విహారాలు

India

Gamyam

Saturday, July 17, 2010

సమ్మర్ బ్యూటీ అండ్ కూల్ స్పాట్ "కొడైకెనాల్"

Flower

వేసవిలో ఎండతాపాన్ని చల్లార్చుకునేందుకు చల్లగా ఉండే ప్రదేశాలను వెతుక్కుని మరీ వాలిపోయే ప్రకృతి ప్రేమికులకు అచ్చమైన దేశీయ కూల్ స్పాట్ "కొడైకెనాల్". పర్యాటకులంతా "ప్రిన్స్ ఆఫ్ హిల్‌స్టేషన్‌" అంటూ ముద్దుగా పిలుచుకునే ఈ ప్రదేశం దక్షిణ భారతదేశంలోని చెన్నై నగరానికి 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. పళని కొండల శ్రేణిలో సముద్ర మట్టంనుంచి 2,130 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశంలోని లోయలు, పర్వతాలు, పూల తోటలు, జలపాతాలు, సరస్సులు వీక్షకులకు కనువిందు కలిగిస్తాయి.

వేసవిలో గరిష్టంగా 20 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 11 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదయ్యే కొడైకెనాల్‌లో చూడదగ్గ ప్రదేశాలు అనేకం ఉన్నాయి. అలాంటి వాటిలో కొడై సరస్సు, కొడై సరస్సు కోకర్స్ వాక్, సెయింట్ మేరీ చర్చ్, పంపార్ జలపాతం, గ్రీన్ వ్యాలీ వ్యూ, గుణ గుహ, ఫైన్ వృక్ష్యారణ్యం, శాంతి లోయ, కురుంజి ఆండవర్ ఆలయం.. తదితర ప్రదేశాలు ముఖ్యంగా చూడదగ్గవి.

మానవ నిర్మితమైన "కొడై సరస్సు" కొడైకెనాల్ పట్టణం సెంటర్‌కు దగ్గర్లో ఉంది. దీనిని 1863లో నిర్మించారు. 60 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించిన ఈ సరస్సు ఓవైపు అరచేతిమాదిరిగా వెడల్పుగా ఉండి, మరోవైపు చేతివేళ్లలాగా సన్నటి పాయలుగా ఉంటుంది. ఇందులో బోటు షికారు చేసేందుకు పర్యాటకులు చాలా ఆసక్తి చూపిస్తుంటారు.

ఒక కొండ అంచున సన్నగా పొడుగ్గా ఉండే కాలిబాట, ఆ బాట వెంబడే నడుచుకుంటూ వెళితే చుట్టూ కనిపించే ప్రకృతి దృశ్యాల సమ్మేళనమే "కొడై సరస్సు కోకర్స్ వాక్" ప్రదేశం. దీని తరువాత సుమారు 150 సంవత్సరాల క్రితం ఈ ప్రదేశంలో నిర్మించిన మొట్టమొదటి చర్చి "సెయింట్ మేరీ చర్చి" చూడదగ్గది. చర్చి నిర్మాణంలోని నగిషీ పని వీక్షకులను విశేషంగా ఆకట్టుకునేలా ఉంటుంది.

కొడైకెనాల్ పట్టణానికి చివర్లో ఉండే "పంపార్ జలపాతం" పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే మరో ప్రదేశం. ఇది ఎత్తుపల్లాలతో ఉండే రాతినేలమీద ప్రవహిస్తూ వచ్చే ఓ సన్నిటి వాగు మాత్రమే. ఆ తరువాత ఓ కొండ అంచున నిలబడి చూసేందుకు వీలుగా నిర్మించిన "గ్రీన్ వ్యాలీ వ్యూ" చూడదగ్గది. ఇక్కడినుంచి చూస్తే విశాలమైన లోయ, పచ్చని చెట్లతో కూడిన పర్వతాలు ప్రకృతి ప్రేమికులను పరవశింపజేస్తాయి.

ఆ తరువాత చెప్పుకోవాల్సింది "గుణ గుహ". రోడ్డు అంచున ఉన్న ఓ బాట వెంబడి సుమారు 200 గజాలు గుబురుగా ఉండే చెట్ల మధ్యలో నుంచి కిందికి దిగుతూ వెళితే, ఓ చిన్న కొండ అడుగుభాగంలో ఈ గుహ దర్శనమిస్తుంది. అయితే దీనికి దగ్గరగా వెళ్లి చూడటం మాత్రం వీలుపడదు. ఎందుకంటే అక్కడికి వెళ్లే వీలు లేకుండా చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. స్థానికులు దీనినే "దెయ్యాల గుహ" అని కూడా పిలుస్తుంటారు.

Flowers

"ఫైన్ వృక్షాల అరణ్యం" కొడైకెనాల్‌లో చూడదగ్గ మరో ముఖ్య ప్రదేశం. కేవలం మంచు, చలి అధికంగా ఉండే కొండ ప్రాంతాలలో పెరిగే ఈ వృక్షాలు ఓ కిలోమీటర్ విస్తీర్ణంలో దట్టంగా పెరిగి.. పర్యాటకులను కొత్తలోకంలోకి తీసుకెళ్తాయి. దీని తరువాత దట్టమైన చెట్లతో నిండి ఉండే విశాలమైన "శాంతి లోయ" కూడా చూడదగ్గదే.

ఇక చివరిగా చెప్పుకోవాల్సింది "కురుంజి ఆండవర్ ఆలయం" గురించే. కొడైకెనాల్‌కు కాస్త దూరంగా ఉండే ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కొలువైయున్నాడు. ఒకానొక కాలంలో ఇక్కడ నివసించిన ఓ యూరోపియన్ మహిళకు స్వామివారు కలలో దర్శనమిచ్చి ఆశీర్వదించారట. అందుకు కృతజ్ఞతగా ఆమె ఈ కురుంజి ఆండవర్ ఆలయాన్ని నిర్మించినట్లు స్థానికులు చెబుతుంటారు. మరో కథనం ప్రకారం చూస్తే.. కొడైకెనాల్ పరిసర ప్రాంతాలలో 12 సంవత్సరాలకు (పుష్కరం) ఒకసారి మాత్రమే పూసే "కురుంజి" పుష్పాల వల్లనే ఈ ఆలయానికి ఆ పేరు వచ్చినట్లు తెలుస్తోంది.

కొడైకెనాల్ ఎలా వెళ్లాలంటే.. విమానం, రైలు, రోడ్డు మార్గాలలో చేరుకోవచ్చు. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నుంచి విమానం ద్వారా మధురై, కోయంబత్తూర్, తిరుచురాపల్లి తదితర ప్రాంతాలకు చేరుకుని.. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు. రైలు ప్రయాణమైతే చెన్నై నుంచి నేరుగా కొడైకెనాల్ రోడ్డు స్టేషన్ చేరుకుని, అక్కడినుంచి ఘాట్ మార్గంలో కొడైకెనాల్ పట్టణానికి చేరుకోవచ్చు.

కొడైకెనాల్‌కు దక్షిణంగా 120 కి.మీ దూరంలో మధురై, పడమర దిశగా 64 కి.మీ దూరంలో పళని, ఉత్తర దిశగా 99 కి.మీ.దూరంలో దిండిగల్‌లు ఉన్నాయి. కొండ ప్రాంతం కాబట్టి ఘాట్ రోడ్డులో ప్రయాణించేవారు మధురై నుండి సుమారు నాలుగు గంటలు, పళని నుండి రెండు గంటలు, దిండిగల్ నుండి మూడున్నర గంటల బస్సు లేదా ఇతర ప్రైవేటు వాహనాలలో ప్రయాణించి కొడైకెనాల్ చేరుకోవచ్చు.

వసతి సౌకర్యాల విషయానికి వస్తే.. కొడైకెనాల్‌లోని బస్టాండ్ ప్రాంతం చుట్టుపక్కలా అనేక హోటళ్లు పర్యాటకులకు అందుబాటులో ధరల్లో లభిస్తాయి. స్టార్ హోటళ్లు, సాధారణ హోటళ్లతోపాటు రిసార్టులు, బంగళాలు, హాలీడే హోమ్స్, గెస్ట్‌హౌస్‌లు కూడా ఇక్కడ అనేకం ఉన్నాయి. అలాగే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన హోటల్, యూత్ హాస్టల్‌లు కూడా అందరికీ అందుబాటులో ఉంటాయి. అయితే వీటిలో ప్రవేశానికి ముందుగానే రిజర్వేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది.

తిరువనంతపురం నుండి తిరుచ్చి



yatra


మేము, మామిత్ర బృందం తమిళనాడులోని తిరువనంతపురం-కన్యాకుమారి-మధురై-రామేశ్వ రం-తిరుచ్చి (తిరుచురాపల్లి)లను దర్శించడానికి విశాఖ నుండి ముందుగా తిరువనంతపురం బయలుదేరాం.

తిరువనంత పురం
ఇక్కడ ముఖ్యంగా శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయం చూడదగినది. సుమారు ఐదువేల సంవత్సరాల క్రితము కట్టబడినదట. 1729 సంIIలో మార్తాండ వర్మ అనే కేరళరాజు ఈ దేవాలయాన్ని పునరుద్దరించాడట. ఇక్కడ ధీర్ఘ చతురస్రముగానున్న వరండా నిర్మించడానికి 4000 మంది తానీపనివారు, 6 వేల మంది కవ్ఞలు, 100 ఏనుగులనుపయోగించి 7 నెలల్లో పూర్తిచేసారట. ఈ దేవాలయ ప్రాంగణము 7 ఎకరాలు. ధ్వజ స్థంభము ప్రత్యేకమైన టేకుతో బంగారు కవచముతో కలిగి వ్ఞన్నది.

ఇది 80 అడుగుల ఎత్తు. ఈ స్వామి దర్శనము దక్షిణ ద్వారము నుండి ముఖము, ఉత్తర ద్వారమునుండి పాదములు, మధ్య ద్వారము నుండి నాభి చూడవచ్చు. ఈ ఆదిశేషునిపై యోగనిద్రలో వ్ఞంటాడు. విగ్రహము ఎదుటనున్న మండపము పై కప్పు ఒకే గ్రయినేట్‌ రాయితో మలచినది. ఆలయములోని స్థంబాలపై అనేక రకముల శిల్పాలు చెక్కబడి వ్ఞన్నవి. త్రివాన్కూరు రాజు ప్రతిరోజు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఈ ఆలయం త్రివేండ్రం రైల్వేస్టేషన్‌ నుండి సుమారు 1 కిలోమీటరు దూరంలో ఉంది. ఈ ఆలయంలోనికి పురుషులను చొక్కాలేకుండా పంచెతో మాత్రమే అనుమతిస్తారు. ఇంకా ఈ పట్టణములో చూడవలసినవి జూపార్కు, బొటాని కల్‌ గార్డెన్‌, నేపియర్‌ మ్యూజియం. ఇక్కడినుండి 80 కి.మీ దూరంలో ఉన్న కాన్యాకుమారికి మాబృందం బస్సులో బయలుదేరాం.

కన్యాకుమారి
బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం కలిసేచోటు. ఈ మూడు సముద్రాలను వేరే వేరే రంగులలో ఇక్కడ చూడవచ్చు.1892 సంవత్సరంలో స్వామి వివేకానంద ఇక్కడి నుండి సముద్రములో 500 మీటర్ల దూరములో 55 మీటర్ల ఎత్తులో ఉన్న శిలపైకి ఈదుకుని వెళ్లి ధ్యానం చేయుటవలన జ్ఞానము పొందెను. దీనిని వివేకనందా రాక్‌ మెమోరియల్‌ అని పిలువబడుతుంది. 1970 సంIIలో స్మారక చిహ్నం కట్టి వివేకనందుని కాంశ్య విగ్రహాన్ని నిర్మించారు. ఇక్కడకు వెళ్ళడానికి ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఫెర్రీ సర్వీసు కలదు. మంగళవారం శెలవ్ఞ. ఐదువేల మంది శిల్పులు రాత్రింబగుళ్లు శ్రమించి చెక్కిన 33 అడుగుల '' తిరువళ్ళువర్‌ విగ్రహం దీనికి దగ్గరలో ఉంది. అమెరికాలోని ''స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీని పోలి ఉంటుంది.

