విహారాలు

India

Gamyam

Tuesday, November 23, 2010

జోధ్‌పూర్‌ రాచరిక సౌధం... ఉమైద్‌ భవన్‌ ప్యాలెస్‌

పర్యాటక రంగంలో... దేశంలోనే ముందంజలో ఉన్న రాష్ట్రం రాజస్థాన్‌. ఎడారి అందాలు, కోటలు, బురుజులు వంటి ఎన్నో అద్భుత కట్టడాలకు ఈ ఎర్ర నేల ఎంతో ప్రసిద్ధిగాంచింది. విదేశీ పర్యాటకులను ఆకర్షించడంలోనూ రాజస్థాన్‌ ముందువరుసలో నిలుస్తున్నది. అక్కడ కొలువైన అందాలు ఆ రాష్ట్రాన్ని పర్యాటక దిగ్గజంగా మలిచాయి. ఎన్నో రాచరిక వ్యవస్థలకు పుట్టినిల్లయిన రాజస్థాన్‌లో ఆ రాజుల కళాపోషణకు గుర్తుగా అనేక సౌధాలు, కోటలు వెలిశాయి. అలాంటి చారిత్రక కట్టడాల్లో ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్న రాచరిక సౌధం ‘ఉమైద్‌ భవన్‌ ప్యాలెస్‌’ విశేషాలు...

umaid-bhawan-palace 
ఉమైద్‌ భవన్‌ ప్యాలెస్‌... వ్యక్తిగత నివాసాల్లో ప్రపంచంలోనే అతిపెద్దదిగా పేరిందిన కట్టడాల్లో ఒకటి. ఇది రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ నగరంలో ఉంది. ప్రస్తుతం తాజ్‌ హోటల్స్‌ గ్రూప్‌ ఈ ప్యాలెస్‌ బాగోగులు చూస్తున్నది. మొత్తం 347 గదులున్న ఈ ప్యాలెస్‌ను జోధ్‌పూర్‌ మహారాజు... మహారాజా ఉమైద్‌ సింగ్‌ నిర్మించారు. రాజా ఉమైద్‌ సింగ్‌ అధికారం నివాసంగా ఉన్న ఈ అద్భుత ప్యాలెస్‌ కు ఆయన ముని మనవలు ప్రస్తుత యజమానులు. ఈ ప్యాలెస్‌ చిత్తర్‌ హిల్స్‌పై నిర్మించినందువల్ల ఉమైద్‌ భవన్‌ ప్యాలెస్‌ను దీని నిర్మాణ సమయంలో చిత్తర్‌ ప్యాలెస్‌ అని కూడా పిలిచేవారు. తరువాత రాజా ఉమైద్‌ సింగ్‌ పేరు మీద ఉమైద్‌ భవన్‌ ప్యాలెస్‌గా నామకరణం చేశారు. చిత్తర్‌ హిల్‌, జోధ్‌పూర్‌లోనే అత్యంత ఎతె్తైన ప్రదేశం. నవంబర్‌ 18, 1929వ సంవత్సరంలో ఈ భవన నిర్మాణాన్ని చేపట్టి 1943లో పూర్తిచేశారు.

నిర్మాణం...
ఐదు వేల మంది నిర్మాణ కార్మికులు 15 ఏళ్ళపాటు శ్రమకోర్చి నిర్మించిన ఈ అందమైన భవనం జోధ్‌పూర్‌కు ఆగ్నేయ దిశలో ఉంది. నిర్మాణంలో కాంక్రీట్‌గాని, సిమెంట్‌ గాని ఉపయోగించకుండా కేవలం రాళ్ళతో నిర్మించడం ఉమైద్‌ ప్యాలెస్‌ ప్రత్యేకత. రాళ్లలోని పాజిటివ్‌, నెగెటివ్‌ ముక్కలను ఒకదానికి ఒకటి అనుసంధానం చేస్తూ... ఈ భవనాన్ని నిర్మించడం అప్పట్లోనే పరిణితి చెందిన శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ రాజప్రాసాద నిర్మాణానికి కావాల్సిన రాళ్ళను తరలించడానికి అప్పట్లోనే ఇక్కడకి ఒక రైలు మార్గాన్ని కూడా వేశారు. ఇక్కడ ఏ సీజన్‌లోనైనా 23 డిగ్రీల ఉష్ణోగ్రతకు హెచ్చుతగ్గులు లేకుండా ఉండడం శాస్తవ్రేత్తలకు ఇప్పటికీ అంతుచిక్కని విషయం. 26 ఏకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ప్యాలెస్‌ మూడున్నర ఎకరాలు భవన నిర్మాణానికి కేటాయించగా మిగిలిన ప్రాంతంలో గార్డెన్‌గా తీర్చిదిద్దారు.

india_jodhpur
దేశవిదేశాలకు చెందిన ఆర్కిటెక్ట్‌లు ఈ నిర్మాణానికి డిజైన్లను అందించారు. ప్రపంచ ప్రఖ్యాత ఇంజనీర్‌ హెన్రీ లాంచెస్టర్‌, భారతీయ ఇంజనీర్‌ బుద్ధమాల్‌ రాయ్‌ ఈ భవన నిర్మాణానికి నమూనాలందించారు. ఉమైద్‌ ప్యాలెస్‌ లోని మధ్య గుమ్మటం 105 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ నిర్మాణంలోని టవర్స్‌ అన్నీ రాజ్‌పుత్‌ల నిర్మాణశైలిని కళ్ళముందుంచుతాయి. హీరానంద్‌ యు. బాటియా రెసిడెంట్‌ ఇంజనీర్‌గా పనిచేసిన ఈ ప్యాలెస్‌ నిర్మాణానికి అప్పట్లోనే అక్షరాల 94 కోట్ల రూపాయలు ఖర్చయ్యిందట. భవనం ఇంటీరియర్‌ డిజైన్‌ను ‘మాపుల్స్‌ ఆఫ్‌ లండన్‌’ వారు చేపట్టగా... వారు వస్తున్న ఓడను జర్మన్లు సముద్రంలో ముంచారు.

దాంతో మహారాజా ఉమైద్‌ సింగ్‌ ఆ పనిని పోలెండ్‌కు చెందిన మరో ప్రముఖ డిజైనర్‌ స్టీఫాన్‌ నార్‌బ్లిన్‌కు అప్పగించారు. లావిష్‌ ఇంటీరియర్‌ స్టైల్‌ను ప్రతిబింబించే విధంగా నిర్మించిన ఈ కట్టడంలో బంగారు, వెండి పూతతో ఎంతో అద్భుతంగా నిర్మించారు. స్వయానా చిత్రకారుడు కూడా అయిన స్టీఫాన్‌ నార్‌బ్లిన్‌ చిత్రించిన చిత్రాలు భవన ఇంటీరియర్‌కు మరింత ఆకర్షణను చేకూర్చాయి. చిత్తర్‌ ప్యాలెస్‌, తన పూర్వీకుల జ్ఙాపకార్థం నిర్మించారు. అంతేకాకుండా, ఓటమి ఎరుగని మహారాజుగా గుర్తింపు తెచ్చుకున్న రావు జోధా నిర్మించిన మెహరంగధ్‌ కోట కూడా తన పూర్వీకుల జ్ఙాపకార్థమే నిర్మించారు.

మెహ్రంగద్‌ కోట...
Palace_Gardens
మెహ్రంగద్‌ కోట రాథోఢ్‌ వంశ పరిపాలను గుర్తు. అయితే ఈ కోటపైన కట్టడాలను రావు జోధా చాలాసార్లు మార్పులు చేశారు. ఆయన చేసిన మార్పుల్లో చాలావరకు మొఘల్‌ సామ్రాజ్య నిర్మాణ శైలికి అద్దం పడు తుండగా... మరోవైపు అద్భుతంగా మలిచిన ఆర్చీలు, గుమ్మటాలు, బొటానికల్‌ పెయింటింగ్స్‌, వాటర్‌ కోర్సులు అన్నీ రాజా ఉమైద్‌ సింగ్‌ చిత్త ర్‌ ప్యాలెస్‌ రాజ్‌పుత్‌ నిర్మాణ శైలిని అడుగడుగా ప్రతిబింబిస్తాయి. రాష్ట్ర కూటుల రాచరికానికి ప్రతీక ఈ ప్యాలెస్‌. పురాతన హిందూ నిర్మాణశైలికి అద్దం పట్టే అద్భుత రాతికట్టడమైన కైలాష్‌నాథ్‌ దేవాలయం వీరి కళాభిరుచికి నిదర్శనాలు.

ఉమైద్‌ భవన్‌ ఇప్పుడో స్టార్‌ హోటల్‌...
ప్రస్తుతం తాజ్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలో రాజస్థాన్‌లోనే అతిపెద్ద స్టార్‌ హోట ల్‌గా ఉన్న ఈ ప్యాలెస్‌లో కొంత భాగాన్ని ఇప్పటికీ మహారాజా ఉమైద్‌ సిం గ్‌ వారసులు వారి నివాసానికి ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్యాలె స్‌కు మహారాజా గజ్‌సింగ్‌-2 వారసుడుగా చలామణి అవుతున్నారు. 1972లో ఈ ప్యాలెస్‌ హోటల్‌గా రూపాంతరం చెందింది. 1978లో ఈ హోటల్‌ నిర్వహణ బాధ్యతలను... భారత్‌లోనే అతిపెద్ద హోటల్‌ గ్రూప్‌ అయిన ఐటీసీ వారికి అప్పగించారు. ఈ హోటల్‌కు వచ్చే పర్యాటకులు మునుపెన్నడూ ఎరుగని అత్యాధునిక వసతి సౌకర్యాలను అనుభవిస్తారు.

రాజమహల్‌లో ఉన్న అనుభూతిని పొందుతారు. హోటల్‌లో ఎక్కడ చూసినా అత్యంత ఖరీదైన ఫర్నిచర్‌ మన కు దర్శనమిస్తుంది. నేటి పర్యాటక అవసరాలకు అనుగుణంగా యాత్రి కులకు అన్నిరకాల సౌకర్యాలు అందించడం ఈ హోటల్‌ ప్రత్యేకత. ఈ హోటలను సందర్శించే పర్యాటకులను... హోటల్‌ మధ్యనున్న 110 అడు గుల ఎతె్తైన గుమ్మటం విశేషంగా ఆకట్టుకుంటుంది. చెప్పాలంటే... ఈ హోటల్‌కు ఇదే ఒక ప్రత్యేక ఆకర్షణ. ఈ హోటల్‌లో అన్ని రకాల ఆహారప దార్థాలను వండి వార్చడానికి ఎన్నో రెస్టారెంట్లు కొలువుదీరి ఉన్నాయి. ది ట్రోఫీ బార్‌, రిసాలా రెస్టారెంట్‌, ది మర్వర్‌ హాల్‌, ది పిల్లర్స్‌ రెస్టారెంట్‌, కెబాబ్‌ కార్నర్‌ వంటి ఎన్నో ఫుడ్‌ పాయింట్స్‌ మీకు దర్శనమిస్తాయి. విదేశీ యాత్రికులకు కావలసిన వంటకాలు కూడా ఇక్కడ లభ్యమవుతాయి.

