్‌‌స వేడుకలు ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతాయి.

సిమ్లా పట్టణం మొత్తం కొండల్లోనే అమరి వుంది. అర్ధచంద్రాకారపు పర్వత సానువుల పై భాగంలో ఉండే ఈ పట్టణంలో ఎటుచూసినా ఫైన్‌, దేవదారు చెట్లు ఒకదాన్ని మించి మరొకటి ఆకాశాన్నం టుతున్నాయా! అన్నట్టుగా ఉంటాయి. అయితే శీతాకాలంలో మాత్రం ఈ చెట్లను మంచుదుప్పటి కప్పుకొని శ్వేతవర్ణంలో కనువిందు చేస్తాయి. ఇక్కడి ఇళ్లన్నీ దూరంనుంచి చూస్తే ఒకదానిపై ఒకటి పేర్చినట్లుగా ఉంటాయి.

వేడినీటిలో జలకాలాట..!
Shimla1 

హాట్‌వాటర్‌ స్ప్రింగ్‌ (వేడినీటి గుండం) సిమ్లా విహారంలో ప్రత్యేక అంశం. ఈ వేడినీటి గుండం లో స్నానం చేయడం ఎంతో ఉల్లాసాన్నిస్తుంది. ఈ నీటి గుండంలో తప్ప దాని చుట్టుపక్కల పరిసరాలన్నీ రక్తం గడ్డకట్టించేంతగా చల్లగా ఉంటాయి. కానీ, ఈ వేడినీటి గుండంలోని నీరు మాత్రం మరుగుతూ ఉంటాయి. ఈ నీటిలో సల్ఫర్‌ ఉన్న కారణంగా రసాయనిక చర్య జరిగి అలా జరుగుతూ ఉంటుందట. అందుకే ఇక్కడ స్నానం చేస్తే చర్మవ్యాధులు నయమ వుతాయని నమ్ముతుంటారు.

మాల్‌ రోడ్‌... లక్కడ్‌ బజార్‌...
సిమ్లా వెళ్లిన పర్యాటకులు మొట్టమొదటగా దర్శించేది మాల్‌ రోడ్‌నే. మాల్‌ సెంటర్‌ ఇక్కడ ఓ ప్రత్యేక ఆకర్షణ. ఈ మాల్‌ రోడ్‌లో విహరించడానికి పర్యా టకులు ఎక్కువగా ఇష్టపడతారు. గుర్రమెక్కి మాల్‌ అంతా చుట్టి, కావాల్సిన వన్నీ కొనుక్కోవచ్చు. సిమ్లా, దాని చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఆపిల్‌ తోటలు ఎక్కువగా ఉంటాయి. పర్యాటకులు ఈ పండ్లను కోసుకుంటున్నా స్థానికులు అభ్యంతరం చెప్పరు. అయితే కేవలం పండ్లను మాత్రమే కోసుకోవాలి. అలా కాకుండా పచ్చికాయలను ముట్టుకుంటే మాత్రం ఊరుకోరు. సిమ్లాలో ముఖ్యంగా దర్శించాల్సిన వాటిలో హిమాలయ పర్వతాలు ముఖ్యమైనవి. అత్యద్భుతంగా కనిపించే స్కాండల్‌ పాయింట్‌, చర్చి, లైబ్రరీ, లక్కడ్‌ బజార్‌.. తదితరాలు ఇక్కడ ముఖ్యమైన ప్రదేశాలు. లక్కడ్‌ బజార్‌లో కొయ్యలతో చేసిన హస్త కళల వస్తువులు విరివి గా దొరుకుతాయి. స్కాండల్‌ పాయింట్‌ నుంచి జనరల్‌ పోస్ట్‌ ఆఫీస్‌ వైపు కాస్త దూరం నడిస్తే కాలాబరి ఆలయం వస్తుం ది. ఇందులో ఉన్న దేవత శ్యామలా దేవి. ఈ దేవత నుంచే సిమ్లాకు ఆ పేరు వచ్చి నట్లు స్థానికులు చెబుతుంటారు.

సిమ్లాలోనే ఉన్న జాకూ ఆలయం ఉన్న శిఖరం కూడా ప్రత్యేకంగా చూసి తీరా ల్సిందే. ఇక్కడి నుంచి చూస్తే సిమ్లా అం తా కళ్లముందు సాక్షాత్కరిస్తుంది. ఇక్కడే హనుమాన్‌ ఆలయం కూడా ఉంది. ఈ ఆలయానికి చేరుకోవాలంటే కాస్త ఓపికతో నడిచి వెళ్లాల్సి ఉం టుంది. నడవలేనివారి కోసం గుర్రాలు, ట్యాక్సీలు కూడా అందు బాటులో ఉంటాయి.

శిల్పకళల నెలవు... స్టేట్‌ మ్యూజియం...
Shimla 

ఇక ఇక్కడి స్టేట్‌ మ్యూజియంలో హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన పురాతన, చారిత్రక ప్రాధాన్యం ఉన్న శిల్పాలు, పెయింటింగ్స్‌ ఉన్నాయి. భారతీయ సంస్కృతిని కళ్లకు కట్టినట్లు చూపించే ఈ మ్యూజియంలో ఆసక్తి కలవారికి సమయం ఎలా గడిచిపోతుం దో కూడా తెలియదట.

అలాగే ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌ కూడా చూడదగ్గ ప్రాంతమే. అక్కడినుంచి 15 నిమిషాలు నడిస్తే ప్రాస్పె క్ట్‌ హిల్‌కు చేరుకోవచ్చు. ఇక్కడ కామనదేవి ఆలయాన్ని దర్శించ వచ్చు. దాని నుంచి ఏడు కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే సమ్మర్‌ హిల్‌ చూడవచ్చు. అక్కడ ఉండే జార్జియన్‌ హౌస్‌లోనే మహా త్మాగాంధీ విడిది చేశారట. హిమాచల్‌ ప్రదేశ్‌ యూనివర్సిటీ కూడా ఇక్కడే ఉంది.

సిమ్లా నుంచి బయలుదేరినప్పటినుంచి ప్రతి ఐదు లేక ఆరు కిలోమీటర్లకు ఒక టూరిస్ట్‌ ప్లేస్‌ దర్శనమిస్తుంది. అలాంటి వాటిలో తత్తపాని, హాట్‌ వాటర్‌ స్ప్రింగ్‌ (వేడినీటి గుండం) తప్పకుండా దర్శించాలి. సిమ్లాకు చేరుకోవాలంటే.. ఢిల్లీ నుం చి చండీగఢ్‌, కల్కాల మీదుగా చేరాలి. కల్కా నుంచి సిమ్లా వెళ్లే టాయ్‌ ట్రైన్‌ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌కు కనెక్టింగ్‌ ట్రైన్‌లో వెళ్లవచ్చు.

Shimla4 

నిజానికి సిమ్లా ప్రయాణంలో ఆనందం కల్కా నుంచే మొదలవు తుంది. అక్కడి నుంచి నారోగేజ్‌ రూట్‌లో టాయ్‌ ట్రైన్‌లో ప్రయా ణించటం పర్యాటకులకు మరపురాని అనుభూతులను మిగు ల్చుతుంది. టుచూసినా హిమాలయ పర్వతశ్రేణులు, లోయ లు, ఫైన్‌, ఓక్‌ చెట్లతో ఆ దేవుడు ఈ భూ ప్రపంచంపైనే స్వర్గాన్ని సృష్టించాడా అని పించక మానదు.