కన్యాకుమారి ఆలయం
ఇది సముద్రపు ఒడ్డున వ్ఞన్న ఆలయం. ఈ ఆలయం గూర్చి చాలా కథలు వ్ఞన్నవి. ఇది పార్వతి దేవి అవతరించిన స్థలమట. బాగాసురుడనే రాక్షసుని వధించుటకు విష్ణువ్ఞ సలహాపై దేవేంద్రుడు యజ్ఞం చేయగా అందులో ఒక కన్య ఉద్భవించినదట. ఆ కన్యను శివ్ఞడు వివాహము చేసుకోవాలని దేవతలు ఆతృతతో చూస్తారు. కాని ఆకన్యను వివాహం చేసుకుంటే ఆ రాక్షసుడు వధింపబడడు. నారదుని పన్నాగము వలన వేళకాని వేళ కోడిపుంజు కూయటం వలన వివాహమునకు సుముహూర్తము దాటిపోయినదని శివ్ఞడు భావించి తన స్థానమైన సుచీద్రమునకు వెళ్ళిపోతాడు. అందువలన ఆ కన్య కన్యగానే మిగిలిపోతుంది. ఈ విగ్రహము చాలా అందంగా వ్ఞంటుంది. ఈమె దుస్తులను తరచు మారుస్తూ ఉంటారు. ఉదయం కన్యగాను సాయంత్రం వధువ్ఞగాను అలంకరిస్తారు. ఈమె ముక్కు పుడకలోని వజ్రము చాలా దూరం నుండిమెరుస్తూ వ్ఞంటుంది. ఈ ఆలయంలోని స్థంబాలను మీటితే సంగీతం వినిపిస్తుంది. పౌర్ణమి రోజు సాయంత్రం ఈ దేవాలయం చూడవచ్చు. ఉదయం 4.30 నుండి సాయంత్రము 5.30 వరకు మరల రాత్రి 8.45 గంటల వరకు అమ్మవారి దర్శనము చేసుకోవచ్చు.

గాంధీమందిరము
ఈ సముద్రములో గాంధీగారి అస్థికలు నిమజ్జనం చేసారు. ఆయన జ్ఞాపకార్ధము 1956 సంIIలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించారు. ప్రతి అక్టోబరు రెండవ తేదీన గాంధీ విగ్రహముపై సూర్యకిరణాలు పడేలా ఏర్పాటుచేసారు.

సుచీంద్రము
కన్యాకుమారి నుండి తిరువనంతపురం వేళ్ళే దారిలో 11 కి.మీ. దూరంలో ఉన్నది. దేవేంద్రుడు శాపవిముక్తి (శుచి) కొరకు ఇక్కడ శివ్ఞని గూర్చి తపస్సుచేయటం వలన సుచీంద్రము అను పేరు వచ్చినది. ఇక్కడ వ్ఞన్న 7 రాతి స్థంభాలను మీటితే 7 రకాల సంగీతం వినిపిస్తుంది. కన్యాకుమారి నుండి సిటీబస్‌లో వెళ్ళి రెండుమూడు గంటలలో తిరిగిరావచ్చు.
కన్యాకుమారిలో వసతి సౌకర్యాలు వివేకనందా శ్రమము వారు ఏర్పాటుచేస్తారు. ముందుగా మనం వారికి తెలియపరచి కొంత అడ్వాన్సును పంపితే వసతి ఏర్పాట్లు చేస్తారు. ఈ ఆశ్రమం నుండి ఆలయమునకు రాక్‌ టెంపులు వరకు ఉచిత బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తారు.
కన్యాకుమారి నుండి 246 కి.మీ దూరంలో మధురైకు చేరుకున్నాం.

మధురై
ఇది మధుర మీనాక్షి దేవాలయంకు ప్రసిద్ధి. ఈ ఆలయం ప్రపంచ ప్రసిద్ది చెందినది. దీనికి 11 గోపురాలు వ్ఞన్నవి. ఆలయానికీ దక్షిణానవ్ఞన్న గోపురం ఎత్తు 200 అడుగులు. ఇది ఆలయ ప్రధాన ద్వారం. దీనిపై అష్టలక్ష్మి బొమ్మలు చెక్కబడి వ్ఞన్నవి. ఇక్కడవ్ఞన్న వెయ్యిస్థంబాల మండపం చూడముచ్చటగా వ్ఞంది. ఈ ఆలయం దక్షిణాది ఆలయాల్లో చూడదగినది. మధుర మీనాక్షిని దర్శించుకున్న తరువాత మా బృందం 163 కి.మీ దూరంలోవ్ఞన్న రామేశ్వరాన్ని వీక్షించడానికి బయలుదేరాం.

రామేశ్వరం
రామేశ్వర ప్రయాణం చాలా వింత కొలుపుతుంది. ఏంబన్‌-రామేశ్వరముల మధ్యనున్న సముద్రపాయపై రైలు బ్రిడ్జి వ్ఞన్నది. దానిపై ప్రయాణిస్తే సముద్ర మధ్య నుండి వెళ్ళే అనుభూతి కలుగుతుంది. రామేశ్వరమునకు సుమారు 150 కి.మీ వరకు కొండలు కనిపించవ్ఞ. దేశంలో నాలుగు అతి ముఖ్య పుణ్యక్షేత్రాలలో రామేశ్వరం ఒకటి. ఇది ఒక ద్వీపములో ఉన్నది. రావణ సంహారము తరువాత అతడు బ్రాహ్మణుడు అగుటచే ప్రాయశ్చిత్తం కొరకు శ్రీరాముడు రామనాధస్వామిని (శివ్ఞని) అర్చిస్తాడు. శుభ ముహూర్త సమయానికి హనుమంతుడు శివ్ఞని విగ్రహము తీసుకొని రాకపోవ్ఞటచే సీతాదేవి ఇసుకతో విగ్రహాన్ని తయారుచేయగా శ్రీరాముడు దానినే పూజిస్తాడు. ఇక్కడే లంకకు వారధి నిర్మించడానికి పూనుకుంటాడు. ఇప్పటికీ ఇక్కడి రాళ్ళు నీటిలో తేలుతుంటాయి. ఇక్కడికి వచ్చిన యాత్రికులకు ఆ రాళ్ళను విక్రయిస్తారు. ఈ దేవాలయ ప్రాంగణములోనున్న నూతులలో నున్న నీటిలో స్నానం చేస్తారు. ఒక్కొక్క బావిలోని నీరు ఒక్కొక్క రుచితో వ్ఞంటాయి. దేవాలయము ఎదుట కొద్దిదూరములో సముద్రము, ఇది కొంత దూరము వరకు లోతు తక్కువ అందువలన అన్ని వయసుల వారు నిర్భీతితో స్నానం చేయవచ్చు. పెద్దగా కెరటాలు వ్ఞండవ్ఞ.

ఇక్కడికి 3.కి.మీ దూరంలోగల గంధమాదన పర్వతము, దానిపై శ్రీరాముని పాదముద్రలు వ్ఞన్నవి. ఈ పర్వతము మీదినుండి రామేశ్వరము ఊరిని, సముద్రాన్ని చూడవచ్చు. ఇక్కడికి 18 కి.మీ దూరంలో వ్ఞన్న ధనుష్కోటి నుండి వానర సైన్యం వారధి నిర్మించిందట. రామేశ్వరములో మన మాజీ రాష్ట్రపతి నివసించిన ఆయన గృహము కూడా వ్ఞన్నది. దానికి ఆనుకొని గవర్నమెంటువారి చేతి వస్తువ్ఞల తయారీ సముదాయం వ్ఞన్నది. ఇక్కడ బ్రాంజ్‌ మెటల్‌తో చేసిన బొమ్మలు కడుఅందంగాను, చవ్ఞకగాను దొరుకుతాయి. రామేశ్వరం చూస్తే మనకు రామాయణం గుర్తుకు వస్తుంది. ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన రామేశ్వరం ను దర్శించడం చాలా అదృష్టం.
ఇక్కడనుండి 265 కి.మీ దూరంలో వ్ఞన్న తిరుచురాపల్లి (తిరుచ్చి)ని చూడటానికి ట్రెయిన్‌లో చేరుకున్నాం. ఇక్కడ ముఖ్యంగా చూడవలసినవి. రాక్‌ఫోర్టు టెంపుల్‌, శ్రీరంగం తంజావూరు, కుంబకోణం, చిదంబరం.

రాక్‌ఫోర్టు టెంపుల్‌
ఇది కావేరి నది ఒడ్డున వ్ఞన్నది. ఈ కొండ ఎత్తు 83 కిలోమీటర్లు, 437 మెట్లు ఎక్కాలి. ప్రస్తుతం ఇక్కడ 100 స్థంబాల మండపం వ్ఞంది. ఇక్కడ వ్ఞన్న శివాలయములో శివ్ఞని మాతృభూతేశ్వరుడు అంటారు. ఈ గుడిని 7 స్థంబాలపై 7 శతాబ్ద ములో పల్లవరాజులు నిర్మించారు. గోడలమీద ఈ దేవాలయపు చరిత్ర పెయింటింగ్స్‌ వ్ఞన్నవి. ఇక్కడ నుండి కావేరి నదిని మొత్తం పట్టణాన్ని చూడవచ్చు.

శ్రీరంగం
తిరుచ్చిరాపల్లికి ఉత్తరాన 7 కి.మీ. దూరంలో శ్రీరంగనాధస్వామి ఆలయం వ్ఞన్నది. 7 గోపురాలు దాటి గుడిలోకి ప్రవేశించవలెను. తూర్పున 146 అడుగుల ఎత్తున వ్ఞన్న గోపురం ఆసియా ఖండంలోనే అతి ఎత్తైన గోపురం. విభీషణుడు ఈ ఆలయాన్ని కట్టించాడట. ఈ ఆలయం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1.00 వరకు, సాయంత్రం 3 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు తెరచి వ్ఞంచుతారు. శ్రీరంగమునకు తూర్పున జంబుకేశ్వర ఆలయమున్నది. దానిని కూడా తప్పకుండా చూడాలి.

తంజావూరు
తిరుచ్చీ నుండి తంజావూరు 54 కి.మీ దూరం. ఇది నాగరికతకు గుండెవంటిది. ఇప్పటికినీ ఇక్కడ ివీదులు, సందులలో శాస్త్రీయనృత్యశాలలు సంగీతము వినవచ్చు. ఇత్తడి విగ్రహాలు, సామాన్లు తయారీకి ప్రసిద్ది. ఇది 10 నుండి 14వ శతాబ్దము వరకు చోళరాజుల రాజధాని. ఇక్కడ వీరు 74 దేవాలయాలు నిర్మించారు. అందులో అతి ముఖ్యమైనది బృహదీశ్వరాలయం ఇది అత్యంత శిల్పకళలో వ్ఞట్టిపడుతుంది. ఇక్కడ ఈ ఆలయంలో పెద్ద నంది విగ్రహమున్నది. ఈ ఆలయం చూడడానికి చాలా బాగుంటుంది.

కుంబకోణము
ఇది తంజావూరుకి 38 కి.మీ దూరంలో వ్ఞన్నది. ఇది కావేరీ నది ఒడ్డున ఉన్న అతిపురాతన పట్టణము. సముద్ర మధనంలోవ్ఞన్న అమృత కలశమును తీసుకొని వెళుతున్నప్పుడు ఆ పాత్రలోని ఒక మూలపగిలి ఇక్కడి ''మహామ హము అను సరోవరంలో పడినదట. అందువలన ఈ ఊరికి కుంబకోణం అనేపేరు వచ్చినది. ఇక్కడ 18 ఆలయములున్నవి. అందులో కుంచేశ్వరా లయం బహుపురాతనమైనది. చేనేత, సిల్కు వస్త్రములకు ఇత్తడి రాగి, కంచు సామాన్లుకు ప్రసిద్ది.

చిదంబరం
ఇది నటరాజ ఆలయానికి ప్రసిద్ది. నల్లరాతితో 32 ఎకరాల స్థలంలో 10వ శతాబ్దంలో చోళరాజులచే నిర్మించబడినది. ప్రధాన ఆలయము లోని విగ్రహాన్ని సామాన్యులు చూసే అవకాశం లేదు. గర్భగుడి ముందు తెర ఉంటుంది. బయట వ్ఞన్న కంఠాభరణము, లోపల విగ్రహమున్నట్లు సూచిస్తుంది. చిత్‌+అంబరం=చిదంబరం అనే పేరు వచ్చినది. ఈ ఆలయానికి 4 గోపురాలు వ్ఞన్నవి. ''కనకసభలో పంచలోహ నటరాజ విగ్రహము అత్యంత అద్భుతంగా వ్ఞంది. రైల్వే స్టేషన్‌కు ఎదు రుగా 500 ఎకరముల స్థలములో అన్నామలై యూనివర్సిటీ వ్ఞన్నది. పై క్షేత్రాలన్ని దర్శించుకొని తిరుచ్చి నుండి విశాఖపట్నంకు మధురానుభూతులతో చేరుకున్నాం.



