విహారాలు

India

Gamyam

Saturday, September 25, 2010

ప్రపంచ అద్భుతాలలో ఒకటైన బృహదీశ్వర ఆలయం * దక్షిణ భారత శిల్ప సౌందర్యం బృహదీశ్వరాలయం

ఇది ఆలయం కాదు విశ్వవిద్యాలయం

తమిళనాడు ఆలయాలలో తమిళ భాష వినిపించకుండా పోయిన రోజుల్లో... ముఖ్యమంత్రి కరుణానిధి చొరవ తీసుకుని రాష్ట్రంలోని ఆలయాల్లో తమిళ ప్రార్ధలను పునరుద్ధరించారని, అలా తంజావూరు కేంద్రంగా దక్షణాదిని పాలించిన రాజరాజచోళుని అభిమతాన్ని కరుణానిధి నెరవేర్చారు.
బృహదీశ్వరాలయం సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా .. తమిళ సంప్రదాయానికి, కళా, సాహిత్యాలకు చోళరాజుల సేవలను గుర్తు చేసుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా తంజావూరులోని తమిళ విశ్వవిద్యాలయం ఈ సదస్సును నిర్వహించింది.  క్రీ.శ.985లో అధికాంలోకి వచ్చిన రాజరాజచోళుడు అనతికాలంలోనే చక్రవర్తులకు చక్రవర్తిగా ఎదిగాడు.

ఆయన పాలనలో తమిళ భూభాగం ఎన్నోవిధాలా అభివృద్ధి చెందిందనీ, నిజానికి ఆయన ఓ సింహమనీ అన్నారు. పరిపాలనాదక్షుడైన రాజ రాజచోళుని కాలంలో రాజ్యం అన్నివిధాలా అభివృద్ది చెందిందన్నారు. ఆ కాలంలోనే ఇక్కడ జైనమతం కూడా వృద్ధి చెందిందనీ, సమాజం సమతౌల్యంగా ఉండేదని అన్నారు. 1003లో ప్రారంభమైన ఆలయ నిర్మాణం 1010లో పూర్తయిందన్నారు.

ఇలా గత వేయి సంవత్సరాలుగా సమున్నతంగా నిలిచివున్న ఈ ఆలయ నిర్మాణం, శిల్పకళా వైవి«ధ్యం ఇప్పటికీ అపురూపమేనన్నారు. ఆలయ నిర్మాణ సారధి వీరచోళన్ కుంజరమాలన్ రాజరాజ పురంద చోళన్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ ఆలయమే ఓ విశ్వవిద్యాలయమనీ, ఇక్కడ నృత్య, సంగీత, సాహిత్య, చిత్రలేఖనం, నాటకం వంటి అన్ని కళారంగాలు విలసిల్లాయన్నారు. అంతకు ముందు బృహదీశ్వ రాలయానికి సంబంధించిన పెయింటింగ్స్‌తో రూపొందించిన ఓ పుస్తకాన్ని  ఆవిష్కరిచారు.

అలరిస్తున్న కళారూపాలు...
బృహదీశ్వరాలయం సహస్రాబ్ధి ఉత్సవాల సందర్భంగా ఐదు రోజుల పాటు నిర్వహించనున్న వివిధ కళరూపాలు సందర్భకులను అలరిస్తున్నాయి. 26వ తేదీన ముగుస్తున్న ఈ ఉత్సవాల్లో భాగంగా శనివారం దేశ, విదేశాలకు చెందిన మొత్తం వేయి మంది కళాకారులు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నర్తకీమణి డాక్టర్ పద్మాసుబ్రమణ్యం సంగీతం సమకూర్చారు.

భరతనాట్య శాస్త్రాచార్యుడు భరతముని తెలిపిన 108 కరణ శిల్పాల్లో ఈ ఆలయంలో 81 శిల్పాలున్నాయి. బిగ్‌టెంపుల్ వేయి వసంతాల వేడుకలో భాగంగా తంజావూరునగరం అంతా పండుగ వాతావరణం కనిపిస్తోంది. ప్రభుత్వం కోట్లాది రూపాయలతో ఆలయానికి మరమ్మతులు చేయిడమే కాక, రూ. 25 కోట్ల వ్యయంతో పట్టణంలో కూడా సౌకర్యాలను మెరుగు పరిచింది.

పందిళ్లు, మామిడాకు తోరణాలు, పూల హారాలు, విద్యుత్ దీపాలంకరణలతో తంజావూరు వెలుగులు విరజిమ్ముతోందని పలువురు సందర్శకులు అభిప్రాయపడ్డారు.
విదేశీ పర్యాటకులను అబ్బుర పరుస్తున్న తంజావూరు బృహదీశ్వరాలయం
'మా కళ్లను మేమే నమ్మలేకున్నాం, ఇటుక, కలప లేకుండా ఇంత పెద్ద ఆలయమా? ఈ క్షేత్రంలోని ప్రతి శిల్పంలోనూ జీవం ఉట్టిపడుతోంది. యంత్రాలు, ఆర్కిటెక్చర్లు, ప్లాన్లు, రోడ్లు అందుబాటులో లేని రోజుల్లో రాళ్లకు ప్రాణం పోశారేమోననిపిస్తోంది. నిజం గా మహాద్భుతం...' అంటూ విదేశీ పర్యాటకులు పరవశించిపోయారు. తమ జీవితంలో ఈ అనుభూతి మరువలేనిదంటూ కొనియాడారు. తంజావూరు పట్టణంలో రాజరాజ చోళ చక్రవర్తి వెయ్యేళ్ల క్రితం నిర్మించి, పూజలు చేసిన బృహదీశ్వరాలయ సహస్రాబ్ది ముగిం పు ఉత్సవాల్లో పాల్గొనేందుకు వందలాది మంది విదేశీ పర్యాటకులు ప్రస్తుతం తంజావూరు వచ్చారు.

అక్కడ ప్రపంచ అద్భుతాలలో ఒకటైన బృహదీశ్వర ఆలయాన్ని సందర్శించారు. ఇక్కడి కళాకృతులను, ఆల య ప్రాశస్త్యాన్ని, పుస్తకాలు, ఇంటర్నెట్ ద్వారా తెలుసుకున్న వారు ప్రత్యక్షంగా చూసి పులకించారు. ఆలయం ఎత్తు, వెడల్పు, పొడవు చూస్తుంటే, పూర్తిగా ఒండ్రుమట్టితో నిండిన ఆ ప్రాంతానికి ఇన్ని బండరాళ్లు ఎక్కడి నుండి వచ్చాయి. ఏ వాహనా ల్లో ఎక్కించి ఇక్కడికి తరలించారు. ఎం త మంది, ఎన్ని రోజులు శ్రమించారు.
ఈ బండరాళ్లను శిల్పాలుగా మలచేందుకు ఎటువంటి పనిముట్లు ఉపయోగించారు? ఇనుముతో తయారైన ఉలి తో శిల్పం చెక్కితే ఆ ఇనుమును పదు ను చేయగల హీట్ ట్రీట్‌మెంట్ వారికి తెలుసుండాలి. వేడిచేసిన ఇనుమును నీటిలోనో, నూనెలోనో ముంచి ఉండా లి. కణకణమనే నిప్పుల్లో కాలిన ఇను ము నూనెలో ముంచె కళ వెయ్యేళ్ల క్రిత మే వాడుకలో ఉందా? ఆలయ నిర్మాణంలో పాల్గొన్న కార్మికులు, కళాకారు లు ఎంతమంది, వారికి భోజనం, బియ్యం, కూరగాయలు ఎలా సేకరించారు, వంట పాత్రలెన్ని, కాలకృత్యాలు తీర్చుకునేందుకు మరుగైన స్థలాన్ని ఏర్పాటు చేశారా, మనుష్యులకు సా యంగా, ఏనుగులు, పశువులు, గు ర్రాలు, గాడిదలు ఉన్నట్లయితే వాటికి మేత, పోషణ చూసుకున్న వారెందరు.

వారంతా పురుషులేనా, ఆలయ నిర్మాణంలో మహిళలు కూడా పాలుపంచుకున్నారా? ఊహకందని ఇలాంటి అనుమానాలు రావడంతో ఆ విదేశీయులు ముక్కున వేలేసుకున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే, గుడిలో కొలువుదీరిన రాతి ప్రతిమలు, ఒక రాతితో చెక్కిన 36 అడుగుల ఎత్తు స్థూపం, వేయి టన్నుల బరువుతో ఉన్న కొండరాళ్లను వందలాది మైళ్ల నుండి ఇక్కడికి ఎలా తరలించగలిగారు.

ఆలయ నిర్మాణం పనులు పూర్తయ్యాక దాని నిర్వాహక మెవరికి అప్పగించారు? ఇలాంటి వివరాలతో శిలాఫలకాలుంటాయేమోనని ఆలయం, ఆ పరిసరప్రాంతాలు మొత్తం వెదికారు. భారత పురావస్తుశాఖ నిపుణులే చెప్పలేని సమాధానం. వివరించజాలని శక్తికి, దైవానికి, తనవల్ల చేతనైన గుర్తుగా నిర్మించాడు ఆ చోళచక్రవర్తి. ఆ మరచిపోలేని గుర్తే బృహదీశ్వరాలయం.
ఈ ఆలయాన్ని అక్కడ శిల్ప సౌందర్యాన్ని, కొలువైవున్న వింతలను దర్శించుకున్న విదేశీయుల బృందాలు ధన్యులమయ్యామని ముక్త కంఠఃతో వ్యాఖ్యానించారు.
దక్షిణ భారత శిల్ప సౌందర్యం బృహదీశ్వరాలయం
భారతదేశంలో దేవాలయం అన్నది మతానికి, ఆరాధనకు జీవగర్రగా ఉంటూ వచ్చింది. విగ్రహాన్ని నెలకొల్పిన ఆలయంలో భక్తులకు ప్రదక్షిణ, పూజచేయడానికి ఏర్పాట్లుండేవి. ఆలయం అనేది మనదేశంలో వివిధ దశల్లో రకరకాలుగా రూపొందుతూ వచ్చింది. ఆయా దేశ, కాల పరిస్థితులను బట్టి దేవాలయం మార్పులకు లోనవుతూ వచ్చింది. అయితే ఆలయాలను నిర్మించిన స్థపతులూ, శిల్పులూ ఒకే రకమైన శిక్షణ పొందినవారు. ఆయా దేవాలయాలలోని దేవుళ్లు, పూజాపద్ధతులు తెలిసిన పూజారులు, మతాధికారులు మొదలైన వారి ఆదేశాలనుసారం ఈ శిల్పులు ఆలయ నిర్మాణాలు చేశారు.ప్రధాన దేవతా విగ్రహాల రూపుౌౌరేఖలలో ఆలయాల శిల్పరీతులలో అలంకరణలలో మార్పులు చేశారు.వీటన్నిటి ఫలితంగానే మన శాస్త్రాలలో పేర్కొన్న వాస్తు శిల్ప, ఆగమ గ్రంథాలు, సూత్రాలు రూపొందాయి. ఈ కారణంగానే మన దేశంలోని వాస్తు శిల్పం అంటూ ఒక సమగ్రమైన, మౌలికమైన భారతీయ శిల్పంగా గోచరిస్తుంది. అలాంటి శిల్ప, వాస్తు సౌందర్యాల మేళవింపే బృహదీశ్వరాలయం...

tempulతమిళనాడులో కావేరీ నదికి దక్షిణాన ఉన్న తంజావూరులో ఉంది బృహదీ శ్వరాలయం. తంజావూరుకు ఈ పేరు ‘తంజన్‌-ఆన్‌’ అనే రాక్షసుని వల న వచ్చిందని చెబుతారు. ఈ రాక్షసుడు శ్రీఆనందవల్లి అమ్మ, శ్రీనీలమేఘ పెరుమాళ్‌ ల చేత చంపబడ్డాడని, ఆ రాక్షసుని కోరిక మేరకు ఈ పట్టణానికి తంజావూరు అనే పేరు వచ్చిందనేది ఒక పురాణగాథ. చారిత్రకంగా ఈ నగరం చోళ రాజులకు బలమైన కేంద్రం. తరువాత నాయక రాజులు, ఆ తరువాత విజయ నగర రాజులు పరిపాలించారు. అటుపిమ్మట 1674వ సంవత్సరంలో ఈ నగరాన్ని ‘వెంకాజీ’ ఆక్రమించుకున్నాడు. ఈ వెంకాజీ శివాజీ మహారాజు కు తమ్ముడు. 1740లో బ్రిటీష్‌వారు మొదట ఆక్రమణకు ఇక్కడికి వచ్చినా విఫలం చెందారు. తరువాత 1799లో విజయం సాధించారు. ఇదీ స్థూలంగా ఈ నగర చరిత్ర.

అచ్చెరువొందే శిల్పకళానైపుణ్యం...
ఆనాడు చోళుల సామ్రాజ్యం తమిళ, కేర ళ దేశాలకే కాక దక్షిణ మైసూరు, కోస్తాంధ్ర, అండమాన్‌, లక్షద్వీప్‌, మాల్దీవులు మొదలైన ద్వీపాలకు విస్తరించి ఉంది. అప్పటికే రాష్ట్ర కూటులు తమ ప్రాభవాన్ని కోల్పోగా పశ్చిమ చాళుక్యులు విజృంభించారు. చాళుక్యులు వచ్చే నాటికే అక్కడక్కడా రాతితో ఆలయ నిర్మాణాలు, వాటిపై అందమైన శిల్పాలు శాస్తబ్రద్ధంగా పరిణతి చెందాయి. విశాలమైన ఈ ఆలయానికి చేరడానికి మూడు ద్వారాలున్నాయి. మొదటి ద్వారం అనగా ప్రవేశద్వారం ‘కేరళాంతకన్‌’, రెండో ద్వారం ‘రాజరాజ న్‌ తిరువసల్‌’, మూడో ద్వారం ‘తిరువానుక్కన్‌ తిరువసల్‌’.

Shiva-Lingamఈ ఆలయం సర్వ కళా శోభితమై సంస్కృత తమిళ శాసనాలున్న చారిత్రాత్మక సుప్రసిద్ధ దేవాల యంగా అలరారుతున్నది. క్రీశ 1003-14 ప్రాంతంలో మొదటి రాజరాజ చోళుడు బృహదీశ్వరాల యాన్ని నిర్మించాడు. ఈ పవిత్ర ఆలయంలోకి అడుగిడగానే 13 అడుగుల ఎతె్తైన శివలింగం దర్శనమిస్తుంది.ఐదుపడగల నాగేంద్రుని నీడన స్వామి దర్శ నమిస్తాడు. ఈ దేవాలయం మొత్తం నిర్మాణంలో ఇదొక అద్భుతమైన నిర్మా ణం. దక్షిణ విమాన నిర్మాణ కౌశలానికి, తమిళ శిల్పుల ళా నైపు ణ్యానికి పరాకాష్టగా దీనిని పేర్కొనవచ్చు. ఈ బృహదీశ్వరాలయా న్ని నిర్మించిన రాజరాజచోళుడి పేరున ‘రాజరాజేశ్వరాలయం’ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం వాస్తు, శిల్ప, చిత్రలేఖన కళ లన్నిటి సంగమం అని చెప్పవచ్చు.