సిమ్లా, కల్కాల మధ్య 103 సొరంగాలు, 87 బ్రిడ్జిలు ఉన్నాయి. టాయ్‌ ట్రైన్‌లో వెళ్లే టప్పుడు వీటన్నింటినీ చూ స్తూ, అంతులేని ఉద్వేగాన్ని పొందవచ్చు. గ్రేటెస్ట్‌ నారో గేజ్‌ ఇంజనీరింగ్‌ అచీవ్‌మెం ట్‌ ఇన్‌ ఇండియాగా గిన్నిస్‌ బుక్‌లో ఈ మార్గం రికార్డయ్యింది.

ఈ మార్గంలో లెక్కలేనన్ని చిన్నా పెద్ద నదులు కనిపిస్తాయి. వీటిలోని చాలా నదుల్లో ఎండాకాలంలో నీళ్లుండవు. కొండపక్కగా కాసేపు, సొరంగంలో మరి కాసేపు, కిందకు చూస్తే నది, ఇలా సహజత్వానికి సాంకేతికత మేళవించిన సిమ్లా సోయగాలు యాత్రికుల మనస్సుల్లో ఎల్లప్పటికీ నిలిచిపోతాయి.

సమ్మర్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియా...
వింటర్‌ స్పోర్ట్‌‌స సంరంభం తరువాత ఫిబ్రవరి చివరి మాసం నుండి వేసవి విడిదికి వచ్చే పర్యాటకుల సందడి పెరుగుతుంది. భారతదేశంలోని ప్రముఖ పర్యాటక స్థలాలలో ఒకటిగా, వేసవి విడిదిగా పేరుగాంచింది సిమ్లా. 1819లో బ్రిటీష్‌ వారిచే కనుగొనబడిన సిమ్లా, ఆ తరువాత 1864వ సంవత్సరంలో సమ్మర్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియాగా ప్రకటించబడింది.

బ్రిటీష్‌వారి కాలంలో సిమ్లాను వేసవి విడిదిగా ఉపయోగించుకునేవారు. దేశ విభజన సమయంలో కాశ్మీర్‌కు సంబంధించిన చర్చలు ఇక్కడి వైశ్రాయ్‌ భవ నంలోనే జరగటం విశేషంగా చెప్పవచ్చు. అందుకనే సిమ్లాను సందర్శించే పర్యాటకులు తప్పకుండా వైశ్రాయ్‌ భవనాన్ని కూడా దర్శిస్తుంటారు. ప్రస్తుతం ఈ భవనంలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌ స్టడీస్‌ను ఏర్పాటు చేశారు.

ఎలా చేరుకోవాలి?
raj దూరప్రాంతాల నుండి విమానయానం ద్వారా సిమ్లా చేరుకోవానుకునే పర్యా టకులకు దగ్గరి విమానాశ్రయం సిమ్లా ఎయిర్‌పోర్ట్‌. దాదాపు అన్ని ప్రధాన నగరాల నుండి ఇక్కడికి విమాన సదుపాయం ఉన్నది. ఈ ఎయిర్‌పోర్ట్‌... చంఢీఘర్‌, కులు మనాలి, ఢిల్లీ నగరాల ఎయిపోర్ట్‌లతో సంబంధం కలిగి ఉంటుంది. వివిధ నగరాల నుంచి వచ్చే పర్యాటకలు ఢిల్లీ, చంఢీఘర్‌ ఎయిర్‌పోర్టులలో వారికి ఏది అనువుగా ఉంటే ఆ ఎయిర్‌పోర్ట్‌ ద్వారా సిమ్లాకు చేరుకోవచ్చు.

ఇక రైలు మార్గం ద్వారా వచ్చే ప్రయాణీకులు సిమ్లాకు 96 కిలోమీటర్ల దూరంలో ఉన్న కల్కా స్టేషన్‌ గుండా ఇక్కడికి చేరుకోవచ్చు. ఢిల్లీ మీదుగా కల్కా స్టేషన్‌కు వివిధ రైళ్లు అందుబాటులో ఉంటాయి.
అన్ని ప్రధాన నగరాల నుండి ఇక్కడి అనుబంధ రోడ్డు మర్గాలు ఉండడం వల్ల రోడ్డు మార్గం ద్వారా వచ్చే ప్రయాణీకులు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సిమ్లా చేరుకోవచ్చు.

ట్రెక్కింగ్‌ స్పాట్‌... ఖండాలా

Bhaja_Caves
కనుచూపు మేర పచ్చదనం తప్ప మరేమీ కనపడని అద్భుత ప్రదేశం ఖండాల. భారతదేశంలోని ప్రధాన హిల్‌ స్టేషన్లలో ఖండాలా ఒకటి. సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో మహారాష్ట్ర పశ్చిమ దిశలో ఎత్తైన కొండలతో, చూపుతిప్పుకోనీయని పచ్చని ప్రకృతి సౌందర్యంతో ఈ ప్రాంతం పర్యాటకుల మనసు దోచుకుంటోంది. ముంబై మహానగరానికి 101 కిలోమీటర్ల దూరంలో, 625 మీటర్ల ఎత్తులో కొలువైయున్న ఖండాలాలో ట్రెక్కింగ్‌ చేసేందుకు దేశ, విదేశీ పర్యాటకులు సైతం ఆసక్తి చూపిస్తుంటారు.

ప్రకృతి ప్రేమికులకు, కొత్త జంటలకు, ప్రేమికులకు స్వర్గధా మంలా అనిపించే ఈ ప్రాంతం అద్భుత అందాల పర్వత ప్రాంతంగా గుర్తింపు పొందింది. గతంలో ఖండాలా ఛత్రపతి శివాజీ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. అనంతరం బ్రిటీష్‌ వారి పాలన వచ్చాక... దక్కన్‌ పీఠభూమి, కొంకణ్‌ మైదానాల మధ్య గల రోడ్డు మార్గంలో గల భోర్‌ ఘాట్‌లో భాగమయ్యింది. బోర్‌ ఘాట్‌కు ఆ కాలంలో రోడ్డు, రైలు రవాణా సౌకర్యాలను కలిగి ఉండేవి. ముంబై-పూణే ఎక్స్‌‌‌రరపెస్‌ రైలు మార్గం, అలాగే ముంబై, పూణేలకు రైలు మార్గం ఖండాలా ద్వారానే సాగేది.

అందాల‘లోనవాలా’...

Karla 

ఖండాలాకు 5 కిలోమీటర్ల దూరంలో లోనవాలా అనే మరో ప్రఖ్యాత హిల్‌ స్టేషన్‌ కూడా చూడదగ్గది. ఖండాలాకంటే పెద్దదైన ఈ ప్రాంతంలోని ప్రకృతి రమణీయత మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కళ్లు తిరిగే లోయలు ఓవైపు, ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ఉండే పర్వతాలు మరోవైపు... తుగవులి, లోనా వాలా, భుషి సరస్సుల హొయలు... ఇలా లెక్కలేనన్ని ప్రకృతి సౌందర్య విశే షాలతో లోనావాలా అలరారుతుంటుంది.

పురాతన గుహలు... కర్ల, భజా...
ఖండాలాకు 16 కిలోమీటర్ల దూరంలో కొలువై ఉన్న కర్ల మరియు భజా గుహలు కూడా తప్పకుండా దర్శించాల్సిన ప్రదేశాలు. ఈ రాతి గుహల్లోని రాతి ఆలయాలు క్రీస్తుపూర్వం 2వ శతాబ్దానికి చెందినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. బౌద్ధమతానికి చెందిన హీనయానశాఖవారు ఈ రాతి గుహాలయాలను నిర్మించి నట్లు తెలుస్తోంది. అలాగే ఇక్కడికి దగ్గర్లోని అమృతాంజన్‌ పాయింట్‌... తప్పకుండా సందర్శించాల్సిన మరో ప్రదేశం. ఇవే కాకుండా... ముంబయి నుంచి ఖండాలా ప్రయాణ మార్గంలో కూడా అనేక దర్శనీయ ప్రాంతాలు కానవస్తాయి. ఇలాంటి వాటిలో చారిత్రకమైన కోటలు, జలపాతాలు, సరస్సులు అనేకం ఉన్నాయి.