 

Wednesday, July 14, 2010

శత్రు దుర్భేద్యం.. గండికోట

రాయలసీమ జిల్లాల్లో ఎంతో ప్రసిద్ధిగాంచిన పర్యాటక ప్రదేశం గండికోట. కడప జిల్లా జమ్మలమడుగు తాలూకాలో పెన్నా నది ఒడ్డున గల ఒక చిన్న గ్రామం ఇది. ఈ ప్రాంతంలో పరుచుకొని ఉన్న ఎర్రమల పర్వత శ్రేణినే గండికోట కొండలని అంటారు. ఎర్రమల పర్వత శ్రేణికి, పర్వత పాదంలో ప్రవహించే పెన్నా నదికి మధ్య ఏర్పడిన గండి మూలంగా ఈ కోటకు గండికోట అనే పేరు వచ్చిందట. ఇక్కడి లోయ యొక్క సుందర దృశ్యం వర్ణనాతీతం. దట్టమైన అడవులు, మనోహరంగా కనిపించే భూతలం మధ్య ఎంతటి బలమైన శతృవు దాడినైనా ఎదుర్కొనడానికి ఈ కోట అనువుగా ఉండేదట. చుట్టూ లోతైన లోయలతో, ఎర్రటి గ్రానైట్‌ శిలలతో ఏర్పడిన దుర్భేద్యమైన కొండలతో, 300 అడుగుల దిగువన పడమటి, ఉత్తర దిశలలో ప్రవహించే పెన్నా నదితో మదిని పులకింజేసే సుందర దృశ్యాలను ఆవిష్కరిస్తున్న గండికోట విశేషాలు .
కోట విశిష్టతలు...
gandikota-fortగండికోట... ఈ పేరు సగటు తెలుగు సినీ ప్రేక్షకుడికి సుపరిచితమే... ఎందుకంటే... గండికోట పేరు, ఇతివృత్తంతో ఎన్నో తెలుగు సినిమాలు తెరకెక్కాయి. కళ్యాణీ చాళుక్యుల నిర్మాణ శైలికి ప్రతీకగా నిలుస్తున్న ఈ కోట తనలో ఎన్నో చారిత్రక విశేషాలను దాచుకుంది. వృత్తాకారంలో ఉండే ఈ కోట చుట్టుకొలత దాదాపు ఐదు మైళ్ళుంటుంది. కోట ముఖ ద్వారానికి ఎత్తైన కొయ్య తలుపులు ఇనుపరేకుతో తాపడం చేయబడి ఉన్నాయి. తలుపులపై ఇనుప సూది మేకులున్నాయి. కోట ప్రాకారం ఎర్రటి నున్నని శాణపు రాళ్ళతో నిర్మించారు. కొండ రాతి పై పునాదులు లేకుండా గోడలు నిర్మించారు. ఈ గోడలు 10 నుండి 13 మీటర్ల ఎత్తున్నాయి. చతుర్రసాకారంలోను, దీర్ఘ చతుర్రసాకారంలోను 40 బురు జులున్నాయి. గోడపై భాగాన సైనికుల సంచారం కోసం 5 మీటర్ల వెడల్పు తో బాట ఉంది.

కోట అంతర్భాగంలో మాధవరాయ, రంగనాథ ఆలయాలున్నాయి. ముస్లిం నవాబుల కాలంలో ఈ ఆలయాలను ధ్వంసం చేశారు. అప్పటి శిధిల శిల్పాలు ఇప్పటికీ దర్శనమిస్తాయి. మీర్‌ జుమ్లా జామా మసీదును ఎంతో సుందరం గా నిర్మించాడు. కోటలో పెద్ద ధాన్యాగారము, మందుగుండు సామగ్రి గిడ్డంగి, పావురాల గోపురం, మినార్లు లాంటి ఎన్నో ముఖ్యమైన కట్టడాలు ఉన్నాయి. అంతేకాదు జైలు, రంగ్‌ మహల్‌ లాంటి కట్టడాలు వీక్షకులను మైమరిపిస్తాయి. నీటి వసతి కోసం రాజుల చెరువు, కత్తుల కోనేరు లాంటి చెరువులు, బావులున్నాయి. భూమి అడుగున గొట్టం ద్వారా ఏర్పరచిన నీటి సదుపాయం పర్యాకులను ఆశ్చర్యా నికి గురి చేస్తుంది. ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని ఆ కాలం లో ఇలాంటి నీటి సదుపాయం నిర్మించడం ఎలా సాధ్యపడిందనే విషయం ఇప్పటికీ అంతుపట్టకుండా ఉంది.
Gandikota_part_of_the_fort

గతంలో ఈ కోటలో సుందరమైన, ఆహ్లాదకరమైన ఉద్యానవనాలు, తోటలు ఉండే వట. పెమ్మసాని నాయకులు గండికోటను జనరంజకంగా పాలించినట్లు ప్రతీతి. ఇప్పుడు గండికోటలోని శిథిలాలు, మిగిలి ఉన్న కట్టడాలు ఈ కోట గత వైభవానికి ప్రతీకలుగా నిలిచి ఉన్నాయి.

చరిత్ర...
దక్షిణ భారతదేశంలోనే ఎంతో ప్రఖ్యాతిగాంచిన గిరి దుర్గమైన గండికోట దుర్గం చరిత్రలోకి చూస్తే... 13వ శతాబ్దము యొక్క రెండవ అర్థభాగము లో మొదలవుతుంది. గండికోట కైఫియత్‌ లో పశ్చిమ కళ్యాణీ చాళుక్య రాజైన ఆహవమల్ల సోమేశ్వర చే మలికినాడు సీమకు సంరక్షకునిగా నియ మించబడిన కాకరాజు శా.1044 శుభకృతు నామ సంవత్సర మాఘ శుద్ధ దశమి (1123 జనవరి 9) నాడు ఈ కోటను కట్టించాడు అని పేర్కొనబడింది. ఐతే ఇదే నిజమని నిర్ధారించడానికి మరే ఇతర చారిత్రక ఆధారాలూ లేకపోవడం గమనార్హం. త్రిపురాంతకము వద్ద గల శా.1212 (1290) నాటి ఒక శాసనం ప్రకారం, అంబదేవ అనే ఒక కాయస్త నాయ కుడు, తన రాజధానిని వల్లూరు నుంచి గండికోటకు మార్చాడని భావి స్తున్నారు. ఉప్పరపల్లె దగ్గర గల శా.1236కు చెందిన ఒక శాసనం ప్రకారం ప్రతాపరుద్రుని సామం తుడు ఒకరు ఈ కోటను జయించాడని, ప్రతాపరుద్రు డు జుట్టయలెంక గొంక రెడ్డిని గండికోటని పాలించ డానికి నియమించాడని తెలుస్తోంది.

Madhavaraya_temple_gandikotగండికోట విజయ నగర సామ్రాజ్య కాలములో ఉదయగిరి మండలము (ప్రాం తము) లోని ఒక సీమకు రాజధానిగా ఉండేది. 16వ శతాబ్దపు రెండవ అర్ధభాగములో గండికోటను పెమ్మ సాని నాయకులు తిమ్మానాయుడు, రామలింగనాయు డు విజయనగర రాజుల సామంతులుగా పాలించారు. విజయనగర సామ్రాజ్యము విచ్ఛిన్నమైనప్పుడు, పదిహే డవ శతాబ్దం మధ్య ప్రాంతంలో అబ్దుల్లా కుతుబ్‌ షా సేనాని మీర్‌ జుమ్లా కుమార తిమ్మానాయునికి మం త్రి పొదిలి లింగన్న ద్వారా విష ప్రయోగము చేయించి ఈ కోటను స్వాధీన పరచుకొన్నాడు.

గండికోట జమ్మలమడుగు నుంచి పడమరగా దాదాపు ఆరు మైళ్ళ దూరంలో ఒక పర్వత శ్రేణిపై ఉన్న ఈ కోటకు... పెన్నా నదీ ప్రవాహం ఇక్కడి కొండల మధ్య లోతైన గండిని ఏర్పరచడం వల్ల గండికోట అని పేరు వచ్చిందని చెబుతారు. రెండు మూడు వందల అడుగుల ఎత్తున నిటారుగా ఉండే ఇసుకరాతి కొండల గుండా పెన్నా నదీ ప్రవాహం సాగే నాలుగు మైళ్ళ పొడవునా ఈ గండి ఏర్పడి ఉంది. నదికి దక్షిణతీరాన ఉవ్వెత్తున ఎగసి న కొండల మీద బ్రహ్మాండమైన రక్షణ గోడలున్నాయి.

చూడదగిన ప్రదేశాలు...
రంగనాథాలయం:

The_Penna_near_Gandikota1ఈ ఆలయం గురించిన మొట్టమొదటి ప్రస్తావన శా.1479 (క్రీ.శ.1557) నాటి ఒక శాసనంలో కనిపిస్తుంది. ఆ శాసనం గండికోట లోని రంగనాయకుని గుడికి భూమిని మాన్యంగా ఇచ్చినట్లు తెలుపుతుంది. ఈ ఆలయనిర్మాణశైలిని బట్టి చూస్తే రంగనాథాలయం నూటికి నూరు పాళ్ళూ విజయనగర రాజుల నిర్మాణం అని స్పష్టమౌతుంది. ఈ ఆధారాలను బట్టి ఈ ఆలయాన్ని క్రీ.శ.15వ శతాబ్దంలో నిర్మిం చినట్లు చెప్పవచ్చు.

మాధవరాయ ఆలయం:
మాధవరాయ ఆలయం ఈ ఆలయం గురించిన మొట్టమొదటి ప్రస్తావన క్రీ.శ. పదహారవ శతాబ్దానికి చెందిన శాసనాలలో కనిపిస్తుంది. ఆలయంలో మనకు కనిపించే శిల్ప కళా లక్షణాలు, ఆలయనిర్మాణశైలిని బట్టి చూసినా ఆలయ నిర్మా ణం అదే కాలంలో జరిగినట్లు తోస్తుంది. ఆలయనిర్మాణాన్నీ, అందలి శిల్పకళారీ తుల్నీ, వాటి లక్షణాలనూ విశదంగా అధ్యయనం చేసిన మీదట ఈ ఆలయాన్ని క్రీ.శ.పదహారవ శతాబ్దం తొలినాళ్ళలో (దాదాపుగా 1501-1525 మధ్యకాలం లో) నిర్మించినట్లు చెప్పవచ్చు. చాళుక్యులు, విజయనగరరాజులు, పెమ్మసాని నాయకులు వంటి రాజుల పాలనలో వారికి జీవన శైలికి అద్దం పడుతున్న గండి కోట చారిత్రక కట్టడాలను ఒక్కసారైనా తిలకించాల్సిందే...

Monday, July 12, 2010

భూగర్భంలో.. అద్భుతం

భూగర్భ గుహలున్న జిల్లాల్లో కర్నూలు జిల్లాకు దేశంలోనే ప్రత్యేక స్థానం ఉంది. జిల్లా తూర్పు ప్రాంతంలో భూమిపైన, భూమి అంతర్భాగంలోనూ సహజసిద్ధమైన గుహలున్నాయి. అలాంటి వాటిలో దేశంలోనే అతి పొడవైనవైన బెలుం గుహలకు విశేష ప్రాధాన్యత ఉంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ గుహలు ఏర్పడి ఉంటాయని పరిశోధకుల అంచనా. వందలాది సంవత్సరాలు నీటి బిందువులు జాలువారితే ఏర్పడే స్టాలక్‌టైట్లు, స్టాలగె్మైట్లు బెలూం గుహలకు ప్రత్యేకం.
buddaభూగర్భంలో కనిపించే పెద్ద పెద్ద మందిరాలు... జల పాతాలు, ఆధ్యాత్మిక ప్రాంతాలు... ఆలయాలు, సరిగమలు పలికించే స్తంభాలు... ఒక్కో వైపు నుండి ఒక్కో ఆకృతిని ప్రదర్శించే శిలాకృతులు ఒకటేమిటి ఎన్నో వింతలు... విడ్డూ రాలు బెలూం గుహల్లో దర్శనమిస్తా యి. అబ్బురపరుస్తాయి. మూడు కిలోమీటర్ల పొడవు మేర ఉన్న ఈ గుహలు అడుగడుగు అద్భుతంగా దర్శనమిస్తుంది.