UmaidBhawan
ఈ హోటల్‌ గుమ్మటాల మధ్య నుండి సూర్యాస్తమయాన్ని చూడడం ఒక మరుపురాని అనుభూతి. ఆ అనుభూతిని అనుభవించాలనేగాని మాటల్లో వర్ణించలేము. అంతేకాకుండా ప్యాలెస్‌ ముందు పచ్చగా పరుచుకున్న లాన్లు ఎంతో ఆహ్లాదకర వాతావరణాన్ని అందించడమే కాకుండా హోటల్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. బిల్డింగ్‌ మధ్యలో ఉండే స్విమ్మింగ్‌ పూల్‌ హోటల్‌కే ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నదని చెప్పవచ్చు. అంతేకాకుండా హోటల్‌ను ఆనుకొని ఒక ప్రైవేట్‌ మ్యూజియం కూడా ఉన్నది. ఈ మ్యూజియంలో దేశవిదేశాలకు సంబంధించిన ఫర్నిచర్‌, గడియారాలు, బొమ్మలు వంటి రకరకాల వస్తువులు కొలువుదీరి ఉంటాయి. ఇందులో జోధ్‌పూర్‌ మహారాజు వారి పరిపాలన కాలంలో సేకరించిన వివిధ రకాలైన, విలువైన వస్తువుల కూడా ఉంటాయి. విహారం లేదా వ్యాపారం నిమిత్తం జోధ్‌పూర్‌కు వచ్చే పర్యాటకులు ముందుగా ఈ ప్యాలెస్‌ హోటల్‌కే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు.

గత కొన్నేళ్ళుగా ఈ ప్యాలెస్‌ దేశీయ పర్యాకులనే కాకుండా విదేశీ పర్యాటకులను కూడా అమితంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా బిజినెస్‌ కాన్ఫరెన్సులకు ఈ హోటల్‌ ప్రముఖ విడిదిగా మారిందని చెప్పవచ్చు. ఇందులో బిజినెస్‌ మీటింగ్‌ కావలసిన విశాలమైన మీటింగ్‌ ఏరియా ఉంది. అంతేకాకుండా మీటింగ్‌ కావలసిన ఫర్నిచర్‌ ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. జోధ్‌పూర్‌ సందర్శించే పర్యాటకులు ఈ హోటల్‌ సందర్శించకుండా వెనుదిరిగారంటే... వారు పూర్తి విహారానుభూతిని ఆస్వాదించలేదనే అర్థం. ప్రపంచంలోనే ఫస్ట్‌ క్లాస్‌ హోటల్‌గా రేటింగ్‌ పొందిన ఉమైద్‌ భవన్‌ ప్యాలెస్‌కు గత కొంతకాలంగా పర్యాటకుల తాకిడి విపరీతంగా పెరిగింది.

అందాలకూ ఆనందాలకూ నెలవు * ‘ పోర్టోరికో ’

 
మన దేశానికి అండమాన్-నికోబార్ దీవులు, లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతాలుగా ఎలా ఉన్నాయో-అలానే ‘పోర్టోరికో’ అమెరికా దేశానికి కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంది. ప్రాకృతిక సౌందర్యం వెల్లివిరిసే బీచులు, ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్, పర్వత శ్రేణులు, స్పానిష్ కాలనీల్లో నిర్మించిన కోటలు, భూమి మీదే అతిపెద్ద రేడియో టెలిస్కోప్ ‘అరబికో అబ్జర్వేటరీ’ లాంటి ప్రత్యేకతలున్న దీవి ఇది.

శానువాన్‌లోగల లూయిస్ మునో మారిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి మియామి నుంచి వచ్చిన అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం నుంచి దిగగానే ఓ చక్కని ఫీలింగ్. హిల్టన్ డబుల్ ట్రీ హోటల్‌లో మా మకాం. మా అధికారిక సంబంధమైన పనులకై రోజూ ఉత్తరాన ఉన్న శానువాన్ నుండి దక్షిణాన ఉన్న గుయామా మధ్య ప్రయాణిస్తూనే సేకరించిన విశేషాలే ఈ వ్యాసం.

చరిత్ర, భౌగోళిక, రాజకీయ వివరాలు
కొలంబస్ రెండోసారి అమెరికా పరిసరాలు చుట్టేసరికి, సుమారు 1493 సంవత్సర ప్రాంతానికి ఈ దీవి స్పానిష్ సామ్రాజ్యంలో భాగంగా ఉంది. దాదాపు 40 యేళ్లు స్పానిష్ పరిపాలనలో ఉన్న పోర్టోరికో- అమెరికన్, స్పానిష్ యుద్ధం తర్వాత అమెరికా అధీనంలోకి వచ్చింది. 1917లో పోర్టోరికన్‌లకు అమెరికన్ పౌరసత్వం లభించింది. 1948 నుండి స్వతంత్ర గవర్నర్‌ల పాలన.

1952లో సొంత రాజ్యాంగం ఏర్పరుచుకున్న వారు, వరుసగా 1967, 1993, 1998లో జరిగిన రిఫరెండముల్లో యథాతథంగా కొనసాగేందుకు ఇష్టపడ్డారు. పోర్టోరికన్‌లకు అమెరికన్ పార్లమెంట్‌లో పాల్గొనేందుకు మాత్రం అవకాశం లేదు. వారికి ప్రత్యేకమైన పతాకం ఉంది. పతాకలో ఎర్ర గీతలు ప్రభుత్వమనే అవయవానికి జవసత్వాల్నిచ్చే రక్తమని, నీల త్రిభుజం... ప్రభుత్వంలోని న్యాయ, రాజ్యాంగ, పరిపాలన విభాగాలని, నక్షత్రం సార్వభౌమత్వానికి చిహ్నమనీ భావిస్తారు.

ఓ పక్క ఉత్తర అట్లాంటిక్ సముద్రం, మరోపక్క కరేబియన్ సముద్రం, మధ్యలో ఉన్న ఈ దీవి 13,790 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో 501 కిలోమీటర్ల సముద్ర తీరంతో, దాదాపు 40 లక్షల జనాభాతో విలసిల్లుతోంది. ఈ ద్వీపం కరేబియన్ దీవులన్నిటికీ ఫ్యాషన్ క్యాపిటిల్ అని వాళ్లు గర్వంగా చెబుతారు. 2006లో జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో పోర్టోరికన్ బ్యూటీ ‘జులైకా రివెరా’ విజయం సాధించింది. గోల్ఫ్, రాకెట్ బాల్, బీచ్ వాలీబాల్, హార్స్ బ్యాక్ రైడింగ్ వారి ప్రధాన క్రీడలు.

ఫోర్ట్ శాన్ ఫెలిప్ డెల్ మొర్రో
స్పానిష్‌వారు కరేబియన్ దీవులకు ముఖద్వారంగా ఉన్న ఈ దీవికి ‘ఫైన్ లేక రిచ్ పోర్ట్’ అని పిలవటం మొదలెట్టారు. ఇదే చివరికి పోర్టోరికో అయ్యింది. ప్రత్యర్థుల నుంచి భద్రత కోసం ఎత్తయిన ప్రదేశంలో రాజు ఫిలిప్-2 గౌరవార్థం కట్టిన ‘ఎల్ మొర్రో’ మాసనీరీ టవర్ ‘శాన్ ఫిలిప్ డెల్ మొర్రో’గా గుర్తించబడింది. ఈ దుర్భేద్యమైన కోట స్పానిష్ వారికి కీలకమైన స్థావరం. 1797లో ఏడు వేల మంది బ్రిటిష్ సైనికులు సైతం దీన్ని ఛేదించలేకపోయారు.

ఈ కోటకు దగ్గర్లో సెయింట్ క్రిస్టోఫర్ గౌరవార్థం కట్టిన మరో కోట ‘కాజిలో డి శాన్ క్రిష్టోబల్’ ఉంది. 1898లో జరిగిన స్పానిష్-అమెరికన్ యుద్ధం తర్వాత జనరల్ నెల్సన్ ఆధ్వర్యంలో అమెరికన్ సేనలు ఆ కోటను అధీనంలోకి తీసుకున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 1949లో ఈ కోటలు ‘నేషనల్ హిస్టారిక్ ప్రదేశం’గా యునెటైడ్ నేషన్స్‌చే గుర్తించబడ్డాయి. ఈ కోటలెప్పుడూ సందర్శకులతో కిటకిటలాడుతుంటాయి. ఎంతోమంది సైనికులు పోరాడిన ప్రదేశంలో ఇప్పుడు సందర్శకులు గాలిపటాలు ఎగరేసుకుంటూ సేద తీరడం ఆశ్చర్యమనిపిస్తుంది.

సప్త సముద్రాల ఆవల ‘తంత్ర’
ఇడ్లీ, దోశ, సమోసా, ఆవకాయ అన్నం రుచి చూసిన నాలుక చప్పబడిపోయింది, ఎలా అనుకుంటున్న మమ్మల్ని, మిత్రుడు పోర్టోరికన్ లూయిస్ మెర్కాడో పాత శానువాన్ కోట ప్రాంతంలోని ఓ రెస్టారెంట్‌కు తీసుకెళ్లాడు. ‘చెఫ్ రమేష్ పిళ్లై’స్ తంత్ర - ఇండో లాటినో కుజిన్’ అన్న బోర్డు చూసి కాస్త ఆశ్చర్యపడ్డాం.

అడుగిడగానే ఎదురైన వినాయకుడు, సరస్వతి విగ్రహాలు, నాగదేవత బొమ్మ మమ్మల్ని మరింత థ్రిల్‌కి గురిచేశాయి. సమోసాలు, దోశ-సాంబార్, అప్పడాలు, కిచిడీ, కేరళ వెజిటేరియన్ కుర్మా... మెనూ చదువుకుంటూ వెళ్తే మతిపోయింది.

రమేష్ పిళ్లై తమిళనాడులో ‘నాగర్ కోయిల్’లో పుట్టి, చెన్నైలో పాకశాస్త్ర పట్టా సాధించి ప్రపంచాన్ని చుట్టిన చెఫ్! కార్పొరేట్ చెఫ్‌గా ఫజార్డోలోని ఓ రిసార్ట్‌కు అడుగిడిన రమేష్, సౌత్ ఇండియన్ వంటలను పోర్టోరికో సంప్రదాయ వంటలకు జోడించి సొంతగా ప్రారంభించిన రెస్టారెంట్ ‘తంత్ర’.

మాకంటే మాతోపాటు వచ్చిన లూయిస్ మెర్కాడో (పోర్టోరికన్), టెర్రీబ్రియన్ (అమెరికన్) తండూరీ వంట లన్నీ లొట్టలేసుకుంటూ తినడం నాకింకా గుర్తుంది. కరేబియన్ లాబ్‌స్టర్, రెడ్ స్నాపర్, ఓయిస్టర్స్ లాంటి సీఫుడ్ విపరీతంగా దొరుకుతుంది. వైన్‌లు, లోకల్ బ్రాండ్ ‘మెడల్లా’ బీర్‌లకు లోటే లేదు. లాటిన్, ఏషియన్, థాయ్, చైనీస్, ఐరిష్, ఫ్రెంచ్, స్పానిష్ వంటకాలందించే రెస్టారెంట్లు కోకొల్లలు.

ప్రపంచ ప్రఖ్యాత అరబికో అబ్జర్వేటరీ
కార్నెల్ యూనివర్సిటీ మరియు నేషనల్ సైన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శాస్తవ్రేత్తలు పరిశోధనలు సాగించే ఈ అబ్జర్వేటరీ, 13 ఫుట్‌బాల్ మైదానాలకు సమానమైన విస్తీర్ణంలో ఉంది. గోల్డెన్ ఐ, కెప్టెన్ రాన్-కాంటాక్ట్ సినిమాల్లో ఇది కనిపిస్తుంది.

‘యెల్ యుంకీ’ నేషనల్ ఫారెస్ట్
ప్రపంచంలో ఏడు ప్రాకృతిక వింతల పోటీల్లో నిలబడినదిగా పేరొందిన రెయిన్ ఫారెస్ట్ ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ! 28,000 ఎకరాల విస్తీర్ణంలో శానువాన్‌కి తూర్పు, ఉత్తర భాగాల్లో ఉన్న ఈ కీకారణ్యంలో 150 ఫెర్న్ జాతులు, 240 వృక్ష జాతులున్నట్టు అంచనా. ఈ 240లో 23 జాతుల వృక్షాలు ప్రపంచంలో మరెక్కడా లేవని ప్రతీతి! కోక్వీ ట్రీ ఫ్రాగ్, పోర్టోరికన్ పేరెట్, పిగ్మీ ఎనోల్ లాంటి జంతువులు ఈ అడవికి మాత్రమే ప్రత్యేకం. సంవత్సరానికి సుమారు పది లక్షల సందర్శకులు వస్తారని అంచనా. పోర్టోరికాకి ఆదిమ జాతిగా చెప్పబడే టైనో ఇండియన్స్ భాషలో ‘యుంకీ’ అంటే పవిత్రమైన నేల అని అర్థమట. హైకింగ్ ప్రేమికులకు, ప్రకృతి ఆరాధకులకు ఇది భూతల స్వర్గం.