రమణీయ కోట... రజ్‌మాచి...
Khandala 

ముంబయి నుంచి లోనవాలాకు వెళ్లే మార్గమధ్యంలో పర్వతాలు ప్రారంభమయ్యేచోట అందమైన ఓ ఉద్యానవనం వంటివి దర్శనమిస్తాయి. వాటిలో ముఖ్యమై నవి రజ్‌మాచి పార్క్‌, రజ్‌ మాచి కోట గోపురాలు. కోట దిగువ భాగంలో అతి పెద్ద లోయ ఉం టుంది. ఆ లోయలోనే ఒక దేవాల యంతో పాటు హోట ల్‌ కూడా ఉంటుంది. దానికి దగ్గర్లోనే చిన్న పిల్లల ప్రత్యేకంగా రూపొందించిన పార్క్‌ ఒకటి ఉంటుంది. దాని తరువాత వంద అడుగుల ఎత్తునుంచి కిందికి దుమికే ‘కునే’ జల పాతాలు కూడా చూడదగ్గవే. ఇవి ఖండాలాకు లోనవాలాకు మధ్యలో ఉన్నాయి. ఇవేకాకుండా టైగర్స్‌లీప్‌, సాకుర్‌ ప్లాటియా, మంకీ హిల్‌, లో హ్గాడ్‌ దర్శన్‌, శివాజీ పార్క్‌, డ్యూక్స్‌నోస్‌ లాంటి అనేక పర్యాటక ప్రాంతాలు పర్యటనను మధురానుభూతులతో నింపుతాయి.
ఖండాలా ఎలా వెళ్లాలంటే...
Rajmachi_Hill 

ఖండాలాలో ఎయిర్‌పోర్టు లేని కారణంగా, దానికి దగ్గర్లోని పూణే వరకు విమానంలో వెళ్లవచ్చు. అక్కడికి దగ్గర్లోని రైలు మార్గం ద్వారా 69 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే లోనవాలా రైల్వే స్టేషన్‌ చేరుకోవచ్చు. లోనవాలాలో ముంబై-పూణే రైలు మార్గంలో ప్రయా ణించే రైళ్లన్నీ అందుబాటులో ఉంటాయి. కాగా.. లోనవాలా నుంచి ముంబై చేరేందుకు కేవలం 3 గంటల సమయం సరిపోతుంది. అదే విధంగా లోనవాలా నుంచి పూణే వెళ్లాలంటే మాత్రం నాలుగు గంటలు ప్రయాణించాల్సిందే. ఇక బస్సు సౌకర్యం విషయానికి వస్తే.. ముంబై-పూణే మార్గంలో ఖండాలాకు అనేక బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.

Thursday, January 20, 2011

కనువిందు చేసే... కాన్‌కన్‌

 
అందాలొలికే శిల్పాలు, జెల్‌-హా-జాతీయవనం, ప్రశాంత వాతావరణంలో చల్లని పిల్లగాలుల పలకరింపు, సకల వర్ణాలతో కనువిందు చేసే మత్స్యసంపద... వెరసి ఓ అందమైన దీవి... అదే కాన్‌కన్‌ ఐలాండ్‌

 

అమెరికాలోని షికాగో నుంచి ఆరు గంటల ప్రయాణం చేస్తే కాన్‌కన్‌ చేరు కోవచ్చు. బీచ్‌కు దగ్గరలో ఉండే విల్లా (రెసిడెన్సీ) లో బస చేస్తూ... మరుపురాని విహారానందాన్ని సొంతం చేసుకోవచ్చు. ప్రపంచంలోనే గొప్ప ఆర్కియాలాజికల్‌ వండర్‌గా చెప్పబడే ‘షిజెనిట్జా’ కు ప్రసిద్ధిగాంచిన ప్రదేశం కాన్‌కన్‌. ఇది క్రీశ 490 నాటి కట్టడం. పురాతనకాలం నాటి ‘మాయన్‌ సివిలైజేషన్‌’ కు చెందిన షిజినెట్జా ఓ అద్భుత చారిత్రక ప్రదేశం. ఈ మ్యూజియంలో అందమైన శిల్పాలు, హస్తకళలు ఎంతో రమ్యంగా ఉంటాయి. ఇక్కడ చెప్పుకునే మరో అద్భుత ప్రదేశాలు షెల్‌-హ-నేషనల్‌పార్క్‌, నేచురల్‌ ఎన్విరాల్‌మెంటల్‌ పార్క్‌. ఇక్కడి ఎక్వేరియంలో ఎన్నో రకాల రంగు రంగుల చేపలుంటాయి. ఇక్కడ జరిగే డాల్ఫిన్‌ షో ఎంతో పేరుగాంచింది.

కోజుమెల్‌ దీవి...
Park-Cancun 

‘కోజుమెల్‌’ ఐలాండ్‌ మెక్సికోలోనే అతి పెద్ద దీవి. ఈ దీవి స్క్యూబా డైవింగ్‌, స్నార్‌కెలింగ్‌లాంటి వాటర్‌స్పోర్ట్‌‌సకి ఎంతో అనువైనది. అందుకే ఈ దీవిని వాటర్‌స్పోర్ట్‌‌స ‘ప్యారడైజ్‌’ అంటారు. ఇక్కడ షార్క్‌లను చాలా దగ్గర నుండి చూడవచ్చు.విశాలమైన ఈ ఐలాండ్‌ చుట్టిరావడానికి ఇక్కడ జీప్స్‌, బైక్స్‌ వంటివ వాహనాలు అద్దెకు దొరుకుతాయి.. ఇక్కడ మరో ప్రధాన ఆకర్షణ ‘ఎక్స్‌క్యారెట్‌’ అనే ఇకలాజికల్‌ థీమ్‌ పార్క్‌. పక్షులు, రకరకాల పూలచెట్లు, వందలకొద్దీ సీతాకోక చిలుకలకు నిలయం ఈ పార్క్‌.
Cancun1

చల్లగాలులు, సముద్రపు అలల నడుమ ప్రకృతి అందాల వీక్షణం మాటల్లో చెప్పలేని అనుభూతి. ప్రపంచం మొత్తంలో కేవలం కోజుమెల్‌ లో మాత్రమే డాల్ఫిన్స్‌తో స్విమ్‌ చేయగలిగే అవకాశం లభిస్తుంది. ఎక్స్‌క్యారెట్‌ పార్క్‌లో ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. డాల్ఫిన్‌తో కలిసి ఈదడమా? అని భయపడకండి! అవి మనల్ని ఏమీ చేయవు. ఎందుకంటే వాటికి ముందే శిక్షణ ఇస్తారు కాబట్టి అవి పర్యాటకులతో ఎంతో స్నేహంగా మెలుగుతాయి. సీ లెవల్‌ నుంచి 30 అడుగుల కింద నీళ్ళల్లో లక్షలాది చేపలు, రకరకాల సముద్ర జీవులను చూస్తూ అండర్‌ వాటర్‌ వాకింగ్‌ మర్చిపోలేని అనుభవం.