1884లోనే గుర్తింపు...
ప్రకృతిలో సహజసిద్దమైన భూగర్బ నిర్మాణంగా చెప్పుకునే బెలుం గుహలు జిల్లాలో నెలకొన్ని ఉన్న ట్టుగా 1884లోనే హెచ్‌బి పుటే అనే గుహ శాస్తవ్రేత్త కనుగొన్నాడు. అయితే అప్పటి నుంచి దీనిపై ఎలాంటి పరిశోధనలు జరగలేదు. 1982, 84 సంవత్సరాల్లో జర్మనీ బృందాలు గుహలను సందర్శిం చాయి. హెర్బర్ట్‌ డానియల్‌ గెబాక్‌ నాయకత్వంలోని బృందం 3కిలోమీటర్ల దూరం మేరకు స్థితిగతుల ను పరిశీలించారు. బెలుం గుహల భూగర్భం యొక్క నైసర్గిక స్వరూపాన్ని వివరంగా పటం గీచి ప్రపంచా నికి చాటి చెప్పారు.

caveగుహల సుందరాకృతికి వందల యేళ్లు...
బెలుం గుహల సుందర ఆకృతి వెనుక వందల యేళ్ల చరిత్ర ఉంది. భూగర్బంలో జారిపడే నీటితో మిళిత మై సూక్ష్మంగా ఉండే సున్నపు కణాలతో ఒక ఘనపు అంగుళం పరిణామం కల ఆకృతి తయారు కావడాని కి కొన్ని వందల సంవత్సరాలు పడుతుందని భూ గర్భ శాస్తవ్రేత్తలు పేర్కొంటున్నారు. ఇలాంటి ఆకృతులు బెలుం గుహల్లో కోట్ల సంఖ్యలో కనిపిస్తాయి. అంతెందుకు గుహల్లోని ఒక మండపంలో కోటి లింగాలు న్నాయంటారు. ఇక గుహల్లో ఎక్కడ చూసినా ఇలాంటివి కనిపించి మనలను ఆశ్చర్యపరుస్తాయి. బెలుం లో ఉండే నమ్మశక్యం గాని రీతిలో భూ అంతర్భాగంలో ఏర్పడిన స్థంబాలు, గుహపై నుంచి వేలాడే మంచుకడ్డీల చారలు, గుహ పైక ప్పు నుంచి నిరంతరం జారీపడే నీటితో తయారై ఘనీభవించిన శిల్పాలు, సుందరమైన గదులు ఏర్పడ్డానికి కొన్ని మిలియన్‌ల సంవత్సరాలు పడుతుందని శాస్తవ్రేత్తల పరిశోధనలు వెల్లడి స్తున్నాయి.

అబ్బురపరిచే సహజ శిల్పాలు...
మూడు కిలోమీటర్ల మేర బెలుం గుహ అంతర్భాగంలో నెలకొన్న సహజ శిల్పాలు చూప రులకు విస్మయం కల్గిస్తాయి. నేర్పురు లైన శిల్పులు ఈ శిలలను చెక్కారా అన్న అనుమా నం రాక మానదు. స్థానికంగా గుహల చుట్టు ఉండే గిరిజనులు, పల్లె ప్రజలు ఈ ఆకృతు లకు కోటి లింగాలు, సింహ ద్వారం, పాతాళ గంగ మండపం అని పేర్లు పెట్టారు. ఆగ్నేయ దిశ నుంచి వాయువ్య దిశగా ప్రవహించే ఒక ఉపరితల ప్రవాహం బెలుం గ్రామపు సమీపంలో ఉన్న బావిలో అంతమవుతుందని ఇక్కడి ప్రజల నమ్మ కం. దీంతో బెలుం గుహల్లో అధ్యాత్మికంగా కూడా చారిత్రక ప్రాధాన్యత ఉట్టిపడుతోంది. దీంతో పర్యాటకుల తాకిడి కూడా రోజురోజుకు పెరుగుతుంది.

belum1999లో టూరిజం ఆధీనంలోకి...
పర్యాటకంగా బెలుం గుహలకు ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని 1999 సంవత్సరం లో ఆంధ్ర ప్రదేశ్‌ టూరిజం శాఖ 1999లో గుహలను తన అధీనంలోకి తీసుకుంది. 60 అడుగుల మేర స్టాలక్టిస్‌ వుండే గదుల్లోకి నడకదారి ఏర్పాటు చేసింది. గుహ అంతర్భాగంలో 2కిమీలు పొడవున లైటింగ్‌ ఏర్పాటు చేసింది. అలాగే పర్యాటకులు వెళ్లేందుకు వీలుగా డ్రిల్లింగ్‌ చేసి వెలుతురు కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటితో పాటు పర్యాటకులకు వసతులతో కూడిన బస ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పున్నమి హోటల్‌ యాత్రికులకోసం భోజన, అల్పహార శాలలను ఏర్పాటు చేసింది.

కర్నూలు నుంచి 110 కి.మీ...
కర్నూలు నగరం నుంచి కొలిమిగుం డ్ల మండలం బెలుం గ్రామానికి చేరు కోవాలంటే 110 కిలీమీటర్ల ప్రయా ణం చేయవలసి ఉంటుంది. నంద్యాల నుంచి 60 కిమీ, తాడిపత్రి నుంచి 31 కిమీ, అహోబిలం నుంచి 91 కిమీ, మహానంది నుంచి 90కిమీ, అలంపూ ర్‌ నుంచి 125కిమీ, అనంతపూర్‌ నుంచి 84కిమీ, బెంగుళూరు నుంచి 269 కిమీ, హైదరాబాద్‌ నుంచి 320 కిమీ, చెనై్న నుంచి 380కిమీల దూరం వుంటుంది. ఎపిటిడిసి కర్నూలు నుం చి ఒకరోజు ప్రత్యేక పర్యటనకు ఏర్పా టు చేసింది. ఇక్కడికి రావాలనుకునే టూరిస్టు బృందాలకు టూరిజం సంస్థ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.
caves

తక్కువ ఖర్చుతో యాత్రికులకు బస...
బెలూం గుహలకు వెళ్లే యాత్రికుల కోసం ఏపీ టూరిజం సంస్థ తక్కువ ఖర్చుతో బస ఏర్పాట్లను చేస్తుంది. డీలక్స్‌ ఏసీ రూంకు రూ. 1350 లతో పా టు ట్యాక్స్‌ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఏసీ రూముకు రూ.1050లు, నాన్‌ ఏసీ రూము కు రూ. 700, విశా లమైన కాన్ఫరెన్స్‌ హాలు ఉంటుంది. డార్మిటరీలో రూ. 40 లు బెడ్‌ దొరకుతుంది. స్నాక్‌ బార్‌, విజిటర్స్‌ రెస్ట్‌ రూం, క్లాక్‌ రూంతో రెస్టా రెంట్‌ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. బెలుం గుహలను సందర్శించే యా త్రి కులు ఎంట్రీ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పెద్దలైతే రూ. 30లు, పిల్లలు అయితే రూ. 20 చెల్లించాలి. ఉదయం 10 గంటల నుంచి సాయింత్రం 5.30 గంటల వరకు సందర్శించవచ్చు. రాత్రిపూట ఈ గుహల్లోకి పర్యాటకులను అనుమంతించరు.

Thursday, July 8, 2010

విజయనగర సామ్రాజ్య వైభవం

statuesవిజయనగర సామ్రాజ్య వైభవానికి ప్రతీక చంద్రగిరి కోట. విజయ నగర యుగం నాటి సంస్కృతి, వైభవం సజీవంగా ఉట్టిపడే రాజ మహల్‌, రాణీమహల్‌, ఇతర కట్టడాలన్నీ చూపరులను ఆకర్షిస్తున్నా యి. తిరుపతి పట్టణానికి అతి సమీపంలో ఉన్న ఈ మహా కట్టడం 10 దశాబ్ధాలు పూర్తయినా నేటికి సజీవంగా చెక్కు చెదరని కళావైభవం కళ్ల కు కట్టినట్లు కనబడుతుంది. ప్రకృతి శోభలీలు సుందరమగు లోయ లో గంభీరమైన రాజప్రసాదాలు, సొంపైన తటాకాలు, శిలామండపాలు విజయనగర సామ్రాజ్య ప్రభువులకు మూడవ రాజధాని నగరమై విరాజిల్లిన చంద్రగిరి కోట అంటే నాటి వైభవానికి ప్రత్యక్ష సాక్ష్యం.

పురాణ గాధలను అనుసరించి ఇక్కడ ఎతె్తైన ఒక కొండపై చంద్రుడు తపమాచరించి శివుడిని ప్రసన్నం చేసుకొని వరం పొందాడని అందువలన నాటి నుంచి చంద్రగిరి అనే పేరుతో ఈ ప్రాంతం ప్రాచుర్యా న్ని పొందింది. చరిత్రను అనుసరించి క్రీ.శ. 1000 సంవత్సరం నాడు చంద్రగిరి పట్టణానికి సమీపంలో ఉన్న నారాయణవనాన్ని పరిపాలిం చిన ఇమ్మడి నరసింహ యాదవ రాయులవారు ఈ కోట నిర్మించారు. ఈ కోట చుట్టూ ప్రాకారాలను అనుసరించి పెద్ద శిలలతో నిర్మించిన చదరపు రుజువులు ఉన్నాయి. కోట గోడలను ఆనుకొని అగడ్తలు ఉండేవి.

దుర్గానికి ఇరువైపులా ప్రవేశ ద్వారాలున్నాయి. స్థానిక చరిత్ర ప్రకారం చంద్రగిరి కోట 314 సంవత్సరాలు యాదవ రాజుల ఆధీన ములో ఉంది. చంద్రగిరి ప్రాంతానికి ప్రభువుగా ఉండి, ఆ కోటలోనే నివసించిన ఘనత అప్పటి యాదవరాజులకే దక్కింది. ఆ తరువాత హంపిలో విజయనగర చక్రవర్తులు శక్తి కోల్పోయి రాజ్యభారము వహించలేక శత్రువు విజయనగర సామ్రాజ్య ఆధిపత్య భారమును తీసుకొని పేరు ఘడించారు. నరసింహరాయుల కాలమున క్రీ.శ. 1565లో సంభవించిన రాకాతి తంగడి (తళ్లికోట) యుద్ధంలో విజయ నగర ప్రభువులు పరాజితులై గత్యంతరము లేక కర్నాటక రాష్ట్రానికి చెందిన హంపి నుంచి పెనుగొండ (అనం తపురం జిల్లా) చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి పట్టణానికి తరలించారు.

ఆ నాటి నుంచి చంద్రగిరి కోట పలు చారిత్రక ఘటనలకు సాక్షిగా నిలచింది. క్రీ.శ. 1000వ సంవత్స రంలో ఇమ్మడి నరసింహ యాదవ రాయుల చే నిర్మించిన చంద్రగిరి కోటలో ఆముఖమై ఉన్న భవనాన్ని రాజమహల్‌ అని పేర్కొంటా రు. ఈ భవన నిర్మాణం అంచలంచెలుగా పూర్తి చేస్తూ 16వ శతాబ్ధం నాటికి ఈ కట్ట డం పూర్తయినట్లు చరిత్రకారుల అంచనా. మూడంతస్థులతో గంభీరంగా ఈ భవనం దర్శనమిస్తోంది. రాజమహల్‌ పైన ఉన్న మూ డు గోపురాలలో పెద్ద గోపురం 24 చదరపు అడుగుల వైశాల్యం గల దర్బారు మాలులోని మధ్య గోడలు లేని స్తంభ పంక్తి రెండంతస్థుల ఎత్తు వరకు ఉంది. ఈ ఏర్పాటు వలన దర్బారులో కి తగినంత గాలి, వెళుతురు వచ్చేందుకు అవకాశం ఏర్పడింది.