మజా కోరుకుంటూ కాసినోలు, పబ్‌లు వెదుక్కొనే జల్సా, సల్సారాయుళ్లకైనా, ప్రకృతి ఆరాధనలో మైమరచిపోయే మృదు స్వభావులకైనా; స్విమ్మింగ్, పాడిల్ సర్ఫింగ్, కైట్ సర్ఫింగ్, బీచ్ వాలీబాల్ అంటూ జల క్రీడలకు సిద్ధమైపోయే బిందాస్ జంటలకైనా; మందే మనకు ముఖ్యమంటూ మత్తులో చిత్తయిపోయే మందు దాసులకైనా; రకరకాల రుచులకై ‘వెరైటీ ఈజ్ ద స్పైస్ ఆఫ్ లైఫ్’ అంటూ జిహ్వ చాపల్యం గల తిండిబోతులకైనా... ఇలా ఎలాంటి టూరిస్టులకైనా సేదదీరుస్తామనే ‘నైస్ ఫోర్ట్’ పోర్టోరికో!

‘పోర్టోరికో’ ప్రత్యేకతలు

స్పానిష్, టైనో ఇండియన్ మరియు ఆఫ్రికన్ సంస్కృతులు కలగలిసి ఉద్భవించిన జాతే పోర్టోరికన్.

స్పానిష్ మరియు ఇంగ్లిష్ అధికార భాషలైనా, ఎన్నో యేళ్లు స్పెయిన్ పాలనలో ఉండడం వలన స్పానిష్ ప్రభావం ఎక్కువ.

అధికారిక కరెన్సీ ‘అమెరికన్ డాలర్’, కానీ ‘పెసో’ అని పిలుస్తారు. ప్రఖ్యాత రమ్ బ్రాండ్ ‘బకార్డీ’ జన్మస్థలం ఇదే.

ప్రపంచంలోనే అతి పెద్దదైన సింగిల్ డిష్ రేడియో టెలిస్కోప్ (1000 అడుగుల వ్యాసార్థం) దాదాపు 20 ఎకరాలలో ఉంది. 10 బిలియన్ కాంతి సంవత్సరాల వరకు పరిశోధించగల సామర్థ్యం ఉన్న ఈ టెలిస్కోప్‌కు మాత్రమే భూమిమీద ఆస్టరాయిడ్స్ ఎక్కడ, ఎప్పుడు పడగలవో కచ్చితంగా అంచనా వేయగల శక్తి ఉంది.

ఫార్చ్యూన్ 100 కంపెనీల్లో 55, ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో 178 పోర్టోరికోలో కార్యాకలాపాలు నిర్వహిస్తున్నాయి. లైలా, ఫైజర్, డెక్స్‌టర్ వంటి ఫార్మా కంపెనీలు తమ ఉత్పత్తులను ఇక్కడే కేంద్రీకరించాయి.

అమెరికాలో వినియోగించే 50 శాతం పేస్ మేకర్స్, డిఫ్రెబ్రిలేటర్స్ అవసరాలను పోర్టోరికో తీరుస్తోంది.

పోర్టోరికో అందాల భామలు అయిదుసార్లు మిస్ యూనివర్స్ టైటిల్స్ గెలుచుకున్నారు. మిస్ యూనివర్స్ పోటీలకు వేదికైన తొలి లాటిన్ అమెరికన్ దేశంగా కూడా గుర్తింపు కొట్టేసింది.

- పి.హరినారాయణరెడ్డి

Wednesday, November 17, 2010

మక్కా సిగలో మరో కలికితురాయి.. అబ్రాజ్‌ అల్‌-బెయిల్‌ క్లాక్‌ టవర్‌

world_biggest_clock సోదరులు పవిత్రస్థలమైన మక్కాలో ప్రపంచంలోనే ఓ అరుదెైన ఆవిష్కరణ రూపుదిద్దు కుంది. గత బుధవారం ప్రారంభించిన ఆ అరుదెైన కట్టడం ఇప్పుడు పర్యాటకులను విశేషం గా ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో క్లాక్‌ టవర్స్‌ ఉన్నాయి. వాటన్నింటినీ తల దన్నే రీతిలో మక్కాలో ఇప్పుడు ప్రపంచంలోనే ఎతైన క్లాక్‌ టవర్‌ గా గుర్తింపు పొందింది. ముస్లింలు ప్రతిరోజు 5 సార్లు నమాజ్‌ చేస్తారని అందరికీ తెలిసిన విషయమే... అయితే నమాజ్‌ టైం కాగానే టంచనుగా మోగుతూ ముస్లిం సోదరులను నమాజ్‌కు సన్నద్ధం చేయడం ఈ బడా గడియారం ప్రత్యేకత.

అబ్రాజ్‌ అల్‌ - బెయిట్‌ టవర్స్‌గా నామకరణం చేసిన ఈ క్లాక్‌ టవర్‌ అలారం నమాజ్‌ టైం కాగానే మోగుతుంది. మక్కాలోని పవిత్రస్థలం కాబా కు దగ్గరలో నిర్మించబడిన ఈ క్లాక్‌ టవర్‌ కు నాలుగు వెైపులా ఒకే రకమైన సైజులో గడియారాలు తీర్చిదిద్దారు. ఈ గడియారాలు ఒక్కొక్కటి 43 చమీల వ్యాసార్ధాన్ని కలిగి ఉంటాయి. అబ్రాజ్‌ అల్‌ - బేయిట క్లాక్‌ టవర్‌ నమాజ్‌ను సమాయాన్ని గుర్తుచేసే... ప్రపంచంలోనే అతిపెద్ద క్లాక్‌టవర్‌ కావడం విశేషం. మక్కాలోని ‘హోలీ గ్రాండ్‌ మాస్క్‌’కు అభిముఖం గా ఉన్న ప్రపంచంలో రెండవ ఎతె్తైన హోటల్‌ పెై అంతస్థు నుండి 400 మీటర్ల ఎత్తులో ఈ క్లాక్‌ టవర్‌ను నిర్మించారు.

ఈ పవిత్ర మక్కా క్లాక్‌ను సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా బిన్‌ అబ్దుల్‌ అజీజ్‌ అల్‌ - సౌద్‌ ఆదేశాల మేరకు నిర్మించారు. 90 మిలియన్ల రంగు గాజు ముక్కలను ఈ క్లాక్‌ నిర్మాణంలో వాడడం విశేషం. గడియారం నాలువెైపులా పెద్ద పెద్ద అక్షరాలతో ‘అల్లా’ అని ముద్రించి ఉంటుంది. ఈ అక్షరాలు సౌదీ నలుమూలల నుండి దర్శనమిస్తాయి.
సౌదీ రాజు అబ్దుల్‌ అజీజ్‌ ఎండోమెంట్‌ హోటల్‌ కాంప్లెక్స్‌కు ఈ క్లాక్‌ టవర్‌ ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. ఈ హోటల్‌ను ప్రైవేట్‌ సౌదీ బిన్‌లాడెన్‌ గ్రూప్‌ నిర్మించింది. ఇది ప్రపంచంలోనే విశాలమైన ఫ్లోర్‌ ఏరియా కలిగిన హోటల్‌గా గుర్తింపు పొందింది. సౌదీ మీడియా గణాంకాల ప్రకారం ఈ క్లాక్‌ టవర్‌ నిర్మాణానికి 3 బిలియన్ల అమెరికన్‌ డాలర్లు ఖర్చు చేశారట.
601 మీటర్ల ఎతె్తైన టవర్‌ మీద ఈ గడియారాన్ని ప్రతిష్టించారు. ఇది ప్రపంచంలోనే రెండవ అత్యంత ఎతె్తైన టవర్‌ కావడం గమనార్హం.
‘‘పవిత్ర స్థలం హోలీ మాస్క్‌ కు ఎదురుగా ఉండడం వల్ల ఇందులో ప్రపంచ ప్రామాణిక కాలం బదులు మక్కా టైమ్‌ ను సెట్‌ చేశారు. ఇది ప్రపంచంలోని ముస్లింలందరికీ ప్రతీకగా నిలుస్తుంది’’ అని తరుచూ మక్కాను సందర్శించే జెడ్డా నివాసి అయిన హషీమ్‌ అద్నాన్‌ తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు.
ప్రపంచం నలుమూల నుండి ప్రతియేటా హజ్‌ యాత్రకు కొన్ని లక్షల మంది యాత్రికుల వస్తుంటారు. వీరి తాకిడి తట్టుకోవడానికి మక్కా పాత నగరాన్ని సుందరంగా తీర్చి దిద్దే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది సౌదీ ప్రభుత్వం. అందులో భాగంగానే ఈ క్లాక్‌ టవర్‌ నిర్మాణాన్ని చేపట్టారు. ప్రతి ముస్లిం జీవితంలో ఒక్కసారెైనా మక్కాను సందర్శించాలని కోరుకుంటాడు. దీనివల్ల ప్రతి సంవత్సరం హజ్‌ యాత్రికుల తాకిడి పెరుగుతుందే కానీ, తగ్గడం లేదు. ప్రతిసంవత్సరం సుమారు 20 లక్షలకు పెైగా హజ్‌ యాత్రికులు మక్కాను సందర్శిస్తారు. మిగతా టైంలో... సంవత్సరం అంతా కలిపి మక్కాను సందర్శించే యాత్రికుల సంఖ్య సుమారు 35 లక్షలు ఉంటుంది.

ఒకవెైపు ఈ క్లాక్‌ టవర్‌ ప్రతిష్టాపన పట్ల కొందరు మక్కా సందర్శకులు ఆనందాన్ని వెలిబుచ్చుతుంటే... మరికొందమంది మాత్రం... మాస్క్‌కు అతి దగ్గరగా నిర్మించిన ఈ కట్టడం మక్కాలోని ఆద్యాత్మికత దెబ్బతీస్తుందేమననే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

‘‘ఎంతో వ్యయప్రయాసలకోర్చి ఎంతో మోడ్రన్‌గా నిర్మించిన ఈ క్లాక్‌ టవర్‌ మక్కాలోని ఆద్యాత్మిక వాతావరణానికి ఆటంకం సృష్టించే అవకాశం లేకపోలేదు. ఈ క్లాక్‌ టవర్‌ ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందితే పొందవచ్చు కానీ, గ్రాండ్‌ మాస్క్‌, కాబాలే మక్కాలో అత్యంత గుర్తింపు ఉన్న ప్రదేశాలని నేను భావిస్తాను’’ అని తరుచూ మక్కాను సందర్శించే లినా ఎడ్రిస్‌ అనే మహిళ ఒకరు తన భక్తిని చాటుకుంది.
ఏదేమైనా ఈ క్లాక్‌టవర మక్కాకు ఆద్యాత్మికతతో పాటు పర్యాటకశోభ మరింత పెంచుతుందనడంలో ఎటువంటి అతిశయోక్తిలేదు.