ైభారీ నంది, ఎతె్తైన శివలింగం...
ఈ ఆలయానికి ఎదురుగా బ్రహ్మాండమైన నంది శిల్పం ఉంది. రాజ రాజచోళుని తరువాత వచ్చిన రాజులు ఈ నంది విగ్రహం చుట్టూ చక్కని మండపాన్ని నిర్మించారు. అనంతపురం జిల్లాలోని లేపాక్షి నంది విగ్రహం కంటే ఈ విగ్రహం పెద్దది. మండపం లోపలి కప్పుకి అందమైన రంగులతో డిజైన్లు చిత్రించారు. ఆ చిత్రాలు ఇప్పటికీ తమ ప్రాభవాన్ని కోల్పోకుండా అందంగా అలరిస్తున్నాయి. ఈ మండపం చాలా ఎత్తులో ఉంటుంది. బృహదీశ్వర ఆలయం విమానపు అధిష్టానం రెండు తలాలతో, మందమైన రెండు గోడల సాంధర ఆలయంగా ఉంటుంది. ఆలయం తూర్పునకు అభి ముఖంగా ఉండగా, ఉత్తర, దక్షిణ, పడమర దిశల్లో ద్వారాలున్నాయి. గర్భగు డిలో చాలా పెద్ద పీఠం, దానిమీద పెద్ద లింగం ఉంది. ఇంత పెద్ద లింగం బహు శ దక్షిణ భారతదేశంలోనే లేదేమో! రెండు గోడల మధ్య రెండతస్తులతో ప్రదక్షి ణ మార్గం కూడా ఉంది.ఇలా నాలుగు వైపులా ద్వారాలున్న ఈ ఆలయం సర్వతోభద్రంగా ఉన్న ఆలయంగా వర్ణిస్తారు.

అబ్బురపరిచే వర్ణచిత్రాలు...
Big-Nandi అలాగే ఆలయద్వారానికి అటూ ఇటూ ఉన్న నిలువు గూళ్లను దేవకోష్టాలుగా తీర్చి వాటిలో దేవతామూర్తుల విగ్రహాలనుం చారు. ఇక కింది తలుపు లోపలి గోడలో దక్షిణాన శివుడు, పడమట వైపు నటరాజు, ఉత్తరాన దేవీ విగ్రహాలున్నాయి. ఆలయ ప్రదక్షిణ మార్గపు లోపలి గోడల మీద, కుడ్య స్తంభా లమీద, ఆలయ చూరు మీద, బయటి గోడలో తట్టుమీద అందమైన వర్ణచిత్రాలున్నాయి. ఈ వర్ణ చిత్రాలలో శివుడు త్రిపురాసురుడనే రాక్షసుడిని సంహరించిన కథ చిత్రాలు ఉన్నాయి. ఇంకా శివ భక్తుడై న సుందరమూర్తి కథ, చిదంబరం నటరా జు మూర్తిని రాజు పూజిస్తున్న దృశ్యం, గాయకులు, నాట్యకత్తెలు, వివిధ పక్షులు వంటి చిత్రాలను అందంగా చిత్రించారు.

ప్రాకారంలో నందికి ఉత్తరంగా బృహదీశ్వరీ అమ్మవారి ఆలయం ఉంది. ఈ ఆలయ విమానం మీద విశాల శిఖరం, ఎదురుగా మండపాలు ఉన్నాయి. ఆ పక్కనే సభామండపంలో దక్షిణాముఖుడైన నటరాజస్వామి ఉన్నాడు. ఆగ్నేయాన గణేశుడు, వాయువ్యాన సుబ్రహ్మణ్య ఆలయాలు తూర్పు ముఖంగా ఉన్నాయి.ఇవన్నీ కూడా కాలక్రమంలో వివిధరాజులు కట్టించినవి.

Bruhadeeshwaraalayamబృహదీశ్వర ఆలయ ప్రాంగణంలో నాయక రాజులు కట్టించిన సుబ్రహ్మణ్య ఆలయం ఒక మణిపూసవంటింది.బృహదీశ్వర ఆలయ ప్రాకారం లోపల ఈ ఆలయాన్ని విమాన అర్ధ, ముఖ మండపాలతో కట్టారు. నునుపైన గట్టి రాతితో కట్టిన ఈ ఆలయపు అధిష్ఠానం మీద, కుడ్య స్తం భాల మీద చాలా సూక్ష్మమైన, అందమైన శిల్పాలున్నాయి. ఈ శిల్పాలు అందమైన అలం కరణ లతో కనులు పండువుగా ఉన్నాయి. గర్భగృహంలో సుబ్రహ్మణ్య స్వామిని సూచిస్తున్నట్లు ఆల య గ్రీవ శిఖరాలు షణ్ముఖంగా ఉంటాయి. బహుతలములైన ఈ ఆలయపు విమాన తలం మూ లలు కూడా షట్భుజంగా ఉన్నాయి. ఈ పద్ధతి తరువాతి దక్షిణాత్య స్థపతులకు మార్గదర్శకాల య్యాయి.

సమ్మోహనభరితం... కోట ప్యాలెస్‌
తంజావూరులో చూడదగ్గ మరో అద్భుత కట్టడం పెద్ద కోట ప్యాలెస్‌. 14వ శతాబ్దంలో పరిపాలించిన నాయక, మరాఠా రాజులు ఈ ప్యాలెస్‌ను గొప్పగా తీర్చిదిద్దారు. దాదాపు 110 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్యాలెస్‌లో సమ్మో హనపరిచే అందమైన కట్టడాలు, విశాలమైన కారిడార్లు, గదులు, ఎతె్తైన టవ ర్లు, ఆకర్షణీయమైన వర్ణచిత్రాలతో గది గోడలు, పరరాజుల దాడులలో రక్షణ కు ఉపయోగించే రహస్య భూమార్గాలు ఉన్నాయి.

విజ్ఞాన గని... సరస్వతీ మహల్‌
పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే వాటిలో ముఖ్యమైనది సరస్వతీ మహ ల్‌ గ్రంథాలయం. ఈ గ్రంథాలయంలో పురాతన తాళపత్ర గ్రంథాలు, ఆనాటి వర్ణచిత్రాలు, చోళ, నాయక, మరాఠా రాజులు వాడిన ఆయుధాలు, వాటికి సంబంధించిన వివరాలున్నాయి. సంస్కృత గ్రంథాలు, వేలాది రాతప్రతులు, భారత యూరోపియన్‌ భాషలకు సంబంధించిన గ్రంథాలు, అముద్రిత గ్రంథాలున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ గ్రంథాలయం ఓ పెద్ద విజ్ఞాన భాండాగారం. చరిత్ర అధ్యయన కారుల కు, విజ్ఞానపిపాసులకు ఈ గ్రంథాలయం ఓ వరం.

త్యాగరాజస్వామికి ఘన నివాళి...
తంజావూరుకి 11 కి.మీ. దూరంలో ఉన్న ‘తిరువయూరు’ అనే గ్రామం కావేరీ నది ఒడ్డున ఉంది. ఈ గ్రామంలోనే ప్రఖ్యాత వాగ్గేయకారుడు త్యాగరాజ స్వామి వారి సమాధి మందిరం ఉం ది. అనర్గలమైన సంగీత రత్నాలను అందించిన ఆయన సమాధి వద్ద ప్రతి సంవత్సరం ‘త్యాగ రాజస్వామివారి ఆరాధన ఉత్సవాలు’ ఘనంగా జరుపుతారు. ఆరోజు ఇక్కడికి దేశం నలుమూ లల నుంచి సంగీత విద్వాంసులు వచ్చి స్వామివారికి నీరాజనాలు పలుకుతారు. ఆయన రచించి న గీతాలను ఆలపిస్తూ ఈ కార్యక్రమం సాగుతుంది.

బృహదీశ్వరాలయానికి చేరుకోవాలంటే...
ఈ ప్రసిద్ధ ఆలయానికి చేరాలంటే... చెనై్న వరకు రైలు లేదా విమాన ప్రయాణం ద్వారా చేరుకొ ని అక్కడి నుండి బస్సు ద్వారా తంజావూర్‌ చేరుకోవచ్చు.

తొలి వెయ్యి నోటుపై బృహదీశ్వరాలయం...
note1954లో మొట్టమొదటిసారిగా రూ.1000 నోటు చలామణిలోకి వచ్చింది. ఆనాడు భారత ప్రభుత్వం ఆ నోటుమీద బృహదీశ్వరాయం బొమ్మను ముద్రించింది. తరువాత 1975లో భారత ప్రభుత్వం వెయ్యి రూపాయల నోటును నిషేధించింది. ఈనాడు మళ్లీ ఈ ఆలయం సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా అందరికీ ఆ నోటు గుర్తుకు వచ్చింది.
1954లో తొలిసారిగా బృహదీశ్వరాలయం ఫొటోతో విడుదలైన వెయ్యి రూపాయల నోటు

తపాలా ‘ముద్ర’...

Stamp-forరాజరాజచోళునిచే 1010వ సంవత్సరంలో తంజా వూరులో నిర్మించిన బృహదీశ్వరాలయానికి వెయ్యి సంవత్సరాలు నిండిన సందర్భంగా, సహస్రాబ్ది ఉత్స వాలకు తపాలాశాఖ 26-9-2010 న బృహదీశ్వరాలయం బొమ్మలతో ఒక ప్రత్యేక తపాలా బిళ్లను విడుదల చేసింది. మన దేశంలో ఉన్న అతిపెద్ద గర్భగుడి, విమాన గోపురం ఉన్న దేవాలయం ఇదే. భూమినుండి స్తుపి వరకు 66మీ ఎత్తులో అద్భుత శ్పికళా సంపదతో అలరారే ఈ దేవాలయం ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది.
ఇటీవల తపాలా శాఖ విడుదల చేసిన బృహదీశ్వరాలయం పోస్టల్‌ స్టాంప్‌
- దామర్ల విజయలక్ష్మి

Wednesday, September 22, 2010

మధ్యయుగాల చరిత్రకు ప్రత్యక్ష సాక్ష్యం సిద్ధవటం

మధ్యయుగాల నాటి కళావెైభవానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోన్న పర్యాటకకేంద్రం సిద్ధవటం. కడప జిల్లాలోని మండల కేంద్రమైన సిద్ధవటంలో ఉన్న శత్రుదుర్భేద్యమైన కోట ఆ నాటి స్మృతులను నేటికీ కళ్లకు కట్టినట్టు ఆవిష్కరిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికే కాకుండా దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన ఈ కోట మన చారిత్రక సంపదల్లో ఒకటిగా విరాజిల్లుతోంది. ఎంతో విశిష్టత, చరిత్ర ప్రాముఖ్యం ఉన్న ఈ కోటను మనమూ దర్శిద్దాం...

siddaam
పూర్వకాలంలో సిద్ధవటం పరిసర ప్రాంతాల్లో ిసిద్ధులు ఎక్కువగా నివసిం చేవారట. వారు నివాసం ఉండే వట వృక్షాలు (మఱ్ఱి చెట్లు) విస్తారంగా ఉండేవట. అందుకే ఈ ప్రాంతానికి సిద్ధవటం అని పేరు వచ్చిందని చరిత్రకారు లు చెబుతుంటారు. సిద్ధవటం పరిసర ప్రాంతాల్లో జెైనులు కూడా నివసిస్తూ ఉండేవారు. మొదట్లో (1807 నుంచి 1812) సిద్ధవటం జిల్లా కేంద్రంగా ఉండే ది. అయితే పెన్నానది ఉప్పొంగిన ప్రతిసారి ఈ ప్రాంతానికి బయటి ప్రపంచం తో సంబంధాలు తెగిపోతూ ఉండడంతో జిల్లా కేంద్రాన్ని అక్కడి నుంచి కడపకు మార్చారు. అయినప్పటికీ తనలో ఇముడ్చుకున్న చారిత్రక సాక్ష్యాలతో సిద్ధవ టం మరింత పేరుగాంచింది. ఇక్కడ నిర్మించబడిన శత్రు దుర్భేద్యమైన కోట పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దక్షిణ భారతదేశంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ కోటను 1956లో పురావస్తు శాఖ తమ ఆధీనంలోకి తీసు కుంది. కేవలం పురాతన కోటలకే కాదు ఆలయాలకు కూడా ప్రసిద్ధిగాంచింది సిద్ధవటం. దీనిని బలపరుస్తూ... సమీపంలో ఏటి పొడవునా దేవాలయాలుండ డం విశేషం. ఇందులో రంగనాథస్వామి ఆలయం ఎంతో కీర్తిగడిచింది. ఇక్కడి స్మశానవాటికలో భాకరాపంతులు పేరుతో నిర్మించిన 16 స్తంభాల మంటపం ఉంది ఎంతో విశిష్టమైనది. ఇవి సందర్శకులను ఆకర్షించడంలో ప్రధానపాత్ర పోషిస్తున్నాయి.

కోట చరిత్రను ఓసారి పరికిస్తే...
gopuram
శ్రీ కృష్ణదేవరాయలు అల్లుడెైన వరదరాజు పరిపాలనలో ఈ కోట ఎంతో అభి వృద్ధి చెందినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. మట్లి రాజులు ఈ కోటను పాలిం చే నాటికి ఇది మట్టి కోట. ఆ తరువాత వరదరాజు ఆధీనంలోకి వచ్చింది. అంతకు ముందు ఈ కోట ఉదయగిరి రాజ్యంలో ఉండేది. రెండవ వెంకటపతి రాయలకు మట్లి ఎల్లమరాజు యుద్ధాలలో ఎప్పుడూ సహకరించేవాడు. అందు కు గుర్తుగా సిద్ధవటాన్ని ఎల్లమరాజుకుకు కానుకగా ఇచ్చాడు. అంతేకాకుండా మరికొన్ని ప్రాంతాలను సిద్ధవటానికి చేర్చాడు. మట్లి అనంతరాజు మట్టికోటను శతృదుర్భేద్యమైన రాతికోటగా నిర్మించాడు. ఈయన తన తండ్రి పేరున ఎల్లమ రాజు చెరువు, తన పేరుతో అనంతరాజు చెరువులను త్రవ్వించాడు.