చేపలవేట... మెక్సికన్‌ వంట...
kankan 

ఫిషింగ్‌ పట్ల ఆసక్తి ఉంటే ఫ్లై ఫిషింగ్‌, స్పోర్ట్‌ ఫిషింగ్‌, డీప్‌ ఫిషింగ్‌ లాంటి చాలారకాల ఫిషింగ్స్‌ చేయవచ్చు. కాన్‌కన్‌లో తప్పకుండా చేయాల్సింది బోట్‌ సెయిలింగ్‌.మెక్సికో అంటే గుర్తొచ్చేది ఘుమఘుమలాడే వంటకాలు. ప్రపంచంలోనే ఎంతో ప్రసిద్ధిగాంచిన మెక్సికన్‌ వంటలు నోరూరిస్తాయి. వివిధ రకాల మసాలాలతో తయారయ్యే వంటలు ఒక్కసారైనా రుచిచూడాల్సిందే.

RIU Cancun *  Conveniently located Resort in Cancun Mexico

ఆహారపదార్ధాలను అందంగా అలంకరించే పద్ధతులు, వాటి రుచి ఆహా... ఓహో అనిపిస్తాయి. బరీతోస్‌, ఫహిటాస్‌, సాల్సాలాంటి తినుబండారాలు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఇష్టపడతారు. సంవత్సరం పొడవునా పర్యాటకులు సందర్శించడానికి వీలున్న ప్రదేశం కాన్‌కన్‌. ఏ కాలలోనైనా వెళ్ళొచ్చు. అయితే చలికాలంలో అయితే మరింత అనువుగా ఉంటుంది. ఇక్కడ చలికాలం డిసెంబర్‌ నుంచి ఏప్రిల్‌ వరకు ఉంటుంది.

ముక్తితోపాటు విహారానందం ... గోకర్ణ

బీచ్‌ల పేరు చెప్పగానే... మొదటగా మన స్మృతిపథంలో మెదిలే పదం ‘గోవా’. అయితే గోవాకు అతి సమీపంలో... గోవా బీచ్‌లకు ఏమాత్రం తీసిపోని సముద్రతీర అందాలకు నెలవైన ప్రాంతం గోకర్ణ. ఈ ప్రదేశం బీచ్‌ల అందాలకే కాదు, ముక్తిని ప్రసాదించే ఆధ్యాత్మిక క్షేత్రం కూడా.గోవా క్రైస్తవ సంస్కృతికి నిలయమైతే... గోకర్ణ హిందూ సంస్కృతికి నిలయంగా భాసిల్లుతోంది.ఇక్కడ ఉన్న శైవక్షేత్రం, భక్తులకు ముక్తిమార్గాన్ని ప్రసాదించే పుణ్యక్షేత్రంగా వెలుగొందుతోంది.

Gokarna2 

గోకర్ణ కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఉన్నది.బెంగళూరు కి 545 కిమీల దూరంలో... ఉత్తర కన్నడ జిల్లా రాజధాని కార్వార్‌ కి 55 కిమీదూరంలో ఉన్నది. గోకర్ణ శైవ క్షేత్రంగా చాలా ప్రసిద్ధి చెందినది.ఈ ప్రదేశం... అందమైన గోవా బీచ్‌లకు అతి సమీపంలో ఉండడంతో దేశీయంగానే కాక, అంతర్జాతీయ పర్యాటకులను సహితం ఆకర్షిస్తోంది.

మహాబళేశ్వర దేవాలయం... చరిత్ర...
లంకాధిపతి రావణాసురుడు శివుని గురించి అకుంఠిత తపస్సు చేసి మెప్పించి ఆత్మలింగాన్ని భూలోకానికి తెస్తాడు. కాని శివుడిచ్చిన ఆత్మలింగం స్వభావం ప్రకారం భూమిమీద ఎక్కడ పెడితే అక్కడ స్థాపితం అయి, అక్కడ నుండి తిరిగి ఎత్తడానికి శక్యం కాదని శివుడు చెబుతాడు. రావణాసురుడు ఆత్మలింగాన్ని లంకలో ప్రతిష్ఠిస్తే ప్రతికూల చర్యలు జరుగుతాయని భావించి దేవతలు విష్ణువును వేడుకోగా విష్ణువు తన మాయతో సూర్యాస్తమయం అయ్యేటట్లు చేస్తాడు. అప్పుడు రావణుడు సూర్యాస్తమయం అయిందని భావించి సంధ్య వార్చుకోవడానికి సంసిద్ధుడవుతాడు.

ఈ విషయం తెలుసుకున్న నారదుడు వినాయకుని వద్దకు వెళ్ళి రావణాసురుడి వద్ద నుండి ఆత్మలింగం తీసుకొని భూమి మీద పెట్టాలని చెబుతాడు. అప్పుడు వినాయకుడు నారదుడు కోరినట్లు రావణాసురుడు సంధ్యవార్చుకొనే సమయానికి బ్రాహ్మణ వేషంలో వెళతాడు. ఆ బ్రాహ్మణ బాలకుడిని చూసిన వెంటనే రావణాసురుడు తాను సంధ్యవార్చుకొనే కారణం చేత ఆ బాలడిని ఆత్మలింగాన్ని పట్టుకోవల్సిందిగా కోరుతాడు. అప్పుడు వినాయకుడు లింగం చాలా బరువు ఉంటే తాను ఎక్కువ సేపు మోయలేనని, సమయం వచ్చినప్పుడు మూడుసార్లు పిలుస్తానని రావణాసురుడు రాకపోతే ఆలింగాన్ని భూమి పైన పెడతానని చెబుతాడు.

Gokarna1 

రావణాసురుడు అందుకు అంగీకరించగా, వినాయకుడు ఆత్మ లింగాన్ని తన చేతులలోకి తీసుకొంటాడు.రావణాసురుడు సంధ్యవార్చుకోవడానికి వెళ్ళగానే గణపతి లింగాన్ని మోయలేకపోతున్నట్లు మూడుసార్లు పిలుస్తాడు. సంధ్య మధ్యలో ఉండడంతో రావణాసురుడు అక్కడకు వచ్చేటప్పటికే వినాయకుడు లింగాన్ని భూమి మీద పెడతాడు. రావణాసురుడు వచ్చి లింగాన్ని భూమి మీద పెట్టినందుకు గణపటి నెత్తిమీద మొట్టుతాడు, దాంతో గణపతి నెత్తికి గుంట పడుతుంది.వినాయకుడు ఆత్మలింగాన్ని భూమి మీద నిలిపిన స్థలమే గోకర్ణ, మురుడేశ్వర లింగం పడిన భాగాలలో ఒక ప్రదేశం.

విష్ణువు తన మాయని తొలగించగా వెంటనే సూర్యుడు ఆకాశంలో మళ్ళి కనిపిస్తాడు. ఈ విషయాన్ని గ్రహించి రావణుడు ఎంతో కోపోద్రిక్తుడై ఆత్మలింగాన్ని తన చేతులతో పెకలించడానికి ప్రయత్నిస్తాడు.ఆత్మలింగం పైనున్న కవచాన్ని విచ్ఛిన్నం చేసి విసిరివేస్తే గోకర్ణ కు 23 కిమీల. దూరంలో సజ్జేశ్వర అనే ప్రదేశంలో పడుతుంది. లింగంపైనున్న మూత తొలగించి విసిరి వేస్తే అది గోకర్ణకు 27 కిమీల దూరంలో ఉన్న గుణేశ్వరలో పడుతుంది. లింగం పైనున్న వస్త్రాన్ని విసిరివేస్తే అది కందుక పర్వతంపై నున్న మృదేశ్వరలో పడుతుంది. ఆపేరు కాలక్రమంలో మురుడేశ్వరగా మారింది.