చారిత్రక సొబగులు, అటవీ అందాలకు ఆలవాలం.. ఆదిలాబాద్‌

adilabad-gods 
ఆదిలాబాద్‌ జిల్లా ప్రకృతి రమణీయతకు పుట్టినిల్లే కాదు పలు విశేషాలు చారిత్రాత్మక స్థలాలకు నిలయం. ఒకప్పుడు దండకారణ్యంలో అంతర్భాగమైన ఆదిలాబాద్‌ జిల్లా చరిత్ర ఎంతో ఆసక్తికరంగా ఉంది. రాకాసి బల్లులు నడయాడిన నేల ఇది. సామ్రాజ్యాలు ఏర్పాటు చేయడానికి ముందు ఇక్కడి ఘనరాజ్యాలు, నగర రాజ్యాలు ఉండేవి. నేటి కుబీర్‌, బెైంసా, నేరడిగొండ, మండలం వడూర్‌ ఘన రాజ్యాలుగా ఉండేవి, వేటికవే స్వతంత్ర దేశాలుగా ఆనాడు వెలసిల్లాయి. మైసాపూరం, కూబీర్‌ పురం మద్య తరుచు యుద్ధాలు జరిగేవని పురాణాలు చెబుతాయి. కళింగ దేశం రాజు ఖారవేలుడిని తీసుకు వచ్చి విజయం సాధించారు. మౌర్యులు, శుంగులు, కలియులు, పశ్చిమ చాణుక్యులు, రాష్టక్రూటులు, కళ్యాణి చాళుక్యులు, దేవగిరి జాదవ రాజులు కాకతీయ గొండు రాజులు, బహమనీ సుల్తానులు, మహ్మద్‌ నగర్‌, నిజాం సాహిద్‌, గోల్కొండ నవాబులు, మరాఠాలు, హైద్రాబాద్‌ అసఫ్‌జాహీ వంశీకులు ఈ ప్రాంతాన్ని పాలించారు. చారిత్రకంగా ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ జిల్లా నేటికీ ప్రకృతి రమణీయతతో అలరారుతోంది...

adilabad-gods1అసఫ్‌జాహీ కాలంలో ప్రస్తుతం జిల్లాకు రూపు రేఖలు ఏర్పడ్డాయి. నిజాం కాలంలో ఈ ప్రాంతం సిర్పూర్‌, తాండూర్‌ ఉప జిల్లాగా ఉండేది. 1905 లో ఆదిలాబాద్‌ జిల్లా స్వతంత్ర జిల్లాగా ఏర్పడింది. అంతకు ముందు ఆసిఫాబా ద్‌ జిల్లాగా కొనసాగింది. నాటి నుంచి ఆదిలాబాద్‌ అంటేనే అడవుల జిల్లా.. ప్రకృతి అంద చందాలకు నిలయాలు ఇక్కడి అభయ అరణ్యాలు. వాటర్‌ ఫా ల్స్‌, ప్రకృతి రమణీయతను చాటుతుంటాయి. కవ్వాల్‌ అభయ అరణ్యాలు జం తువులకు ఆలవాలం అయిన ప్రాణహిత బ్లాక్‌, శివారం అభయ అరణ్యం లోగి లి, ఆదిలాబాద్‌ సెలయేటి గలగలలు, పక్షుల కిల కిల రావాల నడుమ వన్య ప్రాణులు సంచరిస్తుంటాయి. వన్య ప్రాణులకు ఇక్కడ కొదవ లేదు. పులులు, ఎలుగు బంట్లు, నిల్వాయిలు, చిరుతలు, దుప్పులు, నెమళ్ళు, లేళ్లు, నక్కలు, కొండ చిలువలు తదితర వన్య ప్రాణులతో పాటు టేకు, జిట్రేగి, వెదురు మొ దలగు అపారమైన అటవీ సంపద విస్తారంగా ఉంది.

కుంటాల జలపాతం... : ఆదిలాబాద్‌ జిల్లాలో సహజ సిద్దమైన అం దమైన జలపాతాల్లో కుంటాల ఒకటి. రాష్ట్రంలోనే ఎతె్తైన జలపాతాల్లో కుంటాల జల పాతం మొదటిది. పూర్వం శకుంతల దుష్యంతుల విహార కేంద్రంగా ఉండేదని పూర్వీకులు చెబుతుంటారు. దీన్ని ముందుగా శకుం తల జలపాతంగా పిలిచే వారు క్రమేణా కుంతల జలపాతంగా ప్రస్తుతం కుంటాల జలపాతంగా పిలు స్తున్నారు. కారడవుల మధ్య సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

adilabad-gods2  హైదరాబాద్, నాగ్‌పూర్‌ ఏడవ జాతీయ రహదారిలో ఉన్న నేరడిగొండ మండల కేం ద్రం నుంచి 12 కిలో మీటర్ల దూరంలో ఈ జలపాతం ఉంది. గోదావరి ఉప నది అయిన కడేం వాగు సహ్యాద్రి పర్వత పంక్తులపెై 40 మీటర్ల (138 ఫీట్లు) ఎత్తు నుంచి జాలువారుతూ కుంటాల జలపాతంగా మారుతుంది. జలపాతం దూకే చోట చిన్న రాతి గుహ ఉంది. అందులో సోమేశ్వరుడు, నంది, పాన వట్టం ఉన్నాయి. ఏక కాలంలో ఒకరు మాత్రం వెళ్లగలిగే వీలు ఉన్న ఈ గుహలో 10 మంది వర కు కూర్చో వచ్చు. జలపాతం దిగువన కుడి వెైపున చెట్టుకింద కాకతీయుల నాటి దేవత విగ్రహాలు కనిపిస్తాయి. ప్రస్తుతం ఇది పర్యటక ప్రాంతంగా ప్రకటించడంతో సూదూర ప్రాం తాల నుంచి సందర్శకులు వచ్చి ఇక్కడి అడవుల అందాలను తిలకించి మంత్ర ముగ్ధులవు తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు జిల్లా అధికార యంత్రాంగం వచ్చి పోయే పర్యటకుల సౌకర్యార్థం అన్ని వసతులను కల్పిస్తుంది.

పోచ్చెర జలపాతం... : ఈ జలపాతం చిన్నదే అయినప్పటికి ఎంతో ఆకర్షణీయంగా కనిపి స్తుంది. జాతీయ రహదా రి పక్క నుంచి బోథ్‌కు వెళ్లే మార్గంలో కిలో మీటర్‌ దూరంలో ఈ జలపాతం ఉంది. పొచ్చర అనే గ్రామ సమీపంలో చిన్నకొండ వాగు రాళ్ల పెై నుంచి దూకే ఈ దృశ్యం చూడ చక్కగా కనిపిస్తుంది. ఏ కాలంలోనెైన పోచ్చర జలపాతానికి చేరుకోవచ్చు. పర్యటకులు ఏ వేళలోనెైన అక్కడికి వెళ్లి జలపాతం అందాలను తిలకించవచ్చు. ఒకప్పుడు ఎలాంటి సౌకర్యాలు లేక పోగా ప్రస్తుతం అధికారులు సందర్శకుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లను చేశారు.

నిర్మల్‌ కొయ్య బొమ్మలు... : adilabad-gods3కళలకు కళాకారులకు ప్రసిద్ది గాంచినదే నిర్మ ల్‌ ప్రాంతం. ప్రాణం లేని బొమ్మలకు నిర్మల్‌ కొయ్యబొమ్మల తయారీ కళాకా రులు నిర్జీవమైన ప్రతిమలకు ప్రాణం పోస్తున్నారు. జీవం ఉట్టిపడేలా ఆకృ తు లను తయారు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. గేట్‌ ఆఫ్‌ ఆదిలాబాద్‌గా నిర్మల్‌ పేరు గాంచింది. అచ్చంగా కూరగాయలు, పండ్లు, పక్షుల మాదిరిగా ఎన్నో రకా ల బొమ్మలు ఇక్కడి కళాకారులు తయారు చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ది గాంచిన ఈ బొమ్మలను దగ్గరకు వచ్చి చూస్తే గాని అవి కొయ్య బొమ్మలుగా గుర్తించలేము. రాష్ట్రంలోనే కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ కొయ్య బొమ్మలు ప్రసిద్ది గాంచాయి. పెయింటింగ్‌లకు పెట్టింది పేరుగా నిర్మల్‌ను చెప్పుకొవచ్చు. కాకతీయ కళాతోరణం, చారిత్రక చార్మినార్‌తో పా టు జాతీయ నాయకుల కళా రూపాలు తయారిలో మంచి ప్రావీణ్యం ఇక్కడి కళాకారులు సంపాదించారు. వీరి చేతిలో రూపుదిద్దుకున్న బొమ్మలు దేశ విదే శాలకు ఎగుమతి అవుతున్నాయి.

ఈ బొమ్మలను పొనికి కరత్రో తయారు చేస్తారు. ప్రస్తుతం జిల్లాలో అడవులు అంతరిస్తున్నందున ఈ పొనికి కర్ర దొర కడం కష్టంగా మారింది. కళాకారులు అటవీ శాఖ అధికారులకు ఇక్కడి ప్రజా ప్రతినిధులకు పొనికి కర్ర ను పెంచాలని పలుమార్లు విజ్ఞప్తులు చేసినా స్పందిం చడం లేదు. దీంతో బొమ్మల తయారికి ఇబ్బంది అవుతుండడంతో పొట్ట గడవడం కష్టంగా మారిందని కుటుంబాలను పోషించించుకోవడం గగనం అవుతోందని కళాకారులు వాపోతున్నారు.

జ్ఞాన సరస్వతి దేవి ఆలయం... : భారతావనిలో అతి ప్రసిద్ధి గాంచిన శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రం ముదోల్‌ మండలం లోని బాసరలో కొలువెై ఉంది. చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయాల్లో ఒకటి కాశ్మీర్‌లో ఉండగా రెండవది బాసరలో మాత్రమే ఉంది. గోదా వరి తీరానా కిలో మీటర్‌ దూరంలో ఉన్న జ్ఞాన సరస్వతి దేవి వేద వ్యాస మహర్షి చేరూపొందించబడింది. గోదావరి నది తీరాన సంచరి స్తూ సరస్వతీ దేవిని ప్రార్థించగా దేవి ప్రసన్నురాలెై తన ప్రతిమ ను ప్రతిష్టించి పూజించమని ఆజ్ఞాపించినట్లు కథనం. ఆ తర్వాత ప్రతిదినం గౌతమి నదిలో స్నానం ఆచరించి సరస్వ తి దేవిని ధ్యానించి మూడు ముష్టుల ఇసుకను మూడు స్థలాల్లో ఉంచాడు. క్రమేణా అవి మూడు మూర్తులు గా మారి మహాసరస్వతి, శ్రీ మహాలక్ష్మీ, శ్రీ మహా కాళీ రూపాలుగా వెలిశాయని మహర్షి వ్యాసుడు ఆ దేవి ని ప్రతిష్టించినందు న, ఆ క్షేత్రంలో నివసించినందున ఈ క్షేత్రం వాసరగా, క్రమేణా బాసరగా పిలువబడు తోంది.

ఈ బాసర గ్రామం మహారాష్ట్ర సరిహద్దులో ఉంది. ఈ దేవాలయానికి సమీపానే పర్వత గుహలో కుమారస్వామి తపస్సు చేసినందున ఈ పర్వతానికి కుమారచల పర్వతం అని పేరు వచ్చింది. ఇక్కడ ప్ర ధాన దేవాలయానికి తూర్పు భాగంలో ఔదుంబర వృ క్ష ఛాయలోని దత్త మందిరంలో సుందరమగు శ్రీ దత్తాత్రేయుని విగ్రహం, దత్త పాదుకలు ఉన్నాయి. శ్రీ మహాకాళి దేవాలయం పశ్చిమభాగాన కలదు. ఆగ్నేయాన అత్యంత మహిమాన్వితమైన అష్టతీర్థ పుష్కరి ణి ఉంది. వ్యాస మందిరం దక్షణ దిశలో కనిపిస్తుం ది. బాసర గ్రామానికి వెళ్లే దారిలో వేదవతి (ధనపు గుండు) అనే పెద్ద శిల కనిపిస్తుంది. దానిని శిలతో కొ ట్టినట్లయితే విచిత్ర ధ్వని వినిపిస్తుంది. గోదావరి సమీ పాన శివాలయం (సూర్యేశ్వర)ఆలయం కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వాలు అతిధి గృహలను నిర్మించింది.