కవిగా కూ డా పేరుగాంచిన అనంతరాజు ‘కకుస్థ విజయం’ లాంటి కొన్ని కావ్యాల్ని రచిం చాడు. ఉప్పుగుండూరు వెంకటకవి, కవి చౌడప్ప లాంటి పేరొంది న కవులు ఈయన ఆస్థానంలో ఉండేవారు. మట్లి రాజుల పతనం తరువాత ఔరంగజేబు సేనాపతి మీర్‌ జుమ్లా సిద్ధవటంపెై దండెత్తి ఆక్రమించుకున్నాడు. అటు పిమ్మట ఆర్కాటు నవాబులు సిద్ధవటాన్ని స్వాధీనం చేసుకున్నారు. కడపను పాలిస్తున్న అబ్దుల్‌ నబీఖాన్‌ 1714 లో సిద్ధవటాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకొన్నాడు. అంతేకాకుండా మయానా నవాబులు కూడా సిద్ధవటాన్ని పాలించినవారిలో ఉన్నారు. చివరకు 799లో సిద్ధవటం ఈస్టిండియా కంపెనీ చేతుల్లోకి వెళ్లింది.

చూడాల్సినవివే...
old
సిద్ధవటం కోటకు రెండు ద్వారాలున్నాయి. పడమటి దిశగా ఒక టి, తూర్పు దిశగా మరొక ద్వారాన్ని ఎంతో పటిష్టంగా నిర్మించా రు. ముఖద్వాద్వారానికి ఆంజనేయస్వామి, గరుత్మంతుడి శిల్పా లు స్వాగతం పలుకుతున్నట్లుగా ఉంటాయి. పశ్చిమ ద్వారం ఇరు వెైపులా నాట్య భంగిమలో ఉండే అందమైన శిల్పాలు అప్పటి పాల కుల కళాభిరుచికి అద్దం పడుతున్నాయి. ఈ శిల్పాలు సందర్శకు లను ఇట్టే ఆకర్షిస్తాయి. పశ్చిమ ద్వారం లోపలి పెై భాగంలో... రాహువు గ్రహణం పట్టడం నుండి వీడే వరకు అన్ని దశలు ఇక్కడ దృశ్యరూపంలో నిక్షిప్తమై ఉన్నాయి. చరిత్రకు సాక్షీభూతంగా నిలుస్తు న్న ఈ కోట మధ్య భాగంలోని అంతఃపురం శిథిలమై ఉండడం విచార కరం. రాణి దర్బార్‌, ఈద్గా మసీదు, సమీపంలో నగారాఖానా ఉన్నాయి. నగారాఖానా వెనుక కోట గోడకు మధ్య తాగునీటి కోనేరు ఉంది.

కోట లో సిద్ధవటేశ్వరస్వామి ఆలయం, ఎదురుగా నంది విగ్రహం ఉన్నాయి. నానాటికీ శిథిలమవుతున్న కామాక్షి ఆలయాన్ని కొన్నేళ్ళ క్రితం మరమ్మత్తు లు చేసి అద్భుతంగా మలచారు. తూర్పు ద్వారానికి సమీపంలో... టిప్పు సుల్తాన్‌ కాలంలో నిర్మించిన బిస్మిల్లా షావలి దర్గా ఉంది. దాని పక్కనే మసీ దు ఉంది. మసీదుకు తూర్పుగా కోటగోడలో ఏట్లోకి వెళ్ళే సొరంగ మార్గాన్ని నిర్మించారు. చక్రయంత్రం ద్వారా ఏట్లో నీటిని మసీదు తొట్టిలోకి తోడేవార ట. ఇంకా చెప్పాలంటే ఇక్కడ నెలకొని ఉన్న ప్రతి రాయిలో ఏదో ఒక విశిష్టత దాగుందని చెప్పవచ్చు.

ఇలా వెళ్లాలి...
darga
జిల్లా కేంద్రం కడప నుంచి భాకరాపేట మీదుగా బద్వేలు వెళ్ళే మార్గంలో పెన్నా నది ఒడ్డున సిద్ధవటం ఉంది. కడప నుంచి ఇక్కడికి 20 కిమీల దూరం. హైదరాబాద్‌ నుండి కడప వరకు విరివిగా నడిచే బస్సులతో పాటు రెైలు సౌకర్యం కూడా ఉంది. దూరప్రాంతం నుండి వచ్చే పర్యాటకుల దగ్గరి విమానా శ్రయాలు తిరుపతి, హైదరాబాద్‌. సెప్టెంబర్‌, అక్టోబర్‌ మాసాలు ఈ కోటను సందర్శించడానికి ఎంతో అనుకూలమైన సమయం. వేసవికాలంలో కూడా సిద్ధ వటం కోటకు సందర్శకుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది.

కమనీయం... కూర్గ్‌ జలపాతం

rafting-coorg
భారత స్కాట్లాండ్‌గా పేరుగాంచిన కూర్గ్‌ కర్నాటక రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన పర్యాటకకేంద్రం. సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తున్న ఈ జల పాతం మడికేరి ప్రాంతంలో ఉంది. సముద్రమట్టానికి 1525 మీటర్ల ఎత్తున ప్రకృతి ఒడిలో అద్భుతంగా కుదిరిన కూర్గ్‌, బెంగుళూరు నగరానికి సరిగ్గా 252 కిమీల దూరంలో ఉంది. ఏటవాలు పర్వతంపెై దట్టమైన అరణ్యం లో, జలజలపారే జలపాత మధుర ధ్వనులతో ప్రకృతి రమణీయతకు మరో పేరుగా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది కూర్గ్‌ జలపాతం.

Omkareshwara
మంచు దుప్పటిని కప్పుకున్న పర్వతం, దట్టమైన అడవి, ఎకరాల మేర విస్తీర్ణంలో ఆవరించుకున్న టీ, కాఫీ, నారింజ తోటలు... కనురెప్పవాల్చనివ్వని సుందర దృశ్యాలతో మరిచిపోలేని అనుభూ తులు మిగిల్చే అద్భుత విహార కేంద్రంగా విరాజిల్లుతోంది విడిది గా మడికేరి. అంతేకాదు.. ఇక్కడ స్థానికంగా గల దర్శనీయ స్థలాలు మడికేరికి అదనపు ఆకర్షణను చేకూరుస్తున్నాయని చెప్పక తప్పదు. శతాబ్దాల చరిత్రను తనలో దాచుకున్న మడికేరి కోటలో దేవాలయం, ప్రార్థనా మందిరం, చెరసాలలతో పాటు చిన్నపాటి పురావస్తు ప్రదర్శన శాల ఉన్నాయి. ఇక రాజాస్థానం గురించి చెప్పాలంటే, కొడగు రాజులు సాయం కాల విడిదిగా పేరుగాంచింది. రాజాస్థానం నుంచి సూర్యాస్తమయాన్ని వీక్షిం చడం మరుపురాని అనుభూతిగా మిగిలిపోతుంది.

Abbey-Falls-Coorg
మడికేరిలో ప్రత్యేకించి సందర్శించాల్సినవాటిలో నాగర్‌హోళె జాతీయ ఉద్యానవనం ప్రధానమైంది. ఏనుగులు, పులులు, చుక్కల జింకలు, అడవి దున్నపోతులు తదితర జంతువుల్ని ఇక్కడ వీక్షించవచ్చు. అంతేకాదు పర్యా టకుల సౌకర్యార్థం రాత్రిపూట కూడా బసచేసే ఏర్పాట్లు ఉద్యానవనంలో ఉండడం విశేషం. సీతాదేవిని వెదుకుతూ రామలక్ష్మణులు సంచరించినదిగా చెప్పబడే ఇరుప్పు జలపాతం, అటవీశాఖకు చెందిన ఏనుగులను పట్టేందుకు శిక్షణనిచ్చే కేంద్ర మైన దుబరే, ఇక్కడకు 30 కి.మీల దూరంలోని కావేరీ నది నిలువ నీళ్ళతో మనసుకు ఉల్లాసాన్ని కలిగించే వలనూర్‌, కావేరి, కనిక, సుజ్యోతి నదులు సంగమించే భాగమండల, ప్రశాంతతకు ఆలవాలమైన నిసర్గధామ పర్యా టక స్థలాలు ప్రకృతి రమణీయతకు అద్దం పడుతున్నాయి.ఇలా ప్రకృతి రమణీయతనంతా ఒకే చోట పోతపోసినట్లు ఉన్న ఈ అద్భుత దృశ్యాలను ఒక్కసారెైనా దర్శించాల్సిందే...

చేరుకునేదిలా...
రెైలు, విమాన మార్గం లేని ఈ ప్రాంతానికి కేవలం రోడ్డు మార్గం ద్వారానే చేరుకోవాలి. అయితే దూరప్రాంత ప్రయాణీకులు బెంగు ళూరు చేరుకొని అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా మడికేరి చేరుకోవచ్చు. బెంగుళూరు, మైసూరు, మంగళూరు, కన్ననూరు, తెల్లిచెర్రి నుంచి మడికేరికి బస్సు సౌకర్యం ఉన్నది.

Saturday, September 18, 2010

మారిషస్‌లో మజా ... మజాగా ...

కనుచూపు మేరలో అంతా నీలిరంగే. నీలాకాశం... దానితో కలిసిపోతుందా అన్నంత సుదూర ప్రదేశం వరకూ విస్తరించిన సముద్రం. చూస్తుంటేనే మనసు పులకించి పోతుంది. దృష్టి మరలిస్తే... బంగారు రజముతో ప్రకృతి అలంకరించిందా అన్నట్లు కనిపించే ఇసుకతిన్నెలు. ఆ బీచ్‌లో ఓ రెల్లుగడ్డి కుటీరంలో జారుబడిగా కూర్చుని పండ్లరసమో, పానీయమో తాగుతూంటే... ఆనందడోలికలలో తూగిపోతున్నట్లు ఉంటుంది కదూ...

praia-de-maresiasఒకపక్క ఇసుక తిన్నెలు, వాటిని ముద్దాడుతూ పచ్చని చెట్లు... బీచ్‌లో సన్‌బాతింగ్‌ చేసే అందాలు. ఇంత కన్నా సుందరమైన ప్రదేశం ప్రపంచంలో ఉంటుందా! అంత చక్కటి అనుభూతి మీరు కోరుకున్నన్ని రోజులు పొందవచ్చు. భగవంతుడు భువిపై మొదట మారిషస్‌ను నిర్మించి, దాని అందాలకు తానే ముగ్ధుడై ‘స్వర్గం’ రూపొందించాడంటారు మారిషస్‌ ప్రజలు. అంతటి అద్భుతాలను ఆస్వాదించేందుకు ఒక్కసారైనా మారిషస్‌ వెళ్లాల్సిందే.
http://www.bigtravelweb.com/images/mauritius_l.gifమారిషస్‌ హిందూ మహాసముద్రం నైరుతి ప్రాంతంలో ఉన్న ప్రకృతి సిద్ధమైన దీవుల సమూహం. మూడు ప్రధాన దీవులతో పాటు, మానవుల జాడలేని మరో 13 దీవులు ఇక్కడ దర్శనమిస్తాయి. మారిషస్‌ దీవులలో దాదాపు 13 బీచ్‌లు ఉన్నాయి. ఎంతో పరిశుభ్రంగా సెల్యులాయిడ్‌ మీద దృశ్యాల మాది రిగా, అద్భుత పెయింటింగ్స్‌లా ఈ బీచ్‌లు ఆనందాన్ని దోసిళ్ళతో అందిస్తాయి. చక్కటి బీచ్‌లకు తోడు స్వచ్ఛ మైన, తేటనీటితో అలరించే సముద్ర జలాలు. రకరకాల బీచ్‌లలో ప్రధామ మైనవి మూడు. బ్లూ బే, బెల్లే మా రే బీచ్‌, కేప్‌ మెల్హారక్స్‌ బీచ్‌. ఈ బీచ్‌లలో కూర్చుంటే గంటలు నిముషాల్లా గడిచిపోతాయి. నీలిరంగులో మనస్సు లీలమైపోతుంది.
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhlgMbnsihxWBHaUIAh6uGqvSeT36JJ9dw8D36mh_6K07r2b94MbSqgxxEI-ucKThO3Tu3u1Ar31VVIdE4KRGZ-7CTUhiQHL8WDcmHbKX8iCMLVTbGNeb7-qtxzPmZQLcgXtFfIm1-sKjQF/s400/lagoon-mauritius.jpg
బేడు తమరిన్‌
మారిషస్‌లో సర్ఫింగ్‌ సెంటర్‌. తమరిన్‌ నది ముఖద్వారం. ఇక్కడ ప్రకృతి చిత్రంతో పాటు ఏడాది పొడవునా భారీ అలలు దర్శనమిస్తాయి. ఇందుకే సర్ఫింగ్‌ క్రీడాకారుల విన్యాసాలు అలరిస్తాయి. రాజధాని పోర్ట్‌లూయి స్‌ నుంచి కారులో బయలు దేరితే 15 నిముషాలలో బీచ్‌ చేరవచ్చు. ఆకాశం నీలిరంగు చీర కట్టుకున్నట్లు అన్పించే బీచ్‌ బ్లూ బే. పొడవైన బీచ్‌లలో ఒకటి తెల్లటి ఇసుక, సూదిపడేసినా కన్పించే అంత తేట నీరుగల బీచ్‌ ఇది. సెరులింగ్‌, సర్ఫింగ్‌, చేపలవేటకు అనువైన బీచ్‌. ఇక కేప్‌ మల్హంక్స్‌ బీచ్‌. మత్స్యకారుల చిన్న గ్రా మంలోని బీచ్‌ ఇది. పక్క పక్కనే మూడు చిన్నచిన్న దీవులు కనువిందుచేస్తాయి. వాటికి బోట్లలో వెళ్ళే సౌకర్యం ఉంది.
http://guidetomauritius.co.uk/wp-content/uploads/2009/05/beau-rivage-mauritius-aerial-view.jpg
ఎలాంటి భయం లేకుండా పిల్లల్ని తీసుకువెళ్ళి గంటలసేపు హాయిగా గడిపేసే బీచ్‌ ట్రౌ ఆక్స్‌ బీ చ్‌. సముద్రతీరం అంతగా లోతు ఉండదు. పిల్లలు సులభంగా ఈత కొట్టవచ్చు. ఈత నేర్చుకునే వారు ఆనం దంతో కేరింతలు కొడుతూ 70-80 గజాల దూరం వరకూ వెళ్ళవచ్చు. స్నోర్కెల్‌కు మేలైన ప్రదేశం. చేపలు పట్టడానికి వీలుంటుంది. నాలుగు అడుగుల దూరం నడిస్తే చాలు దగ్గరిలోనే మహేశ్వర్‌నాథ్‌ దేవాలయాన్ని కూడా సందర్శించవచ్చు. మారిషస్‌లో ఇది ప్రసిద్ధ హిందూ దేవాలయం. మిగతా బీచ్‌లలో హోటళ్ళకు అను బంధంగా ఉన్న బీచ్‌లు ఉన్నాయి. అపార్ట్‌మెంట్‌లు, రెస్టారెంట్‌లు, దుకాణాలకు దగ్గరలో ఫ్లిక్‌ ఇన్‌ ఫ్లాక్‌ అతి పొడవైన బీచ్‌. ఆ అందం వర్ణనాతీతం. వాటర్‌ స్పోర్ట్స్‌కు అనువైనది గ్రాండ్‌ బీచ్‌. మారిషస్‌లో అతి పెద్ద వాణి జ్య కేంద్రం సమీపంలో రెస్టారెంట్‌లకు దగ్గరిలో ఉన్న బీచ్‌ ఇది. పచ్చని చెట్లతో, సమీపంలో జలపాతంతో అలరించే మరో బీచ్‌ లీ ఆక్స్‌ కార్ఫ్‌స్‌ బీచ్‌. ఈ దీవికి పాయింట్‌ మారైస్‌ నుంచి బోటులో అరగంట లో చేరవచ్చు.