భవ నం పునాదులు రాతితోను, పై భాగాన్ని ఇటుక, కరక్కాయ, సున్నం, బెల్లం, కోడిగుడ్డులోని తెల్లసొన తదితర మిశ్రమాలతో నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ భవనంలో ఎక్కడా కూడా కలప వినియోగించకపోవ డం ప్రత్యేక విశేషం. పరదాల ఏర్పాటుకు కూడా గోడలలోనే ఏర్పాటు చేసి ఉంచారు. రాజమహల్‌పైన ఉన్న గోపురాల్లో ఏర్పాటు చేసిన రం ధ్రాలు లోపలివైపు బంగారు ఆభరణాలు, నిధులు నిక్షిప్తం చేయబడిన ట్లు స్థానికులు పేర్కొంటారు. ఇలా నాటి రాజుల వైభవాన్ని నేటికీ కళ్లకు కట్టినట్లు చూపించే మహల్‌ వైభవాన్ని తనివితీరా చూడాల్సిందే.

అంత ేకాకుండా పంచలోహ విగ్రహాలు శైవ, వైష్ణవ , జైన మతాలకు చెందిన శిలా కాంస్య నిర్మితమైన దేవతా ప్రతిమలు ఈ కోటలో ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచిన విజయనగర చక్రవర్తుల సేవకు గుర్తింపు గా శ్రీకృష్ణ దేవరాయులు, ఆయన దేవేరులు తిరుమలదేవి, చిన్నాంబిక లు, వెంకటపతిరాయులు, శ్రీరంగరాయులు తదితరుల శిలా ప్రతిమ లు సహజతత్వాన్ని ఉట్టిపడేలా కనిపిస్తాయి.దక్షిణ భారతదేశంలోని అ న్ని రాష్ట్రాల నుంచి తిరుపతి పట్టణానికి రైలు ప్రయాణ సౌకర్యం ఉంది. తిరుపతి నుంచి ఆర్‌టిసి బస్సులలో చం ద్రగిరి పట్టణానికి చేరుకోవచ్చు. తిరుపతి పట్టణానికి చేరువలో రేణిగుంట విమానా శ్రయం కూడా ఉండటం విశేషం. యాత్రి కుల సౌకర్యం కోసం చంద్రగిరి నుంచి రాజమహల్‌ పురావస్తు ప్రదర్శనశాలకు వెళ్లడానికి ఆటోలు, రిక్షాలు నడుస్తున్నాయి.

ఆకట్టుకుంటున్న అరుదైన ప్రదర్శన


paintings-exhibition

ఆంధ్రభోజుడుగా పేరుగాంచిన విజయనగర సామ్రాజ్యాదీశుడు శ్రీకృష్ణదేవరాయులు. స్వయంగా గొప్ప కవి, సాహితీవేత్త అయిన శ్రీకృష్ణదేవరాయలు తెలుగు, కన్నడ భాషలకు ఎనలేని కృషిచేశారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని చాటిన శ్రీకృష్ణదేవరాయ పంచమ శతాబ్ది పట్టాభిషేక మహోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఈ ఉత్సవాలలో భాగంగా నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్‌లోని డా.వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి రాష్ట్ర ప్రదర్శనశాలలో విజయనగర సామ్రాజ్య కాలానికి చెందిన నాణాలు, శాసనాలు, బంగారు, వెండి వస్తువుల ప్రత్యేక ప్రదర్శన మంగళవారం ప్రారంభమైంది.

కవి, సాహితీవేత్త అయిన శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా ఆముక్తమాల్యద అనే తెలుగు గ్రంథాన్ని రచించి తెలుగు భాషకు ఎనలేని కృషిచేశారు. రాయల ఆస్థానంలో అష్టదిగ్గజములనే కవులు కొలువు తీరి ఉండేవారు. వారితే జరిపే సాహితీ గోష్టిని ‘భువన విజయం’ అని పిలిచేవారు. ఆయన కాలంలో వ్యవసాయాభివృద్దికి చెరువులు, కాలువలు, బావులు, ఆనకట్టలు నిర్మించినట్టు విదేశీ పర్యాటకులైన పీస్‌, ఎలియట్‌, న్యూనిజ్‌ తదితర రచనల ద్వారా తెలుస్తోంది. ఆయన పెనుగొండ, చంద్రగిరి, గుత్తి, గండికోట, హంపి తదితర ప్రాంతాల్లో టంకశాలలను ఏర్పాటుచేసి బంగారు,వెండి, రాగి లోహాలను ముద్రించి నాణాలను చలామణి చేశారు. ఆయన కాలం సాంఘీక, సామాజిక, ఆర్థిక రంగాలలో మహోన్నత స్థాయికి చేరి స్వర్ణయుగంగా పేరుగాంచింది.

ఆకట్టుకుంటున్న ప్రదర్శన...
statues-exibitionవిజయనగర కాలానికి చెందిన నాణాలు, శాసనాలు, బంగారు, వెండి వస్తువుల ప్రత్యేక ప్రదర్శనను మంగళవారం ఉదయం రాష్ట్ర సాంస్కృతిక శాఖ ప్రధాన కార్యదర్శి డా.యస్‌.చెల్లప్ప ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో 2.88 లక్షల నాణాలను ఏర్పాటుచేయడం విశేషం. ఇవి క్రీ.పూ. 4వ శతాబ్దం నుండి ఆఖరి నిజాం (19వ శతాబ్దం) కాలానికి చెందినవి.

వీటిలో సుమారు 8000 బంగారు నాణాలు విజయనగర కాలానికి చెందినవి కాగా శ్రీకృష్ణ దేవరాయల కాలానికి చెందిన 2333 బంగారు నాణాలను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. ఈ నాణాలలో విశిష్టమైన నాణాలు సందర్శకులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ఈ ప్రదర్శనలో 75 తామ్ర శాసనాలలో 20 విజయనగర కాలానికి చెందినవి కాగా అందులో 8 శాసనాలను ప్రదర్శనలో ఏర్పాటుచేశారు. ఇక 2000 పంచలోహ, రాగి, ఇత్తడి లోహాలతో చేసిన విగ్రహాలు క్రీ.పూ. రెండవ శతాబ్దం నుండి క్రీ.శ.19వ శతాబ్దానికి చెందినవి కావడం విశేషం. వీటిలో సుమారు 500 విజయనగర కాలానికి చెందినవి కాగా వాటిలో కొన్నింటిని ప్రదర్శనలో ఉంచారు. ఈ ప్రదర్శనలో భాగంగా ప్రత్యేకంగా విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించిన దేవాలయాలు, కోటలు, శాసనాల ఛాయాచిత్రాలను సైతం ఏర్పాటుచేశారు.

ప్రకృతి అందాలు... ఆధ్యాత్మికతకు నెలవు... చిక్‌మగళూర్‌

భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా కాఫీ తోటలుపెంచింది ఇక్కడే. తుంగ, భద్ర నదులకు పుట్టినిల్లు ఈ ప్రదేశం. కర్ణాటక రాష్ట్రంలోనే అత్యంత ఎత్తులో ఉన్న పర్వతశ్రేణులు ఇక్కడి ప్రత్యేకత. ప్రకృతి రమణీయ దృశ్యాలు కలిగిన కెమ్మనగుండి, కుద్రేముఖ్‌ కొండలు, మాణిక్యధార, కల్లథిగిరి జలపాతాలు పర్యాటకులకు కనువిందు కలిగిస్తాయి. శంకరాచార్యులు అద్వైత ప్రచారం కోసం స్థాపించిన శారదా పీఠం శృంగేరి ఈ జిల్లాలోనే ఉన్నది. దక్షిణ భారత దేశాన్ని పరిపాలించిన పెద్ద సామ్రాజ్యాలలో ఒకటైన హొయసల రాజులు పాలించిన సుందర ప్రదేశం చిక్‌మగళూరువిశేషాలు ఈవారం ‘విహారి’లో మీకోసం...


Sringeriచిక్‌మగళూరు పేరు జిల్లా రాజ ధాని చిక్‌మగళూరు పట్టణం నుండి వచ్చింది. చిక్‌మగళూరు అంటే కన్నడ భాష లో చిన్న కూతురు ఊరు అని అర్థం. సేక్రపట్న రాజైన రుక్మాంగద చిన్న కూతురు కు కట్నంగా ఇవ్వబడడం వల్ల ఈ పట్టణానికి చిక్‌మగళూరు అని పేరు వచ్చిం దని చెబుతారు. రుక్మాంగద పెద్ద కూతురు పేరు మీద చిక్‌మగళూరుకు 5 కి.మీ దూరంలో హిరెమగళూరు కూడా ఉన్నది.

జిల్లా చరిత్ర...
1670 సంవత్సరంలో చిక్‌మగళూరు జిల్లాలోని బాబా బుడాన్‌ గిరి కొండల పై భారతదేశంలోనే మొట్ట మెదటిసారిగా కాఫీ తోటలు పెంచారు. కాఫీ పెంప కం గురించి ప్రాచుర్యంలో ఉన్న కథ ప్రకారం బాబా బుడాన్‌ మక్కా యాత్రకు వెళుతూ యెమెన్‌ దేశం లోని మొఛా నౌకాశ్రయం నుండి ప్రయాణం చేస్తున్న ప్పుడు మెదటిసారి కాఫీని రుచి చూశాడు. కాఫీ రుచిని భారతదేశానికి అందిం చే ప్రయత్నంలో ఏడు కాఫీ గింజలు తనతోబాటు అరబ్‌ దేశాల నుండి తీసుకొ ని వచ్చాడు. బాబా బుడాన్‌ భారతదేశానికి తిరిగి వచ్చాక చిక్‌మగళూరులో ఈ గింజలు పాతాడు. బాబా బుడాన్‌ పై గౌరవానికి గుర్తుగా ఈ కొండలను బాబా బుడాన్‌ (బాబా బుర్హాన్‌) కొండలని పిలుస్తారు.

సుందర పర్వత కేంద్రాలు...
కెమ్మనగుండి: బాబా బుడన్‌ కొండల మధ్య చిక్‌మగళూరు పట్టణానికి 55 కి. మీ దూరంలో కెమ్మనగుండి పర్వత కేంద్రం ఉన్నది. కెమ్మనగుండి పర్వత కేం ద్రంలో వాడేయార్‌ రాజు కృష్ణరాజ వాడేయార్‌ వేసవి విడిది చేసేవాడు కావున ఈ పర్వతశ్రేణులను కె.ఆర్‌. కొండలు అని కూడా పిలుస్తారు. ఈ పర్వత కేం ద్రం సముద్ర మట్టానికి 1,434 మీటర్ల ఎత్తులో దట్టమైన అరణ్యాల మధ్య సం వత్సరం పొడవునా సెలయేళ్ళతొ హరితంగా ఉంటుంది. పూల తోటలతో, కొం డలోయలతో ఉండే ఈ పర్వత కేంద్ర సౌందర్యం వర్ణణాతీతం. అరణ్యాలు అన్వేషణ జరిపే వారికి ఈ పర్వత కేంద్రం నుండి అనేక మార్గాలు ఉన్నాయి. ఈ కొండ ప్రాంతంలో వివిధ ప్రదేశాల నుండి సూర్యాస్తమయాన్ని తిలకించ వ లసిందే. కేంద్రం పైన గులాబీ తోటలు అనేకం ఉన్నాయి. పర్వతం నడిబొడ్డు నుండి పది నిమిషాల నడకలో వచ్చే జెడ్‌-పాయింట్‌ నుండి చూస్తే రమణీ యంగా ఉండే పశ్చిమ కనుమలలోని శొల గడ్డి భూములు కనిపిస్తాయి.

కుద్రేముఖ్‌ జాతీయ వనం:
templeకుద్రేముఖ్‌... జిల్లా రాజధాని చిక్‌మగళూరు కి 95 కి.మీల నైఋతి దిశలో ఉన్నది. కన్నడ భాష లో కుద్రేముఖ్‌ అంటే గుర్రపు ముఖం అని అర్థం. ఈ పర్వతశ్రే ణులు గుర్రపుము ఖం ఆకారంలో ఉండడం వల్ల కుద్రేముఖ్‌ అని పిలుస్తారు. ఈ కుద్రేముఖ్‌ పర్వతకేంద్రంలో కుద్రేముఖ్‌ జాతీయ ఉద్యానవనం ఉన్నది. అరేబియా సముద్రం వైపు ఉన్న ఈ పర్వత శ్రేణుల పరంపర లోతైన లోయలు, ఎత్తైన శిఖరాలతో చాలా సుం దరంగా ఉంటుంది. సముద్రమట్టానికి 1,894.3 కి.మీ. ఎత్తులో ఉన్న ఈ పర్వత కేంద్రం కుద్రేముఖ్‌లో అపారమైన ఇనుప గనులు ఉన్నా యి. కుద్రేముఖ్‌లో ఉన్న కుద్రేముఖ్‌ ఉక్కు కర్మాగారంలో ఉక్కు కొద్దిగా శుద్ధి చేసి గొట్టాల ద్వారా మంగళూరు పణంబూర్‌ నౌకాశ్ర యానికి సరఫరా చేయబడుతుంది.