గణపతి దేవాలయం...
Gokarna3 

మహాబలేశ్వరుడి ఆలయానికి పక్కనే గణపతి ఆలయం ఉంటుంది. రావణాసురుడు తల మొట్టాడు అనడానికి గుర్తుగా గణపతి మాడు మీద ఒక గుంట ఉంటుది.గణపతి ని అందరు సృశించవచ్చు, గణపతి అభిషేకం చేయవచ్చు.

భద్రకాళి దేవాలయం...
మహాబలేశ్వరుడి దేవాలయానికి దగ్గరలొనే భద్రకాళి దేవాలయం ఉన్నది. ఇక్కడ వెలసిన భద్రకాళి ని అన్నపూర్ణమ్మ తల్లితో సమానంగా భావిస్తారు. ఆవిడ చేతిలో తక్కెడ సరిసమానంగా ఉండకుండా ఒక వైపు ఒరిగి ఉంటుంది, దానికి కారణంగా కాశిలో గంగ మాత్రమే ఉన్నది, కాని గోకర్ణలో కోటి తీర్థం, సముద్రం (ఇక్కడి అరేబియా సముద్రం పుణ్య తీర్థంగా భావిస్తారు) కూడా ఉన్నాయని ప్రాంతీయులు చెబుతారు.

కోటి తీర్థం...
గ్రామంలోని కోనేరు కోటీ తీర్థాన్ని గంగతో సమానంగా ప్రాంతీయులు భావిస్తారు. ఇక్కడ పితృతర్పణాలు సమర్పిస్తారు.

ఇలా వెళ్ళాలి...
Gokarna_Beach 

గోకర్ణ గ్రామానికి 10 కిమీ దూరంలో మంగళూరు-ముంబాయి కొంకణ్‌ రైల్వే లైనులో గోకర్ణ రోడ్‌ రైల్వే స్టేషన్‌ ఉన్నది. కాని ఈ గోకర్ణ రైల్వే స్టేషన్‌ లో ప్యాసింజర్‌ రైళ్లు మాత్రమే నిలుస్తాయి. ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు గోకర్ణ కు 23 కిమీల దూరంలో ఉన్న కుంటా, 25 కిమీల దూరంలో ఉన్న అంకోలా, ఉత్తర కన్నడ రాజధాని కార్వార్లో నిలుస్తాయి.

కార్వార్‌ నుండి ప్రొద్దున 7, 8 గంటలకు, మధ్యాహ్నం 4 గంటలకు గోకర్ణ కు సరాసరి బస్సులు నడుస్తాయి. మిగతా సమయంలో కార్వార్‌ నుండి ఆంకోలా వరకు బస్సులు నడుస్తాయి. హొబ్లీ, హంపి నుండి కూడా గోకర్ణ కు తరచు బస్సులు ఉన్నాయి. గోవా నుండి పొద్దున 8 గంటలకు సరాసరి గోకర్ణక్ఠు చేర్చే బస్సు ఉన్నది (5 గంటల ప్రయాణం). మంగళూరు (252 కిమీల దూరంలో ఉన్నది) నుండి ఉదయం 7 గంటలకు బస్సు ఉన్నది. బెంగళూరు నుండి పగలు 9 గంటలకు, మైసూర్‌ నుండి పగలు 6 గంటలకు గోకర్ణ కు సరాసరి బస్సులు నడుస్తాయి. విమానసౌకర్యం మంగళూరు లేదా పనాజిలో ఉంది.

Friday, January 14, 2011

Thirumala & Thirupathi , Andhra Pradesh

Thirumala & Thirupathi , Andhra Pradesh

ONLY LUCKY PEOPLE CAN SEE THIS PICTURE


Sri Devi Bhu Devi Sahitha Venkateswara Swamy

Thirumala Temple View of Ananda Nilayam

Silathoranam  - One of the Ancestral Formation in the World (2 km from Thirumala)

Radhotsavam of Malayappa Swamy (Lord Venkateswara)

Srivari Padamulu (4 km from Thirumala )

Museum on Thirumala

ANANDA NILAYAM, Thirumala

Malayappa Swamy with Sridevi and Bhudevi, Thirumala
Chandragiri Fort Building (10 KM from Thirupathi)
Gali Gopuram of Sri Kalahasti (36 km from Thirupathi)

Brahmotsavam of Sri Venkateswara Swamy, Thirumala



Thirumala

Tuesday, January 11, 2011

2011లో... విహరించండిలా..!

కొత్త ఆశలను, కొంగొత్త ఆశయాలను మోసుకొని నవ వసం తం వచ్చేసింది.నూతన సంవత్సర వేడుకల సందడి నుండి మొత్తానికి బయటకొచ్చి మళ్లీ బిజీ లైఫ్‌ షెడ్యూళ్లతో ప్రజలంతా బిజీ అయ్యారు. అయితే ఈ సంవత్సరం వృత్తి, ఉద్యోగాలతో... ఆశయాలను, ఆశలను నెరవేర్చుకునే బిజీలో సమయాన్నంతా గడిపేయకుండా... పని ఒత్తిడి తగ్గించి సరికొత్త విహార ఆనందాన్ని అందించేందుకు దేశవిదేశాలకు సంబంధించిన అనేక ట్రావెలింగ్‌ సంస్థలు సరికొత్త టూర్‌ ప్యాకేజీలతో ముందు కొస్తున్నాయి.సెలవులను ఉపయోగించుకుంటూ... విహార యాత్రలు చేస్తూ... కొంత ప్రశాంతత పొందడానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి. అవి పని ఒత్తిడిని తగ్గించడమే కాకుండా తిరిగి ఉత్తేజంతో వృత్తి ఉద్యోగాలను హాయిగా కొనసాగించడానికీ ఉపకరిస్తాయి. ఈ నేపథ్యంలో 2011 లో కొంగొత్త ప్యాకేజీలను అందిస్తున్న టూరిజం సంస్థలు, విహార ప్రదేశాల వివరాలు ఈ '' విహారాలు ''  లో .....
dambulla-cave-temple 
ఈ సంవత్సరం మాల్దీవులు, భూటాన్‌, శ్రీలంక తదితర పొరుగు దేశాలు మీ విహార ఆతిథ్యానికి ఉవ్విళ్లూరుతున్నాయి. ఎక్కువశాతం ఉన్న మధ్యతరగతి ప్రజల ఆర్థిక స్తోమతకు తగిన అనేక ప్యాకేజీలు మీకోసం ఎదురు చూస్తున్నాయి. 2010 చివర్లో మాల్దీవులకు ప్రత్యేక ప్యాకేజీని రూపొందించిన ‘మేక్‌ మై ట్రిప్‌’ సంస్థ ఈసారి శ్రీలంకకు కూడా ఆ ప్యాకేజీని విస్తరించింది. రెండు ద్వీపదేశాలలో సాగే ఈ ఏడు రాత్రుల ప్యాకేజీ కేవలం 50 వేల రూపాయలకు అందుబాటులోకి తెచ్చింది (ట్రావెల్‌, షెల్టర్‌ చార్జీలు కలుపుకొని). తాజ్‌ గ్రూప్‌ 74 వేల రూపాయలకు ఢిల్లీ కపుల్‌ టూర్‌ ప్యాకేజ్‌నీ అందిస్తోంది. అలాగే 62 వేలకు కోల్‌కతా మీదుగా థింపు (భూటాన్‌ రాజధాని)కి కపుల్‌ ప్యాకేజీని అందిస్తుండగా... ఇదే థింపు ప్యాకేజీని మేక్‌ మై ట్రిప్‌ కేవలం 13,895 రూపాయలకు అందిస్తుండడం విశేషం.
టాంజానియా...
ప్రపంచ వర్యాటకులను విశేషంగా ఆక ర్షించిన సాకర్‌ ప్రపంచ కప్‌... 2010 సంవత్సరాన్ని దక్షిణాఫ్రికాకు పర్యాటక రాబడిని బాగానే పెంచింది. అయితే ఈ సంవత్సరం ఆ ఛాన్స్‌ టాంజానియా సొంతం చేసుకోనుంది. కాక్స్‌ అండ్‌ కింగ్స్‌, యాత్ర, ఆక్వాటెర్రా ఎడ్వెంచర్స్‌ వంటి పలు సంస్థలు... 2010 లో టాంజానియాకు కొన్ని ప్యాకేజీలను అందించాయి. వాటికి విపరీతమైన రెస్పాన్స్‌ రావడంతో ఈ సంవ త్సరం ఆ దేశానికి మరిన్ని మెరుగైన ప్యాకేజీలను రూపొందించే దిశలో ప్రయత్నిస్తున్నాయి. సెరెంగెటి, జంజీబార్‌, కిలిమంజారో వంటి ప్రసిద్ధిగాంచిన పర్యాటక కేంద్రాలను కలుపుతూ ఈ ప్యాకేజీలను రూపొందిస్తున్నాయి.‘వుమెన్‌ ఆన్‌ వాండర్‌లస్ట్‌’ అనే ట్రావెల్‌ కంపెనీ 2011 ఆగస్ట్‌లో అరుదైన జంతు వలస వీక్షణాన్ని ప్యాకేజీగా అందించనుంది.
యూరప్‌...
Maldives1 