mauritiusఇక్కడ వాటర్‌ ప్పోర్ట్స్‌ సౌకర్యంతో పాటు, రెస్టారెంట్‌ ఉంది. ఈ దీవిలో జింకల పార్క్‌ కూడా అలరిస్తుం ది. ఇలాగే మారిషస్‌లో పలు బీచ్‌లు ఉన్నాయి. ఏ బీచ్‌లో కుటుంబ సమేతంగా కూర్చున్నా... గంటలసేపు గడిచిపోతుంది. ఇక విదేశీయులు ఎక్కువగా వచ్చే బీచ్‌లు ఉన్నాయి. ఈ బీచ్‌లలో భద్రతాపరమైన భయం లేదు. కొత్తగా పెళ్ళయిన వారయితే హాయిగా, జంటగా, గంటలసేపు గడపవచ్చు. మారిషస్‌లో ఇంకా ఎన్నో దర్శనీయ స్థలాలు ఉన్నాయి. సహజమైన అడవులు, కొండ చిలువలు, జంతువులు, పక్షులు ఉండే బ్లాక్‌ రివర్‌ జార్జెస్‌ నేషనల్‌ పార్క్‌. వాటిలో కి వెళితే అసలు మనం ఏ అడవిలో ఉన్నామో అర్థం కాదు. సహజ ప్రకృతి గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. నేషనల్‌ పార్క్‌ను ఆనుకునే ఉన్న గ్రాండ్‌ బసిన్‌లో కొన్ని హిందూ దేవాలయా లు, కోనేరు కూడా ఉన్నాయి. శివరాత్రి నాడు ఇక్కడి సంబరం చూడాలి.
http://www.nationsonline.org/gallery/MauritiusImg/Mauritius.jpgటమరిన్డ్‌ జలపాతాలు: దాదాపు 240 మీటర్ల ఎత్తు నుంచి నీరు నేలకు ఉరికే జలపాతాలు మారిషస్‌ కే హైలైట్‌. వాటి సమీపంలోకి వెళ్ళడం కష్టమే అయినా, చల్లటినీటిలో స్నానం ఆహ్లాదం కల్గిస్తుంది.


లా వెల్‌ నేచర్‌ పార్క్‌: ఇది ప్రత్యేకంగా పర్యాటకుల ఆహ్లాదం కోసం ఏర్పాటు చేసిన పార్క్‌. ఒకపక్క రొయ్య ల పార్క్‌లు, మరో పక్క కోతులు, ఇతర జంతువులు అలరిస్తాయి.
http://www.bargaindreamholidays.co.uk/beach7.jpgరిచ్‌ స్టార్‌ ఫాల్స్‌: జలపాతం నుంచి ప్రవహించే నీటిలో స్నానం ఓ చిత్రమైన అనుభూతి. మారిషస్‌ జనాభా 12 లక్షలు, జనాభాలో సగం మంది హిందువులే. ముస్లీంల జనాభా పెద్దదే. మౌలికంగా మలేషియన్లు, ఇక చైనా, మలేషియా, కొరియా ఇతర దేశాల నుంచి వలసవచ్చిన వారే ఎక్కువ. ఎక్కువ కా లం ఫ్రెంచ్‌ పాలనలో ఉన్నందువల్ల మారిషస్‌ సంస్కృతితో ఫ్రెంచ్‌ సంస్కృతి మమైక్యమై పోయింది. నైట్‌ క్లబ్‌ లు కాసినోలకు మారిషస్‌లో లోటే లేదు. అంతర్జాతీయ ప్రమాణాలు గల కాసినోలు, క్లబ్‌లతో రాత్రిళ్లు పొద్దు ్దపోయే వరకూ రాజధాని కళకళలాడుతుంది. రెస్టారెంట్‌లలో మారిషస్‌ స్పెషల్‌ నృత్యం ‘సేగా’తో ళాకారులు అలరిస్తారు.


భారతీయ భోజనంతో పాటు, చైనా, ఫ్రాన్స్‌, కొరియా, ఇతర దేశాల ఆహారం కూడా లభిస్తుంది. ఇక్కడ మత్స్య సంపద మారిషస్‌వాసుల ఆహారంలో ప్రధాన భాగం. అందువల్లే చేపలతో తయారు చేసిన రకరకాల ఆహారం ఇక్కడి స్పెషల్‌. మారిషస్‌లో భూతల స్వర్గంగా భావించే ప్రదేశం లా ప్లాంటేషన్‌ డి అల్‌బియోన్‌.అల్పియాన్‌ గ్రామంలో ఉంది. లా ప్లాంటేషనల్‌లో నాలుగు రాత్రులు, ఐదు రోజుల పాటు గడిపేందుకు ప్రత్యేక ప్యాకేజి ఉంది. ఇందుకు 54 వేల రూపాయలు ఖర్చవుతుంది. నవంబర్‌లో ప్రత్యేక రాయితీ ఉం టుంది. జంటతో పాటు అదనంగా వచ్చే వ్యక్తికి టారిఫ్‌లలో దాదాపు 50 శాతం రాయితీ లభిస్తుంది.పర్యాట కుల కోసం క్లబ్‌ మెడ్‌ వివిధ ప్యాకేజిలను అందిస్తోంది. హనీమూన్‌ ప్యాకేజిలకు క్లబ్‌ పెట్టింది పేరు. ఇక ఏడు రోజుల ప్రత్యేక ప్యాకేజి కూడా ఉంది. మరికొన్ని ఇతర టూరిజం ఏజన్సీలు కూడా ప్యాకేజి టూర్‌లను ఆఫర్‌ చేస్తున్నాయి. కాస్త డబ్బు చేతిలో పట్టుకుంటే ఆనందమే... ఆనందం.
http://blog.africabespoke.com/wp-content/uploads/Sega-dance-on-the-beach.jpg
సేగా డాన్స్‌:  మారిషస్‌ ప్రజల మనోజ్ఞమైన నృత్య శైలి. ఫ్రాన్స్‌, డచ్‌ నుంచి బానిసలుగా వచ్చిన ప్రజలు తమ సంస్కృతిని మరచిపోకుండా సేగా నృత్యాన్ని తీర్చిదిద్దారు. మారిషస్‌లో ఏ పండుగైనా సరే. ‘సేగా’ డాన్స్‌ ఉం డాల్సిందే. హృద్యమైన డ్రమ్స్‌ వాయిద్యం నేపథ్యంలో కళాకారుల చక్కని భంగిమలతో నడిచే నాట్యం. దాదాపు ప్రతి రెస్టారెంట్‌లలోనూ సేగా నృత్యం చేసే కళాకారులు ఉంటారు. పర్యాటకులకు కనువిందు చేస్తారు.


ఎలా వెళ్లాలి: ఎయిర్‌ మారిషస్‌-ఎయిర్‌ ఇండియా ప్రతి వారం మూడు విమానాలను ముంబై నుంచి నడుపుతున్నాయి. వీటి ఛార్జీలు దాదాపు 24,500. ఢిల్లీ నుంచి వారానికో ఫ్లైట్‌ ఉంది. ఛార్జి రు. 26, 700 వరకూ.. సెప్టెంబర్‌ - డిసెంబర్‌ మధ్య, ఏప్రిల్‌ - జూన్‌ నెలల మధ్య సందర్శిస్తే అనువుగా ఉంటుంది. ఎయి ర్‌ ఫ్రాన్స్‌, బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌, సౌతాఫ్రికన్‌ ఎయిర్‌ లైన్స్‌ మారిషస్‌కు విమానాలు నడుపుతున్నాయి.

వన్యప్రాణుల ఆవాసం... పోచారం అభయారణ్యం

చెంగు చెంగున గంతులు వేసే లేళ్ళు... పురివిప్పి నాట్యమాడే నెమళ్ళు... అడవికి మంత్రిగా వ్యవహరించే నక్కలు... గాంభీర్యానికి, హుందాతనానికి, పౌరుషానికి పెట్టింది పేరైన చిరుతపులులు... ఎలుగు బంట్లు, మనుబోతులు, కంజులు, తోడేళ్ళు, కొండ గొర్రెలు, అడవి పిల్లులు, ముద్దొచ్చే కుందేళ్ళు తదితర జంతువులతో ఒకనాటి నిజాం షికార్‌ ఘర్‌ గా ప్రసిద్ధిగాంచిన నేటి పోచారం అభయారణ్యం నిగనిగలాడే పచ్చని చెట్లతో అలలారుతుంది. మెదక్‌ జిల్లాలోనే కాకుండా రాష్టవ్య్రాప్త విహారకేంద్రంగా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న పోచారం అభయారణ్యం విశేషాలు ...


pranulu
వనం అంటే అడవి అని అందరికీ తెలిసిందే... అడవిలో నివసించే జంతువులను వన్యమృగాలు అంటారు. సింహం, పులి, చిరుత, లేడి, జింక, దుప్పి మొదలైనవి వన్యప్రాణులు. ఇవి అటవీ సంపద లో ఒక భాగం. పచ్చదనంతో విశేషంగా ఆకట్టుకుంటున్న పోచారం అభయారణాన్ని కాపాడుకోకుంటే... ఆ వన్య మృగాలు కనుమరుగైపోయే ప్రమాదం ఉందంటున్నారు పర్యావణ మేధావులు. పోచారం అభ యారణ్యంలో వందల కొలది ఉన్న అడవి జంతువులను రక్షించుకోవడం మన బాధ్యత అంటున్నారు వారు. అడవులు మానవ జాతి మనుగడ కోసం సృష్టి ప్రసాదించిన సంపద.

మానవ మనుగడ పర్యావర ణంపై ఎంతో వుంది. పర్యావరణాన్ని కాపాడాలంటే అడవులు, వన్యప్రాణులు తప్పనిసరిగా బతికించుకో వాలి. వేటగాళ్ళు, అడవి దొంగల వల్ల నాశనమవుతున్నాయి. వారు వన్య ప్రాణులను అనేక కారణాలుగా వధిస్తూనే ఉన్నారు. రాజరిక వ్యవస్థ నుండి నిన్నటి మొన్నటి వరకు కొందరు వేటగాళ్ళు ఇతరుల మెప్పు పోందడానికి క్రూర మృగాలను వేటాడి చంపేవారు. 1916-27 ప్రాంతంలో నిజాం ప్రభువు తీరిక సమ యంలో జంతువులను వేటాడేందుకు ప్రస్తుతం నిజామాబాద్‌ జిల్లా, మెదక్‌ జిల్లా సరిహద్దులో ఉన్న పోచా రం ప్రాజెక్టు చూట్టూరా వున్న అటవీ ప్రాంతాన్ని షికార్‌ ఘర్‌ పేరుతో అభివృద్ధి పరిచారు.

Bear
ఈ అభయార ణ్యం హైదరాబాద్‌ నుండి 110 కిలోమీటర్లు, మెదక్‌ పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో వుంది. నిజాం పరిపాలన అంతరించి స్వాతంత్య్రం సిద్దించాక 1952 లో పోచారం అభయారణ్యం ఏర్పడిన తర్వాత కూ డా నవాబులు, ఉన్నతాధికారులు సైతం 1990 వరకు పోచారం అభయారణ్యంలో వేటాడటం కోసం అత్యాధునిక ఆయుధాలతో పోచారం అతిథి గృహంలో నివాసం వుంటూ వేటాడేవారు. ఈనాడు వన్యప్రా ణులకు కష్టకాలం దాపురించింది. అడవులు అంతరించిపోతున్నాయి.

మానవులు తన స్వార్థానికి అడవులను నరికి వన్యప్రాణులకు నిలువు నీడ లేకుండా చేస్తున్నారు. దానికి తోడు కారిచిచ్చు వల్ల అడవులు తగల బడిపోయి వన్యప్రాణులు సజీవదహనమవుతున్నా యి. దొరికిన వన్యప్రాణులను చంపడం క్రమంగా పెరిగిపోయింది. దీంతో అడవి జంతువుల సంఖ్య తరిగిపోయి పూర్తిగా అంతరించే ్రపమాదం ఏర్ప డింది. దీంతో మెదక్‌ జిల్లా అటవీ శాఖ వన్య ప్రాణి విభాగం పరిధిలో మెదక్‌లో డివిజన్‌ కార్యాలయా న్ని ఏర్పాటు చేశారు. పోచారం అభయారణ్యం 13 వేల హెక్టార్ల విస్తీర్ణం కలిగి ఉంది. ఇందులో నిజా మాబాద్‌ 74 స్క్వేర్‌ కిలోమీటర్లలో ఉంది.

RedBilledGullFlock
మెదక్‌ జిల్లాలో 56 స్క్వేర్‌ కిలోమీటర్లలో 5,600 హెక్టార్లలో ఉంది. ఈ అభయారణ్యం పరిధిలో మెదక్‌ జిల్లాలోని మెదక్‌, రామాయంపేట మండలాలు, నిజామాబాద్‌ జిల్లాలో లింగంపేట, తాడ్వాయి, బిక్కనూర్‌, ఎల్లారెడ్డి మండలాలు ఉన్నాయి. పోచారం అభయారణ్యంలో వేటాడడం తగ్గడానికి ప్రభుత్వం కన్నా మావోయిస్టు నక్సలైట్ల దళాలు అడవుల్లో సంచరించడం వల్లనే ఈ అభయారణ్యం వృద్ధిచెందిందనేది నగ్నసత్యం. కాగా అడవులు అంతరించిపోవడంతో పాటు మానవుల స్వార్ధానికి అడవులు నరికి వన్యప్రాణులకు నిలువ నీడ లేకుండా చేస్తున్నారు. దానికి తోడు కారుచిచ్చు వల్ల అడవులు తగలబడిపోయి వేలాది వన్యప్రాణులు సజీవ దహనం అవుతున్నాయి.


snakeఅడవులలో నివసించే జంతు వులలో సింహం, పులి, చిరుత మొదలైనవి కౄర జంతువులు. ఇవి తక్కిన జంతువులను చంపితిని బతుకుతాయని వన్యప్రాణి సంరక్షణ అటవీ శాఖ రేంజర్‌ సర్వేశ్వర్‌ తెలిపారు.పోచారం అభయారణ్యంలో ఒకప్పుడు వేటగాళ్ళకు నిలయంగా ఉండేందని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. వేటాడడం నిషేధించడమే కాకుండా వన్యప్రాణులను చంపి నా, వేటాడినా కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా విధిస్తున్నట్టు తెలిపారు.