ముల్లయనగిరి: ముల్లయనగిరి బాబు బుడాన్‌ కొండలలో ఒక భాగం. ఈ కొండ చిక్‌మగళూరు పట్టణానికి 16 కి.మీ దూరం లో ఉన్నది. సముద్రమట్టానికి 1930 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పర్వత శ్రేణులు కర్ణాటక రాష్ట్రం లోనే ఎత్తైన పర్వత శ్రేణులు. ఈ పర్వత శిఖరం సూర్యాస్తమయం వీక్షించడానికి చాలా ప్రసిద్ధి. చిక్‌మగ ళూరు నుండి సితలయనగిరి వెళ్ళే మార్గంలో ఉన్న శివుడి గుడిలో లింగం నిరంతరం నీటిలో ఉంటుంది. నీటి మట్టం ఏ సమయం లోనైన ఒకే లాగ ఉంటుంది. అక్కడ నుండి ముల్లయనగిరికి వెళ్ళే రహదారి చాలా సన్నగా ఉండి రెండు ప్రక్కల వాహనాలు పోవడా నికి వీలు లేకుండా ఉంటుంది. ముల్లయనగిరి కొండ చాలా వాలు గా ఉండడం వల్ల పైకి పూర్తిగా వాహనాల మీద చేరుకోలేరు. ముల్లయనగిరి కొండకు ఎక్కే మధ్య భాగంలో ఒక చిన్న గుడి కూ డా ఉన్నది. ముల్లయనగిరి కొండల నుండి ఆకాశం నిర్మలంగా ఉన్న రోజులలో అరేబియా సముద్రం కనిపిస్తుంది. పర్వత శ్రేణుల ను అధిరోహించాలని ఆసక్తి ఉన్నవారికి ఈ కొండ చాలా మంచి ప్రదేశం.

దత్త పీఠం (బాబా బుడాన్‌ గిరి): చిక్‌మగళూరు కి ఉత్తరాన బాబా బుడాన్‌ కొండలు ఉన్నాయి. వీటికి చంద్ర ద్రోణ పర్వత అనే పేరు కూడా ఉన్నది. ఈ కొండలకు చాలా పురాతన చరిత్ర ఉన్నది. ఈ కొండలు హిమాలయా లకు నీలగిరి కొండలకు మధ్య ఉన్న ఎత్తైన కొండలలో ఇది ఒకటి. ఈ కొండకు ఈ పేరు 150 సంవత్సరాల క్రితం నివసించిన ముస్లిం ఔలియా మరియు సూఫీ అయిన బాబా బుడాన్‌ (దాదా హయాత్‌ కలం దర్‌) వల్ల వచ్చింది.

జలపాతాల హొయలు...
మాణిక్యధార జలపాతం:ఈ జలపా తం బాబా బుడాన్‌ గిరి దత్తాత్రేయ పీఠానికి దగ్గరలో ఉన్నది. ఈ జలపా తం పడేటప్పుడు నీరు ముత్యాల వలే కనిపిస్తూ చూపరులకు, జలక్రీడలు ఆడేవారికి అమిత అనందాన్ని కలిగి స్తోంది.

కళ్ళహతిగిరి జలపాతం: కెమ్మనగుండి నుండి 10 కి.మీ దూరంలో ఉన్న కళ్ల హతగిరి జలపాతాన్ని కాళహస్తి జలపా తం అనికూడా పిలుస్తారు. 122 మీట ర్ల ఎత్తులోనున్న చంద్ర ద్రోణ పర్వతం నుండి పడే ఈ జలపాతం చాలా రమ ణీయంగా ఉంటుంది. జలపాతం పడే రాళ్ళ మధ్య శివునిగా అర్చించబడే వీర భద్ర దేవాలయం కూడా ఉన్నది.

హెబ్బె జలపాతం: కెమ్మనగుండి పర్వ త కేంద్రం నుండి 10 కి.మీ దూరం లో ఉన్న ఈ జలపాతం 168 మీటర్ల ఎత్తు నుండి పడుతుంది. ఈ జలపా తం రెండు గతిపథులుగా పడుతుంది. దొడ్డ హెబ్బె (పెద్ద హెబ్బె) జలపాతం, చిక్క హెబ్బె (చిన్న హెబ్బె) జలపాతం. ఇంకా ఇవేకాకుండా శాంతి, హనుమా న్‌ గుండి, కదంబి జలపాతాలు పర్యా టకులను మంత్రముగ్ధులను చేస్తాయి.

పుణ్యక్షేత్రాలకు నెలవు...
locationsశృంగేరి: చిక్‌మగళూరు కి 90 కి.మీల కు పశ్చిమంగా తుంగ నది ఒడ్డున శంకరాచార్యులు అద్వైత ధర్మప్రచారా నికి స్థాపించిన మొట్టమొదటి మఠమై న శారద పీఠానికి నిలయం శృంగేరి. శృంగేరిలో శారదా దేవి దేవాలయం ఉన్నది, శారద దేవి ఆలయానికి ప్రక్కన విద్యాశంకరులు స్మారకంగా నిర్మిత మైన విద్యాశంకర్‌ దేవాలయం హొయసల రాజుల కాలంలో ప్రారంభిం చబడి విజయనగర రాజుల చేత పూర్తి చేయబడింది. ఈ విద్యాశంకర దేవాల యం లో 12 రాశులను సూచిస్తూ 12 స్థంభాలు ఉన్నాయి. సూర్యుడు ఏ రాశితో ఉన్నాడో సూర్యకిరణాలు ఆ స్థంభం మీద పడతాయి.

హొరనాడు: చిక్‌మగళూరుకు 100 కి.మీ.ల నైఋతి దిక్కులో ఉన్న ఈ గ్రా మం లో ప్రసిద్ధమైన అన్నపూర్ణేశ్వరి దేవాలయం ఉన్నది. ఈ దేవాలయం పున రుద్ధరణ ఇటీవలికాలంలోనే జరిగింది. ఆదిశక్తితో ప్రాణప్రతిష్ట చేసిన ఈ గుడి లో ఉన్న ఈ అమ్మవారిని ఆదిశక్త్యకాంబ శ్రీ అన్నపూర్ణేశ్వరిగా భావిస్తారు. ఈ దేవాలయంలో ప్రతి రోజు అన్న సంతర్పణ జరుగుతుంది. అమ్మవారిని దర్శిం చడానికి వచ్చిన తీర్థయాత్రీకులకు దేవస్థానం వసతి భోజన సదుపాయాలు కల్పిస్తుంది.

కలస: చిక్‌మగళూరుకు నైఋతిదిశలో 92 కి.మీల దూరంలో భద్ర నది ఒడ్డు న కలస ఉన్నది. భద్ర నది ఒడ్డున ఉన్న పంచ క్షేత్రాలలో (ఐదు సరస్సులు) ఇది ఒకటి. దగ్గరలో ఉన్న చిన్న కొండ పై హొయసల శైలితో నిర్మితమైన శివా లయం కాళేశ్వర దేవాలయం ఉన్నది. కలసలో ఉన్న పెద్ద శిలను మధ్వాచార్య బండ అని పిలుస్తారు. ఈ బండ పై మధ్వాచార్యులు ద్వైత సిద్ధాంతాన్ని బోధిం చాడని చెబుతారు. ఈ శిల పై ఇప్పుడు మధ్వచార్యుల విగ్రహం చెక్కబడింది.

గురు దత్తాత్రేయ మరియు బాబా బుడాన్‌ స్వామి దర్గాహ్‌: బాబా బుడాన్‌ గిరి కొండలపై నున్న ఇమాం దత్తాత్రేయ పీఠాన్ని హిందువులు ముస్లిములు సమా నమైన పవిత్ర స్థలం గా భావిస్తారు. ఈ కొండ పై నున్న లాటిరైటు (కంకర) గుహలో దత్తాత్రేయ స్వామి లేదా హజరత్‌ దాదా హయాత్‌ మీర్‌ కలందర్‌ నివసించారని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. (బాబా బుర్హాన్‌ సూఫీ సంతుడిని, హిందువులు దత్తాత్రేయ స్వామి అని, ముస్లింలు హజరత్‌ దాదా హయాత్‌ మీర్‌ కలందర్‌ అని పిలుస్తారు) ప్రతి సంవత్సరం ఇక్కడి ఫకీర్ల జాతరను మరి యు ఉర్సును నిర్వహిస్తారు.

అమృత్‌పుర: చిక్‌మగళూరు పట్టణానికి 67 కి.మీల ఉత్తరంలో ఉన్న అమృత్‌ పుర గ్రామంలో ఉన్న అమృతేశ్వర దేవాలయాన్ని క్రీ.శ. 1196 సంవత్సరం లో అమృతేశ్వర దండనాయక అని పేరు గాంచిన హొయసల రాజు రెండవ వీర బల్లాల్‌ కట్టించాడు. ఈ దేవాలయం చూస్తే హోయసల రాజుల కాలంలో శిల్ప నైపుణ్యం ఎంత ఉచ్ఛ స్థితిలో ఉండేదో అవగతమవుతుంది.

బేలవాడి: చిక్‌మగళూరుకి ఆగ్నేయం లో 29 కి.మీ.ల దూరంలో ఉన్న బేలవాడి గ్రామంలో ఉన్న శృంగారమైన వీరనారాయణ దేవాలయం, ఉద్భవ గణపతి దేవాలయం చాలా ప్రసిద్ధం. ఈ గ్రామానికి 10 కి.మీ. దూరం లోనే హళేబీడు ఉన్నది.ఇలా ప్రకృతి రమణీయతను, ఆద్యాత్మికతను తనలో కలుపుకొని ఉన్న ఏకైక పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది చిక్‌మగళూర్‌.

ఇతిహాసాల నేలకొండపల్లి

Nkpalli_stupamనేలకొండపల్లి... ఖమ్మం జిల్లాలో ఉన్న ఈ గ్రామానికి ఎంతో చరిత్ర ఉంది. మహాభారతంతో ముడిపడిన కథలొకవైపు, బౌద్ధ అవశేషాల తాలూకు చారి త్రక వాస్తవాలు మరొక వైపు ఈ ప్రాంతానికి ప్రాముఖ్య తనిస్తున్నాయి. అంతేకాకుండా భద్రాచలంలో కొలువై ఉన్న శ్రీ రామచంద్రమూర్తికి ప్రియభక్తుడైన భక్తరామదాసు (కంచర్ల గోపన్న) జన్మస్థలం కూడా కావడం నేలకొండ పల్లికి మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చాయి. ఇక్కడి ఒక మైలు దూరంలో విరాటరాజు దిబ్బ, కీచక గుండం అనే స్థలాలు మహాభారత కథతో సంబంధం కలిగి ఉన్నాయి.

పాండవులు అజ్ఞాతవాస సమయంలో విరాట నగరాన్ని పాలించే విరాట రాజు కొలువులో మారువేషాల్లో చేరారు. విరాట రాజు బావమరిది కీచకుడు సైరంధ్రి వేషంలో ఉన్న ద్రౌపదిని కామించగా, వలలుడి వేషంలో ఉన్న భీముడు కీచకుణ్ణి చంపేసాడు. ఆ విరాటనగరం ఈ ప్రాంతమేనని పౌరాణిక గాధ. మహాభారతం జరిగిందని చెప్పబడుతున్న కాలం నాటి అవశేషాలు కూడా ఇక్కడ లభ్యమవుతుండడం దీనిని మరింత బలం చేకూర్చుతోంది. 1977 లో జరిపిన తవ్వకాల్లో బౌద్ధ అవశేషాలు, స్థూపాలు, విగ్రహాలు దొరకడంతో ఈ ప్రాంతంలో బౌద్ధం విలసిల్లిందని రూఢి అవుతున్నది.