స్విట్జర్లాండ్‌ ఎప్పటినుండో యూరప్‌ పర్యాటక రాజధానిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.. ఈ సంవత్సరం ఈ జాబితాలో క్రొయేషియా కూడా చేరనుంది.అందమైన సముద్ర తీరప్రాంతాలు, బీచ్‌లు...ఇలా ఏ-గ్రేడ్‌ అందాలతో క్రొయేషియా ఈసారి ఆతిథ్యం ఇవ్వనుంది. క్రొయేషియా అందాల నగరం సొమోబోర్‌ ఇప్పుడు తన ప్రత్యేకతను చాటుకోవడానికి సన్నద్ధమవుతోంది. ఇక్కడ జరిగే జానీ ఫెస్టివల్‌...

దగ్గరలోని డుబొవాక్‌ నగరంలో జరిగే మెడీవియల్‌ నొబిలిటీ ఫెయిర్‌ వంటి ఫెస్టివల్స్‌ ఈ ప్రాంతాలకు మరింత విహార శోభను చేకూర్చనున్నాయి. ఈ వేసవిలో ‘ఎబెర్‌క్రోంబీ అండ్‌ కెంట్‌’ ట్రావెల్‌ కంపెనీ క్రొయేషియా, స్లొవేనియాలకు 13 రోజుల టూర్‌ ప్యాకేజీని అందిస్తోంది. అలాగే ‘వావ్‌’ (వుమెన్‌ ఆన్‌ వాండర్‌లస్ట్‌) ఈ ప్రాంతాలనే కలుపుతూ కొన్ని టూర్‌ ప్యాకేజీలను అందిస్తున్నాయి. క్రొయేషియానే కాకుండా స్పెయిన్‌, పోర్చుగల్‌, గ్రీస్‌ లకు కూడా అనేక ప్యాకేజీలు అందుబాటు ధరల్లో వేసవి టూర్లను అందించనున్నాయి.
  ఫిలిప్పీన్స్ ...
Kilimanjaro3 

ఈ ఏడాది మార్చి నుండి ఫిలిపె్పైన్స్‌ విహారం భారత్‌కు మరింత చేరువ కానున్నది. ప్రముఖ సంస్థలు అందిస్తున్న టూర్‌ ప్యాకేజీలు ఫిలిపె్పైన్స్‌ను దక్షిణాసియాకే టూరిస్ట్‌ ఎట్రాక్షన్‌ గా నిలబెట్టనున్నాయి. ఇవే కాకుండా మలేషియా, దుబాయ్‌లు కూడా తమ విహార వారసత్వాన్ని నిలుపు కోనున్నాయి. ఈ సంవత్సరం కొత్త టూరిజం ప్యాకేజీల గురించి... మేక్‌ మై ట్రిప్‌ సీఓఓ కేయూర్‌ జోషీ మాట్లాడుతూ...‘‘టిబు, మనిలా వంటి ప్రాంతాలు ఈసారి దక్షిణాసియా దేశాల్లో టూరిజం ఎట్రాక్షన్‌గా నిలువనున్నాయి. అలాగే మలేషియా, దుబాయ్‌, థాయ్‌లాండ్‌ వంటి దేశాలు కూడా తమ వినూత్న ప్యాకేజీలతో తమ వారసత్వాన్ని నిలబెట్టుకోనున్నాయి’’ అని చెబుతున్నారు.
వావ్‌...
రోజుకూ పెరుగుతున్న పర్యాటకుల సంఖ్యతో మహిళ పర్యాటకుల ప్రత్యేక ట్రావెల్‌ గ్రూప్‌ వుమెన్‌ ఆన్‌ వాండర్‌లస్ట్‌ తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంటోంది. 2005లో పదిమంది మహిళలు ఒక గ్రూప్‌గా మొత్తం పది ట్రిప్‌లను ప్రారంభించిన ఆ సంస్థ ఎండీ సుమిత్రా సేనాపతి ఈ రోజు 50 మంది సభ్యులు ఒక గ్రూపుగా మొత్తం 30 టూర్లను నిర్వహించే స్థాయి సంస్థను చేర్చింది. 2011 ఈ నెంబర్‌ను 40 కి పెంచే దిశగా ప్రయత్నిస్తోంది. ఇందులో ట్రైన్‌ టూర్‌ ప్యాకేజీ విశేష ఆకర్షణగా నిలువ నుంది. చైనాలోన బీజింగ్‌ నుండి లాసా వరకు సాగే ఈ రైలు ప్రయాణం ప్రపంచంలోనే అతి పెద్ద లాంగ్‌ జర్నీ కావడం విశేషం.
Bhutan0 

నిజానికి మహిళ లకు ప్రత్యేకమైన ఇలాం టి టూర్లను కొన్ని కంపెనీలు కూడా ప్రారంభించాయి. అందులో యాత్ర టూర్‌ కంపెనీ కూడా ఉంది. ‘‘2010లో 16 మంది గ్రూప్‌తో కేరళ విహారాన్ని ఏర్పాటుచేశాం.దానికి విశేష స్పందన లభించింది’’ అని తెలుపుతున్నారు యాత్ర వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన సబీనా చోప్రా. సుమిత్రా సేనాపతి కూడా ఈసారి కూర్గ్‌, మైసూర్‌, నాసిక్‌, జలంధర్‌ వంటి పర్యాటక ప్రదేశాలకు కొత్త ప్యాకేజీ లు అందిస్తున్నట్టు తెలియ జేస్తున్నారు.
ఎక్స్‌పరిమెంట్‌ హాలీడేస్‌...
కొత్త యాత్రికులను ఆక ర్షించే విధంగా ఈ ఏడాది ప్రముఖ టూర్‌ కంపెనీలు ఏర్పాటు చేసిన అనేక టూర్‌ ప్యాకేజీలకు అప్పుడే విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటికే 30 శాతం కొత్త యాత్రి కులను ఆకర్షించినట్టు ఆయా సంస్థలు తెలియజేస్తు న్నాయి. ‘‘ఫిట్‌ (ఫారెన్‌ ఇండిపెండెంట్‌ ట్రావెల్‌) టూర్లు యువ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. యువత తమదైన ప్రత్యేక విహారానం దంకోసం ఇలాంటి టూర్‌ ప్యాకేజీలను ఎక్కువ ఇష్టపడుతున్నారు. అంతేకాదు, వారు ఎక్స్‌పరిమెంటల్‌ టూర్ల పై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు’’ అని తెలియ జేస్తున్నారు కాక్స్‌ అండ్‌ కింగ్స్‌ టూర్‌ కంపెనీ రిలేషన్‌షిప్‌ అండ్‌ సప్లయర్‌ మేనేజ్‌మెంట్‌ హెడ్‌ కరన్‌ ఆనంద్‌.
Samobor2 