పోచారం జింక ల ప్రత్యుత్పత్తి డిబిసి 1 లో 125.33 హెక్టార్లు, డిబిసి 2లో 39.30 హెక్టార్లు ఉన్నట్టు తెలిపారు. వీటిలో జింకల ప్రత్యుత్పత్తి చేస్తు న్నట్టు తెలిపారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలిపారు. ప్రతి ప్రాణికి జీవించే హక్కు ఉందని తెలిపారు. మన రాష్ట్రంలో నానాటికీ అటవీ సంపద అంతరించిపోతు న్నది. పచ్చదనానికి, అటవీ జంతువులకు ఆలవాలంగా నిలుస్తున్న ఈ పోచారం లాంటి అభయారణ్యాలను కాపాడుకోకపోతే అటవీ జంతువులు మనకు కనుమరుగయ్యే ప్రమాదం ఉన్నది.
- సి.హెచ్‌.అశోక్‌‌


pocharam

పర్వతాలు పిలుస్తున్నాయ్‌..!

సంవత్సరం మొత్తంలో ట్రెక్కింగ్‌ చేయడానికి అనువెైన నెలగా సెప్టెంబర్‌ను చెబుతారు. కొద్దిపాటి సమస్యలున్నా... కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మరువలేని ట్రెక్కింగ్‌ అనుభూతి మీ సొంతమవుతుంది. నిజానికి జూలెై-ఆగస్ట్‌ మాసాలు కూడా ట్రెక్కింగ్‌కు ఎంతో అనువెైనవి. అయితే ఆ సమయంలో వర్షాలు ఎక్కువగా ఉండడం వలన పర్వాతారోహణ సాధ్యపడదు. హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో నెలకొని ఉన్న పర్వతప్రాంతాలు పచ్చదనంతో మైమరిపిస్తాయి. ట్రెక్కింగ్‌ చేయడానికి దేశంలోనే ఎంతో అనువెైన ప్రదేశాలుగా ఈ పర్వతసానువులను చెబుతారు.


Valleyఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో జూలెై ఆగస్టునెలల్లో పర్వతారోహణ కార్యకలాపాలు ప్రారంభమైనపపటికీ వర్షాలు తగ్గుముఖం పట్టిన సెప్టెంబరు మాసంలోనే ఈ కార్యక్ర మాలు ఉధృతమవుతాయి. ెసెప్టెంబరు నెల వచ్చేసరికి పర్వతమార్గాల్లో మంచుకరిగిపోతుంది. కొండలెక్కడాకీ, కష్టతరమైన శిఖరాలధిరోహించడానికి సెప్టెంబరు-అక్టోబరు చాలామంది పర్యాటకులు ఉత్సాహాన్ని చూపిస్తారు. ఈ మాసాల్లో ఈ రాష్ట్రాల్లో ట్రెక్కింగ్‌ సందడి మొదలవుతుంది. వర్షాకాలంలో దిగువ పర్వత సానువుల్లో చిక్కగా దట్టంగా పరుచుకున్న పచ్చదనం సందర్శకులను మైమరిపిస్తుంది. పర్వతారోహకులకు ఇది మరుపురాని అనుభూతిని మిగులుస్తుంది. అయితే పచ్చదనంతో కూడుకున్న సుందర ప్రకృతి వెనుక అపాయాలూ పొంచివున్నాయి.

trekkingకావున ట్రెక్కింగ్‌ చేసేవారు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ముఖ్యంగా ఈ సమయంలో బండలపెై విపరీతమైన నాచు కప్పబడుతుంది. వర్షపు జల్లులు పడేప్పుడు ఈ సానువుల్లో సంచరించేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే నాచువల్ల చాలా జారు డుగా వుంటుంది... వర్షం లేనప్పుడెైతే ఫరవాలేదు కానీ, చిరుజల్లులు పడుతున్నప్పుడు జారిపడే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా జలగలు, విష సర్పాలు మరో సమస్య. పచ్చటి పచ్చిబీళ్ళలో అదే రంగులో సంచరించే విషసర్పాలు, రక్తం పీల్చే జలగలు ట్రెక్కిం గ్‌కు ఆటంకాలు కలిగిస్తాయి.

అయితే మనిషి అడుగుల చప్పుడు వినిపిస్తే... సర్పాలు దూరంగా వెళ్ళిపోతాయి. కానీ జలగలదే అసలు సమస్య. సిక్కింలో వర్షాకాలం ముగుస్తున్న సమయాన్ని జలగల నిలయంగా చెప్పుకోవచ్చు. జలగల వల్ల ప్రాణాపాయ స్థితి డ్రెస్సింగ్‌ విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే... ఈ జలగల గొడవ కూడా ఉండదు. నిండుగా దుస్తులు వేసుకుంటే జలగలు మీపెై దాడిచేయలేవు. ఇంకా వంతుల వారీగా గ్రూపుకు నాయకత్వం వహించండి. అందువల్ల ఒకే వ్యక్తిపెై భారం పడదు. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఉత్తరాది పర్వతాల్లో మీ ట్రెక్కింగ్‌ అనుభూతి కలకాలం గుర్తుండిపోతుంది. మరింకెందుకు ఆలస్యం మీరూ ట్రెక్కింగ్‌కు రెడీ అయిపోండి..!

trekkings

చారిత్రక వైభవ సాక్ష్యం భీమునిపట్నం

దేశంలో మొదటి పురపాలక సంఘం గుజరాత్‌లోని సూరత్‌ నగరం కాగా... ఆంధ్రప్రదేశ్‌లో మొదటి పురపాలక సంఘంగా గుర్తింపు పొందిన భీమునిపట్నం రెండవది. నేడు భీమిలిగా ప్రసిద్ధి చెందిన ఈ నగరం ఎన్నో ప్రాచీన కట్టడాలను తనలో నిక్షిప్తం చేసుకుంది. హిందూ బౌద్ధ మతాలకు చెందిన ప్రాచీన నిర్మాణాలే కాకుండా బ్రిటీష్‌, డచ్‌వారి పాలనకు ఆనవాళ్ళుగా నిలిచే.. అనేక చారిత్ర కట్టడాలకు నిలయం ఈ నగరం. ఉక్కు నగరం విశాఖకు 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ భీమునిపట్నం విశేషాలు...


Bheemili-Lighthouseపశ్చిమం వైపు ఎత్తుగా ఉండి... తూర్పు వైపు సముద్రతీరానికి వచ్చేసరికి పూర్తి పల్లంగా ఉండడంతో... పశ్చిమం నుండి భీమిలి సముద్ర తీరాన్ని చూస్తే... కనిపిం చే ప్రకృతి రమణీయత వర్ణనాతీతం. రాష్ట్రం లోనే తొలి మున్సిపాలిటీగా ప్రసిద్ధి చెందిన భీమిలిలో పురాతన కట్టడాలేకాకుండా బ్రిటీష్‌, డచ్‌ వారి పాలనకు... ప్రాచీన వారసత్వ సంపదకు ఆనవాళ్ళుగా మిగి లిన అద్భుత ప్రదేశాలు మనకు దర్శన మిస్తాయి.

ప్రాచీన వారసత్వం...
పురాణేతిహాసాలను తనలో ఇముడ్చు కున్న ఎన్నో చారిత్రక గాధలను భీమి లి పట్టణం కళ్ళకు కడుతుంది. నాటి కృతయుగం నుండి కలియుగం వర కు ఎన్నో చరిత్ర సాక్ష్యాలను తనలో నిక్షిప్తం చేసుకుంది. కృతయుగంలో హిరణ్యకశిపుని సంహరించి ఉగ్ర రూపుడైన నరసింహస్వామి... ఆ తరువాత ప్రహ్లాదుని అభ్యర్ధన మేర కు శాంతించి ఇక్కడి సౌమ్యగిరిపై వెలి శాడని పురాణాలు చెబుతున్నాయి. మరో కథనం ప్రకారం ద్వాపరయుగంలో పాండవు లు వనవాసం చేస్తున్న సమయంలో భీమ సేనుడు బకాసురుడిని చంపి అనంతరం సౌమ్యగిరిపై లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించాడని అంటారు.

bheemili-beachఅందువల్లనే ఈ పట్టణానికి భీమునిప ట్నం గా పేరొచ్చిందని చరిత్రకారులు చెబుతుంటారు. ఆనా టి ఏకచక్రపురమే ఈనాటి భీమునిపట్నంగా రూపాంతరం చెందినట్లుగా భావిస్తున్నారు. ఈ క్షేత్రం క్రీస్తుశకం 1228 లో నిర్మాణమైనట్లు ఇక్కడి శాసనాల వల్ల తెలుస్తోంది. హిం దూ పురాణాలనే కాకుండా బౌద్ధ విశేషాలను తనలో నిక్షి ప్తం చేసుకుంది భీమునిపట్నం. బుద్ధుని మరణానంతరం అవశేషాలను ఎనిమిది భాగాలుగా చేసి వివిధ ప్రాంతాల్లో భద్రపరిచారట.

అందులోని ఎనిమిదవ భాగం భీమిలి సమీ పంలోని తిమ్మాపురం బావికొండ బౌద్ధకేత్రంలో లభ్యమైంది.కళింగ యుద్ధం తరువాత అహింసావాదిగా మారి బౌద్ధాన్ని స్వీకరించిన అశోకుడు బౌద్ధ మాతానికి వైభవాన్ని తీసుకొచ్చారు. అంతేకాకుండా విజయనగర సామ్రాజ్యాధి నేత శ్రీకృష్ణదేవరాయులు తన జైత్రయాత్రలో భాగంగా పద్మనాభం దగ్గర పొట్నూరులో నెలకొల్పిన విజయస్థూపం నేటికీ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.. విదేశీ యులపై సమరశంఖం రించిన విజయనగరం సంస్థానాధీ శుడు రెండో విజయరామరాజు యుద్ధం చేసిన స్థలం పద్మ నాభం, విప్లవీరుడు అల్లూరి సీతారామరాజు జన్మించిన పాండ్రంగి ప్రాంతాలు భీమిలికి దగ్గరలోనే ఉన్నాయి.

డచ్‌, ఆంగ్లేయుల కాలంలోనే అభివృద్ధి పథంలో..
విదేశీయులు ఏలుబడిలో భీమునిపట్నం ఎంతో అభివృద్ధి సాధించింది. 17 వ శతాబ్ధంలో వ్యాపారం నిమిత్తం భార త్‌లో అడుగుపెట్టిన డచ్‌చ దేశస్థులు వర్తకానికి కొన్ని అను వైన ప్రదేశాలు ఎంచుకున్నారు.వాటిల్లో భీమునిపట్నం కూడా ఒకటి. ఇక్కడ వర్తక వాణిజ్యాలు సాగించడానికి 1641 వ సంవత్సరంలో హైదరాబాద్‌ నవాబు కులీకుతుబ్‌ షా నుండి అనుమతి పొందిన డచ్‌ దేశస్థులు ఇక్కడ స్థిరని వాసం ఏర్పరుచుకోవడమే కాకుండా భీమునిట్నం అభివృద్ధి కోసం విశేష కృషి చేశారు. 1641లో ఇక్కడ ఒక కోట నిర్మించుకున్న డచ్‌ దేశీయులు విదేశీ వర్తకానికి శ్రీకారం చుట్టారు.

locations1754లో జరిగిన మరాఠీ దాడుల్లోనూ, 1781 లో ఫ్రాన్స్‌, బ్రిటన్‌ల మధ్య జరిగిన యుద్ధంలోనూ డచ్‌కోట పాక్షికంగా ధ్వంసమైంది. 1825 నాటికి భీమిలి రేవు పట్ట ణం బ్రిటిష్‌వారి వశమైంది. 1854లో ఇక్కడ రిప్పన్‌ కంపె నీని ప్రారంభించారు ఆంగ్లేయులు. అంతేకాకుండా ఈస్టిం డియా కంపెనీకి సంబంధించిన అనేక శాఖలు ఇక్కడే ప్రారంభమైనట్టు చెబుతారు. బ్రిటీష్‌ వారు చిట్టివలసలో స్థాపించిన బెల్లం కంపెని 1867లో జూట్‌ ఫ్యాక్టరీగా రూపాంతరం చెందింది. 1880లో పంచదార, నీలమందు ఫ్యాక్టరీలను ప్రారంభించారు.ఇంతింతై వటుడింతై అన్నట్లు దినదినప్రవర్తమానంగా వర్తక వాణిజ్యాలను అభివృద్ధిపరు చుకుంటూ... ఇక్కడ వ్యాపార లావాదేవీల కోసం ఇంపీరి యల్‌ బ్యాంకును కూడా నెలకొల్పారు. ప్రస్తుతం గెస్ట్‌ హౌజ్‌ గా ఉన్న ఆ బ్యాంకు భవనం పర్యాటకులకు కనువిందు చేస్తుంది.

చూడాల్సినవివీ...
భీమిలి కోట...
16-18 శతాబ్ధాల మధ్య యూరప్‌ నుండి మనదేశానికి వర్తకం చేసుకోవడానికి వచ్చి భీమిలిలో పాగా వేసిన డచ్‌ వారు 1624లో తొలిసారి ఇక్కడ అడుగుపెట్టినప్పుడు ప్రాంతీయులతో ఘర్షణపడ్డారు. ఆ ఘర్షణలలో 101 మం ది డచ్‌ సైనికులు 200 మంది ప్రాంతీయులు మరణించా రని విశాఖ శాసనాల వల్ల తెలుస్తోంది. ఆ తరువాత ప్రాంతీ యులకు డచ్‌ వారికి సంధి కుదిరిన తరువాత వర్తక, వాణి జ్యాలను అభివృద్ధి పరుచుకునే దిశగా 1661 లో ఇక్కడ ఒక కోట నిర్మించుకొన్నారు. ఈ కోట ఇప్పుడు శిధిలమైపో యి అవశేషాలు మిగలగా... ఈ కోటలో ఉన్న గడియారపు స్థంభం, టంకశాల మాత్రం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. అద్భుత నిర్మాణ శైలికి అద్దం పట్టిన ఆ కోట అందులో ఉన్న గడియారపు స్థంభం చూసి తీరాల్సిందే.