ఇటీవలి చరిత్రకు వస్తే... నేలకొండపల్లి భక్త రామదాసుగా ప్రసిద్ధి గాంచిన కంచర్ల గోపన్న ఇక్కడే జన్మించాడు. ఆయన పుట్టిన ఇంటిని భక్త రామదాసు ధ్యాన మందిరంగా పిలుస్తున్నారు. ఇక్కడ కొన్ని తెలుగు సినిమాలు కూడా చిత్రీకరణ జరుపుకోవడం విశేషం. భక్తరస ప్రధానం కొంతకాలం క్రిందట దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘శ్రీరామ దాసు’ చిత్రం కూడా ఇక్కడే నిర్మాణం జరిగింది. అంతేకాకుండా ఈ గ్రామంలో పురాతన దేవాలయాలు కూడా ఉన్నాయి.

చారిత్రక దేవాలయాలు...
చారిత్రకంగా ప్రసిద్ధి చెందిన వేంకటేశ్వరాలయం, భీమేశ్వరాలయం, వేణుగోపాలస్వామి, ఉత్తరేశ్వర ఆలయాలు నేలకొం డపల్లికి మరింత ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఉన్నవి. వీటిని కనీసం 400 సంవత్సరముల క్రితం నిర్మించారని ప్రతీతి.

రవాణా సౌకర్యాలు...
నేలకొండపల్లి... ఖమ్మం నుండి కోదాడ (నల్లగొండ జిల్లా) వెళ్లే రహదారిపై ఉన్నది. ఖమ్మం నుండి కోదాడ, నల్లగొండ, మిర్యాలగూడ, తిరుపతి, గుంటూరు వంటి ప్రదేశాలకు వెళ్ళే బస్సులు ఇక్కడ ఆగుతాయి. హైదరాబాదు వెళ్ళాలంటే ఖమ్మం లేదా కోదాడ నుండి ఎక్స్‌ ప్రెస్స్‌ బస్సు సౌకర్యం ఉంది. ఖమ్మం నుండి దేశం లోని అన్ని ముఖ్య ప్రదేశాలకు రైలు సౌకర్యం ఉన్నది. అతి దగ్గర విమానాశ్రయం హైదరాబాదు, విజయవాడ లో ఉన్నవి.

వికసించే పూలసోయగం... కాలింపాంగ్‌

ప్రకృతి అందాలకు... హిమాలయ పర్వత వీక్షణకు ఎంతో అనువైన ప్రదేశం కాలింపాంగ్‌. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రానికి పర్యాటక రాజధాని అయిన డార్జిలింగ్‌కు సమీపంలో ఉన్న ఈ పట్టణం డార్జిలింగ్‌ జిల్లాలోనే ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్న పట్టణం. కాలింపాంగ్‌ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది ఇక్కడ అందంగా పరుచుకున్న పూలతోటలు. పూల వ్యాపారంలో ఈ నగరం ఎంతో ప్రాముఖ్యతను సంపాదించుకుంది. బ్రిటీష్‌కాలంలోనే విద్యాలయాల కేంద్రంగా భాసిల్లిన కాలింపాంగ్‌ నేడు అద్భుత పర్యాటక కేంద్రంగా ఉంది. అంతేకాదండోయ్‌... కాలింపాంగ్‌ ప్రపంచంలోనే పేరొందిన బౌద్ధ విహారాలకు కూడా పెట్టింది పేరు. ఇక్కడ ఉన్న బౌద్ధ విహారాల్లో ఎన్నో విశిష్ట బౌద్ధ గ్రంథాలు కూడా ఉన్నాయి. సైనో-ఇండియన్‌ యుద్ధానికి ముందు ఇది టిబెట్‌ - ఇండియాలకు మధ్య వ్యాపార మార్గంగా ఉపయోగపడిన అందాల నగరం కాలింపాంగ్‌ విశేషాలు ఈ వారం ‘విహారి’లో మీకోసం...

The-Zang-Dhokతీస్తా నది ఒక వైపు ఆ నదిని చూస్తున్నట్లు ఉన్న శిఖరం పై ఉన్న అద్భుత పర్యాటక నగరం కాలింపాంగ్‌. సమశీతోష్ణ వాతావర ణం, ప్రముఖ యాత్రా స్థలాలకు సమీపంలో ఉండటం, అంతేకా కుండా మరో ప్రముఖ పర్యాటక కేంద్రం డార్జీలింగ్‌కు దగ్గరలో ఉండటం మూలంగా కాలింపాంగ్‌ పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రానికే కాక దేశ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు పొందిన పర్యాటక నగరంగా వెలుగొందుతోంది. ఇక్కడి ప్రజలు ఎక్కువగా తోట ల పెంపకం పై ఆధారపడి జీవిస్తుంటారు. అదే ఇప్పుడు ఈ ప్రాంతానికి పర్యాటక శోభను తీసుకొచ్చింది.

ఇక్కడి పూలతోటలు పర్యాటకులను ఆనందలోకాల్లో విహరింపజేస్తాయంటే అతిశయోక్తికాదు. కాలింపాంగ్‌ పూల మార్కెట్‌ వివిధ రకముల ఆర్చిడ్స్‌కు ప్రసిద్ధిగాంచింది. హిమాల యాలలో పెరిగే పూల గడ్డలు, దుంపలు మరియు భూగర్భ కాండముల ను ఎగుమతి చేసే నర్సరీలు కాలింపాంగ్‌ ఆర్ధిక వ్యవస్థకు దోహదం చేస్తున్నాయి. సాంప్రదాయ నేపాలీలకు, దేశవాళీ సాంప్రదాయ వర్గము లకు మరియు భారతదేశంలోని ఇతర ప్రాంతముల నుండి వలస వచ్చిన విదే శీయులకు నిలయమైన ఈ పట్టణం బౌద్ధ మత కేంద్రం కూడా. జంగ్‌ ధోక్‌ పల్రి ఫోడాంగ్‌ బౌద్ధ విహారం అరుదైన అనేక టిబెటన్‌ బౌద్ధ గ్రంధములను కలిగి ఉంది.

A-winds-along-the-banksకాలింపాంగ్‌ పేరు వెనుక...
కాలింపాంగ్‌ పేరు వెనుక పెద్ద కథే దాగి ఉంది. కాలోన్‌ (రాజు యొక్క మంత్రులు), పాంగ్‌ (ఆవరణము) నుండి ఉత్పన్న మైనదే కాలింగ్‌ పాంగ్‌ టిబెటన్‌లో ‘రాజు గారి మంత్రుల యొక్క సమూహము (లేదా కూటమి)’ అని అర్ధం వచ్చే కాలింపాంగ్‌ పేరు పుట్టుక చాలా ఎక్కువగా అంగీకరించబ డేది. ఇది లెప్చా నుండి ‘మనం ఆటాడుకునే శిఖరములు’ అనే అనువాదం నుండి కూడా ఉత్పన్నమై ఉండవచ్చుననే ది మరో కథనం. ఎందుకంటే ఇక్కడ వేసవి ఆటల కొరకు ఆ ప్రాంతంలో నివసించే సాంప్రదాయ గిరిజనుల సమ్మేళనం జరుగు తుంది. ఆ పర్వత ప్రాంత ప్రజలు ఆ ప్రాంతమును కాలి బోంగ్‌ (నల్ల ని పార్శ్వ శిఖరములు) అని కూడా పిలుస్తారు.

‘ది అన్టోల్డ్‌ అండ్‌ అన్నౌన్‌ రియాలిటీ అబౌట్‌ ది లెప్చాస్‌’ రచయి త... తమ్సంగ్‌ ప్రకారం, ‘కాలింపాంగ్‌’ అనే పదం కలెన్పాంగ్‌ అనే పేరు నుండి వచ్చింది. లెప్చాలో దీని అర్ధం గుట్టల సమూహ ము. కాలగ మనంలో ఆ పేరు కాలీబాంగ్‌గా రూపాంతరం చెంది ఆ తరువాత కాలింపాంగ్‌గా స్థిరపడిపోయింద నేది తమ్సంగ్‌ వాదన. ఆ ప్రాంతంలో అపరిమి తంగా కనిపించే ఒక నార మొక్క ‘కౌలి మ్‌’ నుండి కూడా ఈ పేరు వచ్చిం దని ఇంకొక వాదన. ఎదెలా ఉన్నప్పటికీ కాలిం పాంగ్‌ దేశంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా వెలుగొందుతోంది.

శతాబ్దాల చరిత్ర...
పందొమ్మిదవ శతాబ్దం మధ్య వరకు, కాలింపాంగ్‌ చుట్టుపక్కల ప్రాంతాన్ని సిక్కిం, భూటాన్‌ రాజులు వారసత్వంగా పాలించారు. సిక్కిం రాజుల పాలన లో, ఆ ప్రాంతం దాలింగ్కోట్‌గా పేరుగాంచింది. 1706 లో, భూటాన్‌ రాజు ఈ పరగణాను సిక్కిం రాజుల నుండి గెలుచుకుని దాని పేరును కాలిం పాంగ్‌ గా మార్చాడు. తీస్తా లోయకు ఎదురుగా ఉన్న కాలింపాంగ్‌ పద్దెనిమిదవ శతాబ్దంలో ఒకప్పుడు భూటాన్‌ ప్రజల ప్రధాన స్థావరంగా ఉండేది. ఈ ప్రాంతంలో దేశవాళీ లెప్చా ప్రజ లు, వలస భుటి యా, లింబు తెగల ప్రజల జనసాంద్రత తక్కువగా ఉంది.

తరువాత 1780 లో, గూర్ఖాలు కాలింపాంగ్‌ పై దండెత్తి దానిని జయించారు. 1864 లో ఆంగ్లో - భూటాన్‌ యుద్ధం తర్వాత, సించుల ఒప్పం దం (1865) ఆమోదించబడింది. ఇందులో భూటాన్‌ ఆధీనంలో ఉన్న తీస్తా నది యొక్క తూర్పు పరగణా బ్రిటిష్‌ ఈస్ట్‌ ఇండియా కంపె నీ వశమయింది. ఆ కాలములో కాలింపాంగ్‌ ఒక కుగ్రామము, అక్కడ రెండు లేదా మూడు కుటుంబాలు మాత్రం నివాసము ఉండేవట. బెంగాల్‌ సివిల్‌ సర్వీస్‌లో పనిచేస్తు న్న ఒక ప్రభుత్వ అధికారి ఆష్లీ ఈడెన్‌ ఆ సంవత్సరం చేసిన తాత్కాలిక ప్రస్తావనలో ఆ పట్టణం గురించి మొదటిసారి పేర్కొన బడిందపి చెబుతారు. 1866 లో కాలింపాంగ్‌ డార్జిలింగ్‌ జిల్లా లో చేర్చబడింది. 1866-67 ప్రాంతంలో ఒక ఆంగ్లో - భుటానీస్‌ కమీషన్‌ ఆ రెండింటి మధ్య ఉమ్మడి సరిహద్దు రేఖలను నిర్ణయించింది. దాని మూలంగా కాలింపాంగ్‌ సబ్‌ డివిజన్‌ డార్జిలింగ్‌ జిల్లాకు ఒక రూపునిచ్చింది.

A-view-from-the-Deolo-Resorవిద్యాలయాల నిలయం...
స్కాటిష్‌ మిషినరీస్‌ ఆగమనం బ్రిటిష్‌ వారి కొరకు విద్యాలయాలు, సంక్షేమ కేంద్రాల నిర్మాణానికి కారణమైంది. మాక్ఫార్లేన్‌ ఈ ప్రాంతంలో మొదటి విద్యా లయాలను స్థాపించాడు. స్కాటిష్‌ యూనివర్సిటీ మిషన్‌ ఇనిస్టిట్యూషన్‌, కాలిం పాంగ్‌ బాలికల ఉన్నత విద్యాలయం, రివరెండ్‌ గ్రాహం నిరాశ్రయులైన ఆంగ్లో - ఇండియన్‌ విద్యార్ధుల కొరకు ‘గ్రాహంస్‌ హోమ్స్‌’ స్థాపించాడు. 1907 నాటి కి, కాలింపాంగ్‌ లో అనేక విద్యాలయాలు భారతీయ విద్యార్ధులకు విద్య అందిం చటం ప్రారంభించాయి.