అనుకున్నట్టుగా విహారానుభూతిని పొందడానికి భారతీయ యువ పర్యాటకులు ఎక్కువగా ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌ దేశాలకు వెళ్ళడానికి మక్కువ చూపుతున్నారట. ప్రైవేట్‌ ట్రావెల్‌ కంపెనీ ఎబెర్‌క్రోంబ్‌ అండ్‌ కెంట్‌ వైప్‌ ప్రెసిడెంట్‌ అమిత్‌ కల్సి కూడా సరిగ్గా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నాడు. ‘‘నేటి యువత కేవలం సైట్‌ సీయింగ్‌ కోసమే తమ విహారాన్ని పరిమితం చేసుకోవడం లేదు. ఎక్స్‌పరిమెంట్‌ టూర్లనే వారు ఎక్కువగా ఇష్టపడుతున్నారు’’ అని తెలియజేస్తున్నారు ఆనంద్‌.
సెల్ప్‌-డ్రైవ్‌ టూర్లు...
నేడు చాలామంది పర్యాకులు సెల్ఫ్‌ - డ్రైవ్‌ టూర్లపైన ఎక్కువ మక్కువ చూపిస్తు న్నారు.ప్రత్యేకవాహనంలో సొంతగా పర్యాటక కేం ద్రాలను చుట్టేయడానికి ఇష్టపడుతున్నారు. ఇలాంటి సెల్ఫ్‌-డ్రైవ్‌ టూర్ల విషయంలో న్యూజీలాండ్‌, మలేషి యా వంటి కొన్ని దేశాల్లో విహరించాడానికి మొగ్గుచూపు తున్నారు. దుకుంటే...ఆ దేశాల్లో ఇండియన్‌ డ్రైవింగ్‌ లైసె న్స్‌ను అనుమతిస్తారు. అందువల్ల ఇప్పుడు ఆ దేశాలు సెల్ఫ్‌ - డ్రైవింగ్‌ వెకేషన్లను మరింత ఆకర్షిణీయంగా తీర్చిదిద్దుతున్నాయట.
భారత్‌లో...
Maldives 

ఇక మనదేశంలోని పర్యాటక కేంద్రాల విషయానికి వస్తే...ఎప్పటిలాగే లెహ్‌, కేరళ వంటి ప్రాంతాలు ట్రావెల్‌ మార్కెట్‌ను ఈ సంవత్సరం కూడా పెంచనున్నాయి. సాంప్రదాయ విహారప్రదేశాలైన గోవా, రాజస్థాన్‌ కూడా అదే మార్గంలో పయనించనున్నాయి. ‘‘వరదల నుంచి కోలుకున్న లెహ్‌ కు ఇప్పుడు చాలా డిమాండ్‌ ఏర్పడింది’’ అని అంటున్నారు యాత్రా కో-ఫౌండర్‌ సబీనా చోప్రా. ఈ అభిప్రాయాన్ని ఏకీభవిస్తూ... ‘‘2010లో మేం చేపట్టిన 30 టూర్లలో 6 టూర్లు లడఖ్‌కే కేటాయించడం జరిగింద’’ని చెబుతున్నారు వుమెన్‌ ఆన్‌ వాండర్‌లస్ట్‌ అధినేత సుమిత్రా సేనాపతి. ఇక ‘గాడ్స్‌ ఓన్‌ కంట్రీ’ గా పిలువబడే దక్షిణాది ప్రకృతి సోయగం కేరళ ఈ సంవత్సరం కూడా తన ప్రత్యేకతను చాటుకోనుంది. రాఫ్టింగ్‌ టూరిజంకు పేరుగాంచిన కేరళ మాన్‌సూన్‌, ఎడ్వెంచర్‌ పర్యాటకులను ఆకట్టుకోవడానికి ఎప్పుడూ 
ముందం జలో ఉంటుంది.
థీమ్‌ ట్రావెలింగ్‌...
స్పా, క్రుయిజ్‌, సఫారీ, గోల్ఫ్‌, వైన్‌ టూర్‌ వంటివి ఇప్పుడు అధికంగా వినప డుతున్న పదాలు. సైట్‌ సీయింగ్‌కే పరిమితం కాకుండా పర్యాటకులు కొత్తద నాన్ని కోరుకుంటున్నారు. అందుకే పర్యాటక సంస్థలు పై అంశాలను దృష్టిలో పెట్టుకొని మరీ థీమ్‌ ట్రావెలింగ్‌ ప్యాకేజీలను రూపొందిస్తున్నాయి. పెళ్ళిళ్ళు, ఫ్యామిలీ రీయూనియన్‌ వంటి వాటితో ఫ్యామిలీ టూర్‌ ప్యాకేజీలకు కూడా ఆదరణ పెరుగుతోంది. ఈ తరహా ప్యాకేజీలు ఈ సంవత్సరం మరింత వృద్ధిని నమోదు చేసుకోవాలని ప్రముఖ ట్రావెల్‌ గ్రూప్స్‌ ఉవ్విళ్లూ రుతున్నాయి.
సోషల్‌ మీడియా దన్ను...
websites 

నానాటికీ పెరిగిపోతున్న సోషల్‌ నెట్‌వర్క్‌ వెబ్‌సైట్లు పర్యాటకుల కోసం ఎంతో విలువైన సమాచారాన్ని అందుబాటులో ఉంచుతున్నాయి. ఫేస్‌బుక్‌ వంటి ప్రముఖ సైట్లలో పర్యాటకులు తమ విహారానుభూతులను ఫొటోలతో సహా నిక్షిప్తం చేస్తుండడంతో విహార కేంద్రాల గురించి పూర్తి సమాచారం కోసం తెలియక తికమక పడే పర్యాటకులకు అవసరమైన సమాచారమంతా మౌస్‌ క్లిక్‌తో లభ్యమవుతోంది. ఇలా ఈ సైట్లు పరోక్షంగా టూరిజం అభివృద్ధికి దోహదపడుతున్నాయి. ట్రిప్‌ అడె్వైజర్‌, టూర్‌ ఆపరేటర్‌ వంటి వెబ్‌సైట్లు విహా ర కేంద్రాల పూర్తి సమాచారాన్ని అందజేస్తున్నాయి.