సెయింట్‌ పీటర్స్‌ చర్చి...
అప్పటి జిల్లా కలెక్టర్‌, మెజిస్ట్రేట్‌ అయిన రాబర్ట్‌ రీడ్‌ ఆధ్వ ర్యంలో జాన్‌ గ్రిఫిన్‌ 1855-64 సంవత్సరాల మధ్యకాలం లో ఈ చర్చిని నిర్మించారు. ఈ చర్చి నిర్మాణ శైలి, లోపలి వస్తువులు, తూర్పు వైపున ఉన్న కిటికి మీద ఏసుక్రీస్తుని శిలువ వేస్తున్న సంఘటను చిత్రించిన విధానం చూపరుల ను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతుంది. ఈ చర్చిలో చాలాకాలానికి ముందు నిర్మించిన పాలరాతి శిల్పాలు నయ నానందాన్ని కలిగిస్తాయి.

సముద్ర తీర అతిథి గృహం...
చిట్టివలస జూట్‌ కర్మాగారం ఆధీనంలో ఉన్న ఈ అతిధి గృహం లో డచ్‌ వారు నెలకొల్పిన ఇంపీరియల్‌ బ్యాంక్‌ ఉండేది. ఆ తరువాత ఈ చిట్టివలస జూట్‌ మిల్లు వారు దత్తత తీసుకొని ఈ గృహాన్ని చెక్కు చెదరకుండా కాపాడు తున్నారు. భీమిలి వైభవాన్ని చాటిచెప్పడానికి ఈ అతిథి గృహం ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. భీమిలి దర్శించడా నికి వచ్చిన ప్రతి సందర్శకుని లిస్టులో ఈ అతిధి గృహం మొదటిస్థానాన్ని ఆక్రమిస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

మునిసిపాలిటీ సత్రం, షిప్పింగ్‌ కార్యాలయం...
ఆంధ్రప్రదేశ్‌లోనే మొట్టమొదటి మున్సిపాలిటీ అయిన భీమిలిలో ఆనాడు నిర్మించిన మున్సిపాలిటీ సత్రం ఇప్పటికీ సేవలందిస్తోంది. రెండు రాళ్ళమీద మద్రాసు పెంకులతో కట్టిన ఈ కట్టడం ఎంతో పటిష్టంగా ఉంది.ఈ కట్టడంలో పురపాలక సంఘ కార్యలయం, నౌకాశ్రయ రవాణా కార్యా లయం ఒకే సముదాయంలో ఉన్నాయి. ఈ రెండు భవనా లు ఇక్కడి నౌకాశ్రయానికి సంబంధించిన ఎగుమతులు, దిగుమతులతో పూర్వవైభవాన్ని గుర్తు చేస్తాయి.

ద్వీప స్తంభం, డచ్‌ శ్మశానవాటిక...

కాకినాడకు శ్రీకాకుళం మధ్య నిర్మించబడిన ఎనిమిది ద్వీప సంభాలలో (లైట్‌ హౌజ్‌) ఇది ఒకటి. ఈ ద్వీప స్థంభం 18 వ శతాబ్ధపు భీమిలి నౌకాశ్రయ వైభవాన్ని తెలుపుంది. ఇప్పు డు నిత్యం ప్రజలకు సమయాన్ని తెలియజేస్తున్న గంటస్తంభం ఆంగ్లేయుల కాలంలో నిర్మిం చారు. అంతేకాకుండా అప్పటి పాలకులు స్మృతి చిహ్నంగా సముద్ర తీరంలో డచ్‌, ఫ్రెంచ్‌, బ్రిటన్‌ దేశస్తుల సమాధు లున్నాయి. పట్టణానికి పశ్చిమంగా నిర్మించబడిన ఈ శ్మశా నవాటిక... డచ్‌ వారు ఈ పట్టణంలో నివసించారని, ఇక్కడే మరణించారనడానికి ఈ సమాధులో సాక్ష్యాలుగా ఉన్నా యి. అంతేకాకుండా వీరి మరణానికి సంబంధించిన కార ణాలను తెలుపుతూ... ఈ స్మశానంలో వారిని ఖననం చేసి న ప్రదేశంలో రాతి ఫలకాలు ఉన్నాయి. బీచ్‌రోడ్డులో ఎర్ర మట్టి దిబ్బలు, బౌద్ధ విశేషాలను చాటిచెప్పే తొట్లకొండ, బావికొండ, పావురాల కొండ ఆనాటి చరిత్రకు ఆనవాళ్లుగా కనిపిస్తాయి.

భీమేశ్వరాలయం...

ఈ పట్టణంలో ఉన్న ప్రాచీన దేవాలయం భీమేశ్వరాల యం. ప్రధాన రహదారి పైన ఉన్న ప్రాచీన దేవాలయం 1170 శాలివాహన శకంలో నిర్మాణం జరుపుకుందని చారి త్రక ఆధారాలున్నాయి. చోళరాజులు దీనికి అనుబంధం గా చోళేశ్వరాలయాన్ని నిర్మించారు.

ఇలా వెళ్లండి...
విశాఖపట్టణానికి అతి సమీపంలో ఉన్న భీమిలికి తరు చుగా సిటీ బస్సులు నడుస్తుంటాయి. 24 కి.మి పొడవున దేశంలోనే పెద్ద బీచ్‌ రోడ్లలో ఒకటైన విశాఖ - భీమిలి బీచ్‌ రోడ్డుమీదుగా... ద్విచక్రవాహనాలపై సైతం చేరుకోవచ్చు. అంతేకాకుండా ప్రైవేట్‌ వాహనాలు కూడా అందుబాటులో ఉంటాయి. విమాన, రైలు మార్గం ద్వారా వచ్చే పర్యాటకు లు విశాఖ మీదుగా భీమిలి చేరుకోవచ్చు.
- ఎస్‌.కె

అందాల హరితవనం విల్లుపురం

తమిళనాడులోని ప్రముఖ పర్యాటక ేకంద్రాల్లో విల్లుపురం ఒకటి. ఇక్కడ దట్టమైన అడవిలో పచ్చదనంతో పరుచుకున్న కల్రాయన్‌ పర్వతశ్రేణుల్ని చూడడానికి రెండు కళ్ళూ చాలవు. పర్వత శ్రేణుల నడుమ వయ్యారంగా ప్రవహించే గోముఖీ నది, అడవి మధ్యలో సెలయేటి చప్పుళ్ళు, ఆహ్లాదాన్నిచ్చే పెరియార్‌, మేఘం జలపాతాలు, నిటారుగా దర్శనమిచ్చే కల్రాయన్‌ పర్వత శిఖరాలు, అడుగడుగునా ఆహ్లాదపరిచే ప్రాంతాలు, పురాతనమైన కట్టడాల శోభతో... పర్యాటకులకు విశేషంగా ఆర్షిస్తున్న విల్లుపురంలో ఊటీని మించిన అందాలున్నాయంటే అతిశయోక్తి కాదు.


Kalrayan-Hillsప్రకృతి సౌందర్యాదిదేవత ఇక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకుందా..?! అన్నట్లుండే విల్లు పురం సౌందర్యాన్ని ఎంతసేపు చూసినా తనివితీరదు. తమిళనాడు రాష్ట్రంలో రెండో అతిపెద్ద జిల్లా అయిన విల్లుపురం..తిరుచ్చి-చెన్నై హైవేలో జిల్లా కేంద్రంగా విరాజిల్లుతోం ది. కనువిందు చేసే పచ్చటి కొండలు, చారిత్రాత్మకమైన ప్రాచీన నిర్మాణాలు, ఆలయాలు, చర్చిలు, మసీదులు, కోటలు, రాజమందిరాలు.. ఇలా ఒకటేమిటి, అనేక పర్యాటక ప్రదేశా లను కలిగి ఉన్న ఈ ప్రాంతానికి బస్సు, రైలు సౌకర్యాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్నాయి.

చూడాల్సినవివే...
కల్రాయన్‌ కొండలు ఇక్కడ ప్రధానంగా చూడాల్సిన పర్యాటక ప్రదేశం, కళ్లకుర్చి నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉండే కల్రాయన్‌ కొండల అందాలను చూసి తరించేందుకు కళ్లకుర్చి నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయి. సముద్రమట్టం నుంచి 3,500 కిలోమీటర్ల ఎత్తులో ఉండే పశ్చిమ కనుమలలో కొలువుదీరిన కల్రాయన్‌ కొండలు ఊటీని తలపించే చల్లటి వాతావరణంతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.దట్టమైన అడవి, సెలయేళ్ల పరుగులు, వనమూలికావనం, గోముఖీ నది పర్యాటకులను పరవశింపజేస్తున్నాయి. రాష్ట్ర పర్యాటకశాఖ ఏర్పా టు చేసిన ఎకో టూరిజం స్పాట్లు కూడా పర్యాటకులకు ప్రకౄఎతిమధ్య ఆహ్లాదం తోపాటు, సేదదీర్చే కేంద్రాలుగా ఉన్నాయి. కల్రాయన్‌ కొండల్లో పలు ప్రాంతాల్లో జలపాతాలున్నప్పటికీ, వాటిలో కొన్నింటిలో మాత్రమే స్నానాలు చేసేందుకు వీల వుతుంది.

పెరియార్‌ జలపాతం:
Megam-Waterfalls గోముఖీ డ్యాం నుంచి సుమారు 15 కిలోమీటర్ల దూరం లో ఉన్న పెరియార్‌ జలపాతం పర్యాటకులకు గొప్ప అనుభూతిని అందిస్తుంది. గోముఖీ డ్యాం-కరియలూర్‌కు బస్సుమార్గంలో వెళితో ఈ ప్రాంతాన్ని చేరుకోవ చ్చు. రోడ్డుపక్క్రనే ఉన్న ఈ జలపాతంలో జలకాలాడవచ్చు కూడా. ఇక్కడి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో కరియలూర్‌ ఉంటుంది. పెరియార్‌ జలపాతం నుం చి కరియలూరుకు వెళ్లే మార్గంలో పచ్చని కొండ ప్రాంతాలు కనువిందు చేస్తాయి. ఇక్కడ పర్యాటకుల కోసం విడిది గృహాలు కూడా అందుబాటులో ఉన్నాయి. పెరియార్‌ జలపాతం నుంచి 5 కిలో మీటర్ల దూరం ప్రయాణిస్తే వెల్లిమలైకి చేరుకోవచ్చు. అక్కడినుంచి మరో ఐదు కిలోమీ టర్ల దూరం వెళితే సంవత్సరమంతా పుష్కళంగా నీరు లభించే మేఘం జలపాతం దర్శించవచ్చు.

జింజికోట: విజయనగర పాలకులు నెల్లూరును పరిపాలించిన కాలంలో మూడు కొండలపై నిర్మితమైన ఈ జింజికోటను... రాజధానిగా చేసుకుని పాలించారు. కృష్ణగి రి, చక్కిలిదుర్గ, రాజగిరి అనే కొండలు ముక్కోణం ఆకారంలో వెలిశాయి. వాటిపై జింజికోటను అద్భుత శిల్పకళా నైపుణ్యంతో నిర్మించారు. ఈ కోటలో ఇండో- ఇస్లామిక్‌ రీతిలో నిర్మించిన కళ్యాణ మండపం విశేషంగా ఆకట్టుకుంటుంది. కోట ముఖద్వారం వద్ద నిర్మించిన వేణుగోపాల స్వామి ఆలయం నేటికీ పూజలందుకుం టోంది. హనుమాన్‌ ఆలయం, రంగనాథ్‌ దేవాలయం, ఉల్లాఖాన్‌ మసీదు, కమలకన్ని ఆలయాలను మొగల్‌ చక్రవర్తులు, విజయనగరరాజులు ఇక్కడ నిర్మించారు.

Periar-Waterfalls1012 లో రాజేంద్రచోళుడు నిర్మించిన రామనాథ ఈశ్వరాలయం, బ్రహ్మ ఇస్లాం ఆలయం గా ప్రసిద్ధి చెందింది.విల్లుపురానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువాక్కరైలోని నేషనల్‌ జియోలాజికల్‌ పార్క్‌ చూడదగ్గ మరో పర్యాటక ప్రదేశం. ఈ పార్కు వేలా ది రకాల చెట్లతో అందరినీ ఆకర్షిస్తోంది. దీనికి దగ్గర్లోనే చోళ చక్రవర్తుల పాలనలో సెంబియాన్‌ మహదేవర్‌ అనే మహారాణి శివాలయాన్ని నిర్మిం చారు. శ్రీ చంద్రమౌళీశ్వరుడు తనాంబిక తీరంలో శ్రీ వక్రలింగేశ్వరుడు, వక్రకాళి అమ్మవారితో కొలువుదీరారు.

రాయలవారు దానమిచ్చారట..!
విల్లుపురంలో సుమారు 600 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించిన కల్రాయన్‌ కొండ ప్రాంతాన్ని విజయనగర సామ్రాజ్యాధిపతి శ్రీకృష్ణ్ణదేవ రాయలు కాంచీపురం నుంచి వలస వచ్చిన కర్లర్‌ అనే గిరిజన తెగవారికి దానంగా ఇచ్చారని చరిత్ర చెబుతోంది. రాయలవారి హయాంలో నిర్మిం చిన కట్టడాలు అనేకం నేటికీ విల్లుపురంలో దర్శనమిస్తుండటం దీనికి నిదర్శనంగా చెప్పవచ్చు.

బౌద్ధ ప్రాశాస్త్యాన్ని చాటిన... భట్టిప్రోలు

రాష్ట్ర చరిత్రలో ప్రాచీనాంధ్ర నగరమైన భట్టిప్రోలుది విశిష్టస్థానం. ఎంతో ప్రాముఖ్యత కలిగిన ప్రపంచ బౌద్ధారామాలలో ఒకటిగా కీర్తించబడితున్న బౌద్ధ స్థూపం ఇక్కడ ఉంది. క్రీపూ 4-3 శతాబ్దాల నాటి ఈ స్థూపం... భవననిర్మాణ రీతుల్లోని ప్రథమ దశలను ప్రతిబింబిస్తుంది. ఇక్కడ లభించిన శాసనాలు ప్రజాస్వామిక విలువలకు నెలవెైన గణతంత్ర రాజ్యంగా భట్టిప్రోలు ఉనికిని బలపరుస్తున్నాయి. గౌతమ బుద్ధుడు, జెైన తీర్థంకరుడెైన మహావీరుడు దర్శించినట్టుగా చెప్పబడుతున్న గుంటూరు జిల్లాలోని ఆ అద్భుత చారిత్రక క్షేత్రం ‘భట్టిప్రోలు’ వెైశిష్ట్యం ......