బౌద్ధ ‘విహారం’...
1947 లో భారత స్వాతంత్రం అనంతరం, భారత్‌, పాకిస్తాన్‌ ల మధ్య బెంగా ల్‌ విభజించబడిన తర్వాత, కాలింపాంగ్‌ పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో భాగం అయింది. 1959 లో టిబెట్‌ ను చైనాలో చేర్చుకోవటంతో, అనేకమంది బౌద్ధ సన్యాసులు టిబెట్‌ ను వదిలి పారిపోయి కాలింపాంగ్‌ లో స్థిరపడ్డారు. ఈ సన్యాసులు వారితోపాటు అరుదైన అనేక బౌద్ధ గ్రంధములను కూడా తీసుకు వచ్చారు. 1962 లో, సైనో - ఇండియన్‌ యుద్ధం తర్వాత జెలేప్ల మార్గమును శాశ్వతంగా మూసివేయటంతో టిబెట్‌ మరియు ఇండియా మధ్య వ్యాపారానికి భంగం కలిగింది, ఇది కాలింపాంగ్‌ యొక్క ఆర్ధిక వ్యవస్థ నెమ్మదించటానికి దారితీసింది. 1976 లో, పర్యటనకు వచ్చిన దలైలామా జంగ్‌ దొక్‌ పల్రి ఫోడాంగ్‌ బౌద్ధ విహారాన్ని స్థాపించారు. ఇందులో అనేక బౌద్ధ గ్రంథాలు ఉన్నా యని చెబుతారు అక్కడి ప్రజలు.

కొండకోనల్లో...
ఈ నగర కేంద్రం 1,247 మీ ఎత్తు వద్ద డియోలో హిల్‌, డర్పిన్‌ హిల్‌ అనే రెండు కొండలను కలిపే శిఖరము పైన ఉంది. కాలింపాంగ్‌ లో అతి ఎత్తైన స్థానం అయిన డియోలో 1,704 మీ ఎత్తులో ఉంది. దర్పిన్‌ హిల్‌ 1,372 మీ ఎత్తు వద్ద ఉంది. దిగువన ఉన్న లోయలో ప్రవహిస్తున్న తీస్తా నది కాలిం పాంగ్‌ ను సిక్కిం రాష్ట్రం నుండి విడదీస్తుంది. కాలింపాంగ్‌ ప్రాంతంలో మట్టి విలక్షణంగా ఎర్ర రంగులో ఉంటుంది. ఫైలైట్‌, స్కిస్ట్స్‌ అధికంగా ఉండటం వల న అప్పుడప్పుడు నల్ల మట్టి కూడా అగుపిస్తుంది.

అనేక హిమాయాల పాద పర్వతముల వలెనే, శివాలిక్‌ కొండలు, నిటారుగా ఉండే ఏటవాలులను కలిగి ఉంటాయి. దీని మూలంగా వర్ష ఋతువులో తరుచుగా భూతాపములు సంభ విస్తాయి. ఆ కొండలు ఉన్నత శిఖరాలతో నిర్మితమై... దూరంలో హిమాలయ శ్రేణుల మంచు పరదాలతో చూడముచ్చటగా ఉంటుంది కాలింగ్‌పాంగ్‌ పట్ట ణం. 8,598 మీ ఎత్తులో ఉండి, ప్రపంచంలో ఎత్తైన శిఖరమైన కాంచనగంగ పర్వతం కాలింపాంగ్‌ నుండి స్పష్టంగా అగుపిస్తుంది.

ఇలా చేరుకోవచ్చు...
సెవోక్‌ ను గాంగ్టాక్‌ తో అనుసంధానించే జాతీయ రహదారి 31 పక్కన కాలిం పాంగ్‌ ఉంది. సెవోక్‌ ను సిలిగురితో కలిపే ఎన్‌హెచ్‌-31, టిఎన్‌హెచ్‌ 31 ఎ... ఈ రెండు జాతీయ రహదారులు కలిసి, సెవోక్‌ మీదుగా కాలింపాంగ్‌ ను మైదానములతో కలుపుతాయి. ఈ రహదారుల మీదుగా బస్సు సర్వీసుల లో కాలింపాంగ్‌ నుండి సిలిగురి, సమీప పట్టణాలైన కుర్సియాంగ్‌, డార్జి లింగ్‌, గాంగ్టాక్‌లకు చేరుకోవచ్చు. ఫోర్‌ వీలర్స్‌ ఈ ప్రాంతంలో ఎక్కువ ఏటవాలుగా ఉండే ప్రదేశములలో సులువుగా ప్రయాణించగలగటం తో, వీటిలో ప్రయాణం అనువుగా ఉంటుంది.

అయినప్పటికీ, కొండచరి యలు విరిగి పడటం మూలంగా వర్షాకాలంలో రోడ్డు రవాణాకి అప్పుడ ప్పుడు భంగం కలుగుతుంది. ఇక్కడి సాధారణంగా నడుస్తూ సంచరిస్తా రు. తక్కువ దూరం ప్రయాణించటానికి నగర వాసులు సైకిల్‌, ద్విచక్ర వాహనములు, అద్దె వాహనాలను కూడా ఉపయోగిస్తారు. కాలింపాం గ్‌ నుండి 80 కిలోమీటర్ల దూరంలో... ఉన్న ‘బాగ్డోగ్రా’ లో ఉన్న విమానాశ్రయం ఇక్కడికి చాలా సమీపంలో ఉన్న విమానాశ్ర యం. ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌, డ్రక్‌ ఎయిర్‌ (భూటాన్‌) తదితర సంస్థలు ఢిల్లీ, కలకత్తా, పా రో (భూటాన్‌), గౌహతి, బ్యాంకాక్‌ల నుండి సర్వీసు లను నడుపుతున్నాయి. సిలిగురి పొలిమేరల లో ఉన్న న్యూజల్పై గురి కాలింపాంగ్‌ పట్టణానికి అతి దగ్గరి రైల్వే స్టేషన్‌.


పేదల ఊటీ.. ....... ఏర్కాడు

తమిళనాడు రాష్ట్రంలో సేలం పట్టణానికి సమీపంలో ఉన్న ఏర్కాడు దేశంలోని హిల్‌స్టేషన్లలో ఒకటిగా పేరుగాంచింది. చెన్నై నగరానికి 370 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏర్కాడును పేదల ఊటీ అని ముద్దుగా పిలుస్తుంటారు ఇక్కడి ప్రజలు. సెర్వ రాయన్‌ పర్వత శ్రేణుల్లో సముద్ర మట్టానికి 1,500 మీటర్ల ఎత్తులో ఉండే ఏర్కాడులో.. వేసవికాలంలో గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్‌గా, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్‌గా ఉండటంతో ఇక్కడ ఎప్పుడూ చల్లగా ఉంటుంది. ఏడాది పొడవునా పర్యాటకులు ఈ హిల్‌స్టేషన్‌ను సందర్శి స్తుంటారు.

yercaud ఆ పేరు ఎలా వచ్చిందంటే...
తమిళ భాషలో ‘ఏరి’ అంటే సరస్సు అని, ‘కాడు’ అంటే అడవి అని అర్థం. ఏరి-కాడు అనే పదాలే క్రమంగా ఏర్కాడుగా రూ పాంతరం చెందినట్లు స్థానికులు చెబుతుంటారు. ఏర్కాడు కాఫీ తోటలకు కమలా పండ్లకు ప్రసిద్ధి. ఏర్కాడులో బొటానికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా సారధ్యంలో నిర్వహించబడే ఆర్కిడారియం పర్యాటకులకు కనువిందు చేస్తుంటుంది.

అలాగే ఏర్కాడులోని అతి ఎత్తైన ప్రదేశం...
సెర్వరాయణ్‌ దేవా లయం చూడదగ్గ ప్రదేశం. ఇది సముద్ర మట్టానికి సుమారు 5300 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఏర్కాడు కొండల ప్రాం తం షెవరాయ్‌ హిల్స్‌గా పిలువబడుతోంది. ఇక్కడ అడవి దున్న లు, జింకలు, ఎలుకలు, కుందేళ్లు, నక్కలు, మాంగూస్‌, ఉడుత లు, పావురాళ్లు, పాములు, బుల్‌బుల్‌ పిట్టలు, పక్షులు.. ఇలా అనేక రకాల అడవి జంతువులు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటాయి.
ఏర్కాడులో అడుగుపెట్టగానే ఆకర్షించే మరో అద్భుత ప్రదేశం అందమైన సరస్సు, అందు లో పడవ షికార్లు కొడుతుంటే కలిగే అను భూతి మాటలతో వర్ణించలేము. ఆ తరువాత చిన్న సైజు జంతు ప్రదర్శనశాల, అన్నా పా ర్కు చూడదగ్గవి. అన్నా పార్కులో వివిధ ఆకృ తుల్లో కత్తిరించిన మొక్కలు, వివిధ రంగుల్లో విరబూసిన పువ్వులు, సేదదీర్చే కాంక్రీటు గుడారాలు, దేవతా మూర్తుల ప్రతిమలు ఒకటేమిటీ అక్కడ కొలు వుదీరి ఉన్న ప్రతి దీ విశేషంగా ఆకట్టు కుంటుంది. అలాగే హార్టి కల్చర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ చూడదగ్గ మరో ప్రదేశం.

vancefoxఏర్కాడు సరస్సుకు పది కిలోమీటర్ల దూరంలో ఉండే లేడీస్‌ సీట్‌ ఎంతో చూటము చ్చటగా ఉంటుంది. లేడీస్‌ సీట్‌ వెళ్లేందుకు సేలం నుం చి ఏర్కాడుకు వెళ్లే రహదారిలో మెలికలు తిరిగే రోడ్లలో ప్రయాణం ఉల్లాసభరితంగా సాగుతుంది. ఆ తరువాత పగోడా పాయింట్‌, సెర్వరాయణ్‌ టెంపుల్‌, నార్టన్‌ బంగళా, బియర్స్‌ కేవ్‌ (ఎలుగుబంట్ల గుహ), 1857 సిపాయిల తిరుగుబాటు సంద ర్భంగా కీలకపాత్ర పోషించిన ‘ది గ్రేంజ్‌ కోట’, 1917లో స్థాపిం చిన మౌంట్‌ ఫర్డ్‌ ఉన్నత పాఠశాల చూడదగ్గ ఇతర ముఖ్యమైన ప్రదేశాలు.

ప్రతి సంవత్సరం ఎర్కాడులో సమ్మర్‌ ఫెస్టివల్‌ అట్టహాసంగా జరుగుతుంది. ఇది మే రెండో వారంలో ప్రారంభమవుతుంది. ఏర్కాడులో కాఫీ సాగు ఎక్కువగా చేస్తుంటారు. విచిత్రమేమి టంటే... ఇక్కడ భూముల సేద్యం ఉండదు. కాఫీ కాకుండా పస నపండ్లు, బెర్రీలు, కమలాపండ్లు, జామపండ్లను కూడా ఇక్కడ విరివిగా పండిస్తారు.

yercaud1ఎలా వెళ్లాలి?
విమాన ప్రయాణంలో తిరుచిరాపల్లి వరకు ప్రయాణించి, ఆపై కోయంబత్తూర్‌ నుంచి బస్సు మార్గంలో ఏర్కాడు చేరుకోవచ్చు. రైలు ప్రయాణంలో అయితే చెన్నై-కోయంబత్తూర్‌ రైలు మార్గం లో చెన్నై నుంచి 335 కిలోమీటర్ల దూరంలోని సేలం జంక్షన్‌ మీదుగా బస్సు మార్గం గుండా అక్కడికి 35 కిలోమీటర్లు ఉన్న ఏర్కాడు చేరుకోవచ్చు. తమిళనాడు రాష్ట్రంలోని ప్రధాన పట్టణా ల నుంచి సేలం వరకు కూడా బస్సు సర్వీసు లు అందుబాటులో ఉన్నాయి.

ఇక వసతి విషయానికి వస్తే..
ఏర్కాడులో అనేక స్టార్‌ హోటళ్లతోపాటు చిన్నా, పెద్దా హోటళ్లు కూడా చాలానే ఉన్నాయి. అలాగే హాలిడే హోమ్స్‌, రిసార్టులు, గెస్ట్‌హౌజ్‌లకు కూడా కొదువేలేదు. వీటితోపాటు తమిళనా డు రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వ హించే తమిళనాడు, యూత్‌ హాస్టల్‌లు అందరికీ అందుబాటు ధరల్లో ఉంటాయి.