అంతేకాకుండా అన్ని టూర్‌ కంపెనీలు ఆన్‌లైన్‌ బుకింగ్‌ సౌకర్యం కల్పింస్తుండడం తో పర్యాటకులు టూర్‌ ప్యాకేజీలు ఎంచుకోవడం మరింత సులభతరం అయ్యిందనే చెప్పాలి. మొత్తం రాబడిలో 13 శాతం రాబడి ఈ సోషల్‌ నెట్‌వర్క్‌ సైట్ల మూలంగానే అందుతుందంటే... పర్యాటకుల సేవలో అవి ఎంత కృషి చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి ఈ సంవత్సరం వేసవి టూర్‌ ప్యాకేజీలు గతం కంటే మరింత హోరెత్తించనున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

Saturday, January 8, 2011

పేరు చిన్న-సొగసుమిన్న

సౌత్ అమెరికాలోని రిపబ్లిక్ ఆఫ్ చిలీ తూర్పున ఏండెస్ పర్వతాలు, పశ్చిమాన పసిఫిక్ సముద్రం సరిహద్దులుగా గల దేశం. ఇది చక్కటి పర్యాటక ప్రాంతం. దీని పసిఫిక్ సముద్ర తీరం 6435 కిలోమీటర్లు. కొన్ని ద్వీపాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ చక్కటి బీచెస్‌ని చూడచ్చు. ప్రపంచంలోని అత్యంత పొడిగా ఉండే 105000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల అటకామా ఎడారి చిలీ దేశంలో వుంది. సముద్ర తీరం, అగ్ని పర్వతాలు, నదులు, సరోవరాలు, ద్వీపాలు, ఉష్ణ కుండాలు ప్రాచీన శిథిలాలుగల ఈ దేశంలో టూరిస్టులని ఆకర్షించే అన్ని అంశాలున్నాయి.
ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలలో వాల్పరైసో నగరం ఒకటి. ఇది చాలా పేద నగరం. బయటకి కనబడే కరెంట్ తీగలు, సన్నటి రోడ్లుగల ఈ ఊరుని ఓ రోజులో చూడచ్చు.


రపానూయి (ఈస్ట్రన్ ఐలండ్) చూడదగ్గ ద్వీపం. పురాతన శిథిలాలు ఇక్కడ చాలా చూడచ్చు. ఇక్కడ యోయే జాతి ప్రజలు జీవిస్తున్నారు. స్కూబా డైవింగ్ లాంటి సముద్ర క్రీడలు, గుర్రపుస్వారీ ప్రత్యేక ఆకర్షణలు.
ప్రపంచంలోని అతి పెద్ద స్విమ్మింగ్‌పూల్ దుబాయ్‌లోనో, లాస్ వేగాస్‌లోనో ఉందని చాలామంది భావిస్తారు. కానీ అది చిలీలోని అల్లరోబోలోని శాన్ ఆల్ఫాన్సో డెల్మార్ అనే రిసార్ట్‌లో ఉంది. 2006 డిసెంబర్‌లో ఆరంభించిన ఇది 19 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న స్విమ్మింగ్ పూల్. చాలామంది దీన్ని కరేబియన్ సీగా భ్రమపడే అవకాశాలున్నాయి. 6కోట్ల 60 లక్షల గేలన్ల నీటిని ఇది పసిఫిక్ మహాసముద్రంనించి తీసుకుంటుంది. ఈ రెంటికీ మధ్య దూరం కొన్ని అడుగులు మాత్రమే. మనుష్య నిర్మిత బీచ్‌లు దీని పక్కనే ఉన్నాయి. దీని ఎదురుగా ఉన్న హైరైజ్ కాంజో బిల్డింగ్స్‌లోని అపార్ట్‌మెంట్లని తక్కువ కాలానికి యాత్రికులకి అద్దెకిస్తారు. సముద్రం ఒడ్డునే ఈ ఉప్పునీటి స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి కారణం సముద్రంలోని నీరు బాగా చల్లగా ఉండి ఈతకి కష్టం. ఈ స్విమ్మింగ్ పూల్‌లోని నీరు ఈతకు అనుకూలమైన ఉష్ణోగ్రతలో ఉంటుంది. దీంట్లో చిన్న పడవలని కూడా ఉపయోగిస్తారు. ఈ స్విమ్మింగ్ పూల్‌ని ప్రతిరోజూ శుభ్రపరుస్తారు. ఇందులో అక్కడక్కడ వేడి నీటి తొట్టెలు కూడా ఉన్నాయి. ఆఫ్ సీజన్‌లో తక్కువమంది యాత్రికులు ఉన్నప్పుడు వాటిని ఉపయోగిస్తారు. ఇందువల్ల నీటిని వేడిచేసే ఇంధనం ఆదా అవుతుంది. ఇక్కడే ఉన్న ఓ బార్‌కి ఓ వైపుగల పెద్ద అక్వేరియంలో అనేక రకాల చేపలు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. టెన్నిస్ కోర్టులు, గోల్ఫ్‌కోర్ట్స్ కూడా ఇక్కడ పర్యాటకుల సౌకర్యంకోసం ఉన్నాయి.

http://www.internationaleducationmedia.com/images/chile_statues.jpg
ఈ దేశంలో ఎడారి ప్రాంతంలో జనాభా పెద్దగా ఉండదు. పసిఫిక్ మహాసముద్రం వైపే జనాభా ఉంటుంది. స్పానిష్ ఆక్రమణలో చిలీ 300 ఏళ్లకి పైగా ఉండటంవల్ల ప్రజలు స్పానిష్ భాషనే మాట్లాడతారు. అటకామా ఎడారి మధ్యలో సముద్ర మట్టానికి 7వేల అడుగుల ఎత్తులోగల ఓచోట ఓ పెద్ద ఒయాసిస్, దాని పక్కనే శాన్‌పెడ్రోడి అటకామా అనే గ్రామం కూడా పర్యాటకులకి ఆకర్షణీయంగా ఉంటాయి. ఇక్కడనించి నక్షత్రాలని చూడడానికి టెలిస్కోప్‌లు ఏర్పాటుచేసారు. ఇక్కడి జనాభా 5వేల లోపే.
ఈ ఒయాసిస్‌కి పొరుగున ఉన్న అర్జెంటీనా దేశంనించి బస్సు సర్వీస్, వాహనాలు నడవడానికి చక్కటి రోడ్డు ఉన్నాయి. ఇక్కడ కూడా ప్రాచీన శిథిలాలని, కొద్ది దూరంలో ఉన్న లికన్ కబుర్ అనే అగ్నిపర్వతాన్ని చూడచ్చు. బంగారు, రాగి, వెండి గనులు కూడా చిలీలో ఉన్నాయి. ఆగస్టు 5, 2010న 33 మంది గని కార్మికులు 2300 అడుగుల లోపల భూగర్భంలో చిక్కుకుపోయి, అక్టోబర్ 12న బయటకి రప్పించబడటం ప్రపంచ వార్తయింది.
‘యూనియన్ ఆఫ్ సౌత్ అమెరికన్ నేషన్స్’ అనే సంస్థని స్థాపించిన దేశాల్లో చిలీ ఒకటి.

Pucon Lake District
క్రిస్ట్‌మస్, న్యూఇయర్, ఈస్టర్ సమయాల్లో అత్యధికంగా పర్యాటకులు వెళ్తారు కాబట్టి ఆ సీజన్ మంచిది కాదు. పెరూ, బొలీలియా, అర్జెంటీనా దేశాల్లోంచి చిలీకి రోడ్డు మార్గం, బస్ సర్వీస్ ఉన్నాయి. సాధారణంగా చిలీలోని శాంటియాగో నగరానికి ఎక్కువమంది యాత్రికులు వస్తూంటారు. ఇక్కడికి 90రోజుల టూరిస్ట్ వీసాని ఇస్తారు. యూరప్, అమెరికాలలోని అన్ని ప్రదేశాలనించి విమాన సర్వీసులున్నాయి.