Bhattiproluభట్టిప్రోలు ప్రాచీననామం ప్రతీపాలపురం. ఆంధ్ర శాతవాహనుల కాలానికి పూర్వం నుండే ఉన్న ప్రముఖ నగరం ఇది. సారవంతమైన కృష్ణానది మైదానంలో... సముద్రతీరానికి సమీపానగల ఈ ప్రాచీన నగ రం... అక్కడ తవ్వకాలలో బయటపడిన బౌద్ధ స్థూపం ద్వారా అంతర్జాతీయ ఖ్యాతినార్జించింది. భట్టిప్రోలుకు సమీపంలో ఉన్న పోతవరలంక వరకు పెద్ద పడవలు, నౌకలు వచ్చేవనీ, అక్కడి నుండి వరి ధాన్యము, దినుసులు, వస్త్రాలు ఎగుమతి అవుతుండేవనీ, జౌళి పరిశ్రమకు, వాణిజ్యానికి కేంద్రంగా ఈ నగరం విరాజిల్లిందని చరిత్రకారుల అభిప్రాయం. ప్రతీపాలపురం, ప్రితుడనగరం, పిటిండ్ర ఇలా భట్టిప్రోలు అనేక పేర్లున్నాయి. క్రీశ 8వ శతాబ్దానికి చెందిన జెైనకవి నయసేనాని వ్రాసిన ‘ధర్మామృత’ కావ్యంలో ప్రతీపాలపురం ప్రసక్తి ఉంది.

Stupaఇది క్రీశ 5వ శతాబ్దంలో జరిగిన కథ. ఇక్ష్వాకు రాకుమారుడెైన యశోధరుడు దక్షిణదేశానికి వలస వచ్చి ప్రతీపాలపురం రాజధానిగా పాలన చేశాడు. ఇతని వారసుడు ధనదుడు జెైన మతాన్ని వదిలి బౌద్ధురాలెైన కమల శ్రీని పెళ్ళి చేసుకుంటాడు. ఈ కథ బృహత్కథాకోశంలో కూడా ఉంది. ధనదుడు తన పేర ధనదపురం నిర్మించాడనీ, అదే నేటి చందోలు అని చరిత్రకారుల అభిప్రాయం. భట్టిప్రోలులో లభించిన శాసనాలలో ‘కుబీరక’ రాజు ప్రసక్తి ఉంది. ధన దుడి కి కుభీరక, కుబేర అనే పేర్లు కూడా ఉన్నాయి. జెైన రాజెైన ఖారవేలుడు పితుడ్రనగరంలోని బౌద్ధే త్రాన్ని గాడిదలతో దున్నించి నాశనం చేశాడని ‘ఖారవేలు’ని శాసనాల్లో చెప్పబడినది. ఆ శాస నాల్లో పితుడ్రనగరం భట్టిప్రోలేనని చరిత్రకా రులు భావిస్తున్నారు.

చారిత్రక శిథిలాలు...
క్రీస్తుపూర్వం 3వ శతాబ్దికి చెందిన భట్టిప్రోలు స్థూపం చరిత్ర తెలుసుకునేందుకు భారతీయులకంటే విదే శీయులే ఎక్కువ ఆసక్తి కనబరిచారు. క్రీశ 1870లో బోస్‌వెల్‌, 1871లో ఇర్లియట్‌, 1882లో రాబర్ట్‌ సెవెల్‌ అనే విదే శీయులు భట్టిప్రోలును సందర్శించారు. 1892లో అలెగ్జాండర్‌ జరిపిన తవ్వకాల్లో రాతి ధాతుకరండాన్ని కనుగొన్నారు. 1969-70 సంవత్సరాల్లో పురావస్తు శాఖ తరపును ఆర్‌. సుబ్రహ్మణ్యం తవ్వకాలు జరిపారు. అప్పుడు ఒక విహారపు పునా దులు బయటపడ్డాయి. బుద్దుని తల ప్రతిమ వెలుగుచూసింది. పలు ఇతర వస్తువులు లభ్యమయ్యాయి. పురావస్తు శాఖ అంచ నా ప్రకారం క్రీపూ 3వ శతాబ్దంలో ఇది నిర్మాణం జరిగిందని తెలుస్తోంది. లాంజ దిబ్బ, విక్రమార్కకోట దిబ్బ అని పిలువబడే మట్టిదిబ్బలు తవ్వగా స్థూపం, కోట గోడలు కనపడ్డాయట.

స్థూపప్రాకారంలో చలువరాతి పలకలు, గోడలో ఇమిడిన నలుచదర పు స్థంభాలు, ఆయక వేదికలు, చక్కగా చెక్కిన బొమ్మలు ఉన్నాయి. ఆయక స్థంభం ఎత్తు 15 అడుగులు. వాటిపెై మనుషుల, జంతువుల బొమ్మలు చెక్కి వున్నాయి. ప్రదక్షిణాపథానికి అంచున 4 అడుగుల ఎత్తువరకు పాలరాతి గోడ ఉండేది. ఇక్కడి స్థూపం 132 అడుగులు, వేదిక 148 అడుగుల వ్యాసాలతో ఉంది. 8 అడుగుల ఎత్తు, 8.4 అడుగుల వెడల్పు, ప్రదక్షిణా పథం నలుదిక్కులా అయకపు అరుగులు కలిగిన ఈ స్థూపం వాస్తురీత్యా నూతన విషయాలను అందించిందని చెబుతారు.

భట్టిప్రోలు స్థూప తవ్వకాల్లో బయటపడిన ధాతువుల్ని అప్పటి బిట్రీష్‌ ప్రభుత్వం భద్ర పర్చింది. 1892వ సంవత్సరంలో కలకత్తాలో స్థాపించిన ‘మహాబోధి సొసైటీ ఆఫ్‌ ఇండియా’కు నూతన స్థూపంలో నిక్షిప్తం చేసేం దుకు వాటిని ఇవ్వటానికి అంగీకరించింది. 1893లో అమెరి కాలో జరిగిన విశ్వమత మహాసభలకు హాజరెైన శ్రీలంక బౌద్ద బిక్షువు అనగారిక ధర్మపాల ఈ సంస్థను స్థాపించారు. 1920వ సంవత్సరంలో కల కత్తాలోని ‘శ్రీధర్మ రాజి క విహార్‌’లోని నూతన స్థూపంలో భట్టిప్రోలులోని బుద్ద ధాతువులున్న స్పటిక పేటికను నిక్షిప్తం చేశారు. అంత టి ప్రాముఖ్యతగల ఈ చారిత్రక ప్రదేశంపెై ప్రభుత్వం దృష్టిపెట్టకపోవడం విచిత్రం.

స్థూప విశిష్టత...
భట్టిప్రోలు స్థూపాన్ని ధాతుగర్భం అంటారు. అనగా బుద్ధుని ధాతువులపెై నిర్మించబడినది అని అర్థం. శాసనాల్లోని ‘బుద్ధ శరీ రాని నిఖేతుం’, ‘బుద్ధ శరీరాని మహనీయాని కమ్మనే’ అనే వాక్యాలనుబట్టి స్థూపం యదార్ధమైన బుద్ధ ధాతువుపెై నిర్మించబడినట్లు స్పష్టమవుతోంది. స్థూపం మధ్య రంధ్రం ఉన్నది. రంధ్రం చుట్టూ ఇటుకలను పద్మాకారములో అమర్చారు. రంధ్రంలో స్థూపం పెైన ఉండే ఛత్రపుకాడను అమర్చారు. రంధ్రం గుండా మూడు బండరాతి పేటికలు (శిలా మంజూషికలు) లభించాయి.

ఆంధ్రులు ఒక విశిష్టమైన స్థూప నిర్మాణశెైలిని అభివృద్ధి చేశారు. ఇందు ఆయక స్థంభాలు ప్రధానమైన సాక్ష్యాలుగా నిలుస్తు న్నాయి. చక్రాకార స్థూపనిర్మాణం భట్టిప్రోలులో ప్రారంభమై అమరావతి, నాగార్జునకొండ స్థూపాల్లో పరిణితి చెందింది. చక్రా కార వెైశిష్ట్యం ఏమిటంటే, స్థూపానికి పటుత్వం, పవిత్ర ధర్మచక్ర ప్రతిష్ఠ. అనగా నిర్మాణ సౌష్ఠవం, ధర్మభావ వ్యక్తీకరణల మేళ వింపు. చక్రాకార స్థూపంలోని ఆకుల సంఖ్య ధర్మభావాలకు ప్రతీకలుగా చెబుతారు.

శాసనాలు...
భట్టిప్రోలు శాసనాల్లోని భాష... ప్రాకృతం, లిపి... బ్రాహ్మీ భేదము. రాతిపేటికలు, స్ఫటికపు మంజూషిక, వెండిరేకు, స్ఫటికపు పూసపెైన 10 లేఖనాలు లభించాయి. ఈ శాసనాల వల్ల స్థానిక సభ దానధర్మాల్లో భాగస్వామ్యం వహించినట్లు తెలుస్తున్నది. సింహగోష్ఠి అనేది స్థానిక సంస్థ (నాలుగవ పేటిక). గోష్టి సభ్యులందరి పేర్లూ ఇందులో ఉన్నాయి. సింహగోష్ఠి అధ్యక్షుడు కుభీర కుడు (కుబేర, కుభిరక, కుభిర). బుద్ధుని శరీర ధాతువులు నిక్షిప్తం చేసేందుకు ‘కుర’ అనే అతడు పేటిక చేయించాడు (మూడ వ పేటిక). ఐదవ పేటిక శాసనంలో ‘రాజా కుబేరక’ అని ఉంది.

భాష, లిపి...
Lipiస్థూపంలో దొరికిన ధాతుకరండముపెై మౌర్యకాలపు బ్రాహ్మీ లిపిని పోలిన లిపిలో అక్షరాలున్నాయి. ఈ లిపిని భాషాకారులు భట్టిప్రోలు లిపి అంటారు. దక్షిణ భారతదేశ లిపులన్నీ ఈ లిపినుండే పరిణామం చెందాయి. బౌద్ధ మతంతోబాటు భట్టిప్రోలు లిపి కూడా దక్షిణాసియా ఖండంలో వ్యాపించి బర్మా, మలయా, థాయి, లావోస్‌, కంబోడియా మొదలెైన భాషలకు లిపి ప్రదానం చేసింది. తెలుగు దక్షిణ భాషా కుటుంబానికి మూలం ద్రవిడం. దీనినుండి క్రీపూ 5-4 శతాబ్దాలలోనే విడివడి ప్రత్యేక రూపురేఖలను సంతరించుకుందని పండితుల అభిప్రాయం. నేటి తెలుగు లిపికి ‘మాతృక’గా పరి ణామక్రమం లో మొదటిదిగా ‘భట్టిప్రోలు లిపి’ ని పేర్కొంటారు. స్థూపంలో బుద్ధుని ధాతు అవశథష భాగా లను భద్రపరచారని భావించే శిలా మంజూషికల మీద ఈ లిపి వ్రాయబడింది.

ఆ లిపి తెలుగు, ప్రాకృత లిపులకు ఆద్యమైనదిగా చెబుతారు. భాషా పరిశోధకుల ఆభిప్రాయం ప్రకారం ఈ లిపి క్రీపూ500 కాలంలో అభివృద్ధి చెందింది. తరువాత దక్షిణాపధంలో క్రీపూ300 నాటికి భట్టిప్రోలులో ప్రస్తుతం ఇక్క డ మనకు కనిపించే రూపం సంతరించుకొంది. శాసనాలలో దక్షిణ మౌర్యలిపికి చెందిన 23 అక్షరాలున్నాయి. గ, శ అనే అక్షరాలు మౌర్యలిపి లాగానే ఉన్నాయి. భ, ద అనే అక్షరాలు నేటి తెలుగు వర్ణాలకు దగ్గరగా ఉన్నాయి. ఘ, జ, మ, ల, ష అనే ఐదు అక్షరాలు చాలా వెైపరీత్యంతో కన్పిస్తున్నాయి. గ, మ అనే వర్ణాలు మౌర్యుల లిపి కన్నా ప్రాచీన రూపంగా ఉన్నాయి. అశోకుని శాసనాలలో కనిపించిన ‘ళ’ ఇక్కడ ఉంది. వీటిని బట్టి చూస్తే ఈ శాసనాలు ఆశోకుని శాసనాలకన్నా ప్రాచీనమైనవని భావించవచ్చు. ఇంతటి చారిత్రక వెైభవం కలిగిన భట్టిప్రోలు మనకు ప్రాచీనులు అందించిన జ్ఞానభండాగారమని చెప్పకతప్పదు.

- ఎస్‌.కె

Sunday, September 5, 2010

తిరగండి... ఈ మట్టిని తిలకంగా ధరించండి *

"ఆవో బచ్చో తుమ్హే దిఖాయే ఝాంఖీ హిందుస్థాన్ కీ
ఇస్ మిఠ్ఠీసే తిలక్ కరో ఏ ధర్తీ హై బలిదాన్ కీ''


కవి ప్రదీప్ 1954లో జాగృతి సినిమా కోసం రాసిన ఈ పాట ఈ రోజుకూ కర్తవ్యబోధ చేస్తున్నది. లక్షలాది త్యాగధనుల రుధిర ధారలతో తడిసిన హిందుస్థాన్ దృశ్యాలను చూద్దాం రండి. ఆ మట్టిని నుదుట తిలకంగా పెట్టుకొందాం రండి అని ప్రదీప్ ఆనాడే బాలురకు సందేశమిచ్చారు. దేశంలో రెండు వందల ఏళ్ళు వ్యాపారం చేసి, మరో రెండు వందల ఏళ్ళు రాజ్యాధికారం నడిపిన బ్రిటిష్ సామ్రాజ్యవాదంపై పోరాటంలో పలుచోట్ల అగ్నిపర్వతాలు బద్దలైనాయి. ముఖ్యంగా సిపాయిల తిరుగుబాటు మే 10, 1857న మీరట్‌లో మొదలైన తరువాత ఢిల్లీ, బెనారస్, ఆగ్రా, పాట్నా, లక్నో, అలహాబాద్, జబల్పూర్, ఝాన్సీ, బందా, ఇందోర్, పూనె, రేవా ఒక్కటేమిటి పెషావర్ నుంచి కలకత్తా వరకు. హిమాలయాల నుంచి మొగిలిగిద్ద (ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లా) వరకు అడుగడుగునా ఫిరంగులు పేలాయి.

వేలాది ఖైదీలను ఫిరంగుల నోళ్ళకు కట్టి పేల్చి వేశారు. అందుకే క్రూరులైన బ్రిటిష్ సైనికాధికారులను ఉత్తరాది వారు 'ఫిరంగీ'లని ఈసడించేవారు. కాని దేశం క్రమంగా ఈ వీరులను విస్మరిస్తున్నది. వారి త్యాగాలను మరచిపోతున్నది. ఈ కృతఘ్నత మన దేశానికే పరిమితం కాలేదు. అన్ని దేశాల్లోనూ ఈ జాడ్యం విస్తరిస్తున్నది. అందుకే చాలా యూరోపియన్ దేశాల్లో వాలర్ (శౌర్యం) టూరిజంను ప్రోత్సహిస్తున్నారు. మన దేశంలో కూడా "శూరులను తలచుకొని, వీరులను కొలుచుకునే'' యాత్రలను ప్రభుత్వాలు, పౌరసంఘాలు ఆరంభించడం అవసరం.