నాగోబా దేవాలయం... : జిల్లాలోని కేస్లాపూర్‌ గ్రామంలో వెలసిన గిరిజనుల ఆరాధ్య దెైవం అయిన నాగోబా దేవతకు రాష్ట్ర వ్యాప్తంగా ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ జాతరకు జిల్లా నలుమూలల నుంచి కా కుండా పొరుగు రాష్ట్రాలెైన చత్తీస్‌గడ్‌, ఉత్తరాంచల్‌, జార్ఖండ్‌, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వేలాది మంది గిరిజనులు తమ ఇష్ట్ట దెైవాన్ని దర్శించుకునేందుకు హా జరవుతారు. ప్రతియేటా పుష్యమాసంలో అమావాస్య రోజున మేస్రం వంశీయులు ప్రత్యేక పూజలు నిర్వ హించడంతో జాతర ప్రారంభమవుతుంది. వేలాది సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయానికి 22 తె గలకు చెందిన మేస్రం వంశీయులు ఇక్కడ పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. పూర్వం మే స్రం వంశానికి నాగాయి మోతి రాణికి నాగేంద్రుడు కలలో సర్పం రూపంలో వచ్చి ఆమెకు జన్మించాడని చరిత్ర చెబుతుంది. ఆ కలను మేస్రం వంశీయులు నమ్మడంతో సర్పం రూపంలో ఉన్న నాగేంద్రు నికి తల్లి నాగాయి మోతిరాణికి తమ్ముడి కూతురు గౌరికి పెళ్లి జరిగిందని చెబుతుంటారు. పుష్య మాసానికి ముందు వచ్చే పౌర్ణమి నుంచి మేస్రం వంశీయులు కాలినడకన గోదావరి నది జలాలను తీసుకు వచ్చి అమావాస్య రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్కడ ప్రతి యేటా ప్రభుత్వం దర్బార్‌ నిర్వహించి గిరిజనుల సమస్యలను పరిష్కరిస్తున్నారు.
గిరిజన పోరాట యోధుడు కొమరంభీం...
komarambeemఆదివాసులది అడవి బ్రతు కు, అడవిలోనే అనేక ఘోరాలు అన్యాయాలు జరుగుతుండేవి. గిరిజనులపెై నిజాం ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను, దోపిడిని అరికట్టేందుకు నిజాంకు వ్యతిరేకంగా సాయుధ పొరాటం చేసేందుకు ముం దుకు వచ్చిన ఆదివాసి ముద్దుబిడ్డ, గిరిజనుల ఆరాధ్య దెైవం కొమరంభీం ఆ అడవి బ్రతుకునుంచే జరుగుతున్న దోపిడిపెై అనేక విషయాలు నేర్చుకున్నాడు. ప్రభుత్వం పెై పోరా డి ఆదివాసుల భూములను వారి పంటలను దక్కించుకున్నాడు. అటవీ భూములను నెైజాం ప్రభుత్వం భూస్వాములకు పట్టాలు చేస్తున్న కార్య్ర మంలో ఆసిఫాబాద్‌ ప్రాంతంలోని ఆదివాసులు తీవ్ర అన్యాయానికి గుర య్యారు. కొమరంభీంది ఆసిఫాబాద్‌ దగ్గర్‌ సంకెపల్లి గ్రామం. భీం కూలీ పనిచేస్తూ చదవడం రాయడంతో పాటు రాజకీయాల గురించి, గిరిజనుల తిరుగుబాటు గురించి తెలుసుకున్నాడు.

ఆ సందర్భంలో ఒక తిరుగుబాటు లో పాల్గొని నిర్బంధం నుంచి తప్పించుకొని చాందా మీదుగా కాకన్‌ఘట్‌ చేరి అక్కడి నుంచి చిన్నయనల వద్దకు వచ్చాడు. వారు పడిన అవస్థలు దోపి డిల గురించి విన్న భీం చలించి పోయి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆ సంద ర్భంలో వారికి నమ్మకమైన మనిషి లోటును తీర్చేందుకు ముందుకు వచ్చా డు. అడవి మనది, పోడు మనది, పంట మనది, అని భీం ప్రకటించాడు. ఆసిఫాబాద్‌ అడవుల్లో నెైజాం సైన్యానికి, భీం సైన్యానికి మధ్య దాదాపు 7 నెలల యుద్దం జరిగింది. చివరి సారిగా నెైజాం వాళ్లు 300లకు పెైగా సైన్యం భారీ మందుగుండు సామాగ్రి, వెైద్య బృందం తో తహసిల్దార్‌ న్యాయకత్వంలో దీపావళి మా సపు పున్నమి రోజున జోడేఘాట్‌ ఎక్కారు. 5 గంటల హోరాహోరి పోరు జరిగింది.

ఆ సమయంలో గుండి గూ డెం నివాసి మడావి పొద్దు పటేల్‌, నెైజాం సైన్యానికి భీంను చూపించ గా సైన్యం అతనిని కాల్చి చంపింది. భీం మరణిం చిన తర్వాత 12 గ్రామాల ప్రజలు చెల్లా చెదురయ్యారు. నెైజాం సామం తరాజుకు వ్యతిరేకంగా భీం న్యా యకత్వంలో గోండ్‌లు జరిపిన సాయుధ తిరుగుబాటు 1940నాటికి అణిచి వేయబడింది. భీం న్యాయకత్వం లో గిరిజనులు పోలీసులకు ఎదురొడ్డి నిలి చిన సంఘటన నిజాం ప్రభువును కదిలిం చింది. వారి సమస్యలను పరిష్కరించేందుకు కావాల్సిన సదుపాయాలు కల్పించేందుకు వారి జీవన విధానం పెై పరిశోధన చేసి నివేదిక సమర్పించాలని ఇంగ్లాండ్‌కు చెందిన సామాజిక శాస్త్ర వేత్త ప్రోఫెసర్‌ హేమన్‌డార్ఫ్‌ ఆయన సతీమణిని నిజాం ప్రభుత్వం నియమించింది. ఆయన గిరిజనుల్లో ఒక్కడెై గిరిజనుల జీవన విధానాలు వారికి కావాల్సిన పథకాలను సూచిస్తూ ప్రభుత్వానికి నివేధిక సమర్పించారు. నేడు జిల్లాలో జరుగుతున్న అభివృద్ది ఆనాటి కొమరంభీం త్యాగ ఫలమే. భీం వర్థంతి సభను దీపావళి పున్నమి రోజున జోడేఘాట్‌లో నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా ప్రభుత్వం అక్కడ ప్రజా దర్బార్‌ను ఏర్పాటు చేసి గిరిజనుల సమస్యలను తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు.

Monday, November 1, 2010

తడి ఆరని ఈశాన్య సౌందర్యం .. .. చిరపుంజీ

Cherrapunji1మేఘాలయా రాష్ట్ర రాజధాని షిల్లాంగ్‌కు 56 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిరపుంజీ ఓ అందమైన ప్రకృతి నిలయం. అంతర్జాతీయ భౌగోళిక గుర్తింపు పొందిన ప్రదేశం... సంవత్సరమంతా సగటున వర్షించే మేఘాలు ఇక్కడి కొండల చాటున పచ్చని తివాచీని పరుచున్నట్లుంటాయి. ఈ ప్రాంతం పర్యాటకులకు స్వర్గధామంగా... ఓ అందమైన అనుభూతిని కలిగిస్తుంది. దాదాపు ప్రతిరోజూ వర్షం కురిసే ఈ ప్రాంతంలో మేఘాలు ప్రసవానికి సిద్ధమైన నిండు చూలాలులా హఠాత్తుగా వర్షిస్తుంటాయి. సముద్రమట్టం నుంచి దాదాపు 1300 మీటర్ల ఎత్తులో ఉండే ఈ ప్రాంతంలోనే దేశంలో అత్యధికంగా వర్షం పడే ప్రాంతంగా పేరు సంపాధించిన మాసిన్రామ్‌ ఉండడం విశేషం. దాదాపు ఓ చిన్న పట్టణంగా విరాజిల్లుతున్న ఈ ప్రదేశం ప్రకృతి శోభను సొంతం చేసుకున్న కొత్త పెళ్లి కూతురిలా మనసుల్ని ఇట్టే కట్టి పడేస్తుంది. దట్టమైన మేఘాల అంచుల్ని మనం అక్కడ చేతులతోనే తాకవచ్చన్నట్లుంటాయి. ప్రకృతిని ఇంత దగ్గరగా చూడవచ్చా అనిపించేలా ఉంటుంది ఇక్కడి అందమైన వాతావరణం... కలుషిత, శబ్దకాలుష్య వాతావరణానికి దూరంగా ప్రకృతి రమణీయ దృశ్యాల అనుభూతులను మాటలతో వర్ణించలేము... ఒక్కసారైనా వెళ్లి అక్కడి సహజందాల సౌందర్యాన్ని వీక్షించిరావలసిందే...

Presbyterian-Churchచిరపుంజీ ని చిర్రాపుంజి అని కూడా పిలుస్తారు. ఇది మేఘాలయాలోని తూర్పు ఖాశీ హిల్స్‌ జిల్లాలోని ఒక ముఖ్య పట్టణం. భూమి మీద అతి తేమగా ఉండే ప్రదేశంగా ఇది ఖ్యాతిగాంచింది. అయితే ఇప్పుడు దీనికి సమీపంలో ఉండే మాసి న్రామ్‌ అత్యధిక వర్షపాతం ఉంటోంది. చిరపుంజీ అసలు పేరు సొరా, దీన్ని చురా అని బ్రిటిష్‌ వారు పిలిచేవారు. కాలక్రమేణా అది చిరపుంజీగా మారింది.

సంవత్సరమంతా... పర్యాటక శోభ: షిల్లాంగ్‌ నుంచి చిరపుంజీ ప్రాంతానికి పయనమైన వారికి చుట్టూ
నిలుచున్న పర్వతాలు అత్యంత మధురానుభూతిని కల్గిస్తాయి. ఘాట్‌ రోడ్‌లో సాగే ఈ ప్రయాణంలో చుట్టూ ఉన్న ఎతె్తైన పర్వతాలు చూస్తూ వాటినుంచి జాలువారే జలపాతాలను తన్మయత్వంతో తిలకించవచ్చు. చిరపుంజీ ప్రాంతం దాదాపుగా లైమ్‌ రాతి గుహలతో నిండి ఉంటుంది. ఇక్కడ ఉన్న విశేషాల్లో పురాతన ప్రెస్బిటేరియన్‌ చర్చి, రామకృష్ణ మిషన్‌ లాంటి వాటిని దర్శించవచ్చు. దగ్గర్లో ఉన్న మాసిన్రామ్‌ ప్రాంతంలో ఏర్పడిన సహజ శివలింగ రూపం పర్యాటకులను ఆకట్టుకుంటుంది.

ఈ శివలింగాన్ని స్థానికులు మావ్‌ జింబుయిన్‌గా వ్యవహరిస్తారు. చిరపుంజిని దర్శించాలనుకునే పర్యాటకులు షిల్లాంగ్‌ నుంచి పయనించాల్సి ఉంటుంది. షిల్లాంగ్‌ చుట్టు పక్కల ఉన్న ప్రదేశాల్లో కేవలం చిరపుంజి మాత్రమే పర్యాటక ప్రదేశం కాదు. షిల్లాంగ్‌ చుట్టు పక్కల అనేక పర్యాటక ప్రదేశాలున్నాయి. దాదాపు ప్రతిరోజు టూరిస్టులతో సందడిగా ఉండే షిల్లాంగ్‌లో మ్యాజియం ఆఫ్‌ ఎంటోమాలజీ అనే సీతాకోక చిలకల పార్క్‌ పర్యాటకులను మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. ఇక్కడ మేఘాలయలో కన్పించే అన్ని రకాల సీతాకోక చిలకలతో పాటు అంతరించిపోతున్న కొన్ని జాతుల సీతాకోక చిలకల్ని కూడా పరిరక్షిస్తుంటారు. దేశంలోనే ఓ ప్రముఖ హిల్‌ స్టేషన్‌గా ఉన్న షిల్లాంగ్‌ కేవలం పర్యాటకులకే కాక సినిమా షూటింగ్‌లకు కూడా అనువైన ప్రదేశం.

Cherrapunji3అధిక వర్షపాతం ఉన్నా... తాగునీటికి ఇబ్బందే: నిత్యం వర్షాలు పడ్డా కూడా, చిరపుంజీ తాగు నీటి సమస్యను ఎదుర్కొంటోంది. ఇక్కడ వారు తాగునీటి కోసం ఎన్నో మైళ్లు వెళ్లాల్సి ఉంటుంది. అడవులు భారీగా ఆక్రమణకు గురికావడంతో, విస్తారంగా పడే వర్షాల కారణంగా, మట్టిపైపొరలు కొట్టుకుపోయాయి. దాంతో ఈ అడవుల్లో నీటిపారుదలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. మేఘాలయా రాష్ట్ర ప్రభుత్వం చిరపుంజీకి సోహ్రా అన్న స్థానిక పేరును తిరిగి పెట్టడానికి నిశ్చయించుకుంది. చిరపుంజీలోని స్మశానవాటికలో డేవిడ్‌స్కాట్‌ (1802-31 వరకు ఈశాన్య భారతానికి సంబంధించిన బ్రిటిష్‌ అధికారి) కు సంబంధించిన స్మారక చిహ్నం ఒకటి ఉంది.

భూగోళ రహస్యం: బంగ్లాదేశ్‌ ముఖంగా ఉన్న ఖాసీ కొండల దక్షిణ కొనకు చిరపుంజీ ఉంది.
బంగాళాఖాతం నుంచి వీచే రుతుపవన గాలులు ఈ కొండశిఖరాలను తాకడం వల్ల చిరపుంజీలో భారీ వర్షాలు కురుస్తాయి. అందుకే ఇది చిత్తడి వాతావరణానికి పుట్టినిల్లుగా భాసిల్లుతోంది. చిరపుంజీలో ఈశాన్య, నైరుతీ రుతుపవనాల నుంచి వర్షాలు కురవడంతో, ఇక్కడ రెండూ కలిసి ఒకే ఒక రుతుపవన కాలంగా ఉంటాయి. ఇది ఖాసీ కొండల నుంచి వీచే గాలులకు వ్యతిరేక దిశలో ఉంటుంది. ఒరనోగ్రాఫిక్‌ భావన కారణంగా రుతుపవన గాలులు అధిక సంఖ్యలో తేమను నిక్షిప్తం చేస్తాయి. శీతాకాలంలో బ్రహ్మపుత్ర వ్యాలీ గుండా ప్రయాణించేఈశాన్య రుతుపవనాల వల్ల ఇక్కడ వానలు పడతాయి. ఒక సంవత్సర కాలంలో గరిష్ట వర్షపాతానికి సంబంధించి చిరపుంజీ పేరిట రెండు గిన్నిస్‌ రికార్డులున్నాయి. ఒక ఏడాది కాలంలో ఆగస్టు 1860 మరియు 1861జులై మధ్య, అదే విధంగా ఒక నెల వ్యవధిలో జులై 1861లో గరిష్ట వర్షపాతం నమోదు కావడంలో ఈ రెండు రికార్డులకు గిన్నిస్‌లో స్థానం దక్కింది.

Ramakrishna-Missionభారీ వర్షపాతానికి కారణం ఇదే: చిరపుంజి భారత వేసవి ఋతుపవనాలు... బంగాళాఖాతం నుండి వర్షాలను అందుకుంటుంది. రుతుపవన మేఘాలు బంగ్లాదేశ్‌లోని పర్వతసానుల గుండా ఎలాంటి అడ్డంకులు లేకుండా సుమారు నాలుగువందల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. ఆ తరువాత అవి ఖాసీ పర్వతాలను ఢీకొంటాయి. రెండు నుంచి ఐదు కిలోమీటర్ల పరిధిలో ఇవి అనూహ్యంగా సముద్రమట్టానికి 1370మీటర్లు ఎత్తు పెరగడమే దీనికి కారణం. భౌగోళిక పరంగా లోతైన లోయలుండటంతో బాగా దిగువకు ప్రయాణించే మేఘాలు (150 నుంచి 300 మీటర్లు) చిరపుంజీ మొత్తం పరుచుకుంటాయి. ఆ గాలులు వర్షాల మేఘాలను ద్రోణివైపు లేదా నునుపైన తలాల వైపుకు నెడతాయి. మేఘాలు వేగంగా పైకి పోతుండటంతో పైన వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి.

అంటే పై భాగాలు చల్లబడతాయి. ఫలితంగా నీటిభాష్పాలు ద్రవీభవిస్తాయి. చిరపుంజీలో కురిసే వర్షాల్లో అధిక శాతం వర్షాలు, గాలి పెద్దమొత్తంలో నీటి భాష్పాలుగా మారడం వల్లనే సంభవిస్తాయి. ఇక అతి పెద్ద మొత్తం వర్షాలు పడటానికి కారణం, బహుళా అందరికీ తెలిసినదే. అదే ఈశాన్య రాష్ట్రాల్లో కురిసే ఒరోగ్రాఫిక్‌ వర్షాలు. చిరపుంజీలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు సంభవిస్తే మిగిలిన ప్రాంతాలు వర్షపాతంలో తీవ్ర వ్యత్యాసాలు చూపిస్తూ, పూర్తిగా పొడిగా ఉంటాయి. రుతుపవనాల కాలం క్రియాశీలకంగా ఉన్న రోజుల్లో వాతావరణంలో తేమ గరిష్ఠంగా ఉంటుంది. చిరపుంజీలో అత్యధిక శాతం వర్షం కురవడానికి, ఒరోగ్రాఫిక్‌ లక్షణాలే కారణమని చెప్పవచ్చు. దక్షిణం పక్క నుంచి వచ్చే మేఘాలు ఈ కొండల మీదగా ప్రయాణించినప్పుడు ఇవి లోయ మొత్తం విస్తరిస్తాయి. ఈ మేఘాలు చిరపుంజీ కొండలను నిట్టనిలువుగా ఢీకొట్టినప్పుడు దానికి దిగువన ప్రయాణించే మేఘాలు నునుపైన వక్రతలాల్లోకి నెట్టబడతాయి. ఖాసీ కొండల నుంచి గాలి నేరుగా వీస్తున్నప్పుడు భారీ వర్షాలు కురవడంలో ఆశ్చర్యం అనిపించదు.

రాత్రిపూటే... ఎక్కువ :  చిరపుంజీలో కురిసే రుతుపవన వర్షాల్లో అత్యధికం ఉదయం పూటే కురవడం విశేషం.

రెండు రకాల గాలులు ఒకేసారి రావడమే దీనికి కారణం. రుతుపవన కాలంలో బ్రహ్మపుత్ర లోయ నుంచి వీచే గాలులు సాధారణంగా తూర్పు నుంచి ఈశాన్యం వైపుకు వీస్తాయి. కానీ మేఘాలయా నుంచి వీచే గాలులు దక్షిణవైపు నుంచి గాలులు వీస్తాయి. ఈ రెండు రకాల గాలు ఖాసీ కొండల సమీపంలో దగ్గరకు వస్తాయి. ఈ కొండల్లో రాత్రివేళ చిక్కుకున్న గాలులు అవి వేడెక్కిన తరువాత ఉదయం వేళ, పైకి లేవడం ప్రారంభిస్తాయి. ఇది ఉదయం వేళ మాత్రమే వానలు కురవడానికి గల కారణాన్ని పాక్షికంగా వివరిస్తుందని చెప్పవచ్చు. ఒరోగ్రాఫ్‌ లక్షణాల కారణంగా వాతావరణంలోనా మార్పులు కూడా రుతుపవన కాలంలో జరిగే మార్పులో కీలక పాత్ర పోషిస్తాయి. సీజన్‌ మొత్తం ఇదే విధంగా కొనసాగుతుంది.

మాతృపాలన: చిరపుంజీలో నివసించే స్థానికులను ఖాసీలంటారు. వీరిలో మాతృవంశ పాలన ఉం
టుంది. పెళ్లి తరువాత భర్త జీవించడం కోసం భార్య వెంబడి ఆమె ఇంటికి వెళతాడు. పుట్టిన పిల్లలు తల్లిపేరును ఇంటిపేరుగా పెట్టుకుంటారు. చిరపుంజీ లివింగ్‌ బ్రిడ్జ్‌కు పెట్టింది పేరు. ఎన్నో వందల సంవత్సరాల నుంచి చిరపుంజీవాసులు చెట్ల వేళ్లనే బ్రిడ్జిలుగా మార్చే విధానాన్ని అభివృద్ధి చేశారు. వీటిని బ్రిడ్జిలుగా మలచడానికి పది, పదిహేను సంవత్సరాలు పడుతుంది. అయితే ఇవి వందల సంవత్సరాల పాటు ఉంటాయి. ఇప్పటికీ ఉపయోగిస్తున్న ఒక పురాతన బ్రిడ్జి వయస్సు 500 ఏళ్లు ఉంటుందని భావిస్తున్నారు.

రవాణా సౌకర్యాలు:  షిల్లాంగ్‌ చేరుకోవాలనుకునే వారికి సమీపంలోని గౌహతి ప్రధాన కేంద్రం. ఇక్కడే విమానాశ్రయం, రైల్వే స్టేషన్‌ ఉంది. గౌహతి చేరుకుని అక్కడినుంచి షిల్లాంగ్‌ వెళ్లాల్సి ఉంటుంది. గౌహతినుంచి షిల్లాంగ్‌ వెళ్లే వారికోసం మేఘాలయా ప్రభుత్వం హెలికాప్టర్‌ సౌకర్యాన్ని సైతం అందుబాటులో ఉంచింది. అలాగే మేఘాల యాలోని ఏ ప్రాంతానికి చేరుకున్నా అక్కడినుంచి రాజధాని ప్రదేశమైన షిల్లాంగ్‌కు బస్‌ సౌకర్యం ఉంది.

అటవీ అందం... పులుకు ఆలవాలం... పెంచ్‌ నేషనల్‌ పార్క్‌

Pench-National-Park1
దేశంలో ఉన్న పులు సంరక్షణా కేంద్రాల్లో ఎంతో ప్రఖ్యాతిగాంచింది... మధ్యప్రదేశ్‌లోని పెంచ్‌ వైల్డ్‌లైఫ్‌ శాంక్చురీ. ఈ జాతీయ పార్క్‌ను ఇందిరా ప్రియదర్శిని పెంచ్‌ నేషనల్‌ పార్క్‌గా పిలుస్తారు. మధ్య భారతంలోని సాత్పురా పర్వత శ్రేణికి దక్షిణ దిశలోని వాలు ప్రాంతంలో పెంచ్‌ పార్క్‌ ఉంది. ఈ జాతీయ వనంలో అనేక కాల్వలు, నాలాలు ప్రవహిస్తుడడంతో ఎప్పుడూ పచ్చదనంతో అలరాతుంది. ఈ పార్క్‌లో అతిఎతె్తైన ప్రాంతం కాలపహార్‌. ఇది సముద్ర మట్టానికి 650 అడుగుల ఎత్తులో ఉంది. పెంచ్‌ నది ఈ పార్క్‌ గుండా ప్రవహిస్తుంది. పులులతో పాటుగా అనేక జంతువులకు ఈ పార్క్‌ ఆలవాలంగా ఉంది. పార్క్‌లో ఐదు చోట్ల నిరంతరం ప్రవహించే జలపాతాలు కనువిందు చేస్తాయి. పెంచ్‌ పార్క్‌ను పులుల సంరక్షణా కేంద్రంగా 1977లో ప్రకటించారు.