ఈ యాత్రల వల్ల ప్రజల్లో జాతీయతాభావాలు పొటమరిస్తాయి. స్వాతంత్య్రం వచ్చే నాటికి బహదూర్‌షా జఫర్ కృషి వల్ల కొంత, నానాసాహెబ్, తాంతియాతోపే వంటి దేశభక్తుల కృషి వల్ల కొంత జాతీయభావాలు వ్యాప్తిచెందాయి. అనేక భాషలు, సంస్కృతులు, కులాల కింద విభజితమైన జాతిలో స్వాతంత్య్ర పోరాటం ఒక మానసిక తాదాత్మ్యతను సృష్టించింది. స్వాతంత్య్రం వచ్చేనాటికే 560 సంస్థానాలుగా విడిపోయి భిన్నభిన్న రాజకీయ, ఆర్థిక సంస్కృతులతో జీవిస్తున్న ప్రాంతాలు క్రమేపీ భారత రిపబ్లిక్‌లో విలీనమైనాయి. కాని పూసల్లో దారం వలె జాతులన్నిటి మధ్యన సోదరభావాన్ని సృష్టించడంలో మాత్రం పాలకులు క్రమేపీ విఫలమవుతూ వచ్చారు.

అందువల్లే దేశంలో జాతీయభావం కన్నా ప్రాంతీయభావం పైచేయిగా ఉంది. అందుకే భారతమాతకు పోటీగా తెలుగుతల్లి, తెలంగాణ తల్లి, కన్నడ తల్లి, మరాఠీ తల్లి అంటూ సవతుల పోటీ మొదలుపెట్టారు. భారతమాతకు, జాతీయగీతానికి, జాతీయభాషకు పోటీపెట్టడమంటే జాతీయవాదానికి తూట్లు పొడవడమే. జాతీయ ఉద్యమం లక్ష్యాలను అన్ని రాజకీయ పార్టీలు విస్మరించడం వల్లే ప్రజాతంత్రం క్షీణించి, చోరతంత్రం (KLEPTOCRACY)గా దిగజారుతున్నది. ప్రజలతోగాని, ప్రజాసేవతోగాని సంబంధం లేని వ్యాపారులు, కాంట్రాక్టర్లు ప్రజాప్రతినిధులై చట్టసభలతో ఊడిగం చేయించుకుంటున్నారు. ప్రజలను కష్టాలపాలు చేస్తున్నారు. ప్రభుత్వాలకు, వాటి విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేసే ప్రజాసంఘాలు తమ రాజకీయ, ఆర్థిక లక్ష్యాలకు దిక్సూచిగా జాతీయ ఉద్యమాన్ని నిలుపుకుంటే, వాటికి నిరంతర ప్రేరణ, స్థిరత్వం లభిస్తాయి.

సోంపేట ఉద్యమమైనా, తెలంగాణ ఉద్యమమైనా, ఏ వామపక్ష పోరాటమైనా భగత్‌సింగ్‌నో, వీర్‌సావర్కర్‌నో, వాసుదేవ్ బల్వంత్ పడ్కేనో తలచుకోకపోతే ఆ ఉద్యమం చుక్కాని లేని పడవలో తెడ్డులేని నావికుడు ఒడ్డులేని సముద్రంలో దారీతెన్నూ లేకుండా సాగిపోయినట్టు ఉంటుంది. ఏ ఉద్యమకారులైనా విధిగా మంగళ్‌పాండే పోరాటం మొదలుపెట్టిన కలకత్తాలోని బ్యారక్‌పూర్‌ను ఒక యాత్రాస్థలి చేసుకోవాలి. ఒక ప్లాసీ (పలాస-మోదుగపూవు), ఒక చిట్టగాంగ్, ఒక కాకోరీ, ఒక లాహోర్, ఒక ఝాన్సీ, ఒక మీరట్, ఒక అమృత్‌సర్, ఒక అంబాలా ఈ ఉద్యమాలకు చుక్కాని కావాలి. ఢిల్లీ కాశ్మీర్ గేటు వద్ద ఉన్న సిపాయి తిరుగుబాటుదార్ల స్మారకస్థూపం పోరాటాలకు దీపస్తంభం కావాలి.

వీర శివాజీ మొదలు యశ్వంత్‌రావ్ హోల్క ర్, నానాసాహెబ్, క్రాంతివీర్ లహూజీ ఉస్తాద్ సాల్వే, వాసుదేవ్ పడ్కే, బాలగంగాధరతిలక్, వీర్ సావర్కర్ సోదరులు, జ్యోతిరావు పూలే, బిఆర్ అంబేద్కర్ వరకూ అనేకమంది వీరయోధుల పుట్టినిల్లు పూనె నగరం మన పక్కనే ఉన్న సంగతి ఉద్యమకారులు మరచిపోరాదు. కర్ణాటకలోని కిత్తూరు రాణి చెన్నమ్మ, ఆమె సైన్యాధిపతి సంగోలి రాయన్న, మన చిత్తూరు వీరుడు వీరపాండ్య కట్ట బొమ్మన నేటికీ స్ఫూర్తిప్రదాతలే.

హైదరాబాద్‌లో కోఠీ రెసిడెన్సీ మీద 1857లో మౌల్వీ సయ్యద్ అల్లావుద్దీన్, తుర్రేబాజ్‌ఖాన్‌ల నాయకత్వంలో 500 మంది సాయుధులు ఫిరంగులతో దాడిచేసి లోపల బందీగా ఉన్న చీదాఖాన్‌ను విడిపించే ప్రయత్నం చేశారు. తుర్రేబాజ్‌ఖాన్‌ను పట్టుకుని కాల్చి చంపి, స్తంభానికి శవాన్ని వేలాడదీసి కాకులు, గద్దలకు ఆహారంగా పెట్టారు. మౌల్వీ అల్లావుద్దీన్‌ను 1859లో అండమాన్‌కు ప్రవాసం పంపారు. వీరి చరిత్రను సుదీర్ఘ పరిశోధన తరువాత వెలికితీసిన ఒకనాటి మేయర్ కృష్ణస్వామి ముదిరాజ్, ఇతర కౌన్సిలర్లు కోఠీలో స్మారకస్థూపం కట్టిస్తే, స్వాతంత్య్ర స్ఫూర్తిలేని నేటి కార్పొరేటర్లు ఆ వీరులను మరచి ఢిల్లీ స్టార్ హోటళ్లలో రాంకీ సంస్థ కార్పొరేట్ ఆతిథ్యంలో మునిగి తేలుతున్నారు. కోఠీ రోడ్డు పేరు తుర్రేబాజ్‌ఖాన్ రోడ్. చాదర్‌ఘాట్ నుంచి అఫ్జల్‌గంజ్ వరకూ వెళ్లే రోడ్డు పేరు మౌల్వీ అల్లావుద్దీన్ రోడ్. వీరి పేర్లను సూచించే బోర్డులు ఎక్కడా లేవు. ఒక్క కార్పొరేటర్‌కు కూడా ఇది పట్టదు. రాంకీ ప్రయోజనాలే వారికి ముఖ్యం.

ప్రజాప్రతినిధులకు, అధికారులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు శౌర్యయాత్రలు తప్పనిసరి చేయాలి. జలియన్‌వాలా బాగ్ నుంచి అండమాన్ సెల్యులార్ జైలు వరకూ పర్యటనలు తక్కువ ఖర్చులో జరిగేట్లు వసతులు కల్పించాలి. జలియన్‌వాలా బాగ్‌లో రెండు వేల మంది దేశభక్తులు బ్రిటిష్ సైనికుల తుపాకీ గుళ్ళకు ఎలా బలైనారో చూపించాలి. సెల్యులార్ జైల్లో వీర్‌సావర్కర్‌తో సహా వేలాది దేశభక్తులు ఎంత నరకం అనుభవించారో వివరించాలి. ఇది చదువుకుంటే తెలిసేది కాదు. చూస్తేనే అనుభూతి. నిజామాబాద్ నుంచి సహాని సోదరులు ఏడాదికి రెండుసార్లు ఈ జైలు చూడ్డానికి వెళతారు.

కేవలం కంటినిండా ఏడవడానికే ఈ సోదరులు ఇక్కడికి వస్తారని అక్కడి గైడ్ మండల్ చెప్పారు. కన్నీరు పాపాలను కడిగివేస్తుంది, కర్తవ్యబోధ చేస్తుంది. అండమాన్‌కి వెళ్లేవారు సెల్యులార్ జైలుకన్నా అందమైన హావెలాక్ బీచ్‌కే ప్రాధాన్యమివ్వడం శోచనీయం. మరో ఘోరం ఏమిటంటే 1857లో వేలాదిమంది దేశభక్తులను లక్నోలో, కాన్పూర్‌లో ఫిరంగి నోళ్లకు కట్టి పేల్చివేసిన బ్రిటిష్ అ«ధికారి హెన్రీ హావెలాక్ పేరు ఆ అందమైన దీవికి ఇంకా కొనసాగడం. జైల్లో మగ్గిన ఒక కూకావీరుని పేరో, ఒక వాహబీశూరుని పేరో, ఒక గదర్ ఖైదీ పేరో ఈ దీవికి పెట్టాలని దేశభక్తులు ఎందరు కోరినా చెవిటివాని ముందు శంఖం ఊదినట్లే ఉంది. బ్రిటిష్ ప్రభుత్వం మీద వేయి మంది గోండులతో, 400 మంది రొహిల్లాలతో గెరిల్లా దాడులు చేసి, నిర్మల్‌లో ఊడకొకరు చొప్పున వెయ్యి ఊడల మర్రికి ఉరి వేయబడ్డ రాంజీ గోండ్, హాజీల బలిదాన ప్రాంతాలు, రంప, అల్లూరి సీతారామరాజు పోరాట స్థలాలు, జోడెన్‌ఘాట్‌లో కొమరం భీమ్ అమరుడైన స్థలం, బైరాన్‌పల్లి, కడవెండి, విస్నూరు వంటి వీరగడ్డలు మన రాష్ట్రంలో కోకొల్లలు.

స్వాతంత్య్ర పోరాటంలో ఏ ఘట్టానికీ తీసిపోనివి మన రాష్ట్రంలో జరిగిన పోరాటాలు. దేశభక్తులు జీవితమంతా బరిసెలు, బాణాలు ఎదిరిస్తూ కత్తుల కోలాటం ఆడారు. దేశమంతటా గాలిలో శౌర్యం ఆవరించింది. ప్రతీరాయి ఒక నిప్పు కణిక అయింది. మట్టిలో తుఫానును బంధించి, నెత్తుటి హోలీ ఆడారు. వీరి త్యాగాలను మరిచిపోయిన నాయకత్వం ఉదాసీనంగా మారింది. సుఖాల వెంట, ఆస్తుల వెంట పరుగెత్తుతున్నది. విందులు, వినోదాలకు మరిగింది. ఈస్టిండియా కంపెనీలు దాడికొచ్చినప్పుడు, 1857లో సిపాయిలు తిరుగుబాటు చేసినప్పుడు విద్యావంతులు సరిగ్గా ఇదే మానసిక స్థితిలో ఉన్నారు. అందువల్లే దేశాన్ని ప్రస్తుతం పీడిస్తున్న అనేక అంశాల పట్ల విద్యాధికుల్లో ఉదాసీనభావం నెలకొన్నది. ఇది ప్రమాద సూచిక.

ఈ నేపథ్యంలో శౌర్యయాత్రలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. కరువులు, వలసలు, ఆకలిచావులు, నైరాశ్యం వల్ల ఆత్మహత్యలు ఆగాలంటే దేశభక్తులు ఎన్ని కష్టనష్టాలు ఓర్చుకున్నారో ఈ తరానికి తెలపాలి. జీవితంలో సంతోషం కొరవడితే, రేపయినా సంతోషం లభిస్తుందనే ఆశ సన్నగిల్లితే ఆత్మహత్యలు అధికమవుతాయి. శౌర్యయాత్రలు మాత్రమే యువతలో స్థయిర్యాన్ని నింపుతాయి. శౌర్యయాత్రలు చేసే విద్యార్థులకు, యువతకు రైల్వే శాఖ రాయితీ కల్పించాలి. యాత్రాస్థలాల్లో చౌకగా సరాయిలు, సత్రాల వసతి కల్పించాలి. కొత్తగా నియామకమైన అఖిల భారత సర్వీసుల అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఏర్పాటుచేసే దేశాన్ని అవగతం చేసే పర్యటన (Familiarisation tours) లలో ఈ శౌర్యయాత్రలను కూడా చేర్చాలి.

దేశమంతా ఒక్కటేననే భావం కలిగితే ఉద్యమకారుల్లో పరస్పర విద్వేషభావం తొలగిపోతుంది. జాతీయభావాల స్ఫూర్తి చుక్కానిగా ఉద్యమాలు సాగుతాయి. ఏ విదేశీ శక్తీ దేశం వైపు తేరిపార చూసే దుస్సాహసం చేయదు. దేశానికి ఒక జెండా, డండా(కర్ర), ఒక సైన్యం, ఒక జాతీయత, ఒక నినాదం (మారో ఫిరంగీ కో), ఒక నాయకత్వం ఇచ్చిన సిపాయిల తిరుగుబాటు నుంచి జాతి నిరంతర ప్రేరణ గ్రహించవలసి ఉంది. వయసు, ఆరోగ్యం సహకరించకున్నా జాతి నాయకత్వ బాధ్యతను స్వీకరించి కొడుకులను, మనమణ్ణీ కోల్పోయి రంగూన్‌లో రెండు గజాల సమాధి స్థలం కోసం పరితపించిన బహదూర్ షా జఫర్ కవితను స్మరించుకోవడం అవసరం.

"ఘాజీయోఁ మే బూ రహేగీ జబ్ తలక్ ఈమాన్ కీ
తఖ్త్ - ఏ - లండన్ తక్ చలేగీ తేగ్ హిందుస్థాన్ కీ''
(మన యోధుల్లో నిజాయితీ గంధం ఉన్నంతవరకూ మన దేశ ఖడ్గం లండన్ సింహాసనం వరకూ పయనిస్తూనే ఉంటుంది.) ఇది మరచిపోతే ఏ విదేశీ ఖడ్గమైనా హస్తిన సింహాసనం వరకూ దాడికి రావడం ఖాయం.

పాశం యాదగిరి
94410 96231