Pench-National-Park
ఈ పార్క్‌ వైశాల్యం 449.39 చదరపు కి.మీ. 1983లో ఈ పార్క్‌ను జాతీయం చేశారు. దేశంలో 19వ పులుల సంరక్షణా కేంద్రం పెంచ్‌. పెంచ్‌ నదిపై జల విద్యుదుత్పత్తి కేంద్రాన్ని 1977-1988 సంవత్సరాల మధ్య నిర్మించారు. పెంచ్‌ పార్క్‌లో 1200 రకాల వృక్షాలు ఉన్నాయి. ఇందులో కొన్ని ఔషధ గుణాలు కలిగినవి ఉన్నాయి. దేశంలో అత్యధికంగా జంతువులు నివసిస్తున్న జాతీయ సంరక్షణా కేంద్రం పెంచ్‌. ఇక్కడ ప్రతి చదరపు కిలోమీటర్‌లో 90.3 జంతువులు నివశిస్తున్నాయి. ఈ పార్క్‌లో జీపులో తిరిగే అవకాశంతో పాటుగా, ఏనుగు సవారీ, పెంచ్‌ రిజర్వాయర్‌లో బోటింగ్‌, పెంచ్‌ నదిలో రివర్‌ రాఫ్టింగ్‌ వంటి సదుపాయాలు ఉండటం విశేషం. ఫిబ్రవరి నుండి జూన్‌ వరకు ఈ పార్క్‌లో పర్యాటకుల సందడి ఎక్కువగా ఉంటుంది. వర్షకాలంలో (జులై1 నుండి సెప్టెంబర్‌30) ఈ పార్క్‌ను మూసివేస్తారు. అక్టోబర్‌ నుండి ఇక్కడి తిరిగి సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.

ఎలా చేరుకోవాలి...
ఈ ప్రాంతానికి దగ్గరి విమానాశ్రయం నాగపూర్‌. ఇక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా 92 కిమీలు ప్రయాణిస్తే... పెంచ్‌ పార్క్‌కు చేరుకోవచ్చు. అలాగే రైలు మార్గం ద్వారా వచ్చే ప్రయాణీకులు సియోనీ (60 కిమీ), నాగపూర్‌ (92 కిమీ), జబల్‌ పూర్‌ (195 కిమీ) రైల్వే స్టేషన్‌ల నుండి చేరుకోవచ్చు.

ప్రకృతి అందాల నిలయం ఫోఖారా

pokhara
పర్యాటక రంగం అనగానే మనకు గుర్తుకు వచ్చేది హిమలయ పర్వాతాలే. హిమలయ పర్వాతాలను ఆనుకుని ఉండే నేపాల్‌ అందాలను చూడడానికి పర్యాటకులు ఎక్కువగా ఆసక్తి కనపరుస్తుంటారు. నేపాల్‌ వెళ్లి న వారికి ఎప్పుడెప్పుడు వెళ్లి చూద్దామా అనిపించే ప్రాంతం పోఖారా. నేపాల్‌లోని అత్యంత పవిత్ర పర్వతం అన్నపూర్ణ పర్వతం. ఆ పర్వత ప్రాంతంలోనే ఉంది ఫోఖారా. ఇక్కడి మత్య్సపుత్స పర్వతం చూడడం ఒక వింతైన అనుభవం. చేపతోక ఆకారంలో ఆ పర్వాతాలు కనిపిస్తాయి. వేకువజామునే లేచి సూర్యోదయ కిరణాల వెలుగులో అన్నపూర్ణ పర్వత అందాలను తిలకిం చడం మరవలేని అనుభూతిని మిగుల్చుతాయి.

సూర్యుని తొలి కిరణాలకు వెలుగులు ప్రారంభించి సమయంతో పెరిగే సూర్యకిరణాలకు తగిన రీతిలో వెలుగులు విరాజిమ్మే ఆ శిఖరాలను దర్శించిన తర్వాతే మిగిలిన ప్రదేశాలవైపు కళ్లు తిప్పగలం. ఫోఖారాలో ఉన్న ఒక గుహ ప్రత్యేకమైనది. ఇది గుప్తేశ్వరమహాదేవుని నిలయం. దాదాపు 140 మీ పొడవున్న గుహ అది. ఆ గుహనుంచి ప్రయాణిస్తూ బయటకు చేరుకోగానే పాల రంగులో పడుతున్న జలపాతం దర్శనమిస్తుంది. దాని పేరు దేవీజల పాతం. హిమలయాలనుంచి జారిపడే అనేక జలపాతాలలో ఇది అందమై నది. ఇక్కడికి సమీపంలో ఉన్న ఫేవా సరస్సులో పడవులలో ప్రయాణిం చవచ్చు. ఎవరికి వారు నడుపుకుంటూ వెళ్లే పడవల సౌకర్యం ఇక్కడ ఉంది.

pokhara-davis
పర్వతాల మధ్య ప్రశాంతం గా ఉన్న సరస్సులో పడవ ప్రయాణం ఎంతో ఆనం దంగా ఉంటుంది. సూర్యోదయ సమయంలో అన్నపూర్ణ పర్వత ప్రాంతాల అందాలను అనుభ వించిన వారికి సూర్యస్తమయ సమయంలో ఆ అందాలను తిలకించాలని అనిపించడం సహ జం. ఆ మధురానుభూతిని తిలకించాలంటే శాంతి శిఖరం ఎక్కి తీరాల్సిందే.

ప్రపంచ శాంతిని కోరుతూ నిర్మించిన ఈ శిఖరం ఒక పర్వతం అంచున ఉంటుంది. అక్కడ నిలబడి పశ్చిమం వైపున తిలకిస్తుంటే సూర్యుడు ఎంతసేపటికీ కిందికి దిగుతున్నట్లు అనిపిం చదు. సూర్యుడు పర్వతాలోకి వెళ్లగానే ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా చీకటిగా మారుతుంది. ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా నిశ్శబ్దం రాజ్యమేలుతుంది.

మరో సాహసం అక్కడి పర్వాతాల మీద తేలికపాటి విమానంలో ఎగరటం. ఇది ఒక చిన్న తొట్టిలాంటి విమానం. అందులో నడిపే పైలెట్‌ కాక మరొకరు మాత్రమే కూర్చోగలరు. ఇది ఒక గ్లైడర్‌కు కలిపి ఉంటుంది. గ్లైడర్‌ అంటే ఎతె్తైన ప్రదేశం నుంచి కిందికి నెమ్మదిగా జారు కుంటూ వచ్చే రెక్కల వంటి నిర్మాణం. ఇది కూడా అదే పద్ధతిలో నెమ్మదిగా పర్వతాల మీద ఎగురుతూ కిందికి దిగుతుంది. ఇది మరువ లేని అనుభవం. బంగీజంప్‌ చేయడానికి కూడా ఇక్కడ సౌకర్యాలున్నాయి. ఇటీవల అనేక సినిమాల్లో ఇలాంటి సాహస దృశ్యాలను పెడుతు న్నారు. అయితే దీనికి కొంత గుండ ెధైర్యం కావాలి. మనం చేసే బంగీ జంప్‌ను చిత్రీకరించి అప్పటిికప్పుడే డీవీడిగా చేసి ఇచ్చే సౌకర్యం కూడా ఉంది. అక్కడి అనేక దృశ్యాలను కూడా డీవీడీల రూపంలో మనం తెచ్చుకోవచ్చు. వాటిని తిలకిస్తూ మధురానుభూతిని పొందవచ్చు.

సర్వాలంకార శోభితయ్తె వర్థిల్లుతున్న శ్రీ మహశక్తియే వరిగొండ శ్రీజ్వాలాముఖి

jwalamuki
ప్రస్తుతం ఆధ్యాత్మిక టూరిజం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటున్నది. హిమాలయాలు మొదలుకొని వివిధ ఆలయాలు, ఆశ్రమాలు ఇలా ఒకటేమిటి అనేక ప్రాంతాలను దర్శించేందుకు ప్రజలు మక్కువ చూపుతున్నారు. ఇహపరాలు రెండూ కలిసి వచ్చేలా వారు తమ పర్యటనలను రూపొందించుకుంటున్నారు. ఒక్క భారతీయులే కాదు ఈ దేశ మార్మికత, సంప్రదాయాలు పట్ల మోజు పెంచుకునే విదేశీయులు సైతం దేశంలోని పలు ఆధ్యాత్మిక క్షేత్రాలను దర్శించేందుకు మక్కువ చూపుతున్నారు. హిమాలయాలే కాదు అనేక మఠాలు, ఆలయాలు, ఆశ్రమాలలో కూడా వీరు కనుపిస్తున్నారు. అయితే ఇప్పటికే ప్రాచుర్యం పొందిన క్షేత్రాలే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాలలో స్థానికంగా ప్రాముఖ్యత సంపాదించుకున్న ఆలయాలు, ప్రదేశాలు అనేకం. ఈసారి అటువంటి క్షేత్రాన్నే పరిచయం చేస్తున్నాం....

jwalamuki2చాలామంది దేవతల చరిత్ర మాదిరే ‘శ్రీ జ్వాలాముఖి మహాదేవి’ జన్మ వృత్తాంతం తెలియజెప్పే చారిత్రక ఆధారాలు కానీ... ప్రశస్తిని ప్రకటించే స్థల పురాణాదులుగానీ ఏవీ లభ్యం కాలేదు. కానీ జనం నోట వినిపించే ‘జనశృతి’ మాత్రం విస్తృతంగా వుందనేది తెలుస్తోంది. కొన్ని వందల ఏండ్లకు పూర్వం ఒంగోలు సమీపానవున్న పెళ్లూరు సంస్థా నానికి... వెంకటగిరి రాజాలకు మధ్య వైషమ్యాలు ఏర్పడి, వైరంగా పరిణ మించాయి. వెంకటగిరి రాజ్య సైన్యశక్తిని ఎదుర్కొనే బలం పెళ్లూరు సంస్థానా నికి లేకపోవడంతో... అనుభవజ్ఞులు, మిత్రులను పెళ్లూరు వారు సలహా కోర డం జరిగింది. ‘మానవ శక్తి చాలనప్పుడు దైవశక్తిని ఆశ్రయించడం తప్ప చేయగలిందేమీ లేదనే’ శ్రేయోభిలాషుల సలహాల మేరకు, మంత్రశక్తితో మహా శక్తిని వశం చేసుకోవడానికి యజ్ఞం ప్రారంభించారు. ఖర్చుకు వెనుకాడక మహాయజ్ఞ నిర్వహణను చేపట్టారు. ఆ యజ్ఞం వలన మహాశక్తి ఉద్భవిస్తే మను గడ కష్టమవుతుందని భావించిన వెంకటగిరి రాజులు... క్షుద్ర పూజలు ద్వారా యజ్ఞానికి అంతరాయం కల్పించారు. సరిగ్గా ఆ సమయంలో హోమాగ్ని నుం చి ఉల్కలు ఉవ్వెత్తున రేగుతుండగా... ఆ ఉల్కలు, జ్వాలలు మధ్య అఖండ తేజస్సుతో... అరుణారుణ కాంతితో... అద్వితీయరూపంతో... ఆవిర్భవిం చింది ‘‘మహాశక్తి’’.

అయితే ఆవిర్భవించిన శక్తికి ఆహుతి, ఆహారం అందివ్వక పోవడం, పూర్ణహుతి సమర్పించి ప్రసన్నం చేసుకోకపోవడానికి అక్కడ ఎవ్వ రూ లేకపోవడంతో ఆగ్రహించిన మహాశక్తి చుట్టూ వున్న గ్రామాలను తన జ్వా లలతో దహించడం మొదలు పెట్టింది. ఆ ప్రాంతంలోనే పశువులు మేపుతున్న మంత్రవేత్త విషయాన్ని పసికట్టి తాను దాచుకున్న పాలకుండను మహాశక్తికి సమర్పించి శాంతింపజేశాడు. అంతటితో ఆ శక్తి అదృశ్యమయ్యింది. జరిగిన సంఘటనను తెలుసుకున్న అక్కడి గ్రామీణులు అన్ని వివరాలను తెలుసుకుని ఆ మహాశక్తిని ‘జ్వాలాముఖి’ అమ్మవారుగా గుర్తించి పూజించారు. అది మొద లు ఆయా గ్రామాలలో మంటలతోపాటు గ్రామీణుల ఈతి బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి అక్కడి వారంతా సుఖశాంతులతో తులతూగారు. ఈ విధంగా భక్తులకు ప్రత్యక్షమైన జ్వాలాముఖి తన అష్టాంశలును గురించి వివరిస్తూ... భక్తుల రక్షణార్థం తాను అష్టస్థానములందు వెలయగలనని ఆనతినిచ్చింది. ఆ ఆనతి ప్రకారమే ఏడు స్థానాలలో అవతరించిన ఆ మహాశక్తి శ్రీ జ్వాలాముఖి, ఎనిమిదవ స్థానంగా వరిగొండ గ్రామంలో అవతరించి నమ్మిన భక్తులను ఆదరిస్తోంది అన్నది ఒక కథనం.

jwalamuki1
వరిగొండ (వరికొండ) కథనం: మునుపు సింహపురి పట్టణానికి అంటే ప్రస్తుతం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు నగరానికి తూర్పున 10 కిలో మీటర్లు దూరంలో వరిగొండ గ్రామం ఉంది. పూర్వం ఆ గ్రామంలో మండలమ్మ అనే గ్రామ దేవత ఉండేదట, ఆ దేవత పేరునే ఆ ఊరు ‘మండలంపేట’ అని పిలువబడుతూ వుండేది. పాడి పంట లతో సశ్యశ్యామలంగా ఉండే ఆ గ్రామంలో వరికుప్పలు కొండలను తలదన్నే ట్లుగా ఉండడంతో వాటిని చూసి ముగ్ధుడైన ఎవరో ఒక ప్రబుద్ధుడు వరి + కొండల్లాగా వుండే ఆ ఊరికి వరికొండ అనే పేరు సార్థకమైనది అన్నాడట. ఆ మహనీయుని వాక్కు ప్రభావమేమోగానీ మండలంపేట వరికొండగా మారింది. క్రమంగా జనం నోళ్లలో ‘కొండ-గొండ’ అయి వరిగొండగా స్థిరపడిపోయిం దని ప్రతీతి. అయితే సంపన్న గ్రామమైన వరిగొండలో ప్రకృతి బీభత్సం వలన ఒకప్పుడు ప్రజలు.., జంతు జాలాలు భయంతో భీతిల్లాయి. పచ్చని పొలాలు చీడపీడలు పట్టి నశించడంమే కాక వింత వ్యాధులు, విషజ్వరాలు సంభవించ డంతో ప్రజలు విలవిలలాడిపోయారు. ఆ ఉపద్రవాన్ని నివారించి కాపాడమని దేవుళ్లు, దేవతలందరికీ ప్రజలు మొక్కుతున్న సమయంలో ఆ గ్రామ పెద్ద కలలో కనిపించి అవతరించింది శ్రీ మహాశక్తి.

ప్రజలను ఈతి బాధలనుంచి రక్షించి, వారి గుండెల్లో కొలువైంది. ఆనాటి నుంచి నేటి వరకూ సర్వాలంకార శోభితయై, భక్త వరప్రదాయినిగా వర్థిల్లుతూ... శ్రీ జ్వాలాముఖి అమ్మవారుగా కొనియాడబడుతోంది. ఆ తల్లి ప్రశస్తి, ప్రభావం, మహిమాన్వితశక్తి, నానాటికీ...ఆనోటా, ఈనోటా వరిగొండ ఎల్లలు దాటి చుట్టూ పట్టూ పల్లెలకు.., సమీప పట్టణాలకే కాక ఖండాంత రాలకు కూడా వ్యాపిస్తోంది.

దర్శనం తప్పని సరి: ఎంతటి కఠినాత్ములైనా.., దైవ దూషణ, దర్శన నిరాకరణ చేసే వారైనా శ్రీ జ్వాలాముఖి అమ్మవారుని తప్పక దర్శించడం విశేషం. అమ్మవారి పిలుపో, తలపో, మహిమో... మహాత్మ్యమో... ఏమో కాని ఆలయ పరిసరాలకు వె ళ్లిన ఎంతటి కసాయి, పాషాణ మనస్కులు కూడా ఒక్కసారైనా ఆమెను దర్శించి తరించాల్సిందే. అలా ఆమె పాదాల చెంతన చేరిన ఎందరినో ఆదరించడంతో పాటు వారిలోని మనో మాలిన్యాలను తొలగించి కోరిన వరాలను ఈడేర్చే తల్లిగా ప్రసిద్థికెక్కింది ఇక్కడి అమ్మవారు.

పోలీసుశాఖ బహుమానం: ఒకనాడు వేకువన అమ్మవారి తలుపులు బార్లా తెరచి వుండడంతో పూజారి హడలిపోయాడు. అమ్మవారి ముందు బోర్లాపడివున్న వ్యక్తిని చూసి ఊర్లోవాళ్లకు తెలపినాడు. గ్రామపెద్దతోపాటు ఊర్లోని వారంతా గద్దించి అడుగగా తాను ఆలయాల దొంగనని చెప్పాడు. ఎన్నో పేరు మోసిన ఆలయాలలో కూడా దొంగ తనం చేశానని, ఇంత శక్తి, పవిత్రత కలిగిన అమ్మవారుని తాను చూడలేదని వివరించాడు. ఆ తర్వాత పోలీసులకు అతన్నఇప్పగించారు. ఎంతో కాలంగా పోలీసుశాఖకు పెను సవాల్‌గా మారిన ఆ దేవళాల దొంగను సులభంగా పట్టించిన అమ్మవారుకు ‘ వెండి వడ్డాణం’ను బహు రించింది అప్పటి పోలీస్‌శాఖ.

మతసామరస్యానికీ వేదిక:హిందువులచేతే కాదు అన్య మతస్థుల చేత కూడా పూజింపబడుతుంది ఇక్కడ అమ్మవారు. వరి గొండ మజరా గ్రామమైన తట్టుగొల్లపాళెంలోని ముస్లింలు వ్యాపారాల నిమిత్తం అప్పట్లో భద్రా చలం వెళ్లేవారు. ఒక ఏడాది వారికి వ్యాపారం లో ఏదో అవాంతారాలు ఏర్పడి తీరని నష్టాలు సంభవించాయి. దీంతో కలత చెందిన వారు శ్రీ జ్వాలాముఖి అమ్మవారుని ధ్యానించి మొక్కుకున్నారు. వెంటనే ముస్లింల కష్టాలు తొలగిపోవడంతోపాటు వారి వ్యాపారాలు లాభాలతో వృద్ధినందుకున్నాయి. తమ జీవితాల్లో మార్పు గమ నించిన ముస్లింలు సొంత నిధులతో అమ్మవారి ఆలయం చుట్టూ ప్రాకారం నిర్మించారు. అది మొదలు ప్రతి ఏడాది అమ్మవారి దర్శనానికి ముస్లింలు రావడం పరిపాటిగా మారింది. ఇలా మతసామరస్యానికీ ఈ ప్రాంతం వేదికైంది.

జంతు బలులు నిషేధం: మునుపు ఉగ్రదేవతగా వున్న శ్రీ జ్వాలాముఖిని 1975వ సంవత్సరము తర్వాత పూర్తిగా మార్పు చేశారు. శ్రీ రాక్షసనామ సంవత్సరం జేష్టశుక్ల ఏకాదశి గురువారం నాడు జులై 19న శ్రీ వినాయక, నాగ ప్రతిష్ఠలతో కూడా దాత గూడూరు సుబ్బారెడ్డి, అప్పటి ఆలయ ధర్మకర్త నెల్లిపూడి జయరామిరెడ్డిల ఆధ్వర్యంలో అశేష జనవాహిని నడుమ విగ్రహ ప్రతిష్ఠ లు మహా వైభవంగా జరిగాయి. శ్రీ జ్వాలాముఖి అమ్మవారి నూతన శిలా విగ్రహ శ్రీచక్ర ప్రతిష్ఠాపన మహాకుంభాభిషేకమును శ్రీ జయేంద్ర సరస్వతిస్వామి స్వహస్తములతో జరిపించారు. అది మొదలు అమ్మవారు ఉగ్రదేవాతా రూపం నుంచి సౌమ్య - ప్రశాంత, ప్రసన్న దేవతగా పరిణా మం పొందింది. తదుపరి జంతు బలలు, రక్త బలులు నిషేధించబడి, సాత్విక నివేదనలు సమర్పించబడుతున్నాయి. నియమిత పద్ధతిలో పూజా కైంకర్య ములు జరుగుతున్నాయి. అనంతరం ఇక్కడి శ్రీ జ్వాలాముఖి ఆలయ ప్రదేశం ఎన్నదగిన యాత్రా స్థలంగా మారింది. ఆమె ప్రతిభ - ప్రాభవం, మహిమ - మహాత్మ్య ములు సుదూర ప్రాంతాలకు వ్యాపించాయి. శుక్ర, ఆదివారాల్లో ప్రత్యేక అలంకరణలతో నిండిన అమ్మవారు కళకళలాడు తోంటుం ది. ఆమె దివ్య దర్శనాన్ని దర్శించి తరించే భక్తులతో ఆలయ ప్రాంగ ణం కిటకిటలాడుతోంటుంది.

ఆలయానికి ఇలా చేరాలి: నెల్లూరు నుంచి ప్రముఖ పారిశ్రామిక కేంద్రంగా పేరొందుతున్న కృష్ణపట్నంకు వెళ్లే రహదారినుంచి కాకుపల్లి వద్ద రోడ్డును వీడి, తోటపల్లిగూడూరు రోడ్డున కిలోమీటరు దూరం ప్రయాణించగా వరిగొండ మజరా గ్రామమైన దేవళాలమిట్ట వస్తుంది. దేవళాలమిట్ట అనగానే ఈ ప్రదేశం దేవాలయాలకు ప్రసిద్ధి అనేది ఆట్టే తెలసిపోతుంది ఎవ్వరికైనా!. దేవళాలమిట్టలో రోడ్డుకు ఉత్తర దిక్కున ఇరువైపులా లక్ష్మీ, సరస్వతుల విగ్రహములు... గజరాజుల రంగు రంగుల ప్రతిమలతో అలంకృతమైన పెద్ద గేటు కనిపిస్తుంది. లోపలికి వెళ్తే పచ్చని పంటచేల మధ్య సువిశాల మైదానంలో ఒక పెద్ద ఊడల మర్రి, దాని మొదట్లో ఒక మహావాల్మీకం ( పుట్ట) ఉన్నాయి. పశ్చిమవైపున విఘ్నేశ్వనిగుడి, దానికి అటు ఇటు కొద్ది దూరంలో తూర్పు ముఖమై సరస్వతిగుడి - నాగుల గుడి వున్నాయి. వినాయకుని గుడికి ఎదురుగా మహాద్వారా ప్రాకార కళా మండపం, ధ్వజస్థంభం, శిల్ప కళా విరాజిత సింహద్వార శాఖా విరాజితమైన శ్రీ జ్వాలా ముఖి ఆలయం ఉంది.
- తాళ్ళూరు వేంకటరమణ, పెళ్లూరు నాగార్జున
తోటపల్లిగూడూరు,
